-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
కర్ణాటక సంగీత సరస్వతీదేవి కిరీటములో పొదిగి ఉన్న
త్రి రత్నములు శ్రీ త్యాగరాజు, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామశాస్త్రి గార్లు.
ముత్తుస్వామి జనకుడు శ్రీ రామస్వామి దీక్షితులు,
“హంసధ్వని రాగమును” కనిపెట్టిన మేధావి.
ఈ భక్త శిరోమణి “ కాశ్యప” సగోత్రీకుడు.
అతని పూర్వీకులు ( గోవింద దీక్షితులు నిర్మించిన అగ్రహారము ఐన) గోవిందపురములో
రామస్వామి క్రీస్తు శకము 1735 లో జన్మించెను.
వేంకటేశ్వర దీక్షితులు, భాగీరథి అతని తల్లి దండ్రులు. వారు 1751లో పరలోకగతులైరి.
పిమ్మట రామస్వామి తంజావూరునకు వెడలెను.
అచ్చట రాజాస్థానములో సంగీత విద్వాంసుడు వీరభద్రయ్య వద్ద
రామస్వామి సంగీతవిద్యను అభ్యసించి, తిరిగి తన స్వగ్రామమునకు వచ్చెను.
సంగీతము పట్ల గల అమిత జిజ్ఞాసతో, అనురక్తితో,
మరల విద్యాభ్యాస ప్రయాణమును కొనసాగించెను.
మధ్వార్జున క్షేత్రమునందు వేంకట వైద్యనాథ దీక్షితులు అనే వైణికుడు నివసించు చుండెను.
వెంకట వైద్యనాథ దీక్షితులు యొక్క పూర్వీకుడు “వేంకటమఖి”అమోఘ పండితుడు;
వేంకటమఖి రచించిన “ చతుర్దండి ప్రకాశిక”
కర్ణాటక సంగీతము నేర్చుకొను వారికి కరదీపిక వంటిది.
వేంకట ముఖి 72 మేళ రాగములను సూత్రీకరించెను.
తనను ఆశ్రయించిన రామస్వామిలోని భక్తి శ్రద్ధలకు, సంగీతము పట్ల ఆసక్తి
వైద్యనాథులకు ఎంతో నచ్చాయి.
తన పూర్వీకులు ఒసగినట్టి, ఆ జన్యు రాగ సంపదలను,
వైద్యనాథ దీక్షిత పండితవరేణ్యులు నిష్కామముగా బోధించెను.
రామస్వామి సంగీత విద్యలను క్షుణ్ణముగా అభ్యసించెను.
స్వయంకృషితో రామస్వామి దీక్షితులు కనిపెట్టిన “హంసధ్వని రాగము”
కర్ణాటక సంగీతసీమలో ప్రాచుర్యము పొందినది.
వేంకట వైద్యనాథులు, రామస్వామి దీక్షితులు ఇద్దరూ అపురూపమైన గురు శిష్యులే!
వారు ఇరువురూ పరస్పరమూ పౌర్ణమి చంద్రుడు, పాల వెన్నెల వంటి వారు.
{ Telusaa!
హంసధ్వని రాగం
By kadambari piduri, Dec 21 2009 11:49PM }
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
హంస ధ్వని రాగము లో శ్రావ్యమైన ఒక త్యాగ రాయ కృతి ఇది;అబీష్ట వరద ;;;రాగం: హంస ధ్వని ;29 - ధీర శంకరాభరణం జన్య ;ఆరోహణ: స - రి 2 - గ3 - ఫ - ని3 - శ ;అవరోహణ: స - ని 3 - ప - గ 3 - రి 2 - స ;తాళం: ఆదిత్యాగరాజ కృతి ;(పల్లవి) ;అభీష్ట వరద శ్రీ మహా గణపతే ఆగమవేదాంత్యంతరహిత పతే || అభీష్ట ||(అనుపల్లవి ):కవీంద్ర రవి వినుతకనక మయ దివ్య చరణకమలములు నమ్మితిని ||అభీష్ట ||(చరణం ) :ముక్తి మార్గమునకు మొదటి దైవమునీ శక్తి సుముఖత భక్తులగు వారికిసిద్ధి బుద్ధి వర ఫలము నొసగినసద్గురు శ్రీ త్యాగ రాజు పొగడిన ||అబీష్ట ||&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&వందేహం జగద్వల్లభం దుర్లభంమందర ధరం గురుం మాధవం భూధవంనర హరిం మురహరం నారాయణం పరంహరిం అచ్యుతం ఘన విహంగ వాహనంపురుషోత్తమం పరం పుండరీకేక్షణంకరుణాభరణం కలయామి శరణంనంద నిజ నందనం, నందక గదా ధరంఇందిరా నాధ మరవింద నాభంఇందు రవి లోచనం హిత దాస పదంము-కుందం యదు కులం గోప గోవిందంరామ నామం యజ్ఞ రక్షణం లక్షణంవామనం కామితం వాసు దేవంశ్రీ మదావాసినం శ్రీ వెంకటేశ్వరంశ్యామలం కోమలం శాంతమూర్తిం