7, మే 2016, శనివారం

వల్కలము, తప వస్త్రము

వల్కలము – అంటే నారచీరలు. 
ఫూర్వం తాపస ప్రవృత్తిని స్వీకరించిన మునిపుంగవులు, ప్రకృతిసిద్ధమైన సరంజామాలను మాత్రమే నిత్య జీవన విధానములకై గైకొన్నారు.
అట్లాగే అరణ్యవాసములకు వెళ్ళిన వారు, 
వానప్రస్థాశ్రమ వాసులు కూడా ఈ జీవనవిధానాన్నే అనుసరించారు.
మన ఇతిహాసాలు ఇందుకు సోదాహరణములు. రామాయణ, మహాభారత, ప్రాచీన చరిత్ర యావత్తూ  
(“జయం”/ # “Jayam”  =  ”MahaBharatam”)# 
నిలువెత్తు నిదర్శనాలు. 
శ్రీరామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణుడు నారచీరలను ధరించి, విపినములకు వెళ్ళారు.  
అరణ్యాలలో పంచపాండవులు వల్కలములను ధరించారు. 
మహర్షులు, వారి భార్యలు, వారి పిల్లలు కూడా వల్కల  ధారణను   దైనందినజీవితములో అంతర్భాగాలుగా స్వీకరించారు.
;
ఇంతకీ ఈ వల్కలములను దేని నుండి తయారుచేసుకున్నారు?
భూర్జవృక్షములు వీరికి ఆధరువు ఐనవి. 
భూర్జవృక్షముల బెరడులను చెక్కి తీసి, 
ఎండబెట్టారు, వస్త్రాలుగా మలుచుకున్నారు.
[భూర్జవృక్షములు, తాళపత్రములు = తాటాకులు – ప్రాచీనకాలమున మన దేశములో 
కావ్యాలను వ్రాయుటకు ఉపయోగించబడినవి.)
ఉత్తరభారత దేశములో 
భూర్జతరువుల కాండముల యొక్క ‘పట్టలు'/ bark నుండి ఎంతో శ్రమపడి తయారుచేసుకున్నారు 
అటవీవాసులు, గురుకులవాసులు.  
గురుకులములు  ఈ చక్కని వాతావరణాన్ని ప్రతిబింబిస్తూండేవి. 
ఆటవికతెగలు శబరులు, కిరాతులు, చెంచులు, కోయవాళ్ళు మొదలైనవారు జంతుచర్మాలను ధరించారు. గురుకుల నివాసులు, అనగా గురువులు, శిష్యులు, ఆదిగా గలవారు సాత్వికజీవనవిధానాలను అనుసరించారు.  కనుక వారు ప్రకృతిసహజమైన వస్తువులను వాడటాన్ని ఆచరణలోకి తెచ్చారు.
శాంతారామ్శకుంతల” లో చెట్టుపట్టల నుండి 
దుస్తులను తయారుచేసుకోవడాన్ని  చిత్రీకరించారు. 
ఆమె కుమారుడు భరతుడు సింహాలతో ఆడుకుంటూంటాడు. 
క్రూర జంతువుల నోరు తెరిచి, వాటి నోళ్ళలోని పళ్ళను లెక్కబెడుతూంటాడు. 
అదిగో! ఆ సందర్భంలో దుష్యంతుడు చూసి, 
“నిర్భీతితో కారడవుల విహరిస్తూన్న వీరబాలుడు ఎవరు?” అని ఉత్కంఠతో ఆరా తీసి, తన భార్యా బిడ్డలను కలుసుకున్నాడు. 
ఆ అతి చిన్న ఉపకథకు - 
మహాకవి కాళిదాసు ఘంటము 
సాహిత్య రంగమున సింహాసనమును అమర్చింది. మహాకవి కాళిదాసు చిత్రీకరణలో 
“అభిజ్ఞాన  శాకుంతలము” 
అనే నాటకముగా వెలుగులీనింది.
] మరి అన్నేళ్ళు ఒంటరిగా కాననములలో జీవించిన శకుంతల, 
చివికిపోయిన దుస్తులలో అట్లాగే కాల వెళ్ళబుచ్చుతుందా? శకుంతలను – ధీరోదాత్తగా భావించాడు 
హిందీడైరెక్టర్ శాంతారామ్.  
ఇంత చిన్న విషయాన్ని- అదేనండీ! కథానాయిక   ఆహార్యాదులను – వెండి తెర చిత్రీకరణ కోసము – గమనించగలిగాడు, 
కాబట్టే – శాంతారామ్ గొప్ప దర్శకునిగా 
కీర్తిప్రతిష్ఠలను ఆర్జించారు. 

**************************;

भूर्जवृक्ष :- భూర్జవృక్షములు, భూర్జ తరువు ఆకులు
వలువలుగా ఉపయోగపడినవి, 
భూర్జపత్రములు, అనగా భూర్జ తరువు ఆకులు 
‘మన ప్రాచీన హిందూ దేశములో సాహిత్య రత్నములను పొందుపరిచిన  కాంచన ఆభరణములైనవి.  

**************************;
part - 2 ;-
న్యూ గినియా మున్నగు దేశాలలోని ప్రజలు, భూర్జవృక్షములు, వలువలు ధరించిన పద్ధతి పూర్వం ఉన్నది. 

वल्कल ​. छाल - bark - chhAla ​. वल्कलधारी ​. वल्कलधारी - dressed in bark - valkaladhArI ​. वल्कल परिधान ​. परिधान प्रकार() - garment ... साधारण वेश धारण करना dress simply ... 
భూర్జవృక్షములు #Ficus Fibres వర్గమునకు చెందినవి. హిందూదేశము నుండి అండమాన్,ఆస్ట్రేలియా ఉత్తరభాగమున Ahem Land; Kalumburu మున్నగు తావులకు చేరినది. 
న్యూ గినియా ప్రజలు తమ బుట్టలకు, కవర్లు,  అల్లికలు, సిద్ధంచేసుకోగలిగారు.
హిమయుగమునకు పూర్వకాలమునందు 
30వేల ఏళ్ళ క్రితం మనుషులు దేహమును చలి, ఎండల బారి నుండి కాపాడుకొనుటకు చెట్టుపట్టలు వాడారు. 
Lin seedsS చెట్లను వాడలేదు. 
ఫైకస్ ఫైబర్స్ జాతి చెట్లు ఉపయోగితం ఐనవి.
బైబిల్ ప్రకారం - ఆడం, ఈవ్ = ఆదాము అవ్వ లు Fig leawesతో ఒడలు కప్పుకొన్నారు.

*************************, 

సరే! ఇంతకీ 'భూర్జ' అనే పేరు ఎట్లాగ సంభవించినది?
తూర్పు వింధ్యాచల ప్రాంతములను 
నేటికీ "భోజ సీమ/ రాజ్యం" అని 
వ్యవహరిస్తున్నారు. 
భోజ మహారాజు పండితులకు 
అక్షరలక్షలను ఒసగిన వితరణశీలి.
సాహిత్యపోషకుడైన ఆయన కాలములో భూర్జపత్రలేఖనములు పరివ్యాప్తికి వచ్చినవి. 
మహాభారతములో భోజపురి ప్రస్తావన ఉన్నది. [హిమాచలము మున్నగు ఎత్తైన చోట్ల పెరుగుతుంది. అద్భుత ఉపయోగముల వలన దేవవృక్షము - అని సంభావిస్తూ, దేవదారు పాదపములు - అని పిలిచారు.  
;
part - 3 ;-

తప వస్త్రము- ఈ పేరును వింటూంటే- 
"భారతదేశములోని మునుల దినచర్య ఐన 
"తపస్సు" అనే మాట స్ఫురణకు వస్తూన్నది కదూ!!!
ఇతిహాస యుగాల నుండి మన దేశంలోనే కాదు, 
ఆదిమ మానవునికి వలువలు కట్టడానికి 
ప్రకృతి నుండి లభ్యమైన సామగ్రిని స్వీకరించాడు. 
తాపసులు, వానప్రస్థాశ్రమమును స్వీకరించిన వారు 
నార  చీరలను ధరించే వాళ్ళు. 
రామాయణములో అరణ్య వాసానికేగుతూన్న 
సీతాదేవి,శ్రీరాముల వారు,లక్ష్మణస్వామి వారు 
నారచీరలను ధరించి, బయలుదేరారు.
నార చీరలు ధరించడము- అన్నది 
ప్రాచీన హిందూ దేశములో,  
వేదకాలములు, యుగాలనుండీ ఒక ఆచారముగా ఏర్పడినది.
వల్కల ధారణ, నార చీరలు కట్టుట - 
వైరాగ్య జీవనమును గడిపే వారు.  
స్వచ్ఛందముగా నిర్దేశించుకున్న వింత ఆచారము.
కైకేయి ఆజ్ఞను శిరసావహించిన దాశరధి, 
సతీ సోదరులతో కారడవులకు ఏగునపుడు, 
ఆహార్యమును మార్చుకున్నాడు.
రాజ భోగ, భాగ్యాలను ప్రతిబింబించే మణిమయ రత్న కిరీటాభరణాలను, పట్టుపీతాంబరాలను త్యజించాడు. 
అప్పటికప్పుడు తెప్పించిన నారచీరలను ధరించాడు. 
వల్కల ధారణ అవగానే, 
మర్రిపాలను తెప్పించాడు. 
జుట్టుకు మర్రి పాలను బాగా పట్టించి, 
సిగముడిని వేసుకుని, 
అటవీ ఆశ్రమాలలో నివసిస్తూన్న మునివరుల వలే సాక్షాత్కరించారు సోదర ద్వయం శ్రీరామ లక్ష్మణులు. ; 
ఈ సహజమైన దుస్తులు ఏ పద్ధతిలో తయారైనవి?
ఆ ప్రాకృతిక వల్కలములను దేహధారణకై, సృజించుకొనుటకై  
మానవులు ఎలాగ శ్రమించారు? 
ఇది కాసింత ఆసక్తికర అంశమే!
;
ఆ కథా కమామిషూలపై 
కూసింత దృష్టి సారిద్దాము!!!!!!!!!
ఇప్పటికీ- ఈ కాలంలోనూ 
ఇటువంటి నారచీరలను వాడుకగా 
ఉపయోగించడము జరుగుతూన్నది. 
ఆరు తెగల పసిఫిక్ జనులు- విరివిగా గౌరవనీయంగా పాటిస్తూన్న ఆచారము. 
ఫిజీ, పపువా న్యూ గినియా, హవాయి, సమొయా, ఫూతునా, హవాయ్,  
ఆ ప్రదేశాలలో- ఈ తప వస్త్రము- 
అక్కడి వ్యక్తిగత హోదాను ప్రతిబింబిస్తాయి.
( six South pacific cultures of 
Fiji island, Tonga, Samoa, 
Papua New Guinea, Futuna and hawaii)
కుటీర పరిశ్రమ వలె కొనసాగుతూ, 
అనుసరిస్తూన్న  అనాది సాంప్రదాయము ఇది.
అనేక యుగాల నుండి వాళ్ళు 
ఇతర దీవులకు వలస   వెళుతూ- 
ఈ తప వస్త్ర సృజనను- కనుమరుగు కాకుండా కొనసాగిస్తూన్నారు. 
 కొందరు ఆధునిక టెక్నాలజీని చేతి సాయంగా గైకొని, 
ఈ తరు వస్త్రాల సృష్టిని కొనసాగిస్తూన్నారు.  
టపా క్లాత్- ను దక్షిణ పసిఫిక్ కల్చర్ల ప్రజలు తయారు చేసుకుంటున్నారు. ఆరు స్థానిక నాగరికతలలో- ఇది అందుబాటులో ఉన్న ఆచరణ. 
స్త్రీలు మాత్రమే వీటిని తయారు చేస్తూంటారు. 
పురుషులు వీటిని ఉత్సవాలలో (Ceremonial dress) ధరిస్తారు. 
సాధారణముగా పెద్ద పెద్ద బండిల్సు (bundles) గా చేసి అట్టిపెట్టుకుంటారు. 
వీనిని గోడలకు అలంకారములుగా తగిలిస్తారు. 
ప్రముఖ వ్యక్తులకు- స్వాగతము పలికే- రెడ్ కార్పెట్ లా  
ఉపయోగిస్తారు
పెళ్ళిళ్ళు, పండుగలు పబ్బాలు, శుభకార్య వేళలలో- 
నేటికీ ఈ తప cloths ను ఇచ్చి పుచ్చుకునే కానుకలుగా- 
ఆరు తెగల పసిఫిక్ జనులు- విరివిగా గౌరవనీయంగా పాటిస్తూన్న ఆచారము.
అనేక యుగాల నుండి వాళ్ళు ఇతర దీవులకు వలస   వెళుతూ- ఈ         
టప వస్త్ర సృజనను- కనుమరుగు కాకుండా కొనసాగిస్తూన్నారు. 
కొందరు ఆధునిక టెక్నాలజీని చేతి సాయంగా గైకొని, ఈ తరు వస్త్రాల 
సృష్టిని కొనసాగిస్తూన్నారు.  
;
ఒకసారి- "సీతారామ కళ్యాణము" సినిమాలోని 
కళ్యాణ ఘట్టాన్ని జ్ఞాపకము చేసుకోండి.
ఎన్.టి.రామా రావు ప్రతిభకు ఇది తార్కాణము.
మిథిలాపురికి విచ్చేసిన దశరధునికీ, పరివారానికీ మర్యాదలు చేస్తారు. 
జనక మహారాజు దశరధ బంధు జనులు వస్తూన్నప్పుడు 
వస్త్రాలను గబ గబా పరుస్తూ ముందుకు సాగే  ఘట్టము- 
మదిని దోచు కమనీయ దృశ్యమది.
టోంగన్ కల్చర్ ప్రజలు- ఇలాగ ప్రముఖులకు - 
టప క్లాత్స్ ను పుట్టములుగా పరచి- ఆహ్వానము పలుకుతూంటారు. 
స్వాగతము పలికే- రెడ్ కార్పెట్ లా  ఉపయోగిస్తారు. 
టోంగాన్లు (Tongans ) ఈ సహజ ఉడుపులను చేసే పద్ధతి 
చాలా ఆసక్తికరంగా ఉంటుంది.  
ఆ విశేషాలను వివరముగా చూద్దాము!
*****************************;  
తప వస్త్రము - కొరకు 
ఆ బెరడు లేయర్లను- సమతలంగా ఉన్న చెట్టు దుంగల మీద పరుస్తారు. వాటిని చెక్క దిమ్మలతో (Wooden mallets) మర్దిస్తారు. ఆ బెరడు పొరలు- చదునుగా అయ్యేటట్లుగా చెక్కలతో దిమ్మస కొడతారు.
(bark is flattened into wide, flexible sheets)
కూరగాయల మొక్కల వేళ్ళ నుండి- జిగురు (Glue) ను చేసి 
సిద్ధము చేసుకుంటారు. 
నీటి చెమ్మ అంతా ఎండి పోయిన బెరడు షీటు (sheets) ను 
ఈ వేళ్ళ బంక (Roots, Glue)తో - అతికిస్తారు. 
అలా వరుసగా అతికిస్తూ- 
పెద్ద తప వస్త్రపు పుట్టము- రెడీ ఔతుంది. 

కొస మెరుపు :-
శాంతారామ్ ప్రఖ్యాత హిందీ సినీ దర్శక నిర్మాత, నటుడు. 
ఈతని "శకుంతల" మూవీలో ఒక చిత్రీకరణ నాకు చాలా నచ్చినది.
దుష్యంతుడు తిరస్కరించిన తర్వాత- శకుంతల 
హిమాలయ పర్వత శ్రేణులకు చేరుతుంది.
మనుష్య సంచారమే లేని ఆ సీమలలొ ఆమె ఎలా గడిపింది? 
ఈ అంశాన్ని అత్యంత సున్నితంగా చిత్రించాడు శాంతా రామ్.
శకుంతల చెట్టు బెరడులను- సున్నితంగా నిలువుగా విచ్చదీస్తూ,
విడదీసిన ఆ చెట్టు పట్టలను  తాను తీసుకుంటుంది.
(ఇంత చిన్న విషయాన్ని కూడా పరిశీలించిన వాడు, 
కాబట్టే, ఆతడు గొప్ప దార్శనిక-దర్శకునిగా- ప్రఖ్యాతి గాంచాడు)
అనాది మానవుల వస్త్రధారణకు శ్రీకార స్వరూపిణులు ఈ వల్కలములు. 
అందుకనే- నేటికీ ఇటువంటి
ప్రకృతి సహజ వరములైన నార దుస్తుల తయారీని 
పాటిస్తూన్న పద్ధతులు- తెలుసుకోదగిన జిజ్ఞాసని కలిగించే విశేషములే కదా!   
;
Tapa cloth  [ link - vedio ]
;
***********************************,
Tags :- 
Tapa cloth (or simply tapa) is a barkcloth made in the islands of the Pacific Ocean, primarily in Tonga, Samoa and Fiji, but as far afield as Niue, Cook Islands, Futuna, Solomon Islands, Java, New Zealand, Vanuatu, Papua New Guinea  
;
అఖిలవనిత
Pageview chart 35700 pageviews - 849 posts, last published on May 7, 2016 - 

తెలుగురత్నమాలిక
Pageview chart 5371 pageviews - 152 posts, last published on May 6, 2016 - 
 
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 65651 pageviews - 1042 posts, last published on May 5, 2016 - 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...