Gurkhas, Lashkar Gah |
నమ్మకము, ధైర్య సాహసాలకు మారు పేర్లుగా నిలిచిన - "గూర్ఖాలు"
మనకు సుపరిచితమైన పేరే! నిత్యమూ రాత్రుళ్ళు, లాఠీలతో చప్పుడు చేస్తూ,
కారుచీకటి వేళలలో ప్రజలకు మెలకువ తెప్పిస్తూ "పారా హుషార్!" చేస్తూ,
చోరభయాలనుండి కాపాడే విధిని
స్వచ్ఛందముగా తమ భుజస్కంధాలపైన నిడుకొన్నవారు గూర్ఖాలు- అని
ఆసేతుహిమాచల పర్యంతమే కాకుండా, యూరోపు వాసులకు కూడా తెలిసిన కబురు ఇది.
గూర్ఖా ప్రజలు- ఒక విలక్షణమైన ప్రత్యేకతను కలిగిఉన్నారు.
బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు- ఇండియా సైన్యంలో
గూర్ఖా బెటాలియన్ ను ప్రత్యేకంగా ఏర్పరిచారు అంటే
శతాబ్దాల క్రితం నుండీ గూర్ఖాల విశ్వాస, ధైర్యములు
చరిత్రలో ప్రసిద్ధమైనవి అనే సంగతి తెలుస్తూన్నది.
&&&&
"గూర్ఖా, గూర్ఖా లాండ్"- అనే మాటల మూల ధాతువు ఏమిటో తెలుసునా?
8వ శతాబ్దములో హిమాలయ సాను సీమలలో
"గూర్ఖా" అనే పేరు కొండ జాతి ప్రజలకు వచ్చినది.
శిష్యుడైన "బప్పా రావల్" వలన గోరఖ్ నాథ్ గాథ ప్రజలకు అందుబాటులో ఉన్నది.
గురు గోరఖ్ నాథ్ "అద్భుత ముని యోధుడు".
బప్పా రావల్ అనే రాజపుత్ర ప్రభువు ద్వారా- గూర్ఖా- అనే పద ఆవిర్భావము సంభవించినది.
హిందువుల ప్రకృతి పూజలో భాగంగా "గో మాత" గా వారు భావిస్తూ,
పూజిస్తూన్న గోవు (Prakrit phrase 'go rakkha' meaning 'protector of cows) -
"గోరక్షణ"- గో రక్ష- అనే సంస్కృత పదము నుండి-
ప్రాకృత పదమైన "గో రక్క" పునాదిగా
"గూర్ఖా దేశము", గూర్ఖా ప్రజలు- ఒక విలక్షణమైన ప్రత్యేకతను కలిగిఉన్నారు.
&&&&
గోరఖ్ నాథ్ - నవ నాథ సాంప్రదాయ నిర్మాత.
శైవ యోగి గోరఖ్ నాథ్, మానవుల ఆరోగ్య ప్రదీపకగా "యోగము"లను కనిపెట్టి,
అందరికీ అందించాడు.
11- 12 వ శతాబ్దాలలో గోరఖ్ నాథ్ నెలకొల్పిన యోగ సిద్ధాంత విధానాలు-
సంఘజీవనములో మేలి మలుపు.
గోరఖ్ నాథ్ ("Eternal sage" ) - వలన హఠ యోగమునకు- గొప్ప ప్రచారము వచ్చినది.
&&&&&&&&
గోరఖ్ నాథ్ యుద్ధవిద్యలతో సాగిన యోగి.
అంటే షాంగై - లో కుంగ్ ఫూ, కరాటే ఆదిగా స్వీయ రక్షణా విద్యలను,
బౌద్ధ సన్యాసులు, బౌద్ధ గురు శిష్యులూ- పరంపరగా నేర్చిన విద్యల వలెనే-
గోరఖ్ నాథ్ కూడా స్వయానా స్వీయ సంరక్షణకై రణ విద్యలకు ప్రాధాన్యాన్ని ఇచ్చాడు.
ఆఫ్ఘనిస్థాన్, పంజాబ్ మొదలుకొని అనేక దేశాలలో తిరుగుతూ,
అనేక ప్రాంతాలలో సంచరిస్తూ, ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని నింపాడు.
ఆతనిని హిమాలయాలలో, కొండజాతి ప్రజలు అనేకులు ఆయనను అనుసరించారు.
అధికశాతం ఆయన అనుయాయులు ఐనారు.
వారు తమ పేర్లను "గోరఖ్ బాబూజీ" పట్ల భక్తిసూచకంగా "గూర్ఖా" అని పెట్టుకోసాగారు.
అలాగ "గూర్ఖాలు జాతి"కి మూలధాతువును అందించిన మహర్షిగా
gorakhnath ప్రజా వందనములను అందుకున్నాడు.
గోరఖ్ నాథ్ సిద్ధాంతములకు భక్తుడై,
ఆయనకు శిష్యుడైనాడు "బప్పా రావల్".
మేవార్ రాజపుత్ర వంశ మూల పురుషుడని చెప్పదగిన- బప్పా రావల్ వలన
గోరఖ్ నాథ్ గాథ ప్రజకు అందుబాటులో ఉన్నది.
బప్పా రావల్ అనే రాజపుత్ర ప్రభువు ద్వారా గూర్ఖా అనే పద ఆవిర్భావము యొక్క
విపుల విస్తరణతో నేపాలీలకు గూర్ఖా - అనే నామ ప్రఖ్యాతులై,
చరిత్రలో వారికి విభిన్నమైన గుర్తింపు లబించినది.
గోరఖ్ నాథ్ - గూర్ఖాలు (newaawakaaya.com)
Member Categories - తెలుసా!
Written by kusuma
Sunday, 15 April 2012 13:06
;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి