14, ఆగస్టు 2014, గురువారం

చుట్టూ మూగిన చిలకల్లారా!

చుట్టూ మూగిన చిలకల్లారా! 
చెట్టూచేమకు కథలే చెప్పి 
వెంటనె వస్తారా? 
మీరు వెంటనె వస్తారా? ...........  
ఈ మా పిల్లలవద్ద, మీరే సొంపగు కథలు నేర్చుకోండీ!
కంచికి పోవని కమ్మని గమ్మత్తు కథలను నేర్వండి ||
;
కొమ్మల వాలిన కోయిలలారా! 
చిగురుటాకులకు పాటలు నేర్పి, 
వెంటనె వస్తారా? 
మీరు వెంటనె వస్తారా? ...........  
ఈ మా పిల్లలవద్ద, మీరే సొగసౌ గానం నేర్వండి 
మహతి, కచ్ఛపి వీణలెరుగని పాటలునేర్వండి  ||
;
పూవుల షికార్ల తుమ్మెదలారా!
పుప్పొడి గ్రోలే మధుపములా! 
పూలకు తేనెలమాటలు నేర్పి
వెంటనె వస్తారా? 
మీరు వెంటనె వస్తారా? ...........  
ఈమా పిల్లలవద్ద, వాణీరాయంచ శిష్యుడైనది ;
సుధామాధురిని మించిన పలుకులు కమ్మగ నేర్వండి ||

చుట్టూ మూగిన చిలకల్లారా! (LINK web magazine "New Awa)

User Rating:  / 1 
Member Categories - బాల
Written by kusuma kumari
Friday, 13 June 2014 16:08
Hits: 186 [2 comments]

{konamanin views - 56402} 


Happy independence day august 15 2014 


స్వాతంత్ర్య ఉత్సాహ శుభాకాంక్షలు

ఆ భక్తుల ఇంటి పేరు - అనుముల

రైతు అనుముల మాచిరెడ్డి, కృష్ణా తీరాన  తంగెళ్ళ పల్లి నివాసి. గుంటూరు జిల్లాలోనిది ఈ గ్రామం. అతని పెద్దకోడలు భవనాశిదేవి శివ భక్తురాలు. ఒ...