15, సెప్టెంబర్ 2015, మంగళవారం

తొలి అనువాద గ్రంధము

ప్రపంచ సాహిత్యానికి అనువాదము, Translations 
అనేవి ఎంతో మేలు చేస్తున్నవి.
అనువాదప్రక్రియకు చెప్పదగిన స్థానం సారస్వత లోకమున ఉన్నది. 
బౌద్ధమత సిద్ధాంతములను చీనా భాషలోనికి 
అనువాదం చేసిన వారు తెలుసా!?
ఝిషెన్  [Zhichen] అను బౌద్ధ సన్యాసి 
ఈ మహా బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టాడు. 
ఝెషిన్ గాంధార [నేటి కాబూల్, పెషావర్] దేశ వాసి, కుషానుల కొలువులో పండితుడు.
హిందూదేశమున స్వర్ణయుగం - అని చరిత్రకారులు ప్రశంసించిన కాలం అది. 
కుషాణచక్రవర్తి కనిష్క ప్రభువు పూనికతోచైనాభాషకు ప్రోత్సాహం లభించింది. 
పాళీభాషలోని బౌద్ధగ్రంధాలను మానవాళికి అందించే ఆలోచన కలిగింది.
కనిష్కుని ఆదేశాలను అవధరించిన ఝిన్ [147 CE] 
చైనాభాషలోనికి ట్రాన్స్ లేషన్ చేయడం మొదలుపెట్టాడు. 
మహాయాన వాదము ప్రపంచ ప్రజలకు అందుబాటులోనికి వచ్చింది.
అప్పటి నుండి హిందూ, చైనా దేశాలు వాణిజ్యం పెంపొందింది. 
 చీనాంబరములు అనే పదము - పట్టు వస్త్రాలకు పర్యాయపదం ఐనది. 
 = అంటే "పట్టు వస్త్రాలు", చైనా దుస్తులు - చీనీ - చైనా సంబంది - అని అర్ధం.   
చీని చీనాంబరములు , పింగాణీ సామానులు మున్నగునవి వర్తకములలో మార్పిడి జరుగసాగినవి. 
అహింస, శాంతి సిద్ధాంతముల యొక్క విలువను లోకము గుర్తించసాగినది.
సంస్కృతీ  సూత్రముల పరస్పర ఆదాన ప్రదానములు కొనసాగినవి.
ప్రజ్ఞాపారమిత సూత్రములు - అని ప్రసిద్ధికెక్కినవి, ఝిషిన్ రచనలు. 
అనువాద రచనలయొక్క విలువ అందరికీ తెలుస్తున్నది.
అనువాద ప్రక్రియ - చైనా, సంస్కృత, పాళీ మున్నగు భాషలకు, అనేక 
భాషలకు వారధిగా గుర్తింపు కలిగినది. 
అనువాద రచన, సాహిత్యరంగములో ప్రధానస్థానాన్ని 
పొందుటకు కారణమైన వ్యక్తి, 
చీనీ భాషలో బౌద్ధ రచనల తొలి వ్యక్తిగా - చరిత్రలో లబ్ధప్రతిష్ఠ గాంచాడు. 
" ఝెషీన్" = లోక క్షేమ" అని ఆతని నామధేయానికి అర్ధము. 

==================================

toli anuwaada gramdhamu   

prapamcha saahityaaniki anuwaadamu, #Translations# anEwi emtO mElu chEstunnawi.
anuwaadaprakriyaku cheppadagina sthaanam saaraswata lOkamuna unnadi. 

mahaayaana waadamu prapamcha prajalaku amdubATulOniki wachchimdi.
appaTi numDi himduu, chainaa dESaaలు waaNijyam pempomdimdi. chini chiinaabaramulu = amTE "pTTu wastrAlu", pimgaaNI saamaanulu munnagunawi wartakamulalO maarpiDi jarugasaaginawi. 
ahimsa, Saamti siddhaamtamula yokka wiluwanu lOkamu gurtimchasaaginadi.
సంస్కృతీ  suutramula paraspara aadaana pradaanamulu konasaaginawi.
praj~naapaaramita suutramulu - ani prasiddhikekkinawi, jhishin rachanalu. anuwaada rachanalayokka wiluwa amdarikii telustunnadi.
anuwaada prakriya - chainaa, samskRta, paaLI munnagu bhaashalaku, anEka bhaashalaku waaradhigaa gurtimpu kaliginadi. 
anuwaada rachana, saahityaramgamulO pradhaanasthaanaanni pomduTaku kaaraNamaina 
wyakti, chiinii bhaashalO bauddha rachanala toli wyaktigaa - charitralO 
labdhapratishTha gaamchaaDu" jheshiin. "lOka kshEma" ani aatani naamadhEyaaniki ardhamu. 

****************  ****************    
[f. b. ;- తెలుగు సాహిత్య ప్రపంచం]

సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 5

అధ్యాయ శాఖ ;- 30 A ;-  తాటాకుల కవిలె కట్ట సేకరణ ;; ;           లేఖక్ 1 ;- ఇందాక వస్తుంటే - వీరకుడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు, ఎవరినో!?  ల...