30, జూన్ 2009, మంగళవారం

బొమ్మ 'లో'లోపలి బొమ్మ !

కాటుకలు 2 రకములుగా ,ఎలా తయారు చేయాలో,చదివారు కదా!
సరే!ఒక కవితను చదివేసి ఆనక

ఇక్కడ ప్రచురించిన ఒక బొమ్మను చూడండి.
అలాగ,ఊరికే చూసి,ఊరుకుంటే ఎలాగ?!
అలాగే దీర్ఘంగా చూస్తూనే ,ఉండండి!
హమ్మయ్య!ఇందులో దాగున్న
"తిరకాసు"ను కనుక్కున్నారన్నమాట!
అదేనండీ!ఈ "పిట్ట గోడ"కథ,కమామిషున్నూ!
***********************************************************************************

లిపి,,,వారధి ;
========
అక్షరాలుగా రాలు తున్నాయి
స్వప్నాలు !!!!!
స్వప్నాలుగా వర్షిస్తున్నాయి
మరల, మరల ఈ రాలు గాయి అక్షరాలు.
అందుకే నేను
ఈ నాటి యువతిని
అక్షరమై మెరుస్తాను.
అక్షరాలు
ఆశలను మోస్తాయి !
ఆశయాలను ధరిస్తాయి !
ఆలోచనలను సంభావిస్తాయి !
ఆవేదనల శకలాలను
శకటములై మోస్తాయి.
అందుకే ,
అక్షరాలలో
నేను భావనగా హసిస్తాను!
అక్షరాలు క్రాంతికి దోసిలి ఒగ్గుతాయి.
విప్లవాలకు తల లొగ్గుతాయి!
చైతన్యానికి "మొగ్గు" వేస్తాయి.
వినూత్న పరిణామానికి
" మొగ్గ " తొడుగుతాయి.
అందుకే నేను
అక్షరానికి గొడుగు పడతాను.
అక్షరానికి హారతి పడతాను.
అనంతానంత సుప్త ,సుషుప్త
జాగృత్ హృదంతరాళ
అంతర్మధనాల ఘన వార్ధికి
'రూప కల్పన 'నొసగే
"విరించి" అక్షరమే గదూ!
అనంత కాల దిగంతాప్త చరిత్రాలయాన
ప్రతిష్ఠించ బడే దేవత ఈ అక్షరము!
చరిత్ర పెదవుల వంపులను
చిరు నవ్వు గానూ తీర్చి దిద్ద గలదు !
వికటాట్ట హాసం గానూ మలచ గలదు.
అక్షరము ఒక "ఉలి"!
అక్షరమే
స్వయంభువు ఐన 'శిల్పి" కూడా!
అందుకే ,నేనంటాను
అక్షరమే మదీయ కల్పనా రధ సారధి!
అక్షరమే విభిన్న విశిష్ట వారధి!
*****************************************

29, జూన్ 2009, సోమవారం

చందన కాటుక తయారీ




Recipes
చందన కాటుక తయారీ

By kadambari piduri,

కావలసిన వస్తువులు;

==============

కర్పూర కాటుక తయారు చేసేటందుకు కావలసినవే ,

చందన - కాటుక - తయారీకి అవసరము.

1)వెడల్పాటి మట్టి ప్రమిదలు

(2)ప్రత్తి వత్తి , పురి పెట్టకుండా, మందంగా ,అర చేతిలో పరచి,

మధ్యలో కరక్కాయ పొడిని చల్లి ఉంచి, వత్తి ఆకారంలో మెలిపి,మలచాలి.

ఈ వత్తిని ఆముదములో నానబెట్టాలి.

(3)వెడల్పైన ఇత్తడి పళ్ళెము

(పెళ్ళిలో వరుని కాళ్ళు కడిగే పళ్ళెము సరి పోతుంది.)

(4)సాన రాయి మీద గంధపు చెక్కను, అరగ దీసి తీసిన గంధము

(5)ఇత్తడి పళ్ళెము అడుగున,

ఈ గంధమును మూడు పొరలుగా మందముగా పూత పూయాలి.

(6) ఆవు నెయ్యి;

)తాటాకు రేకు ;
తయారు చేసే పద్ధతి ;

=============
మూడు రాళ్ళు పేర్చి వాని పైన ,ఇత్తడి పళ్ళాన్ని పెట్టాలి.

దానిలో నీళ్ళు పోయాలి. కింద సెగ తగిలేటట్టుగా

ప్రమిదలో నిండా ఆముదం పోసి, నానిన వత్తిని వేసి వెలిగించాలి.

వత్తి వెలుగుకు జానెడు ఎత్తున ఇత్తడి పళ్ళాన్ని అమర్చాలి.

గాలి విసురు లేని చోట, గదిలో ఒక మూలగా ఇలా అమర్చాలి.

(గాలి తగిలితే ,ప్రమిద వెలుగు కదులుతుంది. సెగ సరిగా లేనిచో కాటుక తయారవదు)

ప్రమిదలోని ఆముదము ఐపోయేదాకా, కదల్చ కుండా అలాగే ఉంచాలి.

అంటే మర్నాటికి పళ్ళెము అడుగున ఉన్న గంధము మసి ఏర్పడుతుంది.
అప్పుడు ఈ ఇత్తడి పళ్ళాన్ని తిరగ వేసి, అక్కడి గంధపు మసిని నూరాలి.

రాగి చెంబు(తో శ్రేష్ఠము.)తో గానీ, ఇత్తడి చెంబుతో గానీ ,నూరాలి .

ఆవు నెయ్యిని వేస్తూ, నెమ్మదిగా నూరాలి.

బాగా మెత్తగా నూరిన తర్వాత, మంచి నీటిని 'ధార' వలె, నెమ్మదిగా,

ధారాళంగా(ఇంచు మించి రెండు కడవల నీరు)పోయాలి.
అలాగ తయారైన కాటుకను

'రాగి కాటుక కాయ' లోనికి తీసుకుని, భద్ర పరచుకోవాలి.
'కర్పూర - కాటుక 'కొంచెమే తయారు అవుతుంది

కానీ ఈ చందన కాటుక ఎక్కువ తయారౌతుంది.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

27, జూన్ 2009, శనివారం

కాటుక తయారు చేయుట


కాటుక చేసే విధానం
By kadambari piduri,

కావలసిన వస్తువులు
==============
పత్తి వత్తి(పురి పెట్టకుండా)వట్టి దూదిని ; లావుగా అరచేతిలో పరచుకునాలి.
దీనిలో ,కరక్కాయ పొడిని చల్లి,ముడిచి ,అరచేతుల్తో మళ్ళీ మలుస్తూ
" ఉండ వత్తి"లా లావుగా తయారించాలి.
కరక్కాయ పొడి(పైన చెప్పినదే!)
ముద్ద
కర్పూరము (లేదా/మంచి గంధమును,
గంధపు చెక్కను సాన రాయి మీద అరగ దీస్తూ,తయారించుకోవాలి.)
వెడల్పు ఇత్తడి పళ్ళెము; వంటాముదము;ప్రమిదలు;
ఆవు; నెయ్యి/లేక - వెన్న;
ధారాళంగా;
నీళ్ళూ(భాగ్య నగరము; మున్నగు చోట్ల నివసించే వారికి
ఈ అంశాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది కదా!)
1)ముద్ద కర్పూరముతో కాటుక తయారీని ముందుగా తెలుసు కుందాము.
ముందస్తుగా వత్తిని , మంచి ఆముదములో
కాస్సేపు నాన బెట్టి ఉంచుకోవాలి.
2)ఒక గుంట గరిటెను కాస్త 'వాల్చినట్లుగా,
ప్రమిదకు బాగా దగ్గరగా బోర్లించి పట్టుకోవాలి.
3)కర్పూరమును వెలిగించాలి.
5) అప్పుడు గుంట గరిటలోనికి "కప్పురపు మసి"ఏర్పడుతుంది.
"తాటాకు రేకులతో " ఆ కాటుక మసిని ,గీకి తీయాలి.
6)ఆ మసిని రాగి పళ్ళెమునూ (ఐతే శ్రేస్ఠము . కానిచో ఇత్తడి/ కంచు పళ్ళెములను బోర్లించి పెట్టి,నూరాలి.)
ఆవు నేతితో గానీ, వెన్నతో కానీ ,
ఆముదమును gaanii
(బొట్లు; బొట్లుగా )వేసి,నూరుతూండాలి.
8)నూరి,ముద్దగా ఏర్పడేటప్పుడు,
ధారగా నీళ్ళు పోస్తూండాలి.
ఇలాగ బిందేడు నీళ్ళు పోయాలి.
9)రెడీ ఐన 'కాటుక'ను, రాగి భరిణలలోనికి తీసి జాగ్రత్త చేసు కోవాలి.

26, జూన్ 2009, శుక్రవారం

నాయుడమ్మ,గంగాధర గౌరి

Pramukhula Haasyam
అమ్మ, గౌరి
By
kadambari piduri,

నాయుడమ్మ ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు.

ఒక సభకు మిత్రులు కూడా వచ్చి ఉన్నారు.

వారిలో ఒకరు గంగాధర గౌరి.సభలో నాయుడమ్మను ప్రసంగించమని అడిగారు.

కొంతసేప మాట్లాడారు నాయుడమ్మ.

ముక్తాయింపుగా ఇలాగ చెప్పి సభాసదులలో నవ్వులను విరబూయించారు.

"ఈ సభలో ఆడ పేర్లు గల ఇద్దరు మగవాళ్ళము ఉన్నాము.

ఆడ పిల్లలు లేని కారణంచేత,

మా అమ్మమ్మ నా నామధేయము కొసన 'అమ్మ'ను తగిలించింది.

మిత్రులు గంగాధర గౌరి లోని గౌరి కూడా స్త్రీ నామమే!"

నాయుడమ్మ గారు ఆడది కాదు,మగ వాడేనని

మీకందరికీ ఇప్పుడు అర్ధమైంది కదా !

యలవర్తి నాయుడమ్మ గుంటూరు జిల్లాలోని ఎల వర్రులో

1922,సెప్టెంబరు 10వ తేదీన జన్మించారు.

చెన్నైలో,లెదర్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుఅభివృద్ధికి ఈయనే మూల స్తంభము.

భారత దేశమునకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ప్రముఖ సైంటిస్టు.

24, జూన్ 2009, బుధవారం

తప్పక చూడండి!


నా "కోణమానిని.బ్లాగు"లో మూడు వీడియో క్లిప్పింగులను చేర్చాను,చూసారా?వీటిలోని విశేషాలు కొన్ని!;;; అలాగే,వ్రేళ్ళతో,జంతువుల బొమ్మల సృజన సేకరణలను,

http://akhilavanitha.blogspot.com

లో ఉంచాను.

1)మన జాతి పిత మహాత్మ గాంధీజీ బొమ్మను చేతులతో ఆర్టిస్తు వేస్తున్నాడండీ!

ఆహా!అక్షరాలా అఱ చేతితోనూ,వ్రేలి ముద్రలతోనూ

అతను "బాపూజీబొమ్మను"వేస్తున్నాడండీ!

అతను ఎలా వేస్తున్నాడో కన్నులారా తిలకిస్తే,

మీరు కూడా "తంబు ఇంప్రెషనిస్టులు " అయ్యే ఛాన్సు ఉన్నది కదూ!

కాబట్టి,ఒకసారి ఈ "గాంధీ పెయింటు"ను వీక్షించండీ!

2)వ్రేళ్ళకు తాడు/రిబ్బను/దారమును తగిలించుకుని,"చిన్న మ్యాజిక్కును" చూపిస్తున్నాడు అబ్బాయి.ఈ వీడియోను,చూసి,ఇంచక్కా మీరూ కొన్ని చిట్కాలను నేర్చుకుని,మీ స్నేహితుల దగ్గర ప్రయోగించి,అందరినీ వినోదమును చేకూరుస్తారు కదూ!

3)ఈ వీడియో,డాన్సులలో,నాట్యాలలో, వాడుకొనేవే! క్యాండిలును వెలిగించీ/టార్చ్ లైటును పెట్టుకొనీ,

గోడ మీద నీడలతో బొమ్మలను సృష్టించడము ఎలాగో తెలుసా?

ఈ వీడియో క్లిప్పింగులో అదే కదా సాక్షాత్కరిస్తూన్నది!

పెద్దలతో పాటుగా,పిల్లలు కూడా చూసి,

ఈ "త్రి వీడియో మ్యాజిక్కులతో,"మెదడులకు మేతను పెట్టే,చమత్కారాలు" ఇవి!

అందుకే చెబుతున్నాను,తప్పక చూడండి.

23, జూన్ 2009, మంగళవారం

డప్పుల సుబ్బారావు





Pramukhula Haasyam
డప్పుల సుబ్బారావు
By
kadambari piduri,

దుర్గాబాయి దేశ్ ముఖ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న రోజులలో,

అనేక చిరస్మరణీయ సంఘటనలను,

"మన ఆంధ్ర దేశ చరిత్ర"లో పదిల పరుచుకొన దగినవి జరిగినాయి.

పైడా వెంకటా చలపతి గారు, మహర్షి సాంబ మూర్తి మున్నగు

వారు కాకినాడ టౌను హాలులో కాంగ్రెస్ సభను నిర్వ హించారు.

అప్పుడు జరిగిన లాఠీ ఛార్జిలో మహర్షి సాంబమూర్తి గాయాల పాలయ్యారు.హాలులో 4 అంగుళాల మందముతో రక్తము గడ్డ కట్టింది. వారము రోజుల దాకా ప్రజలు వచ్చి చూస్తూండేవారు.

బాయపు నీడి సుబ్బారావు సబ్ ఇనస్పెక్టరు.

సభలు, సమావేశాలను చెదరగొట్టడానికి

ఆయన అనుసరించిన ఒక పద్ధతి వార్తలలోనికి ఎక్కింది.

ప్రజా సమూహములను చెదరగొట్టడనికై, ఆయన చాలా డప్పులను తెప్పించి, వాయింపించేవాడు.

అందువలన ఆయనను అందరూ "డప్పుల సుబ్బారావు" అనే వారు.

ఇలాగ, ఈ సరికొత్త నామధేయం (నిక్ నేమ్) కలిగిన వ్యక్తి,

బహుశా "డప్పుల సుబ్బారావు మాత్రమే నేమో!"

22, జూన్ 2009, సోమవారం

తెల్ల వాళ్ల తిక్కకుదిరిందా,మరి?!

Chitra Varta
కుంచె కదిలింపే కాదు!

By kadambari piduri

బాపు
స్నేహితులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు.

ఆ మిత్రుల్లో ఒకాయన అన్నాడు
"మన డాక్టరు వివేకానంద మూర్తి ఇంగ్లండుకు వెళ్ళాడట!
లండనులో ప్రాక్టీసు పెట్టాడట కదా!?"

"ఏం? తెల్ల దొరలు మన దేశంలో తిష్ఠ వేసి,
రెండొందల ఏళ్ళు పాటు మనల్ని రాచిరంపాన పెట్ట లేదా?" అన్నాడు
సినీ దర్శక, చిత్రకారుడు బాపు.
"కుంచె కదిలింపే కాదు,
మాట విదిలింపు కూడా తెలుసును బాపుకి"
అని అందరూ నవ్వుకున్నారు.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...