27, మే 2016, శుక్రవారం

అమెరికా ఆటగాడు యోగి

"యోగీ" అనే ముద్దుపేరు ప్రముఖ బేస్ బాల్ క్రీడాకారునికి వచ్చింది. 
అతను అమెరికా నివాసి. Lawrence Peter "Yogi" Berra. 
స్థానిక అమెరికన్ లీగ్స్ లలో బేస్ బాల్ ఆడ్తూండే వాడు.
[#baseball in local American Legion leagues#].
లాడీ / లారెన్స్, లోరీ  వగైరా నిక్ నేమ్స్  కలిగి ఉన్న 
అతని అసలుపేరు "బెర్రా/ లారెన్స్ పీటర్ బెర్రా". [Yogi's - in childhood - other nicknames  "Lawdie", "Lawrence","Larry"]
ఐతే విచిత్రంగా లారెన్స్ పీటర్ బెర్రా - తర్వాత 
"యోగి" ని అదనంగా పొదిగిన పేరు - 
"లారెన్స్ పీటర్ యోగి బెర్రా" గా ప్రసిద్ధి పొందాడు. 
&&&&&&&&&&&
లారెన్స్ పీటర్ యోగి బెర్రా. బెర్రా Base ball ఆడుతూ, 
బంతిని పట్టుకోవడం , ఇన్ ఫీల్డ్ పొజిషన్స్ అన్నీ 
అక్కడ నేర్చుకో గలిగాడు. 
[ American professional baseball catcher, manager, and coach who 
played 19 seasons in Major League Baseball (MLB) (1946–63, 1965), 
all but the last for the New York Yankees. ]
బెర్రా తొలి దశలో  a Cranston, Rhode Island, team ల తరఫున ఆడాడు. ఆ ఆటలలో తన నూత్న నామం Lawrence Peter "Yogi" Berra అనే పేరుతో ఆడాడు. 
&&&&&&&&&&&
ఇంతకీ అతగాడికి యోగి అనే కల్పిత name ఎట్లా ఏర్పడినది?
అమెరికన్ లీగన్ బేస్ బాల్ లో ఆడేటప్పుడు 
అతని స్నేహితుడు జాక్ మాక్వైర్ "ఓహ్! యోగీ!" అని పిలుస్తూండే వాడు. ఫ్రెండ్ పెట్టిన అదనపు సంబోధన బెర్రా పేరులోని అంతర్భాగంగా మారిపోయింది.
అప్పటినుండీ అట్లాగే "Lawrence Peter "Yogi" Berra" పేర్మి పేరుతో  famous ఐనాడు. [Lawrence Peter Berra got the nickname Yogi during his teenage years, ... 
Maguire said “I'm going to call you Yogi” and from that moment on, the name stuck.]

సరే! మరి ఆ వయస్యుడు, మిత్రవరేణ్యుడు జాక్ - 'యోగి, యోగీ' అని ఎందుకు సంబోధనను ఇచ్చాడు? 
బెర్రా ఆట సమయాన తన వంతు వచ్చే వరకూ శాంతంగా తిష్ఠ వేసే వాడు. బాసిపెట్టు వేసుకుని ఉండేవాడు.
బాసిపెట్లు వేసుకునీ, కాళ్ళ చుట్టూ చేతులు వేసుకునీ, ఉండేవాడు.
బ్యాటు కోసం వేచి చూస్తూ, నిమ్మళంగా ఆసీనుడై ఉండేవాడు. 
ఒకవేళ ఓటమి ఐనప్పుడు , దిగాలుగా చూస్తూ, నిర్లిప్తంగా ఉండేవాడు.
అది చూసి, జాక్ మాక్వైర్  [Jack Maguire] "యోగి" అనేసాడు.
"హిందూ యోగి కి ప్రతీకగా ఉన్నావు, బెర్రా!" అంటూ "యోగీ!" 
అని వక్కాణం వేసాడు.
బెర్రాకు కూడా ఆ కొత్త పేరు ప్రీతిపాత్రమైనది, 
కనుక నిరభ్యంతరంగా "లారెన్స్ పీటర్ యోగి బెర్రా" గా చలామణీ ఐనాడు.
హిందూ జీవన విధానం పట్ల పాశ్చాత్యులకు ఎంతో ఆసక్తి ఉన్నది. 
పశ్చిమ దేశీయులు, యూరోప్ ఖండాల ప్రజలకు 
భారతీయ జీవన విధానాల పట్ల కల జిజ్ఞాసయే 
ఇటువంటి అవగాహనను కలిగించింది.  

&&&&&&&&&&&&&&
;
యోగ, ధ్యానములు ఆరోగ్యప్రదాయినులు.
కేవలం దేహ సంబంధమే కాకుండా, మానసిక ప్రశాంతతలకు 
మన మహర్షులు - అపరిమిత తపో నిష్ఠలతో, కృషితో మూలకారణాలను కనుగొన్నారు.
దైహిక, మానసిక స్థితుల సమన్వయమే అసలు సిసలైన ఆరోగ్యానికి పునాది - అనే 
జీవిత సత్యాన్ని లోకానికి ఆచరణతో చూపించారు.  
మహాఋషులు తమ అన్వేషణతో లోకకళ్యాణం కొరకై సాధించిన 
అమూల్య విశేషాలను జగతి అంతటికీ అందించారు.
సన్యాసి సన్యాసాశ్రమం, మహా ఋషులు, 
యోగి, యోగశాస్త్రము, యోగ విధానముల వలన అనేక ఆరోగ్య సమ్రక్షణకు లబ్ధి కలుగుతుందని, 
యోగము, ధ్యానము మున్నగు విశేషాల పట్ల వెస్టరన్ ప్రజలకు మక్కువ ఏర్పడుతున్నది.
18, 19 శతాబ్దముల నాటికే ప్రపంచ ప్రజలను, Western countries people ని 
భారతీయ మనుగడ, రీతి, పద్ధతులు ఆకర్షించాయి,  , 
అందుకు ఈ సంఘటన నిదర్శనం.    

************************************,
;
Tags :-  Extra points:- 1] Lawrence Peter "Yogi" Berra (May 12, 1925 – September 22, 2015) .  ;
2] The Yogi ... The Yogi Book, the New York Times bestseller. ..... 
3] “But the Yogi-isms testified to a character — goofy and philosophical, flighty and down to earth — that came to define the man. ; 
4]Yankees ;- On July 18, 1999, Berra was honored with "Yogi Berra Day" at Yankee... ]  "A legendary Yankee"
5] On July 18, 1999, Berra was honored with "Yogi Berra Day" at Yankee Stadium. Don Larsen threw the ceremonial first pitch to Berra to honor the perfect game of the 1956 World Series.   
************************************,
కోణమానిని తెలుగు ప్రపంచం ; 65943 pageviews - 1044 posts, - May 19, 2016 - 
[ on screen 61264 ] 
;

19, మే 2016, గురువారం

ఎమోజీ creator

చిన్న డిజిటల్ ఇమేజ్ , ఐ కాన్ = ఎమోజీ.
పాన్ మాట నుండి / ఏర్పడింది. 
1999 లో ఐ మోడ్ - అని చెప్పారు.

ఆ తర్వాత "ఎమోజీ" నిర్వచనం స్థిరపడినది.
1990 లలో ఇది అందరికీ అందింది.
జపాన్ భావాన్ని అనుసరించి , 
పిక్చర్ + మోజీ = అక్షరం + క్యారెక్టర్ :- అని  
భావ సమాసం = ఎమోజీ. [  visualized emoji ] 
మొబైల్ లో ఆవిష్కరించిన తొలి మనిషిగా - 
ఆ ఘనత "కురితా" కి దక్కింది. 
షిగెటకా కురితాశ్రీకారం చుట్టిన 
ఈ చిన్న భావ ప్రతిఫలన బొమ్మ - నేడు 
ఇంటర్ నెట్ లోనూ, ప్రపంచంలోనూ 
విపరీత ఆదరణను పొందిందనేది 
అందరికీ తెలిసిన నిర్వివాద విశేషం. 
ఫోన్ మెస్సేజ్ లు మున్నగునవి, 
48 లెటర్స్ కంటే ఎక్కువ పట్టవు.

[ A feature phone in 1999 had 
a very small monochrome LCD screen 
which could only fit in 48 letters. ]

"అప్పుడు బోలెడు అక్షరములు చెప్పే భావాలను - 
గోరంత జాగాలో చెప్పగలమా?" - 
అనే ఆలోచన కలిగినది. 
ఆ యోచనయే కురిటాను - 
'ఎమోటికాన్స్ బ్రహ్మ'ను చేసింది.  
అతను కొత్త అక్షరమాలను సృజించాడు. 
నవీన alphabets  ని కనిపెట్టాడు.   

&&&&&&&&&&&&&&&&&&&
;  
Emoji, Shigetaka Kurita   
;

;













World Emoji Day ని సృష్టించి, 
జూలై 17 వ తేదీ నాడు జరుపుకోవాలని నిశ్చయించారు. 
సోషల్ మీడియా భావజాలానికి దిక్సూచి లుగా 
చిలకరించబడుతూన్న సింబల్స్, ఎమోటికాన్స్ ఎన్నెన్నో! 
స్నేహితులు, బంధువులు, కంపెనీలు యావన్మందీ 
తమకు ప్రీతిపాత్రమైన సింబల్స్ ని, ప్రతీకలను షేర్ చేసుకుంటున్నారు. 
Face Book, Twitter, Linkden - ఇత్యాది 
వెబ్ ప్రపంచ అనుబంధ సృజన శాఖలలో 
ఈ ఎమోటికాన్స్ లు అంతర్భాగాలు ఐనవి - అనేది నిర్వివాదాంశమే!
38 కొత్త ఎమోజీలు జూన్ న ఎమోజీ కేలండర్ పుటలకు ఎక్కినవి. 
క్లౌన్ -  విదూషకుని ముఖం కూడా వీనిలో ఒకటి. 
 Twiiter  వారు జూలై 15 ని Fake World Emoji Day అని తెలిపారు.

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦
;
The date on this calendar in the Apple emoji artwork is July 17, 
which is the date that iCal for Mac was 
first announced at MacWorld Expo in 2002 and now also World Emoji Day. 

World Emoji Day World Emoji Day , July 17 [ LINK ]  ;- 

7, మే 2016, శనివారం

వల్కలము, తప వస్త్రము

వల్కలము – అంటే నారచీరలు. 
ఫూర్వం తాపస ప్రవృత్తిని స్వీకరించిన మునిపుంగవులు, ప్రకృతిసిద్ధమైన సరంజామాలను మాత్రమే నిత్య జీవన విధానములకై గైకొన్నారు.
అట్లాగే అరణ్యవాసములకు వెళ్ళిన వారు, 
వానప్రస్థాశ్రమ వాసులు కూడా ఈ జీవనవిధానాన్నే అనుసరించారు.
మన ఇతిహాసాలు ఇందుకు సోదాహరణములు. రామాయణ, మహాభారత, ప్రాచీన చరిత్ర యావత్తూ  
(“జయం”/ # “Jayam”  =  ”MahaBharatam”)# 
నిలువెత్తు నిదర్శనాలు. 
శ్రీరామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణుడు నారచీరలను ధరించి, విపినములకు వెళ్ళారు.  
అరణ్యాలలో పంచపాండవులు వల్కలములను ధరించారు. 
మహర్షులు, వారి భార్యలు, వారి పిల్లలు కూడా వల్కల  ధారణను   దైనందినజీవితములో అంతర్భాగాలుగా స్వీకరించారు.
;
ఇంతకీ ఈ వల్కలములను దేని నుండి తయారుచేసుకున్నారు?
భూర్జవృక్షములు వీరికి ఆధరువు ఐనవి. 
భూర్జవృక్షముల బెరడులను చెక్కి తీసి, 
ఎండబెట్టారు, వస్త్రాలుగా మలుచుకున్నారు.
[భూర్జవృక్షములు, తాళపత్రములు = తాటాకులు – ప్రాచీనకాలమున మన దేశములో 
కావ్యాలను వ్రాయుటకు ఉపయోగించబడినవి.)
ఉత్తరభారత దేశములో 
భూర్జతరువుల కాండముల యొక్క ‘పట్టలు'/ bark నుండి ఎంతో శ్రమపడి తయారుచేసుకున్నారు 
అటవీవాసులు, గురుకులవాసులు.  
గురుకులములు  ఈ చక్కని వాతావరణాన్ని ప్రతిబింబిస్తూండేవి. 
ఆటవికతెగలు శబరులు, కిరాతులు, చెంచులు, కోయవాళ్ళు మొదలైనవారు జంతుచర్మాలను ధరించారు. గురుకుల నివాసులు, అనగా గురువులు, శిష్యులు, ఆదిగా గలవారు సాత్వికజీవనవిధానాలను అనుసరించారు.  కనుక వారు ప్రకృతిసహజమైన వస్తువులను వాడటాన్ని ఆచరణలోకి తెచ్చారు.
శాంతారామ్శకుంతల” లో చెట్టుపట్టల నుండి 
దుస్తులను తయారుచేసుకోవడాన్ని  చిత్రీకరించారు. 
ఆమె కుమారుడు భరతుడు సింహాలతో ఆడుకుంటూంటాడు. 
క్రూర జంతువుల నోరు తెరిచి, వాటి నోళ్ళలోని పళ్ళను లెక్కబెడుతూంటాడు. 
అదిగో! ఆ సందర్భంలో దుష్యంతుడు చూసి, 
“నిర్భీతితో కారడవుల విహరిస్తూన్న వీరబాలుడు ఎవరు?” అని ఉత్కంఠతో ఆరా తీసి, తన భార్యా బిడ్డలను కలుసుకున్నాడు. 
ఆ అతి చిన్న ఉపకథకు - 
మహాకవి కాళిదాసు ఘంటము 
సాహిత్య రంగమున సింహాసనమును అమర్చింది. మహాకవి కాళిదాసు చిత్రీకరణలో 
“అభిజ్ఞాన  శాకుంతలము” 
అనే నాటకముగా వెలుగులీనింది.
] మరి అన్నేళ్ళు ఒంటరిగా కాననములలో జీవించిన శకుంతల, 
చివికిపోయిన దుస్తులలో అట్లాగే కాల వెళ్ళబుచ్చుతుందా? శకుంతలను – ధీరోదాత్తగా భావించాడు 
హిందీడైరెక్టర్ శాంతారామ్.  
ఇంత చిన్న విషయాన్ని- అదేనండీ! కథానాయిక   ఆహార్యాదులను – వెండి తెర చిత్రీకరణ కోసము – గమనించగలిగాడు, 
కాబట్టే – శాంతారామ్ గొప్ప దర్శకునిగా 
కీర్తిప్రతిష్ఠలను ఆర్జించారు. 

**************************;

भूर्जवृक्ष :- భూర్జవృక్షములు, భూర్జ తరువు ఆకులు
వలువలుగా ఉపయోగపడినవి, 
భూర్జపత్రములు, అనగా భూర్జ తరువు ఆకులు 
‘మన ప్రాచీన హిందూ దేశములో సాహిత్య రత్నములను పొందుపరిచిన  కాంచన ఆభరణములైనవి.  

**************************;
part - 2 ;-
న్యూ గినియా మున్నగు దేశాలలోని ప్రజలు, భూర్జవృక్షములు, వలువలు ధరించిన పద్ధతి పూర్వం ఉన్నది. 

वल्कल ​. छाल - bark - chhAla ​. वल्कलधारी ​. वल्कलधारी - dressed in bark - valkaladhArI ​. वल्कल परिधान ​. परिधान प्रकार() - garment ... साधारण वेश धारण करना dress simply ... 
భూర్జవృక్షములు #Ficus Fibres వర్గమునకు చెందినవి. హిందూదేశము నుండి అండమాన్,ఆస్ట్రేలియా ఉత్తరభాగమున Ahem Land; Kalumburu మున్నగు తావులకు చేరినది. 
న్యూ గినియా ప్రజలు తమ బుట్టలకు, కవర్లు,  అల్లికలు, సిద్ధంచేసుకోగలిగారు.
హిమయుగమునకు పూర్వకాలమునందు 
30వేల ఏళ్ళ క్రితం మనుషులు దేహమును చలి, ఎండల బారి నుండి కాపాడుకొనుటకు చెట్టుపట్టలు వాడారు. 
Lin seedsS చెట్లను వాడలేదు. 
ఫైకస్ ఫైబర్స్ జాతి చెట్లు ఉపయోగితం ఐనవి.
బైబిల్ ప్రకారం - ఆడం, ఈవ్ = ఆదాము అవ్వ లు Fig leawesతో ఒడలు కప్పుకొన్నారు.

*************************, 

సరే! ఇంతకీ 'భూర్జ' అనే పేరు ఎట్లాగ సంభవించినది?
తూర్పు వింధ్యాచల ప్రాంతములను 
నేటికీ "భోజ సీమ/ రాజ్యం" అని 
వ్యవహరిస్తున్నారు. 
భోజ మహారాజు పండితులకు 
అక్షరలక్షలను ఒసగిన వితరణశీలి.
సాహిత్యపోషకుడైన ఆయన కాలములో భూర్జపత్రలేఖనములు పరివ్యాప్తికి వచ్చినవి. 
మహాభారతములో భోజపురి ప్రస్తావన ఉన్నది. [హిమాచలము మున్నగు ఎత్తైన చోట్ల పెరుగుతుంది. అద్భుత ఉపయోగముల వలన దేవవృక్షము - అని సంభావిస్తూ, దేవదారు పాదపములు - అని పిలిచారు.  
;
part - 3 ;-

తప వస్త్రము- ఈ పేరును వింటూంటే- 
"భారతదేశములోని మునుల దినచర్య ఐన 
"తపస్సు" అనే మాట స్ఫురణకు వస్తూన్నది కదూ!!!
ఇతిహాస యుగాల నుండి మన దేశంలోనే కాదు, 
ఆదిమ మానవునికి వలువలు కట్టడానికి 
ప్రకృతి నుండి లభ్యమైన సామగ్రిని స్వీకరించాడు. 
తాపసులు, వానప్రస్థాశ్రమమును స్వీకరించిన వారు 
నార  చీరలను ధరించే వాళ్ళు. 
రామాయణములో అరణ్య వాసానికేగుతూన్న 
సీతాదేవి,శ్రీరాముల వారు,లక్ష్మణస్వామి వారు 
నారచీరలను ధరించి, బయలుదేరారు.
నార చీరలు ధరించడము- అన్నది 
ప్రాచీన హిందూ దేశములో,  
వేదకాలములు, యుగాలనుండీ ఒక ఆచారముగా ఏర్పడినది.
వల్కల ధారణ, నార చీరలు కట్టుట - 
వైరాగ్య జీవనమును గడిపే వారు.  
స్వచ్ఛందముగా నిర్దేశించుకున్న వింత ఆచారము.
కైకేయి ఆజ్ఞను శిరసావహించిన దాశరధి, 
సతీ సోదరులతో కారడవులకు ఏగునపుడు, 
ఆహార్యమును మార్చుకున్నాడు.
రాజ భోగ, భాగ్యాలను ప్రతిబింబించే మణిమయ రత్న కిరీటాభరణాలను, పట్టుపీతాంబరాలను త్యజించాడు. 
అప్పటికప్పుడు తెప్పించిన నారచీరలను ధరించాడు. 
వల్కల ధారణ అవగానే, 
మర్రిపాలను తెప్పించాడు. 
జుట్టుకు మర్రి పాలను బాగా పట్టించి, 
సిగముడిని వేసుకుని, 
అటవీ ఆశ్రమాలలో నివసిస్తూన్న మునివరుల వలే సాక్షాత్కరించారు సోదర ద్వయం శ్రీరామ లక్ష్మణులు. ; 
ఈ సహజమైన దుస్తులు ఏ పద్ధతిలో తయారైనవి?
ఆ ప్రాకృతిక వల్కలములను దేహధారణకై, సృజించుకొనుటకై  
మానవులు ఎలాగ శ్రమించారు? 
ఇది కాసింత ఆసక్తికర అంశమే!
;
ఆ కథా కమామిషూలపై 
కూసింత దృష్టి సారిద్దాము!!!!!!!!!
ఇప్పటికీ- ఈ కాలంలోనూ 
ఇటువంటి నారచీరలను వాడుకగా 
ఉపయోగించడము జరుగుతూన్నది. 
ఆరు తెగల పసిఫిక్ జనులు- విరివిగా గౌరవనీయంగా పాటిస్తూన్న ఆచారము. 
ఫిజీ, పపువా న్యూ గినియా, హవాయి, సమొయా, ఫూతునా, హవాయ్,  
ఆ ప్రదేశాలలో- ఈ తప వస్త్రము- 
అక్కడి వ్యక్తిగత హోదాను ప్రతిబింబిస్తాయి.
( six South pacific cultures of 
Fiji island, Tonga, Samoa, 
Papua New Guinea, Futuna and hawaii)
కుటీర పరిశ్రమ వలె కొనసాగుతూ, 
అనుసరిస్తూన్న  అనాది సాంప్రదాయము ఇది.
అనేక యుగాల నుండి వాళ్ళు 
ఇతర దీవులకు వలస   వెళుతూ- 
ఈ తప వస్త్ర సృజనను- కనుమరుగు కాకుండా కొనసాగిస్తూన్నారు. 
 కొందరు ఆధునిక టెక్నాలజీని చేతి సాయంగా గైకొని, 
ఈ తరు వస్త్రాల సృష్టిని కొనసాగిస్తూన్నారు.  
టపా క్లాత్- ను దక్షిణ పసిఫిక్ కల్చర్ల ప్రజలు తయారు చేసుకుంటున్నారు. ఆరు స్థానిక నాగరికతలలో- ఇది అందుబాటులో ఉన్న ఆచరణ. 
స్త్రీలు మాత్రమే వీటిని తయారు చేస్తూంటారు. 
పురుషులు వీటిని ఉత్సవాలలో (Ceremonial dress) ధరిస్తారు. 
సాధారణముగా పెద్ద పెద్ద బండిల్సు (bundles) గా చేసి అట్టిపెట్టుకుంటారు. 
వీనిని గోడలకు అలంకారములుగా తగిలిస్తారు. 
ప్రముఖ వ్యక్తులకు- స్వాగతము పలికే- రెడ్ కార్పెట్ లా  
ఉపయోగిస్తారు
పెళ్ళిళ్ళు, పండుగలు పబ్బాలు, శుభకార్య వేళలలో- 
నేటికీ ఈ తప cloths ను ఇచ్చి పుచ్చుకునే కానుకలుగా- 
ఆరు తెగల పసిఫిక్ జనులు- విరివిగా గౌరవనీయంగా పాటిస్తూన్న ఆచారము.
అనేక యుగాల నుండి వాళ్ళు ఇతర దీవులకు వలస   వెళుతూ- ఈ         
టప వస్త్ర సృజనను- కనుమరుగు కాకుండా కొనసాగిస్తూన్నారు. 
కొందరు ఆధునిక టెక్నాలజీని చేతి సాయంగా గైకొని, ఈ తరు వస్త్రాల 
సృష్టిని కొనసాగిస్తూన్నారు.  
;
ఒకసారి- "సీతారామ కళ్యాణము" సినిమాలోని 
కళ్యాణ ఘట్టాన్ని జ్ఞాపకము చేసుకోండి.
ఎన్.టి.రామా రావు ప్రతిభకు ఇది తార్కాణము.
మిథిలాపురికి విచ్చేసిన దశరధునికీ, పరివారానికీ మర్యాదలు చేస్తారు. 
జనక మహారాజు దశరధ బంధు జనులు వస్తూన్నప్పుడు 
వస్త్రాలను గబ గబా పరుస్తూ ముందుకు సాగే  ఘట్టము- 
మదిని దోచు కమనీయ దృశ్యమది.
టోంగన్ కల్చర్ ప్రజలు- ఇలాగ ప్రముఖులకు - 
టప క్లాత్స్ ను పుట్టములుగా పరచి- ఆహ్వానము పలుకుతూంటారు. 
స్వాగతము పలికే- రెడ్ కార్పెట్ లా  ఉపయోగిస్తారు. 
టోంగాన్లు (Tongans ) ఈ సహజ ఉడుపులను చేసే పద్ధతి 
చాలా ఆసక్తికరంగా ఉంటుంది.  
ఆ విశేషాలను వివరముగా చూద్దాము!
*****************************;  
తప వస్త్రము - కొరకు 
ఆ బెరడు లేయర్లను- సమతలంగా ఉన్న చెట్టు దుంగల మీద పరుస్తారు. వాటిని చెక్క దిమ్మలతో (Wooden mallets) మర్దిస్తారు. ఆ బెరడు పొరలు- చదునుగా అయ్యేటట్లుగా చెక్కలతో దిమ్మస కొడతారు.
(bark is flattened into wide, flexible sheets)
కూరగాయల మొక్కల వేళ్ళ నుండి- జిగురు (Glue) ను చేసి 
సిద్ధము చేసుకుంటారు. 
నీటి చెమ్మ అంతా ఎండి పోయిన బెరడు షీటు (sheets) ను 
ఈ వేళ్ళ బంక (Roots, Glue)తో - అతికిస్తారు. 
అలా వరుసగా అతికిస్తూ- 
పెద్ద తప వస్త్రపు పుట్టము- రెడీ ఔతుంది. 

కొస మెరుపు :-
శాంతారామ్ ప్రఖ్యాత హిందీ సినీ దర్శక నిర్మాత, నటుడు. 
ఈతని "శకుంతల" మూవీలో ఒక చిత్రీకరణ నాకు చాలా నచ్చినది.
దుష్యంతుడు తిరస్కరించిన తర్వాత- శకుంతల 
హిమాలయ పర్వత శ్రేణులకు చేరుతుంది.
మనుష్య సంచారమే లేని ఆ సీమలలొ ఆమె ఎలా గడిపింది? 
ఈ అంశాన్ని అత్యంత సున్నితంగా చిత్రించాడు శాంతా రామ్.
శకుంతల చెట్టు బెరడులను- సున్నితంగా నిలువుగా విచ్చదీస్తూ,
విడదీసిన ఆ చెట్టు పట్టలను  తాను తీసుకుంటుంది.
(ఇంత చిన్న విషయాన్ని కూడా పరిశీలించిన వాడు, 
కాబట్టే, ఆతడు గొప్ప దార్శనిక-దర్శకునిగా- ప్రఖ్యాతి గాంచాడు)
అనాది మానవుల వస్త్రధారణకు శ్రీకార స్వరూపిణులు ఈ వల్కలములు. 
అందుకనే- నేటికీ ఇటువంటి
ప్రకృతి సహజ వరములైన నార దుస్తుల తయారీని 
పాటిస్తూన్న పద్ధతులు- తెలుసుకోదగిన జిజ్ఞాసని కలిగించే విశేషములే కదా!   
;
Tapa cloth  [ link - vedio ]
;
***********************************,
Tags :- 
Tapa cloth (or simply tapa) is a barkcloth made in the islands of the Pacific Ocean, primarily in Tonga, Samoa and Fiji, but as far afield as Niue, Cook Islands, Futuna, Solomon Islands, Java, New Zealand, Vanuatu, Papua New Guinea  
;
అఖిలవనిత
Pageview chart 35700 pageviews - 849 posts, last published on May 7, 2016 - 

తెలుగురత్నమాలిక
Pageview chart 5371 pageviews - 152 posts, last published on May 6, 2016 - 
 
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 65651 pageviews - 1042 posts, last published on May 5, 2016 - 

5, మే 2016, గురువారం

నీటివసతి, ప్రాచీనుల సేవ

శ్రీ సారంగపాణి కోవెల ఉన్న ఊరు "తిరుక్కుండతై".
ఈ కోవెల "కుంభకోణము" నకు ఒకటిన్నర మైలు దూరాన ఉన్నది. ;
శ్రీ మహా విష్ణుమూర్తి అనుగ్రహమును పొందిన
హేమఋషి ఆశ్రమము ఉన్నచోట
"మహా మాగ కొలం"  కొలను వెలసినది.
దానికి జంట కొలను "పొత్రమరై" (Potra marai kulam)
 "మహా మాగ కొలం", "పోత్రమరై కులం" అనే నీటి సరసులు ఉన్నవి.
ఈ సరోవర ద్వయానికి ఉద్భవ గాధ కలదు.

story ;-

ప్రళయవేళల బ్రహ్మదేవుని భుజాలపై ఉన్న బాధ్యత "సృష్టి పునర్ నిర్మాణము".
అందుకై సృష్టికర్త - అమృతము మొదలైన సామగ్రిని సేకరించాడు.
విరించి తన సేకరణలను ఒక కుండలో నింపాడు.
ఆ మట్టికుండను "మేరు పర్వత శిఖరము" (Mountain Meru) పైన
విరించి జాగ్రత్తగా అట్టిపెట్టాడు.
ప్రళయ కాలం వచ్చి, తెంపులేని వర్షాలతో అతలాకుతలం అవసాగింది.
బ్రహ్మ - అమూల్య వస్తు పూర్ణకుంభమును జాగ్రత్తగా రక్షించ పూనుకున్నాడు.
వరదభీభత్సాలనుండి కుంభపరిరక్షణ - 
తక్షణ కర్తవ్య దేవతలు కైలాసమునకు వెళ్ళారు.
దివ్యుల కోరికపై - భవుడు శరసంధానము చేసాడు.
నారి సారించి, అంబును విడిచాడు సాంబసదాశివుడు.
మహేశుడు విడిచిన బాణము కుండను తాకింది.
కుండ బ్రద్దలై  అందులోని సుధారసము అక్కడ రెండు భాగాలుగా పడినది.

ఆ ద్వి భాగాల పేర్లు  "మహా మాగ కొలం", "పోత్రమరై కులం" అనే రెండు కొలనులు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&,

శ్రీ సారంగపాణి ( ఆరావముదన్ ) కోవెల ఇక్కడ వెలిసినది.
 కుంభకోణమునకు 1 1/2 మైళ్ళు దూరములో
ఈ ";తిరు కుండతై Thirukkudanthai " ఉన్నది.
కుంభము భగ్నమైన చోటు –
కనుక “కుంభ కోణము”/ కుండతై (Kundatai) అనే పేరు వచ్చి,
నేడు పుణ్యతీర్ధముగా విలసిల్లుచున్నది)  

] మూలవరులు:- Thirukudanthai శ్రీ సారంగపాణి:
శ్రీ మహా విష్ణు ధనుస్సు పేరు "శార్ఙ్గము"
అందుచే ఈ స్వామి పేరు "సారంగపాణి".
ఈ స్వామి - ఆరా అముధన్, అభయాప్త మిరుతన్, ఉత్థాన శాయి
మున్నగు పేర్లతో కీర్తించబడుతున్నాడు.
హేమమహర్షికి  ప్రత్యక్షమైనది ఈ చోటులోనే! 
మూలవరులు ఉద్యోగశయన భంగిమలో ఉన్నారు,
అనగా అప్పుడే నిద్రనుండి మేల్కొన్న పొజిషన్ లో ఉన్నారు.
కోమలవల్లీ తాయారు ఈ కోవెలలో
మరొక దర్శన అభయ వరప్రదాయిని ఐ,
భక్తులను అనుగ్రహిస్తూన్నది.

&&&&&&&&&&&&&&&&&&&
నది 2 :-  

సురాధిపతి ఇంద్రుని వాహనము.
బర్మాలోని ఇరవదిడి నదికి - ఐరావతము- అనే నామము ఆధారము.
Ayeyarwaddy అని కూడా బర్మాలో (సంస్కృతము- పాలీ భాషా రూపము) పిలుస్తారు. 

] ఈ నదిలో మత్స్యజాతి ఇరవాడి డాల్ఫిన్ (Irrawaddy dolphin (Orcaella brevirostris)
విశాఖపట్టణము వద్ద బంగాళాఖాతంలో
1852 లో సర్ రిచర్డ్ ఓవెన్ కనుగొన్నారు;

విశాఖ వద్ద చూసిన Sir Richard Owen  1852 లో గ్రంధస్థం చేసి,
ప్రపంచ జంతు ప్రేమికులకు పరిచయం చేసాడు.
ఒరిస్సాలోని చిలక సరస్సు, కంబోడియా మున్నగు సీమలలో అగుపిస్తాయి.
సముద్ర, నదీ సంగమ జలములలో "డుగాంగ్", నక్షత్ర తాబేళ్ళు,
ఇంకా అసంఖ్యాక జలచర, పక్షులు ఉన్నవి. 

; నీటివసతి, ప్రాచీనుల సేవ [ akhilavanitha  ;-
;- =  Friday, March 8, 2013 ; బర్మాలో ఐరావది నది ] :- 
#neeTiwasati, praacheenula sEwa :- # 
;

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...