21, ఫిబ్రవరి 2011, సోమవారం

మలక్కా = నెల్లూరు

++++++++++
++++++++++
15వ శతాబ్దములో జరిగిన వింత ఇది.
పరమేశ్వడు (Palembang యువ రాజు)
తన అనుచరులతో కలిసి వేటకు వెళ్ళాడు.
అకస్మాత్తుగా ఒక దృశ్యం
అందరినీ ఆశ్చర్యచకితులను చేసినది.
ఆ ప్రాంతములో
ఒక Kung Fu Mouse Deer ఎదురైనది.
ముద్దొస్తూన్న ఆ హరిణము ( జింక/ లేడి)కొన్ని వేట కుక్కలను తరుమసాగినది.
అలాగ జింక వేట కుక్కలను పారద్రోలడము,
ప్రకృతి విరుద్ధ జంతు స్వభావ నేపథ్యములో,
ఒక సరి కొత్త సామ్రాజ్యానికి నాంది ఐనది .
అప్పటి దాకా యువ రాజు " Kancil" అని
తన రాజ్యానికి పేరు పెట్టాలని అనుకున్నాడు.
కానీ అప్పటికప్పుడే నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
పరమేశ్వరుడు ( Parameswara,The founder of Malacca)
అక్కడ నవీన సామ్రాజ్యాని స్థాపన చేసాడు,
అదే మలక్కా Town ( నేటి మలేషియా కి రాజధాని )
అనుకోకుండా, అదే క్షణంలో ఆయన ఒక తరువు ఛాయలో నిలబడి ఉన్నాడు.
ఆయన ఆదేశం మేఱకు (/mE~ra) పరివారం
" ఆ చెట్టు పేరు ఏమిటి?" అని కనుక్కున్నారు.
అచ్చట అద్దానిని, "మలక్కా " ( a Malacca Tree ) అని పిలుస్తున్నారు.
తన నూతన సామ్రాజ్యానికి అదే నామధేయాన్ని పెట్టాడు.
మలేషియా దేశములోని -> Malacca రాష్ట్రానికి రాజధాని Malacca city.
( as a UNESCO World Heritage Site )
యునెస్కో వారు 8 కొత్త సిటీలను వారసత్వ సంపద- విభాగంలో చేర్చారు.
వానిలో Malaccaa పట్టణము ఉన్నది.
See the Links here :
( Malacca City is the capital city of the
Malaysian state of Malacca)


ఒక చెట్టును ఆధారం చేసుకుని ఆయా సీమలకు names కలిగే సాంప్రదాయం,
హిందూ దేశంలో బహుళంగా అగుపిస్తూ ఉంటుంది.
ఉసిరిక చెట్టును -> "నెల్లి" అని, తమిళ భాషలో పిలుస్తారు.
మహేశుడు, నెల్లి చెట్టు కింద వెలిసిన మహత్తర సంఘటన వలన
మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక పుణ్యక్షేత్రము,
పట్టణమునకు వచ్చిన కలిమి పేరు " నెల్లూరు".
కాకతాళీయంగా, అదే చెట్టు పేరుతో
వేరే దేశంలో కొత్త చోటునకు ఏర్పడడము విచిత్రమే కదా!
ఎందుకంటే, వేరే ఆసియా దేశ భాషలో
మలక్కా పాదపము, అంటే మన ఈ ఉసిరి చెట్టేనండీ!
అదే కదా తమాషా!

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

"నెల్" అంటే వడ్లు(తమిళం లో)......."నెల్ ఊరు" అంటే మంచి గా పంటలు పండేవూరు అని అర్థం....అదే ఇప్పుడు నెల్లూరు అయ్యింది....!!

గోదారి సుధీర చెప్పారు...

ప్లేటో ఒక్కటే కవితకి కవి సర్ .మీ బ్లాగ్ చూసాను .very interesting ."ది సీక్రెట్ అఫ్ కెల్స్"మూవీని గుర్తు తెప్పించింది .బలే ఉంది మీ బ్లాగ్ ,కానీ నా కంప్యూటర్ అజ్ఞానం చేత ఆ వ్యాసం పట్టుకోలేక పోయాను .ప్రయత్నిస్తాను .thanks for visiting

అజ్ఞాత చెప్పారు...

Melacca is not capital of malaise. Kaulalampur(KL)is the capital. Melacca is a historic place 150 km (approx) from KL

అజ్ఞాత చెప్పారు...

Malaysia..typo in above

kusuma చెప్పారు...

కరెక్టేనండీ!
వెంటనే గుర్తు పట్టాను,
కానీ సరి దిద్దడానికి కొంచెం టైము తీసుకుంటున్నాను.
Thank you all!

kusuma(kadambari) చెప్పారు...

అజ్ఞాత గారూ! ,& others!
నెల్లు = వడ్లు అని; ఐతే "నెల్లి" వాడుక కూడా ఉన్నది
తెలుగులో నేల ఉసిరి, నేల విరిక అనీ,
తమిళంలో కీల నెల్లి, కిక్కాయ నెల్లి అనీ, మలయాళంలో కీఝర్‌ నెల్లి అనీ,
మరాఠీలో భూయి ; ఆవ్ల అనీ, కన్నడలో నెలనెల్లి, కీరునెల్లి అని,
గుజరాతీలో భోన్యాన్‌వలి అనీ అంటారు.
సింహళ, తమిళ, కన్నడ భాషలలో -
అంటే దాదాపు అన్ని ద్రవిడ భాషలలో " నెల్లి", తత్సమ ధ్వనులతో ->
nellikka, nellikkai, nellikaayi -ఇత్యాది ఉచ్ఛారణలతో ఉన్నది.

Anil Piduri చెప్పారు...

నా వ్యాసాన్ని, ఇంత శ్రద్ధగా చదివి,
మీ అమూల్య సలహాలు ఇచ్చినందుకు,
మీ అందరికీ,నా మనః పూర్వక ధన్యవాదాలు.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...