;
సావేరీ రాగమునకు ఒక ప్రత్యేకత ఉన్నది.
ప్రభాత కాలములో ఆలపించే మృదు రాగం ఇది.
కనుకనే దీనిని "ఉదయ రాగము" అని సంభావిస్తారు.
గాయత్రీ మంత్రము- ఉచ్ఛారణకు ఇది మేలైన రాగముగా ఎన్నుకోబడినది.
కర్ణాటక సంగీతములో జన్య రాగములలోని-
15 వ మేళకర్త రాగము, మాయామాళవ గౌళ రాగము విభాగమునకు సంగీత శాస్త్రజ్ఞులు చేర్చారు.
సావేరీ రాగము- కరుణరస ప్రభావిని. మనసులను ఆర్ద్ర రస ప్లావితము చేస్తుంది.
అందుచేతనే ఉషోదయమున గానము చేసే రాగాభరణములలో
(భూపాళ రాగము మున్నగు వానివలె)-
ఇది ముఖ్యస్థానాన్ని అలంకరించినది.
(Sama Veda,Morning raga(Saweri Raga)
గాయత్రీ మంత్రోచ్ఛారణము :- మెదడులోని ప్రకంపనలు సున్నితముగా కదలడము"ను
Waves నకు మేధస్సును పాజిటివ్ దృక్పధ మార్గములో,
ఆశావహ కోణములలో చలించే రీతిని- రికార్డు చేసారు,
వైజ్ఞానికముగా ఇది నిరూపితమైనది.
అత్యంత పురాతన కాలములో - క్రీస్తు పూర్వము -
వేద కాలములో భారత దేశములో
సంగీతమునకు సిద్దాంతబద్ధత ఏర్పడిన అద్బుతము ఇది.
ఇండియాలో కర్ణాటక సంగీత, శాస్త్రీయ సంగీతములకు
పునాది "సామవేదము" గా అవతరించినది.