कोहकन అనే పదం హిందీ, తత్సంబంధిత భాషలలో చోటుచేసుకున్నది. కోహకాన్ {कोहकन} ఎవరు?
కోహకాన్ ఒక ప్రేమికుడు. పర్షియన్ ఇతిహాసం, జానపద గాధ. లైలామజ్ఞూల కథలు వంటివి, ఈ కథను అనుసరించి, తర్వాతి తరముల వారికి అందినవి, అని విమర్శకుల అభిప్రాయాలు.
ఈ కథ ప్రపంచ సాహిత్యములో, మమతానురాగాలకు ప్రాధాన్యాన్నిఇచ్చినది.
అప్పటిదాకా వచ్చిన “హెలెన్ ఆఫ్ ట్రాయ్”, "క్లియోపాత్రా” మున్నగునవి, కేవలం యుద్ధ పరంపరలను పూసగుచ్చినవి. వీనిలో ప్రేమానుభూతులకు జాగా లేదు. ఒక స్త్రీ కోసమో, లేదా ఒక ఆడదాని పేరుతో, ఆయా ప్రాంతాలపై, దేశాలపైనా తమ తమ అధికారాలను సుస్థిరం చేసుకొనుట, తమ శక్తిని ఋజువు చేసుకునే నిమిత్తం జరిగిన పోరాటాలు! వీటిలో హింస, ద్వేషం మాత్రమే ఉన్నవి. అట్టి తరుణంలో ఆ ఖండములలోని ఇంగ్లీషు, ఉర్దూ ఎట్సెట్రా లిటరేచర్ ని ప్రభావితం చేసిన చారిత్రక ఘటన కోహకన్ వలపు కథ.
పాశ్చాత్యులకు “ప్రేమ”ను ప్రధానాంశముగా అందించిన కథ, మధ్యప్రాచ్యానికి చెందిన ఈ కోహకాన్ కథ. ఇందుకనే కోహకాన్ కథ పద్యకావాలుగా, నాటకములుగా సాహిత్యములో చోటు చేసుకుంటూనే ఉన్నది. అసలు కథ కొద్ది కొద్ది మార్పులు చేర్పులతో, కవుల లేఖనములలో చిత్రితమౌతూ వస్తూనే ఉన్నది.
*******
కథా ప్రారంభం:
వానలు మృగ్యమై, (పర్షియా)దేశములో కరువు వచ్చింది. కథానాయకుడైన కోహకాన్ ఒక పడతిని ప్రేమించాడు. ఆమె పేరు షిరీన్. వారి ప్రేమను ఇష్టపడని రాజు, కోహకాన్ కి ఒక పని అప్పగించాడు. “కొండపైన పెద్ద జలాశయాన్ని అతను స్వయంగా నిర్మించాలి.”- ఇదీ ఆ షరతు.
అసాధ్యం ఐనట్టి ఆ ఫనిని చేయలేకపోతే కోహకాన్ ఇకపై సిమ్రాన్ గురించి ఆలోచించకూడదు. – అని నియమాన్ని పెట్టాడు రాజు.
కోహకాన్ క్లిష్టమైన ఆ కార్యాన్ని చేయడానికి వెనుకంజ వేయ లేదు. నిరంతరము చెమటోడ్చి కోహకాన్ మెట్లు కట్టాడు. రోజుల తరబడి అతనొక్కడే పెద్ద చెరువును తవ్వాడు.
కోహకాన్ పట్టుదల శ్లాఘనీయమైనది. ఒకే చేతిపైన అతను కొండను తొలిచి, పైన పెద్ద తటాకమును నిర్మించాడు. బెహిస్తన్ లో పర్వతాన్ని దాదాపు సగం త్రవ్వాడు. అప్పటికి అతని శ్రమ ఫలించింది. (Behistun Inscription) ఎట్టకేలకు నీళ్ళు పడటంతో అతని ఆనందానికి అవధులు లేవు.
ఐతే ఈ కథ, సాహిత్యమున మాత్రమే కాక డిక్షనరీలలో కూడా ఎలా చోటు చేసుకున్నది?
ప్రస్తుతం మనం కోహకాన్ ని హీరోగా తీసుకున్నాము కదా!
అట్లాగే ఒక ప్రతినాయకుడు కూడా ఇందులో ఉన్నాడు. అతడే “ఖుస్రూ”. ఖుస్రూ గుర్రము నెక్కి వెళ్తూ యువరాణి షిరీన్ ని చూసాడు. చూసి మొదటి చూపుల్లోనే ప్రేమించాడు. ఖుస్రూ కుట్రకు ప్రేమికుడు కోహికాన్ బలి అయ్యాడు. ప్రియుడు కోహికాన్ విషాద వార్తను విన్న షిరీన్ ఆత్మహత్య చేసుకున్నది. విషాదాంత కావ్యాన్ని లోకానికి మిగిలించి, అజరామరమై ఆ జంట మిగిలింది.
*******
కొహ్కన్ అంటే “కొండను తవ్వే వాడు” అని అర్ధం. నిష్ఫలమైన శ్రమ, నిష్ప్రయోజనమైన పని అను భావార్ధమున ఈ పదము స్థిరపడింది. చేసిన శ్రమకు ప్రతిఫలం దక్కక, కొసకు ఇక్కట్ల పాలవడానికి “కొహకాన్”అనే మాట డిక్షనరీలలకు చేరింది. మన ఇతిహాసములకు అనేక ప్రక్షిప్తములు ఉన్నవి. భక్తులు అమిత శ్రద్ధతో స్థానిక అంశాలను కొంచెం కొంచెం జోడిస్తూ, మూలకథకు భంగం జరగకుండా రాసారు. అదేరీతిగా కోహకాన్ గాధ ఆయా దేశాలలో కొద్ది మార్పులతో రచించబడింది.
800 ఏళ్ళ క్రితం "కోహకాన్" కథను ఇరాన్ లో పద్యసంపుటిగా రాసారు. ఇక్బాల్ మొదలైన కవులు స్వచ్ఛమైన ప్రేమభావనను అక్షరబద్ధం చేసారు. 12వశతాబ్దములో జరిగిన కొహకాన్ కథ రచయితలను, ప్రజలనూ ఆకర్షించింది. 2008 లో “షిరీన్” అనే సినిమా వచ్చింది. కొహకాన్ లెజెండ్ చుట్టూ తిరుగినది. ఇరాన్ లోని కర్మన్ షా నగరునందు జరిగింది. ఇరాన్ నందు పడమట ప్రాంత మండలములో ఈ సంఘటన జరిగినదని ప్రజలు భావిస్తున్నారు.
కొహకాన్ (Kohakan) అసలు పేరు “ఫర్హాద్” అని కొందరు ప్రస్తావించినారు. పర్షియన్ కవి ‘ఫిరదౌసీ’గ్రంధము “షానామా” (book of kings).అతను రచించిన కథలో కొంత భిన్నంగా ఉన్నది.
*******
రెండవ కథ:
ఖుస్రూ రాజు భార్య షిరీన్ ప్రేమకథగా వివరించబడినది. ఫర్హాద్ తన కర్తవ్యాన్ని పూర్తిచేసాడు. మహాతటాకమును త్రవ్వాడు. ఖుస్రూ అతనిని మోసగించాడు. వేదనతో తన చేతిలోని గొడ్డలిని విసిరివేసాడు కొహకన్. ఆ గొడ్డలి కూరుకుపోయిన చోట ఒక దానిమ్మచెట్టు మొలిచింది. ఆ “అనార్ చెట్టు”కి కాసే పండ్లు అన్ని రకముల రోగాలను నయం చేస్తాయని ప్రజల నమ్మిక.
*******
ప్రశ్న: మూవీలుగా వచ్చిన కథ ఇది. రోమియో జూలియట్, లైలామజ్ఞూ వగైరా స్టోరీలకు మూలం ఇచ్చినది. నువ్వు చెప్పదలచుకున్నది కఅంతేనా!?
ఆన్సర్: నీటికరువును నివారణగా రాజు విధించిన డ్యూటీ నాకు బాగా నచ్చింది.
“ప్రేయసి రావే! ఊర్వశి రావే!” అంటూ దేవదాసులాగా మందుబుడ్డీ ఎట్సెట్రా లని పుచ్చుకోకుండా , ఇలాగ కాస్త కష్టపడి ఏదైనా సాధించి చూపిస్తే బాగుంటుంది. ప్రజలకూ, ప్రకృతికీ, పర్యావరణానికీ ఎంతెంతో మేలు చేసిన వారౌతారు. ఒకవేళ వాళ్ళ లవ్ స్టోరీ గెలిస్తే విజేతలు ఔతారు. కాదూ, చరిత్రలో ట్రాజెడీ కావ్యాలకు మేటరును ఇచ్చినట్లు ఔతుంది.
ప్రశ్నదారులు:- గాడిద గుడ్డు! రామాయణం లో పిడల వేట అంటే ఇదే!
ఆన్సరుదారుడు:- ఊహూ! కాదు మ్యాన్! ఉభయతారకం అంటే ఇది అన్న మాట!
*******
కొహ్‌కన్ అంటే కొండలుత్రవ్వేవా డు. కోహ్ అంటే కొండ (కోహ్-ఇ-నూర్ లో కోహ్ లాగా అన్నమాట). అయనపేరు అసలుపేరు ఫర్హాద్. (ఈ అంశాన్ని చెప్పిన హితులకు నా కృతజ్ఞతలు.)
**************
Member Categories - తెలుసా!
Written by kadambari piduri
Tuesday, 10 June 2014 07:29
Hits: 199
**************
{హమ్మయ్య! వైరస్ నుండి ఇప్పటికి నా బ్లాగు కుదుటన పడినది.
చాలా వ్యవధి తర్వాత మళ్ళీ కొత్త పోస్టును వేయగలుగుతున్నాను, ఇదిగో ఇట్లాగ! }
1000 పోస్టులు వేసి ఈ బ్లాగుకు "శుభం" కార్డును వేసే ఉద్దేశ్యము.
ఇప్పటికి 986 పోస్టులు ఐనవి.
14 లేదా, 1116 లక్ష్యానికైతే plus16, వెరసి 30 పోస్టుల బాకీ ముందు ఉన్నది.
ఇందుకు అందరి ఆశీస్సులను ఆశిస్తూ, కోణమానిని;
కోణమానిని తెలుగు ప్రపంచం
పేజీ వీక్షణ చార్ట్ 50615 పేజీవీక్షణలు - 986 పోస్ట్‌లు, చివరగా April 20, 2014న ప్రచురించబడింది
**************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి