మలయాళము నుండి తెలుగునకు వచ్చిన film "అంబ అంబిక అంబాలిక "
డబ్బింగ్ సినిమాను చూసాను.
అక్కాచెల్లెళ్ళు, వారి మధ్య సంఘటనల వెల్లువ -
అంతస్సూత్రంగా తీసిన పిక్చర్
అంబ అంబిక అంబాలిక . నాటక, టెలివిజన్, చలనచిత్ర దర్శకులు - మహాభారతములోని
("జయం" - అసలు పేరు) ప్రతి అంశాన్నీ, ఒక్కొక్క పాత్ర యొక్క దృక్కోణంలో తీశారు, తీస్తూవస్తున్నారు, ఇంకా అనేక తెర రూపములను నిర్మిస్తూనే ఉన్నారు.
********************************,
శ్రీవిద్య సోయగాలు :- అంబ అంబిక అంబాలిక - లో అంబ పాత్రను పోషించినది శ్రీవిద్య . పదహారేళ్ళ వయసు లో అంబగా శ్రీవిద్యవిశాలనయనాలు, హావభావాలు, చూపరులను ఆకట్టుకున్నవి.
సినిమా మువ్వురు సోదరీమణుల నాట్యంతో ప్రారంభంఔతుంది.
;
నాట్య గీతం :-
;
తలపులు తెలిపేటి ;
వలపులు కలిసేటి ;
పరవశం మెరిసేటి ఉద్యానం ||
;
ప్రాయముతో నేను ;
పరవశ సంగీతం ;
మనసులు కొసిరేను ;
ప్రియస్నేహం ||
;
ఎవరో వరుడని - విరహములో ;
మానసవీణలు మ్రోగెనులే! ||
;
వయసులు మనసార ;
మనలను పిలిచేను ;
స్వయంవర
శుభసమయమాసన్నము ;
ఒకరికి ముగురము ;
వీడని బంధము ;
అతి మధురం ||
;
********************************,
ఈ పాటచిత్రీకరణ బాగున్నది.
; Indian Video Guru [ link ]
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦
- by -[ సుమదళాలు ]
Amba Ambika Ambalika Telugu Full Movie | Srividya | P Subramaniam |
Indian Video Guru ;