8, ఏప్రిల్ 2010, గురువారం

ఆఫ్రికాలో హేమవిద్య
















ఏడు తరాల కథ – అది. అ నవల పెనుసంచలనమే కలిగించింది.
Alex Haley రచించిన అ విపుల రచనయే “The Roots“.

1750 సంవత్సరాల నుండి మొదలైన కథ ఇది.
సడన్ గా విశాలమైన నేల, సాక్షాత్తూ ఒక ఖండమే కనుగొనబడినది;
అక్కడికి పొలోమంటూ యూరోపియన్ జాతులు కోట్లాదిమంది వలస వెళ్ళారు.

మానవేతిహాసంలోనే కనీవినీ ఎరుగనట్టి, ”మహా వలసల చారిత్రాత్మక సంఘటన" అది.
అలా వెళ్ళి సెట్టిల్ అవుతున్నవారికి,
వందలాది ఎకరాలు సాగు చేసే అవసరం కలిగినది.
అందుకై మనుష్యులను కిడ్నాప్ చేయడానికి ప్రారంభించారు.
సదరు అమెరికా కాంటినెంటుకు దగ్గర ఆఫ్రికా ఖండము.

ఆఫ్రికా వాసులు చదువు సంధ్యలు లేనివారు,
నాగరికత వాసన అంతగా సోకని అమాయక మైన మరో ప్రపంచం.
తత్ఫలితమే అక్కడి జనులను సులభంగా కిడ్నాప్ చేసి,
తమ దేశలకు తరలించి, బానిసలుగా మలుచుకో గలిగారు.

అతి కర్కశ చారిత్రక పరిణామంలో
దయనీయంగా నలిగిపోయిన
ఆఫ్రికా జాతీయుల వాస్తవ గాథ ఈ “ రూట్స్ “ అనే గ్రంధము.

ఏడవ తరానికి చెందిన హేలీ కఠోరమైన శ్రమకోర్చి,
తన మూలాలను కనుక్కోగలిగాడు.
అతని ఆత్మకథను అక్షరరూపంలో ప్రపంచ సాహిత్యానికి అందించాడు.
=====================================

ఆఫ్రికాలోని వ్యక్తుల నిత్య జీవన విధానాన్ని కళ్ళకు బొమ్మ కట్టించాడు
అలెక్సు హేలీ.మాండింకా తెగ వాడైన కుంటకి
ఒక రోజు “బుర్రా”గ్రామ వాస్తవ్యులైన ఫెలూస్ తెగవాళ్ళు పరిచయం ఐనారు.

“ ఏమిటి విశేషం? “ అని అడిగాడు కుంటా.
“ బంగారు రేణువులను
సేకరించుకుని రావడానికి వెళుతున్నాం.” అని, మట్టిలో గీతలు గీస్తూ,
- ‘ ఏ దిక్కుగా , ఏ ఏ ఊళ్ళు దాటుకుని వెళ్ళాలో ‘ చూపించారు.

ఆ తర్వాత కుంటా, లామిన్, జఫూర్ లతో ఒక రాత్రి, రెండు పగళ్ళు
ప్రయాణం చేశాడు .
కొట్టకొసకి, బంకమన్ను గోతుల దగ్గరికి చేరారు.

“నువ్వు తప్పకుండా వస్తావనే అనుకున్నాం.”
వాళ్ళు సంతోషంతో పలికారు.

మరుసటి రోజు నుండి వేకువ ఝాముననే లేచేవాళ్ళు.
బంకమన్ను పెళ్ళలు విచ్చదీసే వాళ్ళు.
పెద్ద పెద్ద ఖాళీ సొరకాయ బుర్రలను నీళ్ళతో నింపి ఉంచుకున్నారు.
ఆ సొరడొల్లలలో బంకమన్నును బాగా పిసికే వాళ్ళు.
వాటిని స్పీడుగా గిర గిరా త్రిప్పే వాళ్ళు.
నెమ్మదిగా, నిదానంగా తేరుకున్న మట్టి నీటిని వంపి వేసేవాళ్ళు.

“ బంగారు రేణువులు అడుగునకు చేరాయి కదూ!”
ఇలాగ ఏకదీక్షతో సాయంత్రం దాకా చేసేవారు. చేతులు నెప్పులు పుట్టేవి.
అడవి పావురాళ్ళ రెక్కలతో బోలుగా గూడులను నిర్మించి పెట్టుకునే వారు.
ఇలా అడుగున చేరిన బంగారు రేణువులను, ఆ గూళ్ళలో భద్రం చేసి, పైన
దూది కూరే వారు.
కుంటా వర్గం అలాగ – ఆరు – సెట్టులను చేయగలిగారు.

తక్కిన ఫ్రెండ్సు “ఇంకా ముందుకు వెళ్ళి, దంతాల వేట చేద్దామని ” అన్నారు.
కానీ కుంటా విముఖత చూపడంతో అందరూ ఇంటి ముఖం పట్టారు.
అతని తల్లి బింటా, ఉమరో, ఊరి జనాలను కలిసి, వారి పొగడ్తలను రిసీవ్
చేసుకుంటే ఎంజాయ్ చేసాడు .

ఈ పుస్తకం వారి అనేక ఆచార వ్యవహారాల అక్షర దృశ్య రూపము.
తక్కినవాటిని నెమ్మది మీద చూడవచ్చును.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Telusaa!

ఆఫ్రికాలో హేమవిద్య

By kadambari piduri, Apr 6 2010 10:35AM

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...