11, ఆగస్టు 2010, బుధవారం

శిథిలాలయమ్ములో శివుడు లేడోయి!
...............
లోక మందిరమునకు పునాది రూపాన్ని
అన్వేషించ యత్నించిన భావుకుడు మన దేవుల పల్లి క్రిష్ణ శాస్త్రి.

ఆ అన్వేషణా భారంతో ఎంతగా డస్సి పోయాడో కదా
పాపం! ఆ భావ కవీంద్రుడు.
"భావనా" గవేషణా లాలిత్య లయలతో
సాగిన ఆయన గీతం ఇది.

( లైబ్రరీలలో 4 నెలల పాటు గాలించీ ........ గాలించీ .......
హమ్మయ్య! ఇప్పటికి దొరికింది నాకు, ఈ పాట! )
పాఠక మిత్రులకై ఇదిగో! స్వీకరించండి! )

****************************************

శిథిలాలయమ్ములో శివుడు లేడోయి!
ప్రాంగణమ్మున గంట పలుక లేదోయీ!
దివ్యశంఖము గొంతు తెరవ లేదోయి
పూజారి గుడి నుండి పోవ లేదోయి!

చిత్ర చిత్రపు పూలు – చైత్ర మాసపు పూలు
ఊరూరా, ఇంటింట ఊరకే పూచేయి -
శిథిలాలయమ్ములో శిల కెదురుగా కునుకు
పూజారి కొకటేని పువ్వు లేదోయి

వాడ వాడల వాడె, జాడలన్నిట వాడె
వీడు వీడున వాడె, వీటి ముంగిట వాడె
శిథిలాలయమ్ములో శిల కెదురుగా కునుకు
పూజారి వానికై పొంచి ఉన్నాడోయి

************************************

SithilaalayammulO SivuDu lEDOyi
praaMgaNammuna gaMTa paluka lEdOyI!
divyaSaMKamu goMtu terava lEdOyi
pUjAri guDi nuMDi pOva lEdOyi!

chitra chitrapu pUlu – chaitra mAsapu pUlu
UrUrA, iMTiMTa UrakE pUchEyi -
SithilaalayammulO Sila kedurugaa kunuku
pUjAri kokaTEni puvvu lEdOyi

vADa vADala vADe, jADalanniTa vADe
vIDu vIDuna vADe, vITi muMgiTa vADe
SithilAlayammulO Sila kedurugaa kunuku
pUjAri vaanikai poMchi unnaaDOyi

***************************************

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
ఎంతో పట్టుదలతో ఈ కావ్య మల్లికా సుమ హారాలను -
1965 వ సంవత్సరంలో పుస్తక రూపంలోకి తెచ్చారు.

ఓరియంట్ లాఙ్మన్ లిమిటెడ్
3-6-272,
Hyderabad - 29 ;

వారు అచ్చు వేసారు.

2 కామెంట్‌లు:

Anil చెప్పారు...

Chaala Baagundi.

Bolloju Baba చెప్పారు...

ఈ పాట MP3 రూపంలో (పాట రూపంలో) మీ వద్ద ఉంటే వీలైతే పోస్ట్ చేయగలరా

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...