30, సెప్టెంబర్ 2015, బుధవారం

చింతామణి గణపతి

గజాననుడు / కరివదనుని విశేషాలు కొన్ని :-
మహారాష్ట్రలోని ‘అష్టవినాయక కోవెలలు' ప్రసిద్ధి గాంచినవి.
వీనిలోని “చింతామణి గణపతి” గురించి స్థలపురాణ కథ ఉన్నది.
ఆ ప్రాంగణములో తరువు వెలయుటకు కారణమైనది.
******************************,

“శబల” అను ఆవు వశిష్ఠముని వద్ద ఉన్నది. చిటికెలో అద్భుతమైన విందు ఆ ధేనువు అనుగ్రహించింది. అతిథి గా, తన సైనిక పటాలంతో సహా వచ్చిన మహారాజు విభ్రమానికి లోనైనాడు.
“కామధేనువు వత్సం ఐన ఈ శబల మహారాజును ఐనట్టి నావద్ద ఉండుట సముచితము. కనుక నాకు ఇవ్వుము మునీ!” అని అడిగి, ముని కాదనగా భంగపడ్డాడు.
అతడే గాధిరాజు, విశ్వామిత్రుడు, ఋషిగా, బ్రహ్మర్షిగా ఎదిగిన చక్కని పౌరాణిక సంఘటన అది. ఇట్లాంటిది ‘చింతామణి అనే మణి ‘ కథ.
************,

ఈ అద్వితీయ రత్నమునకు సంబంధించి ఒక గాథ ఉంది.
పూర్వం కపిలముని వద్ద చింతామణి అనే మణి ఉండేది.
(కపిలముని యొక్క సహోదరి ‘ సతీ అనసూయ' )
చింతామణి కోరిన కోరికలను తీర్చే కల్పతరువు వంటిది. అక్కడి ప్రభువైన అభిజిత్తు, గుణవతిల కుమారుడైన గుణ రాజకుమారుడు ఒకమారు కపిలుని ఆశ్రమానికి వస్తాడు. ఆ ముని రాజకుమారునికి చింతామణి మహిమతో షడ్రసోపేతమైన భోజనము ఏర్పాటు చేస్తాడు. ఆ మణి సంగతి తెలిసి రాజకుమారుడు మణిని తనకిమ్మని కపిలుని అడుగుతాడు.
కపిలముని దానికి అంగీకరించక పోగా, రాజకుమారుడు ఆ మణిని దొంగిలించాడు. బాధతో కపిలుడు గణపతిని ప్రార్థించాడు.
విఘ్నేశుడు భక్త రక్షణకై ఇలకు అవతరించి, రాకుమారుని యుద్ధంలో ఓడించెను. పిమ్మట, అభిజిత్తు మహారాజు మణిని కపిలునికి తిరిగి ఇవ్వబోగా, కపిలుడు ‘ఆ మణి తనకు వలదని ‘ చెప్పి,
“శివపుత్రా! విఘ్నేశా! నీవు ఇక్కడే , భక్తచింతామణివై మమ్ములను అనుగ్రహించుము ’ అని ప్రార్ధించెను.
గణేశుడు అక్కడే కదంబ వృక్షము కింద వెలిసెను.
అప్పటినుంచి కపిలుడు ఆ గణేశుని ‘చింతామణి గణేశుని’గా కొలుస్తాడు.
ఈ చింతామణి గణేశ క్షేత్రం మహారాష్త్రలోని థేవూర్ లో (పుణే/ పూనా దగ్గర) ఉంది.
మహారాష్ట్రలోని అష్టవినాయకులలో ఒకటి ఈ చింతామణి వినాయకుడు.

****************,

ఎనిమిది విఘ్నవినాయకస్వామివార్ల పేర్ల పట్టిక :-

1) చింతామణి గణపతి; Chintamani, Theyur):
2) హేరంబ గణపతి;( hEramba gaNapati) :
3) బళ్ళాలేశ్వర ;పాళీ:                                                                             4) గిరిజాత్మజ, లేన్యాద్రి (Girjatmaja, Lenyadri):
5) మహా గణపతి, రాజన్ గావ్ (Mahaa GaNapati, Rajan gaaw):
6) మోరేశ్వర కోవెల (Moreshwar Temple):
7) సిద్ధివినాయక ఆలయ (Siddhiwinayaka dewalay, Siddhtek):
8) వరదవినాయక్ మహాడ్ (Varada Vinayaka, Mahaad);

&&&&&&&&&&
Important points:- కామధేనువు దూడ శబల ;
[rachana :- కుసుమాంబ1955 ] ; = http://jabilli.in/1274 

చింతామణి గణపతి ; September 20, 2015 =
link - web mag "JABILLI sept 2015"  

*************************************,  

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 61916 pageviews - 1029 posts, last published on Sep 15, 2015

15, సెప్టెంబర్ 2015, మంగళవారం

తొలి అనువాద గ్రంధము

ప్రపంచ సాహిత్యానికి అనువాదము, Translations 
అనేవి ఎంతో మేలు చేస్తున్నవి.
అనువాదప్రక్రియకు చెప్పదగిన స్థానం సారస్వత లోకమున ఉన్నది. 
బౌద్ధమత సిద్ధాంతములను చీనా భాషలోనికి 
అనువాదం చేసిన వారు తెలుసా!?
ఝిషెన్  [Zhichen] అను బౌద్ధ సన్యాసి 
ఈ మహా బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టాడు. 
ఝెషిన్ గాంధార [నేటి కాబూల్, పెషావర్] దేశ వాసి, కుషానుల కొలువులో పండితుడు.
హిందూదేశమున స్వర్ణయుగం - అని చరిత్రకారులు ప్రశంసించిన కాలం అది. 
కుషాణచక్రవర్తి కనిష్క ప్రభువు పూనికతోచైనాభాషకు ప్రోత్సాహం లభించింది. 
పాళీభాషలోని బౌద్ధగ్రంధాలను మానవాళికి అందించే ఆలోచన కలిగింది.
కనిష్కుని ఆదేశాలను అవధరించిన ఝిన్ [147 CE] 
చైనాభాషలోనికి ట్రాన్స్ లేషన్ చేయడం మొదలుపెట్టాడు. 
మహాయాన వాదము ప్రపంచ ప్రజలకు అందుబాటులోనికి వచ్చింది.
అప్పటి నుండి హిందూ, చైనా దేశాలు వాణిజ్యం పెంపొందింది. 
 చీనాంబరములు అనే పదము - పట్టు వస్త్రాలకు పర్యాయపదం ఐనది. 
 = అంటే "పట్టు వస్త్రాలు", చైనా దుస్తులు - చీనీ - చైనా సంబంది - అని అర్ధం.   
చీని చీనాంబరములు , పింగాణీ సామానులు మున్నగునవి వర్తకములలో మార్పిడి జరుగసాగినవి. 
అహింస, శాంతి సిద్ధాంతముల యొక్క విలువను లోకము గుర్తించసాగినది.
సంస్కృతీ  సూత్రముల పరస్పర ఆదాన ప్రదానములు కొనసాగినవి.
ప్రజ్ఞాపారమిత సూత్రములు - అని ప్రసిద్ధికెక్కినవి, ఝిషిన్ రచనలు. 
అనువాద రచనలయొక్క విలువ అందరికీ తెలుస్తున్నది.
అనువాద ప్రక్రియ - చైనా, సంస్కృత, పాళీ మున్నగు భాషలకు, అనేక 
భాషలకు వారధిగా గుర్తింపు కలిగినది. 
అనువాద రచన, సాహిత్యరంగములో ప్రధానస్థానాన్ని 
పొందుటకు కారణమైన వ్యక్తి, 
చీనీ భాషలో బౌద్ధ రచనల తొలి వ్యక్తిగా - చరిత్రలో లబ్ధప్రతిష్ఠ గాంచాడు. 
" ఝెషీన్" = లోక క్షేమ" అని ఆతని నామధేయానికి అర్ధము. 

==================================

toli anuwaada gramdhamu   

prapamcha saahityaaniki anuwaadamu, #Translations# anEwi emtO mElu chEstunnawi.
anuwaadaprakriyaku cheppadagina sthaanam saaraswata lOkamuna unnadi. 

mahaayaana waadamu prapamcha prajalaku amdubATulOniki wachchimdi.
appaTi numDi himduu, chainaa dESaaలు waaNijyam pempomdimdi. chini chiinaabaramulu = amTE "pTTu wastrAlu", pimgaaNI saamaanulu munnagunawi wartakamulalO maarpiDi jarugasaaginawi. 
ahimsa, Saamti siddhaamtamula yokka wiluwanu lOkamu gurtimchasaaginadi.
సంస్కృతీ  suutramula paraspara aadaana pradaanamulu konasaaginawi.
praj~naapaaramita suutramulu - ani prasiddhikekkinawi, jhishin rachanalu. anuwaada rachanalayokka wiluwa amdarikii telustunnadi.
anuwaada prakriya - chainaa, samskRta, paaLI munnagu bhaashalaku, anEka bhaashalaku waaradhigaa gurtimpu kaliginadi. 
anuwaada rachana, saahityaramgamulO pradhaanasthaanaanni pomduTaku kaaraNamaina 
wyakti, chiinii bhaashalO bauddha rachanala toli wyaktigaa - charitralO 
labdhapratishTha gaamchaaDu" jheshiin. "lOka kshEma" ani aatani naamadhEyaaniki ardhamu. 

****************  ****************    
[f. b. ;- తెలుగు సాహిత్య ప్రపంచం]

4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

palindrome శ్లోకము



తాం భూసుతా ముక్తి ముదారహాసం | 
వందేయతో లవ్య భవం దయాశ్రీ||
          ===================================
taam bhuusutaa mukti mudaarahaasam| 
 wamdEyatO lawya bhawam dayaaSree||
        ***************************************

ఈ పై శ్లోకం లోని చమత్కారం ఏమిటో తెలుసా? 
ఇందులో ఒక విశేషం ఉన్నది.
కొంచెం పరిశీలిస్తే మీకే అర్ధమౌతుంది. 

14 వ శతాబ్దంలో దైవజ్ఞ సూర్య రచన ఇది! 
daivajna surya - ఈ పద్ధతిలో దాదాపు 40 శ్లోకములు - వ్రాసారు.

పాలిండ్రోంస్ [palindrome ] = అంటే 'ముందు నుండి గానీ, వెనుక నుండి గానీ చదివితే - ఒకటే వస్తుంది.
పై శ్లోకమును ఇప్పుడు చదివి, చూడండి - 'తిరగమోతలు 'గా!

కేవలం ఇంగ్లీష్ వర్డ్స్ (English Words) తో కుస్తీ పడ్తూ, పాలండ్రోంస్ చేస్తున్నారు పాశ్చాత్యులు.
మన దేశంలో పద్య, శ్లోక, కావ్య, ప్రబంధాదులు 
అనేకానేకం సృజనలు జరిగినవి.
క్రీస్తు పూర్వం నుండే మన దేశంలో మాత్రమే 
సంభవించిన ' అపూర్వ సాహిత్య విన్యాసాలు ఇవి!' 

(#A palindrome is a word, phrase, number,
or other sequence of characters which 
reads the same backward or forward) # 

జై  భారతమాతా! 

********************,  ====================

"taam bhuusutaa mukti mudaarahaasam | 
wamdEyatO lawya bhawam dayaaSree||"

********************, 
ii pai SlOkam lOni chamatkaaram EmiTO telusA? 
imdulO oka wiSEsham unnadi.
komchem pariSIlistE miikE ardhamautumdi. 

14 wa SataabdamlO daiwaj~na suurya rachanalu, daadaapu 40 SlOkamulu - wraasaaru.
kEwalam imgliish warDs (#English Words)# tO kustii paDtuu, paalmDrOms 
chEstunnaaru pASchaatyulu.
mana dESamlO padya, SlO|ka, kaawya, prabamdhaadulu anEkaanEkam sRjanalu 

jariginawi. 
jai bhaaratamaatA! 

********************,

[ palindrome  శ్లోకము :-   ;- ఇన్ - F. B. Group ;- మన సంస్కృతి - ఆచారాలు సంప్రదాయాలు] 
&&&&&& 
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 61395 pageviews - 1026 posts, last published on Aug 27, 2015 -

********************,

  [  5:19పి. ఎమ్.  4/సెప్టెంబర్ /2015

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...