“ వీణ చిట్టి బాబు “ అని ప్రసిద్ధి గాంచారు ,
ప్రముఖ వైణిక విద్వాంసుడు చల్ల పల్లి చిట్టి బాబు ( 1936 – 1996 ).
ఎందరినో “ వీణా వాదన “లో తీర్చి దిద్దారు చిట్టి బాబు.
ఆయన వంటి వైణికుల వలన ప్రజలలో "వీణ "కు గౌరవం ఇనుమడించినది.
ఆయన శిష్యరికం పొందిన భాగ్య శాలిని “ లలితా ముఖర్జియా( కలకత్తాలో ఆమె నివాసము).
ఆమె తన వేణ వాదనా ప్రజ్ఞకు హేతువులను
తరచుగా జ్ఞాపకం చేసుకుంటూ, చెబుతూంటారు.
చిట్టి బాబు ఉన్నత వ్యక్తిత్వానికి అందరూ ముగ్ధులౌతూంటారు.
ఆ యా సంగతులను లలితా ముఖర్జియా పూస గుచ్చినట్లుగా వివరిస్తూ ఉంటారు.
" చిట్టి బాబు చాలా ఓర్పు కలిగిన టీచరు.
ఆయన మంచితనానికి మారు పేరైన మాష్టారు.
శిష్యులకు బోధించేటప్పుడు అలసట అనేది ఎరుగరు.
ప్రత్యక్షంగా బోధిస్తారు, విరామము లేని గానం చేస్తూ ఉంటారు.
చిట్టిబాబు మాస్టారు – చిన్న అంశమునైనా సరే! -
ఆయన కోరిన విధంగా, ఆయన అనుకున్న విధంగా
నేను వీణ మీద వాయించ గలిగే దాకా ,
అవిశ్రాంతంగా చెబుతూ, వాయించి చూపిస్తూనే ఉండే వారు.
మొట్ట మొదటి సంగీత పాఠము (lesson )ను
90 నిముషాల పాటు నేర్పారు.
అప్పటికి, కేవలం పల్లవిని మాత్రమే
నేను నేర్చుకో గలిగాను;” అని
శిష్యురాలు లలిత ఆనందంతో తన చిన్న నాటి అనుభవాలను తలుచుకున్నారు.
"ప్రాధమిక అవస్థలో ఉన్నది కదా; నాకెందుకు లెమ్మని "; తాను గొప్ప వైణిక విద్వాంసుణ్ణి కదా!
అనుకునే నిర్లక్ష్యపు వైఖరి చిట్టి బాబుకు లేదు;
శిష్యులకు పాఠాలను నేర్పే విషయంలో
చిట్టి బాబు శ్రద్ధాసక్తులు, ఓరిమి నిరుపమానమైనవి.
“ నాకు ఇదివరకు వాయిద్యాన్ని నేర్పిన ఉపాధ్యాయుడు,
notation ను notes లో రాసుకునే పధ్ధతిని అనుసరించారు.
కానీ చిట్టి బాబు _ ‘ నోట్సును కానీ, రాగ వరుసలను రాసుకుని అనుసరించరు.
ఆయన పాఠ్య ప్రణాళిక విభిన్నముగా ఉండేది.
మళ్ళీ మళ్ళీ వీణపైన వాయించి చూపించే వారు.
దానిలో ఎంతగా లీనమై పోయే వారు అంటే ,
తన్మయత్వంతో వాయిస్తూ ఉంటే,
వీణ ఇంచుమించుగా నేలను తాకేటంతగా
వంగి పోతూ వాయిస్తూ ఉండే వారు.’
లలిత ఇతర మార్గాలను ఫాలో అయ్యే ప్రయత్నం కూడా చేసేది.
ఆమె ఇతర పుస్తకములలోనుండి –
మ్యూజిక్ లెసన్సు నొటేషన్సును, రాగాల మెట్టులను రాసు కునేది;
అయితే ఆ రాగ బాణీలను,
చిట్టి బాబు నేర్పిన అద్భుతమైన రాగాలకూ
పోలికలూ, సారూప్యతలూ ఉండేవే కాదు..........”
అంతటి మహానుభావుని స్టూడెంటుగా ఉన్నందుకు ఎంతో సంతోషంతో
“ తన పూర్వ జన్మ పుణ్యము వలన ఆయన శిష్యరికము లభించినది.”
అని చిర కాల జ్ఞాపకములుగా తన మనో పర్ణ కుటీరములో పదిల పరచుకున్నారు.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"అభినందన” మొదలుగా గల
అనేక హిట్ సినిమాలలో హీరోగా వేసిన అందాల నటుడు కార్తీక్.
ఈతని తండ్రి ముత్తురామన్.
ముత్తు రామన్ నటించిన సినిమా
“కలై కోవిల్ “కు ఒక ప్రత్యేకత ఉన్నది.
ఈ సినిమాకు సంగీత రచనను – విశ్వనాథన్ రామ్మూర్తి చేసారు.
ఈ మ్యూజిక్ రూప కల్పనలో
తెలుగు వైణికుడు చిట్టిబాబు వీణను వాయించాడు.
అంతేకాదు అధిక శాతం పాలు పంచుకున్నాడు కూడా!
1964 విడుదల ఐన “కలై కొవిల్”
సంగీత ప్రధానమై , ప్రేక్షక లోకం మన్ననలను పొందింది.
1960 – 1970 దశకంలో దక్షిణాది సినీ ప్రపంచంలో
అనేకం “వీణా వాయిద్యము నేపథ్యంగా” వెలువడి,
వీనుల విందొనరించాయి.
చిట్టిబాబు( October 13, 1936 - February 9, 1996 )
“లైలా మజ్ఞు” లో బాల నటునిగా ఉన్నాడు.
కానీ అతడు నటుడిగానే పరిమితం అవలేదు.
గొప్ప వైణిక విద్వాంసునిగా పరిణతి చెందాడు.
మహా మహోపాద్యాయ ఈమని శంకర శాస్త్రి వద్ద ఆత్మీయ శిష్యరికం చేసి,
గురువుకు తగ్గ శిష్యుడు ఐనాడు.
అప్పటి అనేక సినిమాలలో చిట్టి బాబు యే
వీణను శ్రావ్యంగా వాయించాడు.
“బాపు” దర్శకత్వంలో వచ్చిన “ సంపూర్ణ రామాయణము” లో
టైటిల్ సాంగు “జగదానంద కారకా!.....” అనే
త్యాగ రాజు కృతి వినిపించిన వీణా నాదము చిట్టి బాబుదే!
రాజాజీ రచన “దిక్కర్త పార్వతి" కథ ఆధారంగా తీసిన సినిమాకు
దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు అవడం ఒక ఎత్తు ;
ఈ అవార్డు గెలిచిన చలన చిత్రమునకు (కన్న దాసన్ రాసిన గీతాలకు)
music director మరెవరో కాదు, చిట్టి బాబు యే!
వాణీ జయ రాం పాడిన ”"ఆగాయం మఘై పొగిందాల్ ………” పాట
ఆ రోజులలో సూపర్ హిట్ ఐనది.
చల్లపల్లి రంగారావు కుమారుడైన చిట్టి బాబు
” Veena is my mission in life” అని పలికాడు.
ప్రాచీన వేద శ్లోకాలు, అలాగే కర్ణాటక సంగీత బాణీలు
ఆతని అంగుళుల కదలికతో మృదు స్వరాల వరాలై
శ్రోతల శ్రవణేంద్రియాలకు లభించాయి.
కోకిల స్వరములను వీణా తంత్రులపై వినిపించి ,
అనితర సాధ్య వైణిక విద్వాంసునిగా ప్రపంచమంతా ప్రఖ్యాతి గాంచాడు చిట్టిబాబు .
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&