15, ఆగస్టు 2009, శనివారం

గాంధీ తాతకు జేజేలు!

మా గాంధి నామము మరువం!మరువం!
---------------- -----------------
1)కొల్లాయి గట్టితేనేమి
మా గాంధి-కులము ఏదీ ఐతేను ఏమి
(=కోమటై పుట్టితేనేమి? )
2)వెన్న పూస మనసు-కన్న తల్లి ప్రేమ
పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు //
3)నాల్గు పరకల పిలక, నాట్యమాడే పిలక
నాలుగు వేదాల నాణ్యమెరిగిన పిలక //
4)బోసి నోర్విప్పితే -ముత్యాల తొలకరే!
చిరు నవ్వు నవ్వితే -వరహాల వానలే!//
మన భారత దేశమునకు స్వాతంత్ర్యమును ఆర్జించే దిశలో సాగిన పోరాటాలలో-సాహిత్యం వేసిన ఉరుకుల పరుగుల-ముందడుగులలో-ఎన్నెన్నో కవితల ఆణి ముత్యాలలో, ఇలాగ ఒకటి, రెండు గీతాలను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుందాము.
నా చిన్నప్పుడు,ఆకాశ వాణిలో, అదేనండీ రేడియోలో నన్న మాట, ఒంటి కాలి మీద నిలబడి మరీ పిల్లకాయలము, ఏక దీక్షగా, ఏకాగ్రతతో వింటూండే వాళ్ళము. ఆ రోజులలో, రేడియో అపురూపమైన వస్తువు. దానిని పాడు చేస్తారేమో ననే భీతితో, భయంతో పిన్నలకు అందకుండా పెద్దలు, అలమారలో భద్రంగా పై అరలలో పెట్టేవారు. బాల బాలికలు వినదగినవీ, వారి విద్యాభివృద్ధికీ, వారిలో దేశ భక్తిని పెంపొందింపజేయగల ఐటంసు అని వారు అనుకున్న ప్రోగ్రాములనూ విన నిచ్చే వారు. అందుకే ఆ కొన్ని కార్యక్రమాలనూ, ఒంటి కాలి తపస్సు చేస్తూ, దోరగా చెవులు అప్పగించి మరీ వినే వాళ్ళము.

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...