22, డిసెంబర్ 2009, మంగళవారం

'Konjum Salangai' ; " మురిపించే మువ్వలు "

-
-
-
-
-
-
-
-
-
-
-

Savithri's 100th film 'Konjum Salangai' ('Muripinche Muvvalu' in Telugu)

అభేరి రాగం ఆధారంగా / దగ్గరగా ఉన్న కొన్ని పాటలు, పద్యాలు
1. ఊరకే కన్నీరు నింప కారణ మేమమ్మా… (లవకుశ)
2. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని… (గులేబకావళి కధ)
3. నా కంటి పాపలో నిలిచి పోరా… (వాగ్దానం)
4. వెన్నెల లోని వేడిమేలనో వేడిమిలోని హాయి ఏలనో… (పెళ్ళినాటి ప్రమాణాలు)
5. చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి… (పెళ్ళినాటి ప్రమాణాలు)
6. రాగమయి రావే అనురాగమయి రావే… (జయభేరి)
7. చిగురాకులలో చిలకమ్మా… (దొంగ రాముడు)
8. కలవరమాయే మదిలో నా మదిలో… (పాతాళ భైరవి)
9. నీవేనా నను పిలచినది నీవేనా నను తలచినది… (మాయా బజార్‌)
10. ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని నాకేనోయ్‌.. (భట్టి విక్రమార్క)
11. నీ లీల పాడెద దేవా… (మురిపించే మువ్వలు)
12. నీలి మేఘాలలో గాలికెరటాలలో… (బావా మరదళ్ళు)
13. ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు… (మల్లీశ్వరి మొదటి చరణం మాత్రమే)
14. రావోయి చందమామ మావింత గాధ వినుమా… (మిస్సమ్మ)
15. తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీరూపు తెలిసిందిలే… (రాముడుభీముడు)
16. ప్రేమ యాత్రలకు బృందావనము నందన వనమూ ఏలనో… (గుండమ్మ కధ)
17. నిన్న కనిపించింది నన్ను మురిపించింది… (రాణి రత్నప్రభ)
18. సడి సేయకోగాలి సడి చేయబోకే… (రాజ మకుటం)
19. నీవే నీవే నిన్నే నిన్నే… (ఇంటికి దీపం ఇల్లాలు)
20. ఉయ్యాల జంపాల లూగ రావయా… (చక్రపాణి)
21. పదిమందిలో పాట పాడినా… (ఆనంద నిలయం)
22. కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో… (అప్పుచేసి పప్పుకూడు)
23. కళ్లు మూసుకొని వళ్ళు చూసుకొని కాలం గడపకు… (ప్రైవేటు రికార్డ్‌)
24. రావోయి బంగారి మామా నీతోటి రాహస్య మొకటున్నదోయి… (ప్రైవేటు రికార్డ్‌)
25. హాయమ్మ హాయి మా పాపాయి… (ప్రైవేటు రికార్డ్‌ )
26. బంగారు పాపాయి బహుమతులు పొందాలి… (ప్రైవేటు రికార్డ్‌)
27. కనుల దీపికలుంచి మనసు వాకిలి తెరచి… (ప్రైవేటు రికార్డ్‌)
28. క్రొంజికురాకు వ్రేళుల కురుల్‌ తడియార్చుచు… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం)
29. ఓహో మేఘమాలా నీలాల మేఘమాల… (భలే రాముడు)
30. తెలవారదేమో స్వామీ (శ్రుతిలయలు)

{ మన సంగీతంలో ప్రసిద్ధ రాగాలను ,"ఈ మాట " వెబ్ పత్రికలో (జులై,2000 )ఎంతో శ్రద్ధతో విష్ణుభొట్ల లక్ష్మన్న గారు పాఠక మహాశయులకు అందించారు.
సంగీతముపై మమకారము ఉన్న వారికి ఉపయుక్తమైన వ్యాసాలు , " ఈ మాట"ఇత్యాది పత్రికలు అందిస్తున్నాయి; వారి దీక్ష బహుధా ప్రశంసనీయము కదా! }

నీ లీల పాడేద దేవ... ఆ ఆ ఆ...
నీ లీల పాడేద దేవ! మనవి ఆలించ వేడెద దేవ !
నను లాలించు మా ముద్దు దేవ ! నీ లీల పాడెద దేవ ||2||--

(చరణం 1 ) ;
సింధూర రాగంబు దేవా!~~~ ~~~
దివ్య శృంగార భావంపు దేవా !
వైళి చెలువాలు - నిను కోరు, నీవు రావా? ఎలమి ||నీ లీల||

- (చరణం 2 ) ;;;;;
అనుపమ వరదానశీలా!~~~~~~~[2]
వేగ కనిపించు కరుణాల వా~~~~ లా!
ఎలమి నీ లీల పాడేద దేవ ||నీ లీల||
సగమపని ||నీ లీల||

నిసనిదపమ- గామ -గరిసని - పానిసగమప -
మగరిస- నిదపమ- గరిని ||నీ లీల||

సా రిస- నిసరిసా -
నినిస - పపనినిస - మమపపనినిస -
గగస గగస నినిస పపని మమప -
గగమమపపనినిసస గరిని -
పానిదపమ గరిసని సగగ -
సగమపగరిసని సగస -
నినిప మమప నీప నీపస పనీపసా -
నిదపమగరి సగస గామపానిసా -
నిసగరిసరి నీ సారిస నీ సారిగరి -

నీ సారిస నీ - గరిని గరిగ నిరిగరి నిగరినీ -
నిరిరి నిసస నిరిరి నిసస నిదపా - నినిసా... ఆ... అ... ఆ... -
రి నీస పాని మాప గామ - పనిసరి... ఆ... -
సానీ పానీ సారిసనీ సారిసనీ -
పానిపసా పానిపనీ మాపమ -
పానిప నీపనిసా - పానిపనీసనిసా
మగా పమా - సారిసనీ నీసనిపా సారిసనీ -
సారిస సారిస సారిస గరీ గరిసనీ -
గరిసనిసా రీసని దపా పనిపమసా -
నిదపమపా నిపమ గరిరిస -

సగమపా గమపనిసా -
గరినిస నిదపమని ||నీ లీల||

ఈ గీతమునకు అనేక విశేషాలు ఉన్నాయి.
సావిత్రి యొక్క నూరవ చలన చిత్రము - 100 th film
( tamil ) ‘Konjum Salangai’ " మురిపించే మువ్వలు’అనే పేరుతో విడుదల ఐ,
విజయ దుందుభిని మోగించింది.
అరుణాచలం నాద స్వరము ఈ పాటకు మణి కిరీటము.
సన్నాయి పాటకు అందరినీ ఆకర్షింప జేస్తున్నది ఈ సంగీత సంవిధానము.
ఎస్.జానకి మొట్ట మొదటి పాట ఇది.
ఆమెకు ఈ సినిమా మ్యూజిక్ జగత్తులోనికి అవకాశము కలిగినది.

వెండి తెరపైన --- Nadigaiyar thilagam బిరుదాంకితురాలైన
ప్రఖ్యాత నటీ మణి కొమ్మారెడ్డి సావిత్రి, జెమినీ గణేశన్.
singer ;;;;; ఎస్.జానకి, Cinema --->>> మురిపించే మువ్వలు ; ;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...