మన త్రిలింగ దేశంలో(ఆంధ్ర. ఒరిస్సా, కర్ణాటక; కటకం నుండి) శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి "కాలజ్ఞానము" గీతాలు పరివ్యాప్తి గాంచినవి.
ఇలాంటి నుడువులు ఇండొనేషియా ద్వీపసముదాయాలలో (ఆగ్నేయ ఆసియా దేశాలు ఇవి) ప్రజల నాలుకలపై విస్తృత సూక్తి, గీతాల, జానపదములుగా ఆడుచున్నవి. “జయోభయో భవిష్యద్ వాక్కులు” జనులు భక్తిప్రపత్తులతో మననం చేస్తున్నారు.
* * * * * * * * *
జావా- పశ్చిమ ప్రాంతమునకు రాజు జయోభయో (1135 - 1157).
ఐర్లింగ చక్రవర్తి అనంతరం – జావాదేశం ముక్కలుచెక్కలైంది.
ఆ పరిస్థితులలో ఉదయించిన ఆశాజ్యోతి “జయ అభయ సామ్రాట్”. తూర్పు జావా , కెదిరి రాజ్య స్థాపకుడు "శ్రీ మపాంజి జయాభయ": (జావా భాషలో “జయోభయో” అని ఉచ్ఛారణా పదము ఇది.) ఋతు జయభయ – అని గౌరవసూచిత నామము. శాంతి సౌభాగ్యాలకు ప్రతీక ఈతని పాలనాకాలము. ఇతను హిందూ దేవుడు “శ్రీ మహా విష్ణువు” యొక్క అవతారము- అని ప్రజలు భక్తిపూర్వక విశ్వాసము.
“విదర్భ”- నేటి కెదిరి మండలం లో, “పమెనాంగ్” లోని అంతర్భాగం.
విదర్భ = అంటే సహస్ర (= వెయ్యి) నగరములు.
జయోభయో తండ్రి “గెండ్రాయన”. పాండవుల వంశీయుడు అని ప్రఖ్యాతి చెందిన అర్జునుని పుత్రుడు అభిమన్యుడు, అభిమన్యు ని సుతుడు పరీక్షిత్తు, పరీక్షిత్తు కుమారుడు యుదయన (=ఉదయనుడు).
ఈ విధంగా జయోభయో వంశవృక్ష గాధలు “మహాభారత ఇతిహాసము లోని పాండవ సంజాతులై ఉన్నవి.
జయోభయో భార్య దేవీ సారా. ఆ రాజ దంపతులకు నలుగురు కుమార్తెలు –
౧) దేవీ జయామి జయ; ౨) ప్రమేష్ఠి దేవి, ౩) ప్రాముని, దేవీ ౪) శశాంతి ~ అనే నలుగురు.
జయోభయో చతుర్ పుత్రికల పరిణయాది బాధ్యతలను నిర్వర్తించాడు.
హిందూ మతములో చతుర్ ఆశ్రమములు; జీవిత దశలు; గమన యాత్రలో- బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రమములు- తత్ ప్రకారము, మోక్షగామియై, వానప్రస్థమును స్వీకరించాడు. జయోభయో చరమదశను “మెనాంగ్ గ్రామము” లో ప్రశాంతంగా గడిపాడు.
* * * * * * * * *
కెదిరి మండలంలోని ఉప జిల్లా “పాగు” లో మెనాంగ్ గ్రామంలో ఉన్నది. ఆ కుగ్రామమునకు జయోభయో వెళ్ళాడు, అక్కడ పట్టు వదలని నిష్కామ తపసు చేసాడు. ఆ దీక్ష వలన జయోభయో కి వాక్శుద్ధి వంటి అతీత శక్తులు లభించినాయి.
* * * * * * * * *
ప్రాచీన జావా దేశములో జయోభయో పాలనలో పురా జావా సాహిత్య స్వర్ణ యుగముగా విలసిల్లినది. జయోభయో (1135 - 1157) భవిష్యత్తును తెలిపే గ్రంధాన్ని రచించాడు. అటు తర్వాతి కాలంలో - జయాభయ వాక్కులు అధికాధికం నిజమైనవి.
"ఇండొనేషియా పతనమౌతుంది, తెల్లవాళ్ళు ఆక్రమించి, పాలిస్తారు. అటు పిమ్మట పసుపు వన్నె జాతి వారు (Yellow dwarfs) పాలించుతారు" అని చెప్పాడు. ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయంలో వలస వచ్చిన డచ్ వారు దేశాన్ని ఏలారు. పిమ్మట జపాన్ దేశం (పసుపు వన్నె పొట్టివారు) కూడా ఇండొనేషియాను పరిపాలించింది. చిత్రంగా – జయోభయో మాటలని వాస్తవం చేస్తూ ఇండొనేషియా ప్రజలు జపాన్ సైన్యం రాకను స్వాగతం పలుకుతూ వీధులలో డాన్సులు చేసారు. అలాగే ఇండొనేషియా స్వాతంత్ర్యం పొందుతుంది – ఫెటిల్లున రెండు ప్రపంచ యుద్ధాలూ, కొద్ది సంవత్సరములలోనే గగనపర్యంతం పెరిగిన ఆధునిక సైన్సు, చరిత్రాది శాస్త్ర విజ్ఞానములు - జయాభయ నుడువులను సార్ధకపరిచినవి. విశాల కెదిరి సామ్రాజ్యము సాహిత్యమునకు స్వర్ణయుగమై భాసించినది. అనేక బృహత్ గ్రంధాలు వెలువడినవి. అంతే కాదు! జావా ద్వీప నేపథ్యంగా – మహాభారత ఇతిహాసం రూపొందింది.
సెరత్ జయభయ ముసరర్, సెరత్ ప్రనీతివాక్య్ ; ఇతరులు చేర్చినవి
జయభయ వాణీ సేకరణలు; ఎంపు సెడహ్, ఎంపు పానులూహ్ అనే ఇద్దరి కృషి- ఈ సేకరణలలో సింహభాగము వీరిది ముఖ్య స్థానము. (Prelambang Jayabaya, a prophetic book)
పరివ్రాజక “సెడాహ్”, ఆతని సోదరుడు పానులూహ్ ల కృషికి ఫలితమే “మహాభావివాణి”.
1157 లో ఈ బృహత్కార్యము ప్రచురణతో వెలుగొందింది.
* * * * * * * * *
అలాగే ఉత్తర దిక్కునుండి వచ్చే yellow men వలన వాళ్ళు కూడా వెళ్ళగొట్టబడతారు- అని జయాభయ నుడివెను. జయాభయ పలికినట్లుగానే “పంట నాట్లు కోతకు వచ్చే నాటికి జపాన్ వారి పాలనకు తెర పడింది.” ఇలాటి ఆటుపోట్లకు సంచలనాలకూ కేంద్ర బిందువైంది ఎక్కువగా ‘జావా ద్వీపము . ("With the minor exception that three crops had been harvested, Jayabaya's prophecy had been realized.") డోలాయమాన స్థితిలో ఉన్నవి ఈ “ఈస్ట్ ఆసియా దేశాలు . అప్పుడు 1944 లో డచ్ నియంతృత్వం నుండి ఇండొనేషియా ప్రజలకు విముక్తి కలిగించింది జపాన్. సెకండ్ వర్ల్డ్ వార్ లో జర్మనీ (హిట్లర్) తో చేతులు కలిపినందున – జపాన్ కూడా ఓటమి పాలవడం ఖాయమైంది.
అందుచేత అత్యవసరంగా – జపాన్ రెండో ప్రపంచ యుద్ధపు ఆఖరి డంకారావం మ్రోగే సమయానికి – ఇండొనేషియాకు స్వాతంత్ర్యం ఇచ్చి, 1945 ఆగస్ట్ 9 వ తేదీన
(The Japanese officially granted Indonesia its independence on 9 August 1945) ప్రకటన చేసింది.
ర్యాటు ఆదిల్ ప్రకారమే "when iron wagons could drive without horses and ships could sail through the sky"), ”
19 వ శతాబ్దపు పాశ్చాత్యులు రుద్దిన సేద్య విధానాలు ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మొదలైనది.
ఇచ్చట సుగంధ ద్రవ్యాలు పుష్కలంగా ఉన్నవి, అందుచేత యూరోపు నుండి పాశ్చాత్యుల వలసలు ఆరంభమైనవి. డచ్, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆధిపత్యంలో నిరంకుశ వ్యాపార పాలనా విధానాల వలన, అణచివేతకు ఇండొనేషియా ప్రజలు మగ్గిపోయారు.
వారి పద్ధతులలో – ప్రజలపై బలవంతంగా రుద్దిన Cultiveer stelse. 16 వ శతాబ్దం నుండి ఈ తభావతు మొదలైంది. యూరపు వాణిజ్యకర్తలు ఆధిపత్యపు పోరులో క్రమంగా స్పెయిన్, పోర్చుగీసు వారు స్థిరపడ్డారు. పిమ్మట వారిని Dutch వణిక్కులు వెళ్ళ గొట్టగలిగారు.
జావాద్విపంలో స్వలాభాలకై డచ్ వాళ్ళు ప్రవేశపెట్టిన వ్యవసాయ విధానాలు స్థానికులలో వ్యతిరేకత పెంచాయి. స్వేచ్ఛా భావాలు పెల్లుబికే తరుణంలో జపాన్ వారి ఆగమనం ఇండొనేషియన్ జనుల ఆశలకు ఊపిరి పోసాయి.
*************************
;
photo curtecy (Link)
Ratu Jayabaya ఆశు పద్య, గద్య, లేఖనములు ప్రసిద్ధమైనవి (famous oracles or prophesies) .
అతని భవిష్యద్ వాణి పలుకులు “ Serat Jayabaya Musarar, Serat Pranitiwakya” గా లోక ప్రఖ్యాతమైనవి. జయోభయో అనుయాయులు, శిష్యపరంపరాగతముగా, ఈ సారస్వత స్వరూపము రక్షించబడుతూన్నది.
జయోభయో విరచితములు- దీర్ఘ పద్య ఛందస్సులు, చాలా పెద్ద పాదములు కల “పదముల వంతెన” అనవచ్చును. జయోభయో నుడువులలో వేరొకటి :-
"The Javanese would be ruled by whites for 3 centuries and by yellow dwarfs for the life span of a maize plant prior to the return of the Ratu Adil: whose name must contain at least one syllable of the Javanese Noto Negoro."
జయాభయ – గుర్రాలు కట్టని(పూన్చని) ఇనుప బోగీలు, లోహ నావలు ఆకాశములో చరిస్తాయి – అంటూ ముందే చెప్పగలిగన దీర్ఘ ద్రష్ట.
****************************
Prophecy of Satriyo Piningrit ; (Link for matter):
న్యాయదేవతకు రక్షణ కవచము వోలె భాసిల్లును చక్రవర్తి.
సాంత్రియో పినింగిత్ (Santryo piningith) -
అనగా అజ్ఞాత యోధ/ గుప్త్ క్షత్రియుడు - కి ప్రతీక - గా సామ్రాట్టు సంభవించబడుచున్నాడు.
జయాభయో - రచనలలో - "మైతేయుని సంఘము నిర్వహించే విధులను చెప్పారు. కల్కి అవతారము-
కృత యుగము, సత్య యుగము- కాలచక్ర పరిభ్రమణ విశేష ఘటనలు చోటు చేసుకుంటాయి.
ఈ పద్ధతిలో - భవిష్య వాక్కు కర్త "సాంత్రియో పినింగిత్" ప్రతిబింబమై వరలుట- - ఈ జావా ద్వీప చారిత్రక ఘటన సూత్రీకరణ జరిగినది.
*********************************
౧, ౨, ౩, ౪, ౫, ౬, ౭, ౮, ౯, ౧0
*********************************
జావా , ఇండొనేషియా ద్వీపాల భవిష్యత్ సూక్తికారుడు
User Rating: / 2
Member Categories - తెలుసా!
Written by kadambari piduri
Tuesday, 20 August 2013 08:51
Hits: 338

JayabhayO (photo curtecy) |