ఈ వేళ ఉత్థాన ఏకాదశి. ఉత్థానఏకాదశి విశిష్టమైనది.
కార్తీకశుక్ల పక్షమున ఉన్న పండుగ, నోము ఇది. .
ఉత్థాన ఏకాదశికి నాలుగు పేర్లు కలవు. ;
1) హరిబోధిని; 2) ప్రబోధిని; 3) దేవోత్తని; 4) ఉత్థాన ఏకాదశి;
నేడు నెమలిఈకలను (peacock feathers) దానము చేయుట పుణ్యప్రదము.
*****************************,
బర్హి పింఛధారి (song)
ఆ అందచందముల చూసితే చాలని అంటారు ఎల్లరూ! ; చాలు! చాలనుచును - చాల కోరికలు గద! ఎలమి ఈ లోకులందరికిని! శిఖిపింఛధారిని దర్శించాలని - అందరికి ఆపేక్ష || నెమలి పింఛమ్ములను నీ బర్హిలోనుండికోమలముగా వలిచి ఇవ్వవమ్మా కేకి! ఈ రోజు మంచిది, నీకు పుణ్యము దక్కు!ఉత్థాన ఏకాదశి! నేడు ఉత్థాన ఏకాదశి! || పింఛములు కాసిన్ని మాకివ్వవోయీ! నెమలి! నీ వన్నె ఈకలు కొద్దిగా చాలును మారాము చేయకే ఓ మయూరి! ఎవ్వారి 'చాలు' ఈ పెంకితనము;నీకిట్లు కలిగేను చెప్పవమ్మా! ॥
నాణెమైన ఈకలివ్వమ్మ నువ్వువెన్నెల, హరివిలులు, కన్నయ్య నగవులు వెల్లివిరియును అందు, అందుకోగలవీవు! ఉత్థాన ఏకాదశి, నేడు ఉత్థాన ఏకాదశి! ||
*****************************,
చాలు = పోలిక; చాళ్ళు = పోలికలు
*****************************,
హరే రామ! హరే క్రిష్ణ! |
1 కామెంట్:
ఏదో 'అమూల్' అంటే ఇట్లా వచ్చితిమి !
ఇట్లా నోములు అని వీర వాయింపుళ్ళు వేస్తా రను కోలేదుస్మీ !!!
జిలేబి
కామెంట్‌ను పోస్ట్ చేయండి