14, నవంబర్ 2013, గురువారం

జమ్మి చెట్టు కథ

జమ్మి చెట్టు ఆకులను బంగారముతో సమానముగా భావిస్తూ, ఆదాన ప్రదానములుగ ఉన్న ఆచారముగా- మన ఆంధ్రదేశములో వ్యాప్తిలో ఉన్నది. 

"ఆప్త తరువు" ను మహారాష్ట్రలోని ప్రజలు పూజిస్తారు. 
ఆ తర్వాత ఆ చెట్టు  ఆకులను తీసుకుంటారు. ఈ పత్రములను 'బంగారము 'నకు ప్రతీకగా జనులు భావిస్తారు. కాంచన సంకేతమైన ఆ  కులను ప్రజలు ఒకరి  కొకరు ఇచ్చి పుచ్చుకుంటూంటారు./ ఇలాటి పరస్పర ఆదాన ప్రదాన ఆచారముచే- అందరి మనసులలో ఉన్నట్టి పాత వైషమ్యాలు తొలగిపోయి, స్నేహభావము నెలకొంటుంది.  
ఆప్త వృక్షానికి పూజచేసి, బంగారు ఆకులని పిలిచే ఆ ఆకులని స్వర్ణానికి సంకేతంగా, ఒకరికొకరు అందించుకుంటారు  
మహారాష్ట్రీయులు (Shanu and Apta tree/ Aapati trees) ఆపతి తరువు హరిత దళాలను ఇలాగే వినియోగిస్తారు. వారు అత్తి చెట్టు ఆకులు, తెల్ల ఆరె చెట్టు పత్రములుతో వ్రతాన్నిచేస్తారు. ఇందుకు కారణముగా ఒక కథ కలదు.
;


















*********

కౌత్స, వరతంతు కథ:

ప్రతిష్ఠానపురంలో నివసిస్తూన్న దేవదత్తుని తనయుడు కౌత్సుడు. తండ్రి కౌత్సుని విద్యాభ్యాసము కొరకు వరతంతు అనే ఋషికి బాధ్యతను అప్పజెప్పాడు. వరతంతు గురువు వద్ద విద్యను అభ్యసించాడు కౌత్సుడు. దేవదత్తుని కుమారుడు కౌత్సుడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి ఐనది. గురుకులమునుండి ఇంటికి వెళ్ళే తరుణం వచ్చింది. 

"గురువర్యా! మీకు ఏ గురుదక్షిణను నేను ఇవ్వవలెను? మీరు ఏదైనా వస్తువులను తెమ్మని ఆనతి ఇస్తే తెస్తాను" వరతంతు దరహాసముతో "నీ శ్రద్ధాసక్తులూ, వినయవిధేయతలే నాకు నీవు ఇస్తూన్న నిజమైన గురుదక్షిణ, అది చాలును నాకు! నీవు పరిపూర్ణ విద్యావంతునివైనావు. నాకు ఆ తృప్తి చాలును" అంటూ ఆశీస్సులు ఇచ్చాడు. కానీ కౌత్సునికి మనసులో ఎంతో వెలితి! ఇన్ని ఏళ్ళుగా భోజనము పెట్టి సాకిన గురు దంపతులు కన్నవారిని తలపించేలా చదువులు చెప్పారు. అట్టి మహనీయులకు ఏమి ఇవ్వక తాను గృహోన్ముఖుడు ఐతే ఎలా?" అదుచే శిష్యపరమాణువు పట్టు విడువక "మీ కోసం ఏదో ఒకటి నేను తెస్తాను,చెప్పండి స్వామీ!” 

అయ్యవారికి ఈ బాలుని మొండితనం చిరాకు తెప్పించింది. విసుగుతో "ఐతే నాకు బంగారు నాణెములు కావాలి. నేను నీకు 14వేదములు నేర్పాను. ఒక్కొక్క శాస్త్రానికీ ఒక్కొక్క కోటి చొప్పున 140 కోట్ల హేమ టంకములు తీసుకురా!" అని పలికాడు.

అందుకు "సరే!" నని కౌత్సుడు అంగీకరించి, వరతంతు వద్ద సెలవు తీసుకున్నాడు.


*********

అటు తర్వాత బహు యోచన చేసాడు. తండ్రి, హితుల సలహా తీసుకున్నాడు. ధర్మదాత అని పేరు పొందిన రఘు మహారాజు వద్దకు వెళ్ళాడు. 
(రఘు చక్రవర్తి వంశీయుడే శ్రీరామచంద్రుడు, కనుకనే ఆతనిని 'రఘుపతి" అని కూడా పిలుస్తారు)

కౌత్సుడు వెళ్ళే వేళకు రఘు చక్రవర్తి "విశ్వజిత్ యజ్ఞము"ను చేసాడు. యజ్ఞ యాగాలు చేసే ప్రభువులు 'అడిగిన వారికి లేదనకుండా దానము చేయాలి. ఆ ప్రకారము అప్పటికే ప్రజలందరికీ రాజభవనములోని డబ్బు, దస్కమూ, సొమ్ములను యావత్తూ తన సర్వస్వము దానము చేసేసాడు. ఆయన కోటలోకి - ధనమును యాచించుటకు వచ్చినప్పుడు రఘు చక్రవర్తి కోశాగారం ఖాళీ ఐంది. కౌత్సుడు తన ’గురుదక్షిణ’ సంగతి తెల్పగా, ఖిన్నుడు ఐనాడు ఆ చక్రవర్తి.

"కౌత్సా! ఎల్లుండి రమ్ము!" అని చెప్పాడు. 

మూడురోజుల గడువులోపల రాజు అంత ధనాన్ని తీసుకురావాలనుకున్నాడు. అతను ఇంద్రుని వద్దకు వెళ్ళి ద్రవ్యమును కోరాడు. ధనపతి కుబేరుని పిలిచాడు మహేంద్రుడు. 
"కుబేరా! రఘు సామ్రాట్టు ముఖ్యపట్టణము అయోధ్య. ఆ రాజధానిలోని షాణు, అపర్తి చెట్లు (Shanu and Aapati trees) పై స్వర్ణ నాణాల వర్షము పడేలా చేయి!" అంటూ అజ్ఞాపించాడు సురపతి. 
అయోధ్యలో ఎడతెరిపి లేకుండా సువర్ణ వర్షం కురిసింది. అలాగ వర్షించిన ధనమును పూర్తిగా కౌత్సునికి ఇచ్చేసాడు రఘువు. [సురవర అనుగ్రహముతో లభించిన అగణిత అపరంజి రాసులు అవి!]

కానీ కౌత్సుడునికి డబ్బు అంటే వ్యామోహము లేదు. తన గురుదక్షిణకు అవసరమైన 140 కోట్లు మాత్రమే తీసుకున్నాడు కౌత్సుడు. అతడు"మహాప్రభువుకు కృతజ్ఞతలు" చెప్పి గృహోన్ముఖుడైనాడు.

*********

గురువు గారు కోరిన నాణెములు తీసుకుని తక్కినవి రఘురాజుకు తిరిగి ఇచ్చేసాడు కౌత్సుడు.

దానముగా ఇచ్చిన వాటిని మళ్ళీ తీసుకోకూడదు రాజు. కావున రఘువు "ఈ డబ్బును నేను తీసుకోను" అంటూ నిరాకరించెను. అప్పడు కౌత్సుడు మిగిలిన డబ్బును ప్రజలకు అందరికీ పంచాడు. అయోధ్యా పట్టణమునందు తెల్ల ఆరె చెట్ల పైన కనకవర్షము కురిసిన రోజు ఆశ్వీజ శుక్ల దశమి.

పథాన్ నివాసి ఐన కౌత్సుని అన్వేషణ వలన ఆపతి తరువుల కుందన వృష్టి కురిసి, ధనరాసులనిలయాన్ని చేసింది అయోధ్య నగరము సిరి సంపదలు పొంగులు వారి సుఖసంతోషములతో విలసిల్లసాగినది. నాటినుండీ ప్రజలు అత్తి చెట్టు ఆకులను/తెల్ల ఆరె చెట్టు పత్రములను' పసిడి 'కి ప్రతీకలుగా భావిస్తూన్నారు. ఇరుగుపొరుగువారికీ, బంధు మిత్రులకూ ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటూండడం నవ రాత్రి, దసరాల ఆనవాయితీ ఐనది.

వరతంతు గోత్రము :- 

ఋషుల మూలములను స్వీకరించి, జనులు – ఆయా గోత్రములవారు ఐనారు. ఈ పద్ధతిలో- “వరతంతు గోత్రీకులు” ప్రవర, ఋషిమూలములు ఏర్పడినవి. ఈ సంప్రదాయము ఆయా వ్యక్తుల ప్రాచీనతకు పునాదులు. ఇందుచే శాస్త్రజ్ఞులకు- మనుష్య జాతి జీన్సు, పరిణామములు – మున్నగు అనేక అంశముల గూర్చి సులభముగా రీసెర్చ్ చేయడానికి అనువైన వాతావరణము ఏర్పడింది.) 

User Rating:  / 1 
PoorBest 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...