కోతులలో పలు కోతులు.
మన దేశంలో శ్రీరామచంద్రుని సేతు నిర్మాణమును చేసి,
కిష్కింధ్ కాండ- ప్రజలందరికీ కలకాలమూ గుర్తుండేలా చేసిన ఇతిహాసము
"శ్రీమద్ రామాయణము".
"ఆంజనేయ స్వామి మందిరములు" అడుగడుగునా ఉన్నవి.
శ్రీ హనుమంత స్వామికి భక్తులు కోటానుకోట్లు.
భీతి కలిగిన సమయాలలో
"శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభా దివ్య కాయం .......... "
అంటూ స్మరిస్తూ ధైర్యాన్ని పుంజుకుంటారు జనులు.
ఇంతకీ ఇవాళ ఏమిటో తెలుసా?
"ప్రపంచ వానర దినోత్స్"
("World Monkey Day") ఈ రోజే!
అనగా డిసెంబరు 14 వ తేదీన "మర్కట దినము".
****************;
అనేక ఇంగ్లీష్ మూవీలు; జంతువులు పాత్రధారులుగా వచ్చినవి.
కింగ్ కాంగ్, ఒరాంగు టాన్, కంపూచిన్,
గొరిల్లా, macaque, Macao ....... అనేక ఉపజాతులు- కోతులు- నటీనటులు.
"పైరేట్స్ ఆఫ్ కరేబియన్" అనే ఆంగ్ల చిత్రం సూపర్ డూపర్ హిట్.
ఇందులో ఒక కోతి ప్రేక్షకులకు బాగా జ్ఞాపకం ఉంటుంది.
దీనికి "జాక్" అని ఆ సినిమాలో పేరు పెట్టారు.
చిన్న నల్లని ఈ మంకీ, "కోతి చేష్ఠలకు" నిలువెత్తు అద్దము.
ఇంతకీ ఇది ఏ జాతిది?
స్పైడర్ మంకీలు spider monkey &
"కెపుచిన్ మంకీ" (capuchins) .
;
;
గ్రీకు పదము "kebos")
కేబోస్ వ్యుత్పత్తి.
"పొడవైన తోక కలిగిన - మర్కటము"
అనే
అర్ధ భావ నామము ఇది.
****************;
15 వ శతాబ్దములో అమెరికా చేరిన ఔత్సాహికులు-
ఈ కొత్త కోతి జాతిని కనుక్కున్నారు.
మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, అర్జెంటీనాలలో
చెట్ల కొమ్మలలో ఆటలాడుతూ, గంతులు వేస్తూ ఉండే
స్వేచ్ఛా జీవులు ఈ క్యపుచిన్ వానరములు.
ఇంగ్లీషు సినిమాలలో చాలా చురుకుగా తెర దర్శనాలను ఇస్తూన్న
ఈ బులి కోతులు ప్రకృతి ప్రేమికులకు మక్కువను కలిగిస్తూన్నవి.
పశ్చిమ ఖండాల నివాసులు వీటిని తమ తమ గృహాలలో పెంచుకుంటూనారు.
ఇళ్ళలో అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన "పెంపుడు జంతువులు" గా మారినవి
ఈ కెపూచిన్ హనుమాండ్లు.
"జై భజరంగ భలీ! భళిర భళిర భళి భళీ!"
****************;
Part - 2
"గ్లోబల్ మంకీ డే" సృష్టికర్త క్యాసీ సారో.
ఈ రోజు ఎలా మొదలైందో తెలుసా?
అనుకోకుండా అకస్మాత్తుగా "పండుగల జాబితాలో" నికి చేరింది.
Casey Sorrow కార్టూనిస్టు, జర్నలిస్టు.
ఒకరోజు తన ఫ్రండు కేలండర్ లో తమాషాకి "కోతి రోజు" అని మార్క్ చేసాడు.
అతని పెన్ను రౌండు చుట్టిన ముహూర్త బలం గొప్పది.
కాబట్టే "ప్రపంచ కోతి దినోత్సవము" ప్రజలలోకి చేరింది.
2000 సంవత్సరము నుండీ "Monkey Day" ఆరంభమైనది.
పీటర్ జాక్సన్ యొక్క
"కింగ్ కాంగ్" సినిమా
2005 లో, ఈ "కోతి రోజు" న release ఐనది.
Bruce Almighty:
King Kong,
Mighty Joe Young.
The Zookeeper,
Planet of the Apes
ఇలాగ ఇంగ్లీష్ ఫిలిమ్ సు జంతువులు,
ముఖ్యంగా మర్కటములు యాక్టర్స్ గా
వెండితెరపైకి ఎక్కి, విజయదుందుభి మోగించినవి.
****************;
"World Monkey Day" :
ఇది Global Monkey Day:
*******************************;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి