11, జూన్ 2010, శుక్రవారం

చలం - ఆఖరి ఉత్తరంఅరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూన్నారు
వివాదాలకు కేంద్ర బిందువైనట్టి ప్రఖ్యాత రచయిత చలం.

ప్రఖ్యాత విమర్శకులు, రచయిత కూడా అయినట్టి
ఆర్.ఎస్. సుదర్శనం " మళ్ళీ వసంతం" నవలను రాసారు.
దానిని చలం గారి అభిప్రాయం కోరుతూ పంపించారు;

కానీ , ఆ నవల చలం గారికి ఆట్టే నచ్చ లేదు.

కొంత కాలం తర్వాత R.S. Sudarsanam -
తాను రచించిన మరో నవల " అసుర సంధ్య" ను పంపించారు.

" ........ అంతటికీ మీ నవల పేరు ఎంతో బావుంది నాకు.
ముందు మీరు పంపారు నాకు నవల, దాని కన్న ఇది చాల మెరుగు..........
మెంటల్ ఎనాలిసిస్ మీ ఫోర్ట్ ...... కొన్ని చోట్ల మీ చర్చలు నాకెంతో ఇష్టమైనాయి.
మీరు చాలా విషయాలపైన, దేశ ప్రజల పోకడల పైన
చక్కని ఎనలిటికల్ లయిట్ వేస్తోంది,
మీరు దేశాన్ని సమగ్రంగా చూసి రాసారు ఈ నవల."

"చలం గారికి కొంతైనా నచ్చిన నవలను రాయ గలిగానన్న మాట."
అని సంతోషించారు సుదర్శనం గారు.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

4- 9 - 1966 లో రాసిన ఈ ఉత్తరం చలం గారు రాసిన ఆఖరి ఉత్తరం -
అందువలన సుదర్శనం గారు ఆ జవాబును అందుకున్న అదృష్ట వంతులు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

చలం శైలిలో అత్యద్భుతమైన కవితా ధార పరి పూర్ణంగా ఉన్నది.
ఈ సారి ఆ కోణంలో ఆయన రచనలను చదవమని నా మనవి;
ఇట్లు,
(కోణమానిని)

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Telusaa! -

చలం - ఆఖరి ఉత్తరం ;

By kadambari piduri, May 23 2010 3:01PM

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

చలం గారు "లేఖా రచన"కు సాహిత్య గౌరవాన్ని సముపార్జించిన
TREND SETTER ఐనట్టి గొప్ప రచయిత.
చింతా దీక్షితులు మున్నగు వారికి
ఆతడు రాసిన ఉత్తరములు,
జరిపిన ఉత్తర ప్రత్యుత్తర సంపద
తెలుగు సాహిత్య స్వర్ణ పేటికలో చేరిన అమూల్య ఆభరణాలు.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

[ మచ్చుకు ఈ letter ను చదవండి ]

గుంటూరు,
14-03-30

my dear pendulum,

మీ వుత్తరానికి వెంటనే జవాబువ్రాసితీరాలనిపిస్తోంది.
అంతపని తొందరలో వ్రాసినా
మీ వుత్తరం సోడామల్లె పొంగుతోంది.
పెట్టిపోయిన ఆ మూర్ఖపు గొడవనతా ఒక్కసారిగా మానేశాను.
సూర్యనమస్కారాలు ముఖ్యం. అలసిపోయినాను.
ఏ మాత్రం లేదు Inspiration , బైటనించి గాని, లోపల్నించి గాని.

మా హెడ్మాష్టరు కుదర్చడానికి రోగుల్ని వెదకడంలో నిమగ్నుణ్ణి ప్రస్తుతం.
కొంతశక్తి వుంది ఆయనకి.
కాని వుత్త nonsense మాట్లాడుతాడు.
ఆ సాహేబు, ఎన్నేళ్ళకిందో చచ్చిపోయిన
యీవూరి ఉర్సుమస్తానుని కలుసుకొని మాట్లాడానంటాడు.

రోజూ నేనూ, సుబ్బారావూ
జాగ్రత్తగా జరుగుతున్న సంగతుల్ని గమనించి
గాంధీగారిని చర్చించుకుంటున్నాము.

నా వుత్సాహాన్ని అణిచిపెట్టడం కష్టంగా వుంది.
ఏ నిమిషానో తెంచుకుని ఆయనతో చేరి పోతానేమో ?
ఎవరికి తెలుసు ?

మొన్న రైల్లో సౌరిస్ టాగూరుగార్ని కలుసుకుంది.
ఆయన షౌ చేతిని పట్టుకున్నారు.
ఆయన్ని గురించి Rave చేస్తోంది.

అచ్చుకి కథలు తయారు చేస్తున్నాను.
బెజవాడలో మీకు యోగాసనాలు నేర్పుతాను.
మీ వెన్నెముక తాగుతుంది వాటిని.

ఈ Mrs. భూషణం నా బతుకుని చెడ్డకలగా మారుస్తోంది.
ఒకటేగొడవ, ఆ శుకుడి జాతకం పట్టుకుని,

"నేను సుఖంగా వుంటానని వుంది, కాదూ?"
"అవును."
"సుఖంగా అంటే ?"
"అంటే, సుఖంగా అన్నమాట."
"ఎట్లా?"
ఏం చెప్పను ??
"మరి నా నలభై మూడోయేట ఏం జరుగుతుందో చెప్పలేదే?, మేషలగ్నం అంటే ఏమిటి?"

నాకేం తెలుసు ? మేషంవొచ్చి ఆమెకు లగ్నం చేస్తుందనా?
ఆ జాతకం అతను మోసాలమారిట.
నన్ను వెళ్ళి అతన్ని తన్నమంటుంది.
లేకపోతే తానేవొచ్చి అతన్ని తంతానంటోంది.
ఇంక అతను ఆడవాళ్ళకి జాతకాలు చెప్పడనుకుంటాను.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన
రచయిత గుడిపాటి వెంకటాచలం గురించి
అనేక మంది తమ అమూల్య అభిప్రాయాలను రాసారు.

కొన్ని లింకులు ;
__________
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...