27, సెప్టెంబర్ 2012, గురువారం

హిందూదేశపు లక్క - బ్రిటీష్ శాస్త్రవేత్త విలియం లోక్స్ బర్గ్

మన మహా ఇతిహాసమైన "మహా భారతము"లో "లాక్షా గృహము" ఘట్టము ఉన్నది. 
పంచపాండవులు ఏకఛత్రపురమునకు చేరుటకు మూలమైనది ఈ అధ్యాయం. 
హిడింబా భీమసేనుల పెళ్ళి, నగరములో 
మత్స్యయంత్రభేదనము చేసిన అర్జున-ద్రౌపదీ పరిణయములు జరిగినవి. 
ఆ వివాహముల వలన పాండవులకు బంధుబలగము సమకూరి, 
వారికి అండదండలు దొరికి, భవిష్యత్తులో దాయాదులతో 
ముఖాముఖీ పోరాడగలిగిన “సమ ఉజ్జీలు” ఐనారు. 
పాండవవనవాసము-నకు దారి తీసిన ఆ పరిస్థితులలో పాండవులు ఉండాల్సిన స్థితి, 
వారి అవస్థలు, కథాగమనానికి చాలా స్పీడును కలిగించిన 
ఆ వైనములు మీకు గుర్తుకువచ్చినవా! 
ఇంతాచేసి ఈ వ్యాసానికి మూలమైనది లక్క (లాక్ష).

************** 

 
Dr. William Roxburgh -"Father of Indian Botany"

ఉపఖండంగా ప్రసద్ధి చెందిన ఇండియాలో ఈ నేలపై పెరుగుతూన్నమూలికలు, మొక్కలు, 
లక్క(లాక్షారసము), లోధ్ర, ఇలాటి వాటన్నిటి గురించీ 
19వశతాబ్దములలో-పాశ్చాత్యప్రపంచానికి తెలిపిన వ్యక్తి ఒక ఆంగ్ల భాషీయుడు. 
అతని పేరు విల్లియం రోక్స్ బర్గ్. 1751జూన్ 29వతేదీన జన్మించిన 
స్కాటిష్ సర్జన్, బోటనిస్టు. విల్లియం రోక్స్ బర్గ్ 
17 సంవత్సరముల వయసు వచ్చేసరికి ప్రపంచయాత్ర చేస్తూ, జీవనోపాధిని పొందేవాడు. 
హిందూదేశములో లక్క వినియోగము ఆతని దృష్టిని ఆకర్షించింది. 
ఇండియా బాటనీ విద్యా విభాగాలకూ, లాబరేటరీలలో 
వృక్ష సంబంధ పరిశోధనలకు మంచి పునాదిని వేసిన వ్యక్తి!

అప్పటికి హిందూదేశములో -  ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనము  మొదలైనది. 
కుంఫిణీ (company) పాలనలోని భారతదేశానికి “ఇండియా” అనే పేరు వచ్చినది. 
ఈస్ట్ ఇండియా కంపెనీలో పాలనలోని ఇండియాకు చేరి, మద్రాసులోకి  అడుగుపెట్టాడు. 
మద్రాసులోకి అడుగుపెట్టిన స్వతహాగా అతను ప్రకృతి పట్ల ఆసక్తి కలిగిన మనిషి.
విల్లియం రోక్స్ బర్గ్  India కు చేరాడు.  అప్పటినుండీ ప్రకృతి ప్రేమికునిగా నిరంతర కృషినిసాగించాడు. 
ఉపఖండము ఇండియాలో పెరుగుతూన్నమొక్కలు, చెట్లు గురించి గణిత సేకరణలను లిపిబద్ధము చేసాడు. 

సంవత్సరాల పర్యంతమూ అంటే 1820 దాకా 
ఇలాటి వివరములను సైంటిఫిక్ గా Ricord చేసిన మొదటి వ్యక్తి ఈతడే! 
Ramsden barometers and Nairne thermometers మున్నగు పరికరములతో అవిరళకృషి చేసాడు.

లోధ్ర - గోరింట, ఇత్యాది వేలాది మొక్కలు, తరు సంపదలు 
వాని  జాతులు, ప్రజాతులను గూర్చి సవివరముగా రాసాడు, 
తరువాతి తరాల వారికి పరిశోధనలకు అమూల్య సంపదగా  అందించాడు. 
విల్లియం రోక్స్ బర్గ్ భారతీయ వృక్షశాస్త్ర జనకుడు (Father of Indian Botany) అనే బిరుదును పొందాడు. 
'లక్క’ అనే అమూల్య పదార్ధము గురించి 
పాశ్చాత్యలోకానికి విలువైన సమాచారాన్ని అందించడం చేత 
"Asiatic Society"  లో మెంబర్ ఐనాడు విలియం. 

*******
లక్కను – ఉత్తరములు, కొరియర్ పార్శిలు వస్తువులు, 
కోర్టు వ్యవహారాదులలో- “సీలు చేయుటకు” వాడుతూంటారు 
కాబట్టి అందరికీ తెలిసినదే! 
మైనములాగా కాస్త సెగ తగిలితే-త్వరగా కరిగిపోయే  స్వభావం దీనిది. 
ఇది మిలమిలా మెరుస్తూ మైనము, వార్నీషులను పోలివుంటుంది. 
అందుచేత ఇది చెట్ల బెరడు నుండి తయారయ్యే జిగురు లాంటి పదార్ధమని చాలామంది పొరబడుతారు. 
ఐతే “లక్క పురుగు” వలన ఉత్పత్తి ఔతూన్నది అంటే ఆశ్చర్యం కలగక తప్పదు.

భారతదేశములో కాళ్ళకు పారాణి మొదలైన ఆచార సంప్రదాయాలలలో లక్క use ఎక్కువగా తటస్థపడ్తూంటుంది. 
ఇంతటి ప్రశస్తమైన లక్కను గూర్చి 1800 ల తర్వాత తెల్లవారికి యూరోపు ఖండముల ప్రజలకు తెలిసింది. 
ఇందుకు కారణము విల్లియం రోక్స్ బర్గ్. 
"లక్క" ఒక పురుగు నుండి చేయబడ్తుంది. రికార్డ్ లలో రాసి, 
ప్రపంచానికి భారతీయులు కుటీరపరిశ్రమలలో విరివిగా వాడే విశేషాలను చెప్పాడు. 
వీటిని కొత్త అంశాలుగా యూరోపు దేశీయులు ఆశ్చర్యంతో గమనించారు.
నేడు మన దేశములో లక్క ఉత్పత్తిలో జార్ఖండ్ రాష్ట్రము ప్రధమ స్థానములో ఉన్నది. 
చత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర లు తదుపరి క్రమముల్లో ఉన్నవి.
పట్టు పురుగుల నుండి పట్టు దారమును తీస్తారు కదా! పట్టుపురుగుల పరిశ్రమవలెనే - లక్కపురుగులపెంపకము కూడా కుటీరపరిశ్రమ ఐ, ప్రజలకు బ్రతుకుతెరువు ఏర్పరిచినది.

విల్లియం రోక్స్ బర్గ్ "Father of Indian Botany" అనే పురస్కారముతో 
సదా జ్ఞాపకములలో కొలువై ఉంటాడు. 
Tags:- లక్క, (లాక్షారసము), లోధ్ర; ఫాదర్ ఆఫ్ ఇండియన్ బాటనీ 
   
హిందూదేశపు లక్క - బ్రిటీష్ శాస్త్రవేత్త విలియం లోక్స్ బర్గ్ 
newAwakAya (Web magazine)  (see this essy)    
Member Categories - తెలుసా!   
Written by kadambari piduri     
Sunday, 16 September 2012 13:06  
;

18, సెప్టెంబర్ 2012, మంగళవారం

పండుగ సంరంభము


పండుగ సంరంభము నేడే!
మహేశపుత్రుడు గౌరీతనయుడు
విఘ్నవినాయక చవితి పర్వము ఈనాడే!||
;
వన్నెల సీతాకోక చిలకలకు
ఆహ్వానములు-అందినవా!
పాలవెల్లులను కట్టగ రండి! ||
;
జామ చెట్టుల గుబురుల నక్కిన
రామ చిలుకలూ! వేగమె రండి!
ఫలములు,పత్రీ తీసుకు రండి! !
;
భక్తి సీమలో తొలి తొలి పూజలు
అందుకునే మన గజాననుడు
విఘ్నేశునికి దండిగ ఇవిగో! అర్చనలు
చెవులను రెండూ పట్టుకునీ
గుప్పెడు గుంజీల్ చాలునట!

*******************************

అందరికీ వినాయక చతుర్ధి శుభాకాంక్షలు!


;


17, సెప్టెంబర్ 2012, సోమవారం

అక్షరము పవిత్రమైన కోవెల


అక్షరమ్ము పవిత్ర దేవాలయంబు
లక్షలాదిగ భావమ్ము లలరు నందు
అక్షరమ్మెల్ల విద్యల కాశ్ర యంబు

దానికిని సాటి కానమీధరణి యందు.
;
ఊహలును జీవ కోటికి ఉండునెన్నొ
మూగ జీవులే అన్నియు పుడమి నందు
ధ్వనికి రూపమ్ము నొసగును మనిషి యొకడె
వెలువరించినప్పుడె వాని విలువ గలదు.
;
అక్షర మొక దేవాలయమ్మరయగాను
మనసు లందలి
కలలు,కల్పనల కెలమి
నదియె స్వాగత ద్వారము
ఆశ లెల్ల వెలుగు చూడగ,
సర్వ విద్యలకు గూడ.
;
జీవి మనసున కదలాడు భావములకు
స్థిరముగా నుండు పీట మేర్పరచు కొరకు
సాధనలు చేసి కను గొన్న సత్ఫలమ్ము
అదియె, రూపొంది, ఉదయించె నక్షరముగ.
;
భాష, "లిపి" యను అరదము పైన నెక్కి
ముదము లొప్పార సంచారములును చేసె
వసుధ యందలి కోట్లాది వాక్కులకును
"ధ్వని", "లిపు"లె మూల కారణాధారమయ్యె.
;
ఆశలును, అభిలాషలు, ఆశయములు
కల్పితమ్మక్షరము నందె
కావ్యములకు, గాధలకును,చరితలకు,
కథల వాస్త వముల చిత్రించు వాక్య దేవాలయమ్ము.
;
ఘంటమ్ము, పెన్ను, పెన్సిళులుగా-
బలపమ్ము, సుద్ద ముక్క, కుంచె- 
చాక్ పీసుగాను, 
వచ్చితివి మౌనముగ, మాదు భాగ్య మనగ .
;
ఓసి కలమ!నీకు కలిగిన మహిమ కలిమిని
ఎన్ని వర్ణనల ఋజువు సేయగలను?
నీవు లేకున్న తెల తెల్ల బోవు చుండు
తెల్ల తెల్లని పేపరు, ఖచ్చితముగ;
;
సవ్వడికి మారు బింబమౌ "శక్తి" నీవు
అయ్యారె! అంతులేని పరమాద్భుతమ్ముల నెరపగలవు
ధరణి నీ సాటి ఎవరు, అరసి చూడ;
అందు కొనుమమ్మ! జోతల అక్షరమ్మ!
;

శ్రీ అక్షరము (Andhra Folks)                               Link ( 1 )
Posted On 9/1/2008 @6:32:53 AM 
;

                   

శ్రీ అక్షరము:-


అక్షరమ్ము పవిత్ర దేవాలయంబు 
లక్షలాదిగ భావమ్ము లలరు నందు 
అక్షరమ్మెల్ల విద్యల కాశ్ర యంబు 
దానికిని సాటి కానమీ ధరణి యందు

;
అఖిలవనిత:శ్రీ అక్షరము;Monday, April 20 2009
 तरति (tarati)
అచ్చులు: 16


 అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ  

   ఏ ఎ ఐ ఒ ఓ ఔ అం అః


హల్లులు: 38 

క ఖ్ గ ఘ ఙ్  
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ

26, ఆగస్టు 2012, ఆదివారం

Neil Alden Armstrong-పి.బి. శ్రీనివాస్ లేఖలు

పి.బి. శ్రీనివాస్ ఒక ఇంగ్లీషు సాంగును కూడా పాడారు.
ఎస్. జానకి తో గాత్ర యుగళమును చేసారు.
"మానవుడు చంద్రగోళముపైన అడుగు పెట్టిన అద్భుత క్షణములు అవి.
ఆ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని-
ఎస్. జానకి , పి.బి. శ్రీనివాస్ లు స్వర్ణించిన ఆ గీతమే

A song in English, “Man to moon;
--------------------------Moon to God...............”

ఇంతకీ ఈ ఆంగ్ల గీత రచయిత ఎవరో తెలుసా?
మరెవరో కాదు - మన పి.బి. శ్రీనివాస్.
అమెరికా ప్రెసిడెంటు నిక్సన్, చంద్రునిపై కాలూనిననీల్ ఆర్మ్ స్ట్రాంగ్ లు
( President Nixon and Louis Armstrong )
పి.బి.ఎస్. శ్రీనివాస్ P.B.S. కి ప్రశంసిస్తూ లేఖలను రాసారు. 
సకల జగత్తునూ తన చల్లని వెన్నెలతో మురిపించే జాబిల్లి,
ఆ గ్రహగోళముపైన మనిషి పాదము మోపి 2 గంటలు నడిచిన
అద్భుత సంఘటనను యావత్తు ప్రపంచ ప్రజలను మైమరపింపజేసినది.
అక్కడ సంచరించిన మొట్టమొదటి వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
(Neil Alden Armstrong-ugust 5, 1930 – August 25, 2012).
ఈ మహత్తర ఘటనను గూర్చి ఇండియాలోని
8 భాషలలో పాట(ల)ను-P.B.S.-లిఖించి, పాడి- రికార్డు చేసారు.

**********************************

“Man to moon; Moon to God,”
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్(:Neil Alden Armstrong)





21, ఆగస్టు 2012, మంగళవారం

భీమ్ పూల్, విచిత్ర బ్రిడ్జి


ఉత్తరాఖండ్ లోని "ఘర్హ్ వాల్"/ గర్హ్వాల్ (= దేవ  భూమి)
హరితదనముతో  ప్రశాంతతను మనసులకు చేకూరుస్తుంది . 
పంచపాండవులు నడయాడిన ప్రదేశములు- 
హిమాలయ శిఖర వలయ సీమలు.  
సరస్వతీనది - అంతర్వాహిని ఐన స్రోతస్విని (SarasvatI river flows incognito).  
ఈ వేదభూమిలో పూజ్యనీయురాలు ఐన పవిత్ర నది  
ఈ సరస్వతీనదీ సరిత్తు.  - 
అలకనందా ఝరీ విలీనమౌతూ ప్రవహిస్తూన్న 
శోభాయమాన దృశ్యాలు  నయనానందము కలిగిస్తూంటాయి ఇక్కడ, 
;
సహజ వంతెన ; bheem pul
సరస్వతీనది పైన ఒక బ్రిడ్జి  ఉన్నది. 
ఈ bridge పేరు "భీమ్ పూల్"- పూల్= వంతెన - అని అర్ధము.  
ఇది సహజ వారధి. భీమ్ పూల్, ప్రాకృతిక సంపద; అమోఘ ప్రకృతి వరము, 
రెండు శిఖరములను కలుపుతూ ఏర్పడిన         శిలా వారధి బాట ఇది. 
ప్రకృతిసిద్ధమైన ఈ వంతెన- 
భగవానుని సృష్టిలోని విచిత్రములకు నిదర్శనముగా నిలిచి, అబ్బురపరుస్తూన్నది. 
మహా ప్రస్థానమునకై నిర్దేశించుకున్న "పంచ పాండవులు" - 
భార్య ద్రౌపదితో బాటు ముందుకు కదిలారు. 
పాండవులు ఈ నది చెంతకు వచ్చారు. 
సరస్వతీ ప్రవాహమును దాటి ఆవల తీరమునకు చేరడము ప్రస్తుత కర్తవ్యము. 
"కిమ్ కర్తవ్యమ్?". 
బాహుబలసంపన్నుడు, వెయ్యి ఏనుగుల బలము కలవాడు ఐన భీముడు 
ఒక పెద్ద శిలను తెచ్చి, ఆ ఉత్తుంగ ఝరికి పైన 
అటూ, ఇటూ ఉన్న గిరులను కలుపుతూ ఉండేటట్లుగా-వేసి, 
తాము అందరూ నడిచి వెళ్ళేందుకు వీలుగా చేసాడు. 
(Bheem threw a big massif rock to make a path joining two mountains)  
జయం సంహిత- (వేద వ్యాస విరచిత- మహా భారతము) - 
ఇతిహాసముతో ముడిపడి ఉన్న కల్పనా గాధలు 
ఈ సీమాసంబంధములై ప్రచారములో బహుళ ఉన్నవి. 
ఈ  హృద్య వర్ణన స్థానికుల కథనము. 
ఉరకలు వేస్తూన్న సరస్వతీ వాహినీ తరంగాలు చూపరులను దృష్టి త్రిప్పుకోనీయవు.

వ్యాస గుహ, గణేశ్ గుహ- లు దగ్గరలో ఉన్న ప్రత్యేక దర్శనీయ పుణ్య స్థలములు. 
వసుంధర జలపాతము, బండ రాళ్ళ మధ్య-ఇరుకు  
ఇరుకు సందులగుండా ప్రవహిస్తూ  ఉరికే నీళ్ళు ప్రత్యేక ఆకర్షణ
వసుంధరా జలపాత ధారలు - సుందర దృశ్యాలు. 
ఈ సీనరీలు బదరీనాధ్ కి 5 కిలోమీటర్లు దవ్వున ఉన్నవి.-  

సహజ Bridge వంతెన ; (Garhwal hills)
అంతర్వాహిని సరస్వతీనది పైన సహజ వంతెన

17, ఆగస్టు 2012, శుక్రవారం

శాండిల్యన్ చెప్పిన సంఘటన (నాగయ్య)


చిత్తూరు నాగయ్య గా వెండితెర జీవులకు సుపరిచితుడైన నాగయ్య
పూర్తి పేరు ఉప్పలపాటి  నాగయ్య (28 మార్చి 1904 - 30 డిసెంబరు 1973).  
నాగయ్య - జీవితము- సినీ రంగములో ఉన్న వారు 
నిరంతరము మననం చేసుకునేటన్ని మలుపులు తిరిగినది.  
1945లో "మీరా" హిందీ సినిమాలో (కథా నాయిక గా ఎం.ఎస్.సుబ్బులక్ష్మి) హీరోగా వేశారు. 
"మీరా"- నిర్మాణములో పాశ్చాత్యులు కూడా పాలుపంచుకున్నారు- 
అదీ విశేషం!!!!!  
;
నాగయ్య వేమన



 

 










C.హొన్నప్ప, భాగవతార్, P.U. చిన్నప్ప,
G.N. బాలసుబ్రహ్మణ్యమ్ మున్నగువారి పేర్లు 
ప్రస్తావనకు వచ్చినవి. 
కానీ ....... ఎల్లిస్ ఆర్. డంగన్ మాత్రము నాగయ్యను మాత్రమే ఎంచుకున్నారు.
(Ellis R. Dungan)1945 లో నిర్మిస్తూన్న "Meera" (1945) కై- 
రాజపుత్ర రాజు కుంభ రాణా గా- నాగయ్య  పేరును ప్రతిపాదించారు. 
నాగయ్య ఆజానుబాహువు, గాంభీర్యము, ఠీవి ఐన నడక- 
ఆయనకు ఇలాటి పాత్రలు నప్పేటట్లు చేసినవి.
ఇలాగ తెలుగు, తమిళ, హిందీ ఇత్యాది భారతీయభాషలలో నటించిన నాగయ్య - 
"భక్త రామదాసు"ను నిర్మించారు. 
ఆ సినిమా హిట్ ఐనప్పటికీ వివిధ కారణాలవలన 
ఆయన బీదరికములో, last stage ను గడపవలసి వచ్చింది. 
శాండిల్యన్ చెప్పిన సంఘటన:- 
నాగయ్య బ్రతుకు చిత్రము క్రమేపీ వెలిసిపోసాగినది. 
వాహినీ పిక్చర్సు వైభవదశలో ఉన్న రోజులు అవి. 
శాండిల్యన్ ఆ స్టూడియో లో తమిళరచయిత. 
అతను అక్కడ నాగయ్యను చూసాడు. 
అప్పుడు జరిగినది ఫ్రెండ్సుకు చెప్పాడు :-  

నాగయ్య ఆయన ఒక సినిమాలో "కౌ బాయ్" గా వేసారు.
అంతకుమునుపు అత్యున్నత స్థాయిలో ఉన్న మహామనీషి, 
దాతృత్వములోనూ, ఉదాత్తవేషాలతో 
ప్రజలలో నీతినియమాలను పాదుకొల్పిన వాడు నాగయ్య.
త్యాగరాజు, యోగి వేమన- వంటి మహాపురుషుల పాత్రలను తలచుకోగానే- 
అందరి మనోఫలకాలపైన నాగయ్యయే- సాక్షాత్తు  అలాగ ప్రత్యక్షమయ్యేవాడు.
ఇప్పుడు శాండిల్యన్ కళ్ళకు కనుపిస్తూన్న దృశ్యము 
ఆతని మనసును కదిల్చివేస్తూన్నది. 
నాగయ్య (Nagaih play a cowboy for a third-rate `curry western; 
old pal, Nagaiah, dressed in a bizarre, outlandish, 
cowboy costume holding a rifle made of bamboo)                  
నాగయ్య  చెమటలు తుడుచుకుంటూ-   -
వెదురుతో చేసిన "కట్టె తుపాకి"ని పట్టుకుని, 
ఊపిరాడని తోలు కోటుతో వింత వేషధారణతో 
ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు నాగయ్య. 
"షూటింగ్ లో తన సీనును షూట్ చేసే టైముకు - 
పిలుపు కోసమై వేచిచూస్తూన్నారు.
అలాటి పరిస్థితిలో ఉన్న నాగయ్యను చూడగానే - 
శాండిల్యన్ కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. నాగయ్య 
"నాగయ్యగారూ!మీరేనా?" అనే ప్రశ్న గుండె లోతుల్లోనుంచీ దూసుకువచ్చింది.  
నాగయ్య థర్డ్ రేటు (a third-rate `curry western) పాత్రలు వేస్తున్నారు.
కౌబాయ్ గెటప్ - ఉన్న నాగయ్యను చూసిన శాండిల్యన్ ఖంగు తిన్నాడు. 
దగ్గరికి వెళ్ళి నాగయ్యను పలకరించాడు శాండిల్యన్.
"ఇదేమిటి? ఇలాంటి ఈ దుస్తులు ధరించారు?" 
Sandilyan (Tami cine writer) అడిగాడు.   
శాండిల్యన్ విలవిలలాడడము చూసి, నాగయ్య అతడిని అనునయిస్తూ
"భాష్యమ్!! ఉదర నిమిత్తమ్ బహుకృత వేషమ్ కదా! " 
(శాండిల్యన్ అసలు పేరు భాష్యమ్)
నెమ్మదిగా పెదవులపై మందహాసమును వెలయిస్తూ అన్నారు నాగయ్య.   
(`for the sake of the stomach, one has to play many roles!') 
శాండిల్యన్ - అంతటి కష్టకాలంలోనూ నిబ్బరంగా ఉండగల్గిన 
మహనీయుడు నాగయ్యకు శాండిల్యన్ అభివాదములు చెప్పాడు. 
స్థితప్రజ్ఞతకు ప్రతిబింబరూపుడు నాగయ్య.

********************************    
Sandilyan- Vuppalagadiyam Nagaiah (Link- The Hindu)

;

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...