27, నవంబర్ 2017, సోమవారం

ఆర్యకుడు బందిఖానా


కిటికీలో నుండి కోకిల పాట వినిపిస్తుంది. అటు వెళ్ళబోయింది కుశావతి. 
"కుశావతీ! ..... "  వసంతసేన గొంతు అది.
వసంతసేన  ;- ఇక్కడ ఒకతను వచ్చాడు, ఎవరో చూడు. 
కుశావతి ;- [సిగ్గు పడుతూ] శర్విలకుడు అమ్మా ...... 
వసంత సేన ;- గుర్తు పట్టావే. [పకపకా నవ్వుతూ అంటూ ]
శర్విలకా, నీ చేతిలో ఆ మూట ఏమిటి, 
ఏదీ, నువ్వు తెచ్చిన మూటను విప్పి, చూపు.
[చూపుడు వేలుతో సంజ్ఞ చేస్తూ అన్నది వసంత సేన]
శర్విలకుడు ;-  సరే [తటపటాయిస్తూ చూపించాడు ]
[రమణులు ఇద్దరు ఉలిక్కిపడ్డారు]
కుశావతి ;- అయ్యో, ఈ నగలు ....... 
చారుదత్తుల ఇంట్లో నుండి దొంగిలించావా ఏమిటి!?
శర్విలకుడు ;- అబ్బే, అదేం కాదు, కాదు.
కుశావతి ;- కాక, ఇంత విలువైన నగలు .......  
ఈ వజ్రాభరణాలు ......  ఈ ఊళ్ళో కొద్దిమందికే ఉన్నవి.
వీటిని స్వయంగా వసంతసేన - వారి ఇంట్లో దాచిపెట్టమని ఇచ్చారు. 
నువ్వు, ఇంకా ఏవైనా 
కాకమ్మ, 
పిచుకమ్మ కథలు అల్లి, చెప్పాలని ఆలోచిస్తున్నావా!?
శర్విలకుడు ;- తప్పైపోయింది, గుంజీలు తీస్తాను, 
ఇదంతా నీ కోసమే చేసాను కుశావతీ! 
కుశావతి 
;- చేసింది దొంగతనం, హూ .........  ఇంకేమున్నదని 
చెప్పుకోవడానికీ, సమర్ధించు కోవడానిన్నీ. 
మునుముందు ఇంకా ఏమి అవస్థలు కలుగుతాయో ఏమో ......... 
పైగా నా కోసం ఇంత నీచం [ఆమె ఎక్కిళ్ళు పెడ్తున్నది]
వసంతసేన ;- ఊరుకో కుశావతీ! ఇంత తెగింపు ప్రేమ నీ కోసమే కదూ! 
శర్విలకునికి నీపై అనురాగం మెండు. 
[ఇంతలో మైత్రేయుని రాక]
మైత్రేయుడు ;- కుశావతీ! మీ స్వామిని సొమ్ములు మేము 
భద్రపరచ లేక పోయాము. కనుక, ఈ నగలను 
వసంతసేనకు ఇవ్వమని నన్ను పంపారు చారుదత్తులు.
వసంతసేన ;-ఈ రత్నాభరణములు - ధూతమాంబ ధరించినవి కదూ.
[మనసులో అనుకున్నది] 
వసంతసేన ;- భూమి గుండ్రంగా ఉన్నది - కుశా! 
నీ సఖుడు శర్విలకుని వలన అనుకోకుండా మేలు జరిగింది. 
కుశావతి ;- సాక్షాత్తు వారివి ఇవి. అర్ధంపర్ధం లేని పనులు చేసాడు శర్వుడు.
వసంతసేన ;- ప్రేమ కోసం, ప్రేమ వలన, ప్రేమ తోటి - 
ఇంత సాహసం.
ఎంతైనా అటువంటి ప్రియుడు లభించాడు నీకు.
భాగ్యశాలినివి కుశావతీ! శర్విలకా, మీ ఇద్దరి పెళ్లిని నేను చేస్తాను. 
నువ్వు నిశ్చింతగా ఉండు. 
కుశావతి ;- అమ్మా, మీ తల్లిగారికి కోపం వస్తుందేమో. 
వసంతసేన ;- మా జననికి నేను నచ్చజెబుతాను. మైత్రేయా, 
చారుదత్తుల వారికి నా కృతజ్ఞతలు తెలుపు.
మైత్రేయుడు ;- వసంత దేవీ! విధివిలాసం అంటే ఇదే కాబోలు! 
మీ ఆభరణాలను మీకు చేర్చాను.
వెళ్ళివస్తాము. పద వర్ధమానకా!

[ 
మైత్రేయుడు, వర్ధమానకుడు వెళ్లిపోయారు.
శర్విలకుడు ;- జీవితంలో ఒకే ఒక్కసారి - గ్రహపాటు బాగోలేక చేసాను పొరపాటు. 
ఇంక ఎన్నడూ చేయను. 
భూమి మీద ఒట్టు వేస్తున్నాను.
వసంతసేన ;- అన్నేసి ఒట్లు ఎందుకు. శర్విలక, కుశావతిల 
జంట కన్నుల పంట. 
పెళ్ళినాటి ప్రమాణాలు మరువక, కట్టుబడి ఉండు, అదే పది వేలు. 
శర్విలకుడు ;- పెళ్ళి ముహూర్తాలు పెట్టుకోగానే, మీ వద్దకు మళ్ళీ వస్తాము. 
మీ ఆశీస్సులు తీసుకుంటాము.
వసంతసేన ;- శర్విలకుని, కుశావతిల జంట - సంతోషం కలకాలం వర్ధిల్లాలి. 
శర్విలకుడు ;- బయట కోలాహలం, అదేమిటి!? 
అక్కడ వీరకుడు, 
చందనకుడు - పరిగెడుతున్నారు.
[బైట అరుపులు, కేకలు ;- 
ప్రజలు యావన్మందికీ హెచ్చరిక. 
అందరూ ఈ చాటింపును శ్రద్ధగా వినండి.  
ఆందోళనకారుడు ఆర్యకుని చెరసాలలో వేసారు.
కనుక ప్రజలు - తగు జాగ్రత్తల్తో మెలగవలసినదిగా తెలుపుతూ -
టముకు వేస్తున్నాము - ఒహో .... ]
శర్విలకుడు ;- కుశావతీ! నువ్వు మీ కన్నవారి ఇంటికి 
వెళ్ళు. నేను నిన్ను ఆనక కలుస్తాను. నా ప్రాణ స్నేహితుడు 
ఆర్యకుడు చిక్కుల్లో ఇరుక్కున్నాడు, నిన్ను మళ్ళీ కలుస్తాను.
వసంతసేన ;- తుందిలా! కుశావతిని -ఆమె పుట్టినిల్లు వద్ద దించు. 
తుందిలుడు ;- అమ్మా, కుశావతి సోదరుడు రేభిలుడు ఉండే స్థలం నాకు తెలుసు, 
అక్కడ ఈమెను అప్పగించి రమ్మంటారా!? 
- 

కుశావతి ;- కానీ మా అన్న చెప్పా పెట్టకుండా దేశాంతరములకు వెళ్ళాడు .....
శర్విలకుడు ;- రేభిలుడు - నీ సోదరుడా, ఆహా, అతను మంచి గాయకుడు.
ప్రజలలో ఉత్సాహాన్ని నింపుతున్నవి అతని పాటలు. 
మా దళమునకు రేభిలుని గానం ద్వారా అత్యంత ఉపకారం చేకూరుస్తున్నాడు. 
వసంతసేన ;- మొత్తానికి వెదకబోయిన తీగలు కాలికి తగులుతున్నవి. 
శర్విలకుడు ;- ధన్యవాదములు అమ్మా! మీ మేలు ఎప్పటికీ మరువలేను. 
ప్రస్తుతం - దేశరక్షణ - తక్షణ కర్తవ్యం నాకు. సెలవు తల్లీ!
;
♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣
;

అధ్యాయ శాఖ ;- 17  ;- ఆర్యకుడు బందిఖానా ;
;

23, నవంబర్ 2017, గురువారం

కలికి కామాక్షి పయనం

రదనిక  ;- కలవారి కోడలు కలికి కామాక్షి ; కడుగుచున్నది పప్పు కడవలో పోసి ; 
అప్పుడే వచ్చెను ఆమె పెద్దన్న ; కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు నింపె ........
పట్టె మంచము మీద పడుకున్న మామా ;;
మా అన్నలొచ్చారు, మమ్మంపుతారా!? 
నేనెరుగ నేనెరుగ, మీ అత్తనడుగు ;;
ముక్కాలి పీటపై కూర్చున్న అత్త ; 
మా అన్నలొచ్చారు, మమ్మంపుతారా!?  ..............
[రదనిక కూనిరాగం తీస్తూ, సన్నగా పాడుతున్నది]; 
ఇంతలో వాకిలి నుండి వస్తూన్న వ్యక్తి భగీరధుడు]
భగీరధ ;- నమస్కారం బావ గారూ!
చారుదత్తుడు ;- భగీరధా, ఉభయ కుశలోపరి. 
దూతమాంబా! మీ పెద్దన్నయ్య వచ్చారు ....
రదనిక ;- భగీరధయ్య బాబుగారా, దండాలు, 
అమ్మగారూ ..... [లోనికి వెళ్ళింది]
ధూత ;- మజ్జిగ తీర్ధం పుచ్చుకోండి అన్నయ్యా, 
అమ్మ, నాన్నగారు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు - 
అందరూ కులాసా కదా, చిన్ని పెళ్ళి కుదిరిందా!?
భగీరధ ;-  ఆ పని మీదే  అందుకే వచ్చాను, 
మీదే బాధ్యత, పెద్దలు,  మీరు ముందుంటే మాకు భరోసా. 
మీరందరూ తప్పక రావాలి బావ గారూ! మండలం రోజులలో ముహూర్తం. 
ఇదిగో తొలి లగ్న పత్రిక మీకే.
బావగారూ! పెళ్ళికి సకుటుంబ సమేతంగా మీరు విచ్చేయాలి. 
చారదత్తుడు ;- వివాహ సుముహూర్త వేళకు వస్తాము
భగీరధూ! మాకు ఇక్కడ ఇల్లూ వాకిలి, చిన్న వ్యాపారము - చూసుకోవాలి కదా.
భగీరధ ;- వ్యాపారం - అన్నాక లాభ నష్టాలు ఉంటాయి. 
ఇప్పుడు చిన్న వ్యాపారం - మునుపటి దశకు - 
ఉన్నత స్థాయికి తప్పక చేరుకుంటారు బావా. 
చారుదత్త ;- ఇట్లాంటి ఒడిదుడుకులు - 
జీవితంలో ప్రతి మనిషికి తటస్థ పడతాయి. 
క్రుంగిపోకుండా కాలం గడపగలిగిన మనిషియే స్థితప్రజ్ఞుడు. 
భగీరధ ;- అందుకే బావా, మిమ్మల్ని చూస్తే - నాకు  గర్వం కలుగుతుంది. 
రదనిక ;- బాబు గారూ, భోజనం సిద్ధం, వడ్డించమంటారా!? 
అమ్మగారు అడగమన్నారు.
భగీరధ ;- సరే, మా సోదరినైనా - శుభకార్యానికి పంపిస్తే మాకు ఆనందం.
ధూతమాంబ ;- మరి రోహణుని కూడా తీసుకువెళ్ళనా!? 
రదనిక ;- రోహణ బాబుకు - కొత్త గాలి, నీళ్ళు పడవు కదా అమ్మా.
చారుదత్త ;- నిజమే, గతంలో కొన్నిసార్లు జరిగింది కదా! 
బిడ్డకు కొత్త వాతావరణం గిట్ట లేదు.
రదనిక ;- సుస్తీ చేసింది అయ్యా.
చారుదత్త ;- ఇప్పుడు ధూతమాంబ మీతో వస్తుంది. 
పెళ్ళిరోజుకు, నేను, రోహణునితో వస్తాను.
భగీరధ్ ;- మీరెట్లా సెలవిస్తే అట్లాగే ఆ బావగారూ!
;  

♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ;
REF :-
భాస నాటక చక్రం ;- 14 నాటకములు ;-

1. చారుదత్త ; 2. ప్రతిమ ;  3. బాల చరిత్ర ;;
4. అవిమారకం ; 5. అభిషేకం ;
6. ప్రతిజ్ఞ యౌగంధరాయణ ;;
7. స్వప్న వాసవదత్త ;;
8. పంచరాత్రం ; 9. యజ్ఞఫలం ;
9. ఊరుభంగం ; 
10. దూత వాక్యం ; 11. దూత ఘటోత్కచం ; 
12. కర్ణభారం ; 13. మధ్యమ వ్యాయోగం ;
14. అవిమారకం ; 
============================;
;
BAsa nATaka cakram ;- 14 nATakamulu ;-

1. caarudatta ; 2. pratima ;  3. baala caritra ;;
4. awimaarakam ; 5. abhishEkam ;
6. pratij~na yaugamdharaayaNa ;;
7. swapna waasawadatta ;;
8. pamcaraatram ; 9. yaj~naphalam ;
9. uurubhamgam ; 10. duuta waakyam ;
11. duuta GaTOtkacam ; 
12. karNabhaaram ; 13. madhyama wyaayOgam ;
14. awimaarakam ; 
;
♣♣♣♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣  ♣♣♣♣♣♣ ♣♣♣♣♣♣ 

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
;
అధ్యాయ శాఖ ;- 16 ;-
కలికి కామాక్షి పయనం =

 kaliki kaamaakshi payanam ;
;
previous ;- [అధ్యాయ శాఖ ;- 15 ; -  
;- 22, నవంబర్ 2017, బుధవారం ;- మైత్రేయుని పొరపాటు] ;
;
♣♣♣♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣  ♣♣♣♣♣♣ ♣♣♣♣♣♣ 

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
REF ;- భాసో హాసః  = BAsO hAs@h  [LINK] ; 
;

22, నవంబర్ 2017, బుధవారం

మైత్రేయుని పొరపాటు

చారుదత్తుని ఇల్లు ;-
చారుదత్తుడు ;- మైత్రేయా, వర్ధమానకా, 
,                ఆమె ఆభరణాలను భద్రంగా కాపలా కాయండి, 
రదనికా, రోహణునికి పాలు ఇచ్చావా, 
రదనిక ;- ఇచ్చాను, రోహణ బాబు పాలు తాగారు, 
ఇంక మీకోసం ఎదురుచూస్తున్నారు. మీరు కథ చెప్పాలని.
ధూత ;- రామాయణ, భారతం, భాగవతం, ఉపనిషత్తులు - 
 ప్రతి రోజూ - ఏదో ఒక కథ చెప్పాలి. 
రదనిక ;- లేకుంటే నిద్ర ఎట్లా పడుతుందమ్మా, 
                  పిల్లలకు కన్నతల్లి పలుకులు తేనె ఊటలు కదా.
ధూతమాంబ ;- గదిలోకి వెళ్తున్నాము. 
చారుదత్త ;- ఆభరణముల సంరక్షణను - ఆ ఇద్దరు - బాధ్యతగా చేస్తారులే, ధూతా! 
ఎంతైనా - స్త్రీలకు నగలంటే ఎంతో ఇష్టం. [ ఆమె నవ్వింది]
వర్ధమానకుడు ;- సరే స్వామీ! మీరు నిశ్చింతగా నిద్ర పొండి. 
బయట - నేను, బండివాడు మార్గుడు - ఉంటాము. ఈగ కూడా జొరబడలేదు.
మైత్రేయుడు ;- వర్ధమానా, నీ మాట నాకు కొండంత ధైరాన్ని కలిగించింది. 
కాసినీ కూసినీ కావు కదా, పెట్టెడు నగలు .......... భోషాణములు కూడా ఇక్కడ లేవు. 
దాన ధర్మముల కోసం స్వామి చారుదత్తుల ఆస్థిపాస్తులు, బంగారం,  వస్తువులు అన్నీ ఐపోయాయి, 
ఇంక తలదాచుకోను తాతల నాటిది, ఈ పాత ఇల్లు మిగిలింది. 
హా - నాకేమో ఈ ఆవులింతలు ఆగవు, కంటి రెప్పల మీద కునుకు వేళ్ళాడుతున్నది. 
ఇంక ఈ నగల మూటను నా తల కిందే పెట్టుకుని పడుకుంటాను.
;
[రాత్రి - దొంగ - శర్విలకుడు ]
శర్విలకుడు ;- పురాతనమైనదే ఐనా ఈ ఇంటి గోడలు దిటవుగా, గట్టిగా ఉన్నవి. 
ముందు ఇద్దరు కాపలా ఉన్నారు. 
కాబట్టి ఇంక ఈ వెనుక వైపు మాత్రమే ఈ శర్విలకుడికి మిగిలిన దారి. 
[కన్నం వేసి, దూరాడు] 
;
మైత్రేయుడు ;- వర్ధమానా, నువ్వు కూడా నిద్ర పట్టక, తచ్చాడుతున్నావు, 
ఏమిటి, గాలికి దీపం మలిగినట్లున్నది. ఈ నగల మూటను నీ దగ్గర పెట్టుకో నాయనా! 
హమ్మయ్య - ఇప్పుడు ఇంక నాకు తగని నిశ్చింత. 
గుండెల మీద చెయ్యి వేసుకుని - హాయిగా నిద్ర పోతాను.
[ శర్విలకుడు గప్ చుప్ గా మూటను అందుకున్నాడు]
;
శర్విలకుడు ;- ఆహా, వేకువఝామున కలలోకి నా ప్రేయసి కుశావతి వచ్చింది. 
పొద్దున్నే వచ్చిన స్వప్నాలు నిజమౌతాయని నానుడి. 
కనుకనే ఈ శర్విలకుడికి ఇంత సులభంగా సొత్తు దొరికింది. 
వసంతసేనమ్మకు ఈ నగలు ఇస్తాను. దాంతో నా ప్రియురాలికి దాస్య విముక్తి. 
ఆ యజమాని వసంతమ్మకు ఋణం తీర్చగలుగుతున్నాను. 
ఆ ఆలోచనతో - నా మనసును మేఘాలలో తేలిపోతున్నది.
శర్విలక ;- వచ్చిన రంధ్ర ద్వారం నుండే బైటికి చేరి, ప్రహరీ గోడను ఎక్కి, దూకాను. 
హమ్మయ్యో, ఆ దిక్కున దండ నాయకులు - చందనకుడు, వీరకుడు ఉన్నారు. 
సరే, పక్క బాటలో నుండి జారుకుంటాను.
దూతకరుడు ;- శర్విలకా, ఆగు ఆగు. 
శర్విలకుడు ;- అరె, దూతకరుడు, దర్దురకుడు - 
మీరు ఇంత అపరాత్రి వేళ వీధులలో ......
దూతకరుడు ;- మామూలే కదా, మా మిత్రద్వయం - 
జూదంలో రేయిం బవళ్ళు గడపటం. నీ చేతిలో ఏమిటో ఆ మూట!?
దర్దురకుడు ;- నా మిత్రుడు - దూతకరుడి సందేహం నివృత్తి చేయనిదే 
అడుగు ముందుకు వేయలేవోయీ! 
శర్వికుడు ;- నా ఇష్ట సఖి - వేశ్యా వాటికలో ఉన్నది.  
ఆమె తల్లిదండ్రులు వేశ్య మాత వద్ద అప్పు తీసుకున్నారు. 
చేసిన అప్పును తీర్చేదాకా - నా రమణి కుశావతి - 
వారి వద్దనుండి ఈవలకు రాకూడదు కదా. 
నేను ఆమెను పెళ్లి చేసుకోవాలంటే - ఆ శుల్కం చెల్లించి తీరాలి. 
గత్యంతరం లేని పరిస్థితులలో చోరత్వానికి పాల్పడ్డాను.
దర్దురకుడు ;- వసంతసేన నుండి నీ మగువను తెచ్చుకొని, సుఖంగా ఉండు శర్విలకా, 
ఈ దర్దురకుని మాట వేదవాక్కు.
దూతకరుడు ;- నీ కుశావతిని తెచ్చుకుని, 
పరిణయమాడి, పిల్ల పాపలతో - కుశలముగా జీవించుము - 
ఇది ఈ దూతకరుని దీవెనలు, శర్విలకా, క్షేమంగా వెళ్ళి, లాభంగా మరలుము.
ఇద్దరు ;- 'మీ శర్విలక -  కుశావతి జంట' 
కలకాలం సుఖంగా సౌఖ్యాల క్రీడలలో ఓలలాడుదురు గాక.
శర్విలక ;- సంతోషం. మీ అశీస్సులు ఫలించాలి. సెలవు, వెళ్తున్నాను.
దూతకర ;- మిత్రమా, దర్దురకా, అటునుండి ఏదో ధ్వని ........
దర్దురకుడు ;- ఔను దూతకరా! చారుదత్తుని ఇంటి నుండి - ఆ సవ్వడి ......... పద, చూద్దాము.
చారుదత్తుడు ;-  మైత్రేయా, మన ఇంటిలో ఏమి మిగిలి ఉంటాయని - 
దొంగ వస్తాడు,  చోర వృత్తి కొత్తగా చేపట్టిన వాడు ఐ ఉంటాడేమో కదా!
మైత్రేయ ;- చిత్తం. కానీ - కించిత్తు అదృష్టం - గుడ్డిలో మెల్ల. -
మిత్ర వర్ధునికి ఇచ్చాను - వర్ధమానా, వసంతా దేవి రత్నాల నగల మూట - 
నీకు ఇచ్చాను కదా, అవి నీ వద్ద భద్రమే కదా.
వర్ధమానకుడు ;- నాకు ఇచ్చావా, ఎప్పుడు, రాత్రి నాకు గాఢ నిద్ర పట్టింది. 
అసలు మెలకువయే రాలేదు .......
చారుదత్త ;- ఆ, ధూతా, రదనికా, ఇంట్లో ఎక్కడైనా పడి పోయాయేమో, వెదకండి.
మైత్రేయ ;- క్షమార్హుడిని కాను - దేవరా! వర్ధమానుడు అనుకుని, 
ఎవరి చేతికో నగల మూటలను ఇచ్చేసాను.
ధూతమాంబ ;- ఏడవకు మైత్రేయా, ఏద్చి ప్రయోజనం ఏముంటుంది!?
రోహణుడు ;-  అమ్మా, ఏం జరిగింది!?
ధూత ;- అయ్యో, నా చిట్టితండ్రికి నిద్రా భంగం కలిగింది. రదనికా, రోహణ బాబును 
లోపలికి తీసుకు వెళ్ళు. ఆర్య చారుదత్తులు, వీటిని గ్రహించండి.
చారుదత్త ;- నీ నగలు వలిచి ఇస్తున్నావా, భార్యగా నీ చేయిని పరిగ్రహించాను. 
చివరికి భర్తగా నా నుండి నీకు లభించిన ప్రతిఫలం ఇంతే కదు!
ధూత ;- స్వామీ, మీ కష్ట సుఖములలో భాగస్వామిని ఐనప్పుడే - 
అర్ధాంగిగా నా బ్రతుకు సార్ధకత, నా మీద కృపతో వీనిని స్వీకరించండి. 
చారుదత్త ;- మైత్రేయా, మీరిద్దరు - ఈ నగలను - ఆమె ఇంటికి వెళ్ళి ఇచ్చివేయండి.  
మైత్రేయ ;- వసంతసేనమ్మకు - పొరపాటు జరిగింది - కనుక 
మా అమ్మగారి నగలను బదులుగా ఇస్తున్నాము. - అని చెప్పి, ఇచ్చి వస్తాము దొరా!
;
*************************************************;
;
అధ్యాయ శాఖ ;- 15 ; - 
పాత్రలు ;- చారుదత్తుడు - ధూతమాంబ -  రోహణుడు ;;;
రదనిక - మైత్రేయ - వర్ధమానుడు ;;;;
శర్విలకుడు - దర్దురకుడు - దూతకరుడు ;;;
[దండనాయకులు ;- చందనకుడు, వీరకుడు ] ;;;
[అధ్యాయ శాఖ ;- 14 ; బౌద్ధ సన్యాసి సంవాహకుడు  - next + ] ;
*************************************************;
;
BHAARATEEYAM ; బుద్ధ భగవానుడి కథలు - బోధనలు ; LINK ;

21, నవంబర్ 2017, మంగళవారం

బౌద్ధ సన్యాసి సంవాహకుడు

బుద్ధం శరణం గచ్ఛామి ;
సంఘం శరణం గచ్ఛామి ;
ధర్మం శరణం గచ్ఛామి ;
[సంవాహకుడు నడుస్తున్నాడు.]
; 
కుశావతి ;- ఇదిగో స్వామీ వరహా, స్వీకరించండి! 
ఈ పేద కుశావతి ఇస్తున్నది, స్వీకరించండి!
సంవాహక ; శుభమస్తు కుశావతీ
కుశావతి ; అరె సంవాహకా, నీవా, నువ్వు ఆర్యకుని పటాలంలో చేరావని, 
సైనిక శిక్షణ పొందుతున్నవని విన్నాను.
సంవాహక ;- వెళ్ళాను, చేరాను. కానీ పరాక్రమవంతులకే యుద్ధం చేయడం చేతనౌతుంది. 
నేను యుద్ధ పిరికిని, సభా పిరికిని కూడా. 
కుశావతి ;- అందుకని పారిపోయి వచ్చి, బౌద్ధ సన్యాసివి ఐనావా [నవ్వింది]
సంవాహక ;- సమాజం, వ్యవస్థ - నిలకడగా ఉండాలంటే - నిజాయితీ అవసరం. 
నీతి పట్ల ఆదరణ భావం ప్రతి మనిషికి ఉండాలి. 
వ్యక్తులలో - నీతి, నిజాయతీల ఆచరణలు నిలుచునట్లు - చేయగలవారు 
బోధ గురువులు.
కుశావతి ;- అందుకే ఇట్లాగ కాషాయాంబర ధారివి ఐనావు, అంతేనా!
సంఘ జీవన విధానములందు సమ తూకమును కాపాడటం మా విధి.
కుశావతి ;- నిజమే, నువ్వు మంచి బాధ్యతను నిర్వహిస్తున్నావు. 
అరుగో వసంతమ్మ వస్తున్నారు.
వసంత సేన ;- చెరువులో తామరలు, కలువలు వికసించి, కళ కళ లాడ్తున్నవి, కుశా! 
కుశావతి ;- ఔనమ్మా, వికసించిన పూలు, ఆ చెరువుకు ఎంతో శోభ నిస్తున్నవి.
వసంత ;- ఈ ఉద్యానవనానికి వచ్చిన ప్రతిసారీ - వాటిని కోయాలని ఆశ. 
కానీ ఎట్లా కోయగలం?
కుశావతి ;- ఔనమ్మా, ప్రతిసారీ - ఉత్తి చేతులతో వెళ్ళి పోతున్నాము.
[సంవాహక ;- స్త్రీలు ఇరువురు సంభాషిస్తున్నారు, 
       వారి మాటలను వినిన సంవాహకుడు - 
                     చెరువు దగ్గరికి వెళ్ళి, నీరజములను తెచ్చాడు.]
సంవాహక ;- ఇవిగోనమ్మా, పద్మాలు, కువలయాలు ;
వసంత సేన ;- ధన్యవాదాలు, సంతోషం స్వామీ, ఇతను ......
కుశావతి ;- ఇతను సంవాహకుడు. ఆర్య చారుదత్తుని వద్ద పని చేసే వాడు.
వసంత సేన ;-  ఔను కదూ, ఇదేమిటి, బౌద్ధ సన్యాసిగా.... !?
సంవాహక ;- అమ్మా, జూదం దుర్వ్యసనం. చాలా చెడ్డ వ్యసనం. 
నేను జూద శాల మాధురునికి - డబ్బు చెల్లించ లేక పోయాను. 
వాళ్ళు నన్ను తరుముకుంటూ వచ్చారు.
వసంత సేన ;- ఆ, అప్పుడు మా గృహంలో దూరి, దాక్కున్నావు.
కుశావతి;- అప్పుడేమో, మా వసంతమ్మ - మాధురుని మనుషులకు ధనం చెల్లించి, 
నీ బాకీని చెల్లు వేసారు కదా.
సంవాహక ;- అప్పుడు నాకు చాలా సిగ్గు వేసింది. పశ్చాత్తాప పడ్డాను. 
కుశావతి ;- చారుదత్తుల వద్ద ఉన్న మనిషివని అమ్మకు అభిమానం. 
అందుకే నిన్ను ఋణ విముక్తుని చేసింది 
సంవాహకా, కాదు కాదు - స్వామివారూ!
వసంత సేన ;- ఇంక సెలవు స్వామీ, ఈ ధనమును తీసుకోండి. 
ప్రజల క్షేమ, సౌకర్యాలకై వినియోగించండి.
కుశావతి ;- సంవాహకుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు. 
వసంత సేన ;- మేలైన బాటలో సాగే జీవన విధానం - గౌరవాన్ని ఇస్తుంది.
కుశావతి ;- అది నిజమేనమ్మా, ముందు సైనికునిగా మారాలని అనుకున్నాడు. 
కానీ - ఇతని వ్యక్తిత్వానికి అది నప్పలేదు. 
అక్కడే ఉంటే - ఆర్యకుని పటాలానికి చిక్కులే కలిగేవి. 
సైన్యానికి పిరికిపందలు భారం ఔతారు.
వసంత సేన ;- ఇతని ప్రవృత్తికి అనుగుణమైన సరైన దారిని ఎన్నుకున్నాడు. 
సంవాహకుని వంటి వారి సంఘ సేవ - లోక కళ్యాణదాయిని ఔతుంది.
వసంత సేన ;- తుందిలుని పిలువు కుశా! 
ఇంక వెళ్దాము. సెలవు సంవాహక స్వామీ! 
; 
****************************************;
;
 అధ్యాయ శాఖ ;- 14 ; బౌద్ధ సన్యాసి సంవాహకుడు ;-
శోధ గంగ, మృచ్ఛకటిక నాటకానుశీలనము - 3 canto  LINK  
; 
కుంట మోదకము అను ఏనుగు ;-
రాజ శ్యాలకుడు శకారుడు ;
ఇవ్వవలసిన ధనమునిచ్చి, అతనిని ఋణవిముక్తుని గావించెను సంవాహకుడు. వసంతసేనకు తన ... కుంటమోదకమను ఏనుగు ఒకటి కట్టు బ్రెంచుకొని ఆదారిన పోవుచున్న ఒక బౌద్ధ ... ఆ సన్యాసిని విడిపించెను 
అదే సమయంలో ఆ దారిన పోవుచున్న చారుదత్తుడు.

కూటమి నడక - కూడలి వైపుకి

మాధురుడు ;- మార్గా, ఓ మార్గుడా;
మార్గుడు ;- ఎవరు? మాధురుడా!?
మాధురు ;- ఆహా, గుర్తు పట్టావు కదా, మీ పల్లెకు పక్కన ఉన్న గ్రామ నివాసిని నేను, 
ఐనా గుర్తించావు, నీ జ్ఞాపక శక్తికి నా జోహార్లు.
మార్గు ;- ఇల్లరికం వెళ్ళావు, మీ అత్తవారింటిలో వైభోగంగా ఉన్నావా!?
మాధురు ;- భోగం, వైభోగం - అదీ మగవానికి అత్తింటిలో ......
 భలే భలే! చెప్పావు మార్గా! 
పురుషునికి ఇల్లరికం - గౌరవ మర్యాదలు ............ 
హు ....... తట్టుకోలేకే - నేను నేడు ఇక్కడ ఉన్నాను.
మార్గు ;- ఓహో, కాస్త అటు ఇటుగా మన అందరి పరిస్థితి ఒకటే లాగ ఉన్నాయన్న మాట 
మాధురు ;- అన్న మాట కాదన్నా - ఉన్న మాటే అది.
మార్గు ;- చారుదత్తుడు అనే మహనీయుని బండిని తోలుతున్నాను, మరి నీవో ........
మాధురు ;- నీకు ఉదాత్త పురుషుడు యజమానిగా లభించాడు, 
నాకు అట్లాంటి మంచి ఆశ్రయం ఏదీ దొరక లేదు. ఒక జూద శాలను పెట్టుకొని, నడుపుకుంటున్నాను.
మార్గు ;- జూదశాల, ఐతే మూడు దమ్మిడీలు, ఆరు వరహాలు ........... 
మాధురు ;- ఆరు వరహాలు, పన్నెండు వజ్రాలున్నూ ...... కాదా మరి.
మార్గు ;- అంత  నిరాశ పడుతున్నావేమిటి?
మాధురు ;- బహిరంగ రహస్యమే, అసమర్ధ ప్రభువు, అతని రాబందు బంధువులూ ......
మార్గు ;- విరాట రాజుకు కీచకునిలా - బావమరిది శకారుడున్నాడు, అతని గురించేనా?
మాధురు ;- బావ, బావమరిది, ఇంకా అతని తోకలు, చాలా చాలా చాలామంది ......
మార్గు ;- ఔనా, ఐతే ఒక చోటికి వెళ్తున్నాను, వస్తావా?
మాధురు ;- ఎక్కడికి?
 మార్గు ;- మన బోటి వారి కూటమి అది. ఒక రహస్య .......
మాధురు ;- రహస్య ......
మార్గు ;- సమావేశం, రాజు గారి కోటలో ...........
మాధురు ;- హమ్మో,  నేరుగా కోటలోనే. 
మార్గు ;- ఆ,  కోటలోనే, చెరసాల వెనుక ఒక చీకటి కొట్టులో సమావేశం.
మాధురు ;- పట్టుబడుతామేమో .......
మార్గు ;- కొందరు సైనికులు, కొందరు కాపలా భటులు సాయపడ్తున్నారు.  
మాధురు ;- ఎట్లా ఎట్లా, అది ఎట్లా?                                                                  మార్గు ;- ఔను మరి, నమ్మితీరాలి - భటుల కుటుంబాలు కూడా  ......... 
అధికార బాధితులే!
రాజు గారి చుట్టాలు, స్నేహితుల స్వార్ధం ఎవ్వరినీ వదల లేదు. 
వీరు అడగానే - వాళ్ళు సమర్పించుకోవాలి ; నోట్లో మాట నోట్లో ఉండగనే ...... ; 
చందనుడు ;- బ్రహ్మ - పిపీలిక పర్యంతం శకారాదులు దేనినీ వదిలిపెట్టరు, 
జుర్రుకుని, పీల్చి పిప్పి చేస్తున్నారు.
మార్గు ;- నిజం చెబ్తున్నాడు సంవాహకుని ఉవాచ -
నూటికి నూరు శాతం సత్యం సత్యం పునః సత్యం. 
మాధురు ;- సింహం జూలు విదిలిస్తే పడేది దుమ్ము, మన మీద. 
ఇక నుండి మీ కూటమిలో నేను కూడా సభ్యుణ్ణి. 
తుందిలుడు ;- మార్గా! ఓ మార్గా! ఓహో మార్గుడా, ఓహోహో మార్గయ్యా!          
మార్గు ;- ఓహో తుందిలుడా! ఈతను వసంతసేన గారి శకట సారధి, వీరు మాధురులు ;
వీరి నామం చందనుడు - రాజభటుడు.  
మాధురు ;- పరస్పర పరిచయాలు బాగా చేస్తున్నావు, నన్ను కూడా ...... 
ఈ కొత్తవారికి పరిచయాలు చేయండి. 
మార్గుడు ;- సంవాహకా, ఎచ్చటి నుండి రాక ......... 
మాధురు ;- సంవాహకుడు కదూ, మార్గా - 
వీనికి నూత్న పరిచయ అవస్థ - అనవసరం.
సంవాహకుడు ;- అరె, జూదశాల నిర్వాకులు, మాదురుడు - అయ్యా, మన్నించండి - 
మాధురు ;- గుర్తున్నానన్నమాట!!!! హూ ......... జూదశాలకు నిత్య అతిధివి. 
జూద మండపంలో తిష్ఠ వేసి, వినోదం పొందే వాడివి. 
మంటపం అద్దె ఎగకొట్టే చిట్కాలు నీ దగ్గరే అందరూ నేర్చుకోవాలి మరి.
సంవాహకుడు ;- ఏమి చేయగలను? 
జూదంలో గెలుపు అనే దేవత నన్ను కరుణించడం లేదు, 
ఒక్క అవకాశం చాలు, ఒక్క గెలుపు చాలు - 
నీ బాకీ - చిటికెలో తీరుస్తాను కదా, మీ మీద ఒట్టు.
మాధురు ;- సరి, సరి - తిన్నగా నా పైననే, వద్దు, 
ఒట్టు తీసి, గట్టు మీద పెట్టు.
మార్గు ;-  మీ వాదనలు తరువాత - కాస్త, ఈ మార్గుని మాట చెవికి ఎక్కించుకోండి. 
ఇప్పుడు - మన గమ్యస్థానానికి బయలుదేరుదాం. 
మాధురు ;- ఈ మాధురుడు సిద్ధం, ఆర్యక కేంద్రం వద్దకు.
సంవాహకు ;- మా సంవాహక, తుందిలుల జంట కూడా - ఎప్పుడో మీ జతలో చేరాము, 
తుందిలు ;- కదలండి అందరూ, పదండి, ముందుకు పదండి ముందుకు. 
అందరు ;- మును ముందుకు -ముందుకు,  పదండి ముందుకు. ;
*****************************************;
[ previous episode ;-
          అధ్యాయ శాఖ ;- 12 ;- మీ గృహమున మా నగలు మీ భద్రం] ;
 ;- అధ్యాయ శాఖ ;- 13 ;- కూటమి నడక - కూడలి వైపుకి ;-
పాత్రలు ;- మార్గుడు =  చారుదత్తుని cart driver ;  
తుందిలుడు = వసంతసేన గారి శకట సారధి ;  
సంవాహకుడు = సన్యాసం in FUTURE ;  
చందనుడు - రాజభటుడు ;
మాధురుడు = జూదశాల నిర్వాహకుడు;  
REF ;- పదండి ముందుకు ;
**********************;
REF ;- 1. చారుదత్తుడనే బ్రాహ్మడు ఉజ్జయినీ నగరంలో
2. చారుదత్తుడి వద్ద ఒళ్లు పట్టేవాడిగా 
గతంలో పనిచేసిన సంవాహకుడు అనేవాడు .......  ; &
వర్గం "సంస్కృత నాటకాలు" లో వ్యాసాలు ;- 
అభిజ్ఞాన శాకుంతలము ;; [ముద్రారాక్షసమ్ ] ;;
ఉ ;- ఉత్తరరామచరిత్ర ;;; ] న ;- నాగానందము ;;                       
] మ ;- మాళవికాగ్నిమిత్రము ;; ] మృచ్ఛకటికమ్‌ ;;
] వ ; -  విక్రమోర్వశీయము ;; ] వేణీ సంహారము ;; 

31, అక్టోబర్ 2017, మంగళవారం

మీ గృహమున మా నగలు మీ భద్రం

మదనిక = కుశావతి ; [ పేరు మార్చాము ] ;-
చెట్టు వెనక నుండి చారుదత్తుని ఎదట బిడియపడుతూ నిలిచారు.
"ధూతాంబా!" భర్త పిలుపు విని ఇంట్లో నుండి బైటకు వచ్చింది భార్య.
"సందె దీపం గూట్లో పెట్టి వస్తాను." చెప్పింది ఆమె.  
; &&&&&&&&&&&&&
;
మదనిక = కుశావతి ;;
చెట్టు వెనక నుండి చారుదత్తుని ఎదట బిడియపడుతూ నిలిచారు.
"ధూతాంబా!" భర్త పిలుపు విని ఇంట్లో నుండి బైటకు వచ్చింది భార్య.
"సందె దీపాం గూట్లో పెట్టి వసాను." చెప్పింది ఆమె.
"ఇవాళ వీరిద్దరు మన అతిథులు."
"అరె, దుస్తులు మాసినవి. రండి. అలసట తీర్చుకుందురు గాని.
రదనికా! మన ఇంటికి కొత్తవారు వచ్చారు. 
వీరి స్నానపానాదులకు తగిన ఏర్పాట్లు చేద్దాం."
ఇంటి లోపలి నుండి వచ్చిన రదనిక - "అమ్మా, దయ చేయండి."
;
ధూతాంబ "అటు వెనుక వేపు స్నానశాల ఉన్నది.
వేణ్ణీళ్ళు ఉంచాము. రదనికా! వీరి అభ్యంగనం పూర్తి ఐనాక
ఈ కొత్త దుస్తులను ఇవ్వి. ఈ లోపు నా వంట పూర్తి ఔతుంది."
కుశావతి [మదనిక - ] - "చెల్లీ! రదనికా! మా అమ్మగారి పరిచర్యలు 
నేను చూస్తాను గానీ - నీవు వంట గదిలో మీ అమ్మగారికి సాయం చేయి. సరేనా!?" 
"సరే, అట్లాగే!" రదనిక వెళ్ళింది.
కుశావతి [= మదనిక] -; "వసంతసేనమ్మా! ఎదురు చూడని అదృష్ట యోగం. 
మీ నగలను 'భద్రపరచండి,'అని మీ స్వామికి ఇవ్వండి."
"కానీ వారి భార్యకు కోపం వసుందేమో!?"
"మీ మనోహరుని మళ్ళీ కలిసి, మీ మనసు విప్పి చెప్పాలంటే,
మనకు వీలౌతుందా!? మీరు ధూతమ్మ గారికి 
సోదరి గానీ, వారి చుట్టం కానీ కాదు కదా.
ఇప్పటికి నాకు తోచింది ఇదే మరి!"
"ఔనౌను, నీ యోచన కూడా బాగున్నట్లే ఉన్నది."
"మీ తర్వాత నేను చేస్తాను లెండి. మీ కురులు ముడి వేస్తాను."
"కుశావతీ, మా జాతి స్త్రీలకు ప్రేమ భావాలు ఉండదంటావా!?"
"ఏమోనమ్మా, అవన్నీ పెద్ద వాళ్ళు ఎప్పుడో చేసిన నియమాలు కదా. 
ఏం చేయగలం. కొత్త దారి వేయాలంటే మన బోటి వాళ్ళకు సాధ్యమా!?" -
రదనిక వచ్చి ;- "స్నానాదులు ఐతే వేగిరం రండి. విందులు సిద్ధం."
******************************************************;
"మా వంట మీకు రుచించిందా? లోపం ఏమీ పొరపాటున - జరుగలేదు కదా."
ధూతాంబ "అన్నట్లు మీ నామధేయములు తెలుసుకొనవచ్చునా?"
"అట్లాగ తటపటాయిస్తున్నారు. చెప్పకూడనుకుంటే చెప్పకండి."
"అబ్బే, అదేం లేదు, రదనికా! మా స్వామిని పేరు వసంతసేన, నేను కుశావతి."
"వర్ధమానుడా! వీరిద్దరినీ క్షేమంగా - వారి గృహమున చేర్చు."
ధూత ;- "ఆర్యా! చిన్న మనవి. ఈ కారుచీకటిలో - విలువైన ఆభరణములతో ....
ప్రయాణించడమంటున్నారా!?" - 
చారుదత్త ;- "ఔను, అదీ నిజమే. నా భార్య కూడా సంశయాన్ని వెలిబుచ్చుతున్నది. 
సరే, మరి ఏమి చేయాలి?"
మైత్రేయ ;- "కిం కర్తవ్యం, మిత్రమా!" 
కుశావతి ;- "మా అమ్మగారి నగలను మీ వద్ద దాచిపెట్టి, ఉంచండి దేవరా! 
వీలు చూసుకుని, మేమే వచ్చి, తీసుకుని వెళ్తాం"
శకారుని వలన మాకు ముప్పు పొంచిఉన్నది. పరిస్థితులు చక్కబడిన తర్వాత -
తీసుకుంటాము. అంతవరకూ- కరుణతో ఈ భూషణములను మీ వద్ద భద్రపరుస్తారా!? 
మైత్రేయ ;- ఔనౌను, అదీ సత్యమే. ఈ వనితల ఉవాచ కూడా నిజమే అనిపిస్తున్నది.
"మైత్రేయా! రత్నాభరణములను మూట కట్టండి. ఈ మణిభూషణముల మూటను
పగలు వర్ధమానుడు, రాత్రి నువ్వు వేయి కన్నులతో కాపాడవలెను!"
వసంతసేన ;- అమ్మయ్య, నాకు ఇంక నిశ్చింత, కుశావతీ!  
కుశావతి ;- స్వామి ఇంట గృహమున మన నగలు మీ పదిలం కదా!
ధూతాంబ ;- "రదనికా! బండి వానిని పిలువు.
రదనిక ;- "మార్గా! ఓ మార్గుడూ! వేగిరం బండి కట్టు."
"చిత్తం, అమ్మా, బయలుదేరండి. "  
;
***********************************************;
NEW పాత్రలు names ;- వసంతసేన బండి సారధి = తుందిలుడు ;
] 10. B. చారుదత్తుడి బండి సారధి :- మార్గ/ మార్గుడు ;; 

[ "మా యజమానిని, ప్రఖ్యాత నర్తకీమణి వసంతసేన."  
మదనిక బెరుకుగానే పరిచయం చేసింది.
;; 12-10-2017 ;-  అధ్యాయ శాఖ ;- 11 ;- అక్కడే దోబూచి  ;- +]
;
***********************************************;
దీపావళి శుభాకాంక్షలు ; ;
***********************************************;

అధ్యాయ శాఖ ;- 12 ;- మీ గృహమున మా నగలు మీ భద్రం ;
;

11, అక్టోబర్ 2017, బుధవారం

అక్కడే దోబూచి

వసంతసేన, మదనికలు గుబురు చెట్టు వెనక - 
నక్కి ఉన్నారు, గజగజా వణుకుతూ. 
చారుదత్తుడు అప్పటికే తోటలో పని చేస్తున్నాడు.
అతను తమ ఆవరణలోకి - వసంతసేనా ద్వయం - ప్రవేశించడం - గమనించ లేదు.
వసంతసేన చారుదత్తుడిని చూస్తూ, సంతోషంలో మునిగిపోయింది.
"అమ్మా! ఇవాళ మీకు అదృష్ట యోగం పట్టింది. 
మరీ అంత తన్మయంలో మైమరచి పోకండి.
వెదక బోయిన తీగ కాలికి తగిలింది." 
;;;;;;; ;;;;;;; ;;;;;;; ;;;;;;; ;;;;;;; ;;;;;;; ;;;;;;; ;;;;;;; ;;;;;;; 

"రోహణా!"  చారుదత్తుడి పిలుపును ఆలకించి, అతని సుపుత్రుడు బైటికి వస్తున్నాడు. 
"వస్తున్నా, నాన్నగారూ!" 
"ఉసిరిక చెట్లకు పాదులు చేయండి. వచ్చే కార్తీక మాసంలో వన భోజనాలు చేయాలి కదా." 
అందరూ హుషారుగా "హాయ్ హాయ్" అంటూ నవ్వారు.
"వర్ధమానకుడు, మైత్రేయుడు గొప్పులు తవ్వుతున్నారు కదా, 
నీళ్ళు సరిగ్గా పారేటట్లు చూడు రోహణా!" 
"సరే నాన్నగారూ"
ధూతాదేవి అక్కడికి - రదనికతో వచ్చింది.
"వంచిన నడుం ఎత్తకుండా పని చేస్తూనే ఉన్నాను, మీరు కాస్త సేదదీరండి. బడలిక తగ్గుతుంది, ముందీ పానీయాలను అందరూ త్రాగండి."
"తేనె, నిమ్మ రసం కలిపి తయారు చేసాను. తీసుకోండి,యజమానీ!... 
ఓహో,పని దొంగల్లారా!"
"ఎవర్నీ, మమ్మల్నే!" 
"ఆహా, మిమ్మల్నే. తీరుబడి లేనంత పని చేస్తున్నట్లుగా నటించడంలో బహు నిపుణులు."
"ఇక్కడికి వచ్చి ఇవ్వవచ్చునుగా."
"మరే, పాపం. నోటికి అందివ్వమని ఆజ్ఞాపించ లేదు. ఇక్కడ పెట్టేసాను, వేం చేసి గ్రోలండి."
ఆ గ్లాసులను చెట్టు వెనక దాక్కుని ఉన్న వసంతసేన, చెలికత్తె - 
జాగ్రత్తగా తీసేసుకున్నారు, గుట్టుగా త్రాగేసారు. అప్పటికే దాహంతో వాళ్ళ గొంతులు తడారి పోయి ఉన్నవి. 
నెమ్మదిగా తాగి, దాహం తీర్చుకున్నారు.
"వర్ధమానుడా! రదనిక పానీయ చషకములు ఏవీ? రదనిక ఇక్కడే పెట్టానన్నది."
"సరిగా చూడు మైత్రేయా!"
"ఈ మైత్రేయునికి చత్వారం రాలేదులే. 
నువ్వూ కూడా వచ్చి, శ్రద్ధ గా ఇకించు, పర్తిలకించు."
"ఏమైపోయాయబ్బా! ఇది మయసభ కాదు కదా. 
కనికట్టు మటుమాయం అవడానికి."
"రదనిక పరాకున ఇంట్లోకి తీసుకుపోయి ఉంటుంది, గానీ - 
ఇంక పని ఆపి, మీరూ వెళ్ళండి. కాస్త 
విశ్రాంతి తీసుకుని, భోజనాలు చేద్దాం."
అందరూ గృహంలోనికి వెళ్ళారు. 
గృహస్తు చారుదత్తుడు - కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్నాడు.   
లోనికి వెళ్ళబోతూన్న చారుదత్తుడు - 
"ఏదో అలికిడి." అనుకుంటూ పరిశీలనగా చూస్తుండగా - 
అతనికి కనిపించారు, అక్కడే ఉన్న వనితలు.
"ఎవరు మీరు?" ఆశ్చర్యంతో అడిగాడు. 

"మా యజమానిని, ప్రఖ్యాత నర్తకీమణి వసంతసేన."  
మదనిక బెరుకుగానే పరిచయం చేసింది.
;;
12-10-2017 ;-  అధ్యాయ శాఖ ;- 11 ;- అక్కడే దోబూచి  ;- 

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...