31, డిసెంబర్ 2013, మంగళవారం

కేలండర్ తమాషాలు


క్రీస్తు శకము 1150 వర్షము హిందూ దేశ పంచాంగముల నిర్మాణములో మేలు బంతి. అప్పటిదాకా ప్రజలు అనుసరిస్తూన్న ఖగోళ జ్ఞాములలో- ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దాడు భాస్కరాచార్యుడు. అధిక మాసమును, అలాగే లుప్త (శూన్య -మాసాలను ఏర్పరిచాడు. ఇందువల సంవత్సరమునకు నిర్ధారించిన రోజులు, నక్షత్రగమన గణనములూ ఒక కొలిక్కి వచ్చినవి. సంవత్సరమునకు 365. 258438 రోజులు- అని - ఘడియలూ, విఘడియలతో సహా నిర్మించగలిగాడు.

* * * * *

వెస్టర్న్ విజ్ఞానము ఫలితముగా కేలండరు ప్రజలకు అందుబాటులోనికి వచ్చింది. రోజువారీ దినచర్యలకూ, జీతభత్యాదుల గడువు వగైరాలు సకల పనులకు నేడు ఈ అంగ్రేజీ కేలండర్ ముఖ్య ఆధారమైనది. వారఫలాలనుఆట్టే నమ్మకున్నా- మొదటగా రాశి ఫలితములను ఓసారి చదివి, తతిమ్మా వార్తాది విశేషాలను పేజీలను పత్రికలను తిరగేస్తూ చదివే వాళ్ళు - పాఠకులలో గణించదగిన సంఖ్యలోనే ఉన్నారు. 

ద్వాదశ రాశుల పేర్లు ఇటు స్థానిక భాషలలో గానీ, అటు ఆంగ్లంలో గానీ ఏయే తేదీ మొదలై ఏయే తారీఖు వరకూ ఉంటాయో దాదాపు అధికశాతం మందికి తెలుసును. 


ప్రస్తుతం వాటినే పునః అవగాహనకై ఈ పట్టిక:-


Aries March 21 - April 19.
Taurus April 20 - May 20.
Gemini May 21 - June 21.
Cancer June 22 - July 22.
Leo - July 23 - August 22.
Virgo - August 23 - September September 22.
Libra - September 23 - October 22.
Scorpio - October 23 - November 21.
Sagittarius - November 22 - December 21.
Capricorn - December 22 - January 19.
Aquarius - January 20 - February 18.
Pisces - February 19 - March 20

* * * * *

1582 వ సంవత్సరం చరిత్రలో గుర్తుంచుకొనాల్సిన రోజు. ఎందుకంటే ఆనాడు 1582 ఫిబ్రవరి 24 తారీఖు - గ్రెగేరియన్ కేలండర్ ఆవిష్కరణ జరిగింది. అప్పటి దాకా "జూలియన్ కేలండరు" అమలులో ఉన్నది. "Juliyan Year " కాలమాన గణనములో చేసిన మార్పులతో కొత్తది ప్రజలకు అందుబాటులోనికి వచ్చినదే "గ్రెగేరియన్ కేలండర్".

ఆ మార్పులలో ఒకటి లీపు వత్సరము. ఇది హిందూ చాంద్రమానములోని అధిక మాసము, శూన్య మాసముల వంటిది. ప్రతి నాలుగు ఏళ్ళకు ఒకసారి "Leap year" వచ్చే రీతిగా మార్చారు. 

* * * * *

"నేపుల్స్" దక్షిణ ఇటలీ లో రేవు పట్టణము "నవ నగరము" అని ఈ మాటకు అర్ధము. గ్రీకు పదమైన "Neopolis" అనే మూల ధాతువు నుండి వచ్చినది "Naples". మెడిటరేనియన్ లోని ఈ కా పట్టణంలో ఒక డాక్టరు జన్మించాడు. అతని పేరు "అలౌసియస్ లిల్యుస్". ఈతని సలహాలు కేలండర్ విభాగమునకు నవ్య పరిణామాలను చేకూర్చినవి. 13 వ పోప్ "గ్రెగరీ", అలౌసియస్ లిల్యుస్ తో సలహా సంప్రదిపులు చేసాడు. అటు పిమ్మట వారిద్దరు కొత్త "కాలమాన పట్టిక"ను ప్రవేశపెట్టారు. అదే పోప్ గ్రెగరీ పేరుతో ప్రసిద్ధి చెందిన "గ్రెగేరియన్ కేలండర్".

* * * * *

గణితములో ఆసక్తి కలవారు ఇంగ్లీషు కేలండర్ మాదిరి తో అనేక ప్రయోగాలతో అనేక వింతలను సాధన చేస్తూ, సాధిస్తూ ఉంటారు. (Mr. India- అనే హిందీ సినిమాలో ఒకని పేరు 'కేలండర్'. "హవా హవాయీ ..... " పాటకు శ్రీదేవి చేసిన అద్భుత నాట్యము ఈ మూవీలోనిదే!) 
నేడు ప్రపంచవ్యాప్తంగా బహుళ వ్యాప్తిలో ఉండి అందరికీ ఆత్మీయమైనది ఇంగ్లీషు కేలండర్ యే కదా! 
so- మనం కొన్నిటిని రేఖామాత్రంగా చూద్దాము.

* * * * *

ఇంగ్లీషు కేలండర్ నాలుగు వందల ఏళ్ళకు ఒకసారి లీప్ సంవత్సరము తిరిగి ఆరంభం ఔతుంది. లీప్ సంవత్సరమునకు సంబంధించి అనేక విశేషాలు ఉన్నవి. ఐతే లీప్ సంవత్సరమునకు భిన్నమైన ఇతర ఏడాదులను గమనిస్తే కొన్ని తమాషాలు ద్యోతకం ఔతూన్నవి. ఈ జిజ్ఞాసలే కేలండర్ లోని అంకెలకు అనుయాయిలైన వారములు, నక్షత్రాలు ఇత్యాది విషయ సంగ్రహణలకు హేతువులు ఐనవి. 

అగణితమైన అంకెల గారడీల శోధనలకు ఆలంబనములు ఐనవి.

1) ఏ శతాబ్దమూ బుధ వారము, శుక్ర వారము , ఆది వారములతో ప్రారంభం అవదు. 
     అంటే తతిమ్మా- సోమ, మంగళ, గురు, శని వారములతో begin ఔతుందని అర్ధము.
2) అలాగే మంగళ , గురు, శని వారములతో ఏ శతాబ్దమూ కూడా ముగింపు అవదు.

3) లీప్ సంవత్సరము కానట్టి సంవత్సరములలో 
       ప్రతి సంవత్సరమూ ఒకే రోజున “వారము” తో నాంది, ముగింపులు అవుతూన్నవి. 
ఈ 2013 సంవత్సరం లీప్ వర్షము కాదు. అందుచేత 2013 కు ఇది వర్తించినదా? 
కాస్త ధ్యాస పెట్టి, పరిశీలించండి. 2013 జనవరిని ఒకసారి కేలండర్ 12 పేజీలను తిప్పి చూడండి.


2013 జనవరి 1 వ తేదీ రోజు – మంగళ వారం ఐనది {January 1 = Tues day & December 31 = Tues day}. ఇందాక చెప్పుకున్న షరతు ప్రకారం- డిసెంబర్ 31 వ తేదీ నాడు మంగళవారమే ఐనది.

అలాగే 2014 January- 1 - Wednesday ఐనది. 
అలాటప్పుడు December 31 నాడు ఏ వారం ఔతుందో గుర్తించారు కదూ! 
ఔను, కరెక్టే!  అది బుధవారమే ఔతున్నది.

* * * * *

ఇలాగ లెక్కలేనన్ని సంఖ్యల తమాషాలు- కేలండర్ పున్నెమా అని గణిత జిజ్ఞాసులకు లభిస్తూనే ఉన్నవి.



అందరికీ నూతన వత్సర శుభాకాంక్షలు. 

2014 Wish you Happy New Year. 

******************

కేలండర్ విశేషాలు (Link web mag: New Awa)  

User Rating:  / 2 
Member Categories  - తెలుసా!
Written by kusuma kumari
 Friday, 13 December 2013 09:16

Hits: 76
వ్యాసకర్త: కాదంబరి, konamanini 

( By: కోణమానిని )

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...