9, డిసెంబర్ 2011, శుక్రవారం

బర్మాలోని గంధం చెక్క


Thanaka face paste 

“తనఖా  చెక్క”- బర్మాలో 
ఈ చెట్టు ఉపయోగం చాలా ఎక్కువ.


మియన్మార్ (మునుపటి పేరు బర్మా దేశము) లో 
ముఖ లేపనముగానూ,
స్త్రీలు చేతులకూ, పాదాలకూ వాడుతారు. 
నఖ శిఖ పర్యంతమూ రాసుకుంటారు.
ఈ తనఖా  పేస్టును బర్మాలో పురుషులు, 
బాలురుకూడా పూసుకుంటారు.


"థయనా" అనే పేరుతో ఈ లేపనమును, 
క్రమంగా పొరుగు దేశాలైన థాయ్ లాండ్ మున్నగు దేశాల  
లలనా మణులు  సైతము పై పూతలుగా పూసుకుంటారు.


ఆ జాతి చెట్లను బర్మా దేశీయులు 
“తనఖా తరువులు” అని పిలుస్తారు.
మధ్య మియన్మార్ లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి.


ష్వేబూ, మాగ్వే డివిజన్సులోని 
ఆ యా ప్రాంతాలలో విభిన్న పేర్లతో   
ఈ లేపనము వాడబడుతూన్నది .
సదరన్ షాన్ స్టేట్ లోని కుటీర పరిశ్రమలలో 
తాజాగా, లేటెస్ట్ థయనా సౌందర్య లేపనము తయారీ చేశారు.


తాజా దనముతో ఎప్పటికప్పుడు చెక్కను అరగదీసి, 
సిద్ధం చేసుకుంటారు.
తనఖా చెట్ల  లోని – 
సర్వ భాగాలు ప్రయోజనకారులు.


35 సంవత్సరాలు పెరిగిన చెట్లు 
ఇలాటి గంధము తీయడానికి అనువైనవి.


హిందువులు గంధమును చేసినట్లుగానే  
దీనిని వాళ్ళు చేస్తారు.


మన దేశంలో సాన రాయి మీద గంధపు చెక్కను అరగదీస్తూ చేస్తారు.
బర్మాలో  ఇలాటి గుండ్రపు రాయిని  kyauk pyin  అంటారు.


చెట్టు బెరడును గానీ, చెట్టు వేళ్ళను గానీ – 
నీళ్ళు కొంచెం కొంచెం చిలకరిస్తూ బాగా అరగదీస్తారు. 
సాంప్రదాయిక పద్ధతిలో 
ఇలాగ రెడీ ఐన గంధాన్ని – కొద్ది మొత్తాలుగా విక్రయిస్తారు.


నేడు తనఖా తరువు నుండి 
గంధము – పేస్టు, పౌడర్, 
కురుల నూనె అత్యాది తయారీ వస్తువులు దొరుకుతూన్నవి.


బర్మా వనితలు 2 వేల ఏళ్ళ నాటి నుండీ- 
మన గంధము వలెనే- కమ్మని వాసన కలిగి ఉన్న 
తనఖా గంధములను ఉపయోగిస్తున్నారు.


బర్మా మహిళలు, తమ వదనాలకు 
ఈ లేపనాన్ని రక రకాల డిజైన్లతో కూడా అలంకరించుకుంటారు.


గుండ్రంగా గానీ, ఆకు ఆకారంలో గాని, 
వివిధ  రకాలుగా అలంకరించుకుంటారు.
నఖశిఖపర్యంతము కూడా సింగారించుకుంటారు.
ఎండ కాక నుండి, 
సూర్య రశ్మి  నుండి రక్షణ కల్పించేసాధనము.


దేహము యొక్క మృదుత్వమును ఇనుమడించే 
కాస్మొటిక్ సాధనమీ  పేస్టు.
J.Raeburn Middleton’ oil paintings లలో 
“తనఖా సింగారిత బర్మా స్త్రీల దృశ్యాలు “చోటుచేసుకున్నాయి. 
1920 ల నాటి నుండీ ఇంగ్లండు లో 
ఈ తనఖా విలేపనము అధిక గిరాకీతో ఉంది.


                                        (- కాదంబరి)



బర్మాలోని గంధం చెక్క; (Link web magazine)
Posted on November,2011 by విహంగ 1634;
;

;

;


Tags:-


thanaka (yellowish-white cosmetic paste made from ground bark) 
on face 







This entry was posted in వ్యాసాలు. 
Bookmark the permalink.
;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...