30, సెప్టెంబర్ 2015, బుధవారం

చింతామణి గణపతి

గజాననుడు / కరివదనుని విశేషాలు కొన్ని :-
మహారాష్ట్రలోని ‘అష్టవినాయక కోవెలలు' ప్రసిద్ధి గాంచినవి.
వీనిలోని “చింతామణి గణపతి” గురించి స్థలపురాణ కథ ఉన్నది.
ఆ ప్రాంగణములో తరువు వెలయుటకు కారణమైనది.
******************************,

“శబల” అను ఆవు వశిష్ఠముని వద్ద ఉన్నది. చిటికెలో అద్భుతమైన విందు ఆ ధేనువు అనుగ్రహించింది. అతిథి గా, తన సైనిక పటాలంతో సహా వచ్చిన మహారాజు విభ్రమానికి లోనైనాడు.
“కామధేనువు వత్సం ఐన ఈ శబల మహారాజును ఐనట్టి నావద్ద ఉండుట సముచితము. కనుక నాకు ఇవ్వుము మునీ!” అని అడిగి, ముని కాదనగా భంగపడ్డాడు.
అతడే గాధిరాజు, విశ్వామిత్రుడు, ఋషిగా, బ్రహ్మర్షిగా ఎదిగిన చక్కని పౌరాణిక సంఘటన అది. ఇట్లాంటిది ‘చింతామణి అనే మణి ‘ కథ.
************,

ఈ అద్వితీయ రత్నమునకు సంబంధించి ఒక గాథ ఉంది.
పూర్వం కపిలముని వద్ద చింతామణి అనే మణి ఉండేది.
(కపిలముని యొక్క సహోదరి ‘ సతీ అనసూయ' )
చింతామణి కోరిన కోరికలను తీర్చే కల్పతరువు వంటిది. అక్కడి ప్రభువైన అభిజిత్తు, గుణవతిల కుమారుడైన గుణ రాజకుమారుడు ఒకమారు కపిలుని ఆశ్రమానికి వస్తాడు. ఆ ముని రాజకుమారునికి చింతామణి మహిమతో షడ్రసోపేతమైన భోజనము ఏర్పాటు చేస్తాడు. ఆ మణి సంగతి తెలిసి రాజకుమారుడు మణిని తనకిమ్మని కపిలుని అడుగుతాడు.
కపిలముని దానికి అంగీకరించక పోగా, రాజకుమారుడు ఆ మణిని దొంగిలించాడు. బాధతో కపిలుడు గణపతిని ప్రార్థించాడు.
విఘ్నేశుడు భక్త రక్షణకై ఇలకు అవతరించి, రాకుమారుని యుద్ధంలో ఓడించెను. పిమ్మట, అభిజిత్తు మహారాజు మణిని కపిలునికి తిరిగి ఇవ్వబోగా, కపిలుడు ‘ఆ మణి తనకు వలదని ‘ చెప్పి,
“శివపుత్రా! విఘ్నేశా! నీవు ఇక్కడే , భక్తచింతామణివై మమ్ములను అనుగ్రహించుము ’ అని ప్రార్ధించెను.
గణేశుడు అక్కడే కదంబ వృక్షము కింద వెలిసెను.
అప్పటినుంచి కపిలుడు ఆ గణేశుని ‘చింతామణి గణేశుని’గా కొలుస్తాడు.
ఈ చింతామణి గణేశ క్షేత్రం మహారాష్త్రలోని థేవూర్ లో (పుణే/ పూనా దగ్గర) ఉంది.
మహారాష్ట్రలోని అష్టవినాయకులలో ఒకటి ఈ చింతామణి వినాయకుడు.

****************,

ఎనిమిది విఘ్నవినాయకస్వామివార్ల పేర్ల పట్టిక :-

1) చింతామణి గణపతి; Chintamani, Theyur):
2) హేరంబ గణపతి;( hEramba gaNapati) :
3) బళ్ళాలేశ్వర ;పాళీ:                                                                             4) గిరిజాత్మజ, లేన్యాద్రి (Girjatmaja, Lenyadri):
5) మహా గణపతి, రాజన్ గావ్ (Mahaa GaNapati, Rajan gaaw):
6) మోరేశ్వర కోవెల (Moreshwar Temple):
7) సిద్ధివినాయక ఆలయ (Siddhiwinayaka dewalay, Siddhtek):
8) వరదవినాయక్ మహాడ్ (Varada Vinayaka, Mahaad);

&&&&&&&&&&
Important points:- కామధేనువు దూడ శబల ;
[rachana :- కుసుమాంబ1955 ] ; = http://jabilli.in/1274 

చింతామణి గణపతి ; September 20, 2015 =
link - web mag "JABILLI sept 2015"  

*************************************,  

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 61916 pageviews - 1029 posts, last published on Sep 15, 2015

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...