25, డిసెంబర్ 2014, గురువారం

శాంతాక్రాజ్ ఇల్లు ఎక్కడ?


శాంతాక్రాజ్ ఎవరు? క్రిస్ మస్ తాత  అనగానే గడ్డం తాత గుర్తుకువస్తాడు.  
ఈ శాంతాక్రాజ్ ఏ ప్రదేశంలో నివసిస్తున్నాడు? 
జానపదుల మనసులందు శాంతాక్రాజ్ నిజ నివాసము అని 
ఒక సుందర సీమను ఎన్నుకున్నారు. 
ఇలాంటి ఊహా నగరము జగత్ ప్రసిద్ధమైనది. 
అదే క్రిస్మస్  తాత శాంతా క్లాజ్ ఊరు. 
అర్ధశతాబ్దం క్రితం   ప్రయాణీకులు కొందరు “అరోరాబొరియల్స్ కాంతుల మనోజ్ఞ దృశ్యం” కనబడే జాగాకు కూసింత దూరంలో, 6 కిలోమీటర్లు దూరాన ఒక ఊరును గురించి జనులకు ఆషామాషీగా చెప్పారు. 

వారు తమాషాగా చెప్పిన ఆ పట్టణము పేరు కర్ణాకర్ణీగా బహుళ ప్రచారముల్లోకి వచ్చింది. 
ఆ పట్టణము రొవానైమీ #(Santa Claus Village in Rovaniemi ). #  
ఈ సిటీ ఫిన్ లాండ్ దేశంలో 'లాప్ లాండ్' సీమనందు ఉన్నది. 
ఈనాడు ఆ సిటీ సందర్శకులతో కిటకిటలాడుతూ, క్రిస్మస్ పండుగ శోభానిలయమైనది. 
ఆర్కిటిక్ అద్భుతకాంతుల దర్శన అనుభూతిని, 
ఇక్కడికి 8km ఉత్తరధృవప్రాంతము ఐనందుచేత ఈ ఊహాసీమను అందరూ ఆమోదించారు. 

క్రిస్మస్ పండుగ అనగానే పిల్లలకు ఆనందం, 
ఆ నాడు "శాంతాక్రాజ్ వీపుపై పెద్ద మూటను తెస్తాడు, 
ఆ  మూటలో తమకు నచ్చిన అనేక కానుకలను మోసుకొస్తాడు", అదీ సంగతి. 
అన్నట్లు ఒక మ్యూజియాన్ని నెలకొల్పారు. 
దాని పేరు "The Arktikum",museum of Finland's and the world's Arctic regions.)    
*****************************,

శాంతాక్రాజ్ గృహసీమ ఎక్కడ?:- 

అఖిలవనిత
Pageview chart 29087 pageviews - 747 posts, last published on Dec 19, 2014
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 55079 pageviews - 1003 posts, last published on Dec 13, 2014 - 2 followers
Create new postGo to post listView blog
Telugu Ratna Malika
Pageview chart 3910 pageviews - 125 posts, last published on Nov 30, 2014

13, డిసెంబర్ 2014, శనివారం

సంత్ శిరోమణి రవిదాస్

"మరో ప్రపంచం " అంటే అందరికీ ఆపేక్ష. ఆశాజీవులు ఇట్లాంటి ఊహాజగత్తులను సృష్టిస్తూ ఉంటారు. 
కొన్ని శతాబ్దాలకు, ఇట్లాంటి నిన్నటి స్వప్నాలను, సమర్ధులైన జనులు, దేశాలు, నేటి ఆచరణలతో వాస్తవ స్వరూపములనుగా తీర్చి దిద్దుకొనగలుగుతున్నారు.

మన తెలుగున "మరోప్రపంచం" అనే మాట శ్రీశ్రీ రచన "మహాప్రస్థానం"  ద్వారా బహుళ ప్రచారం లోనికి వచ్చింది.  
ఆధునిక కవితా పదబంధం ఇది, సరే! అంతకు మునుపు ఈ స్వాప్నిక పదం ఉన్నదా? 
ఔను, వున్నది- అనేకపర్యాయాలు అంటే "ఆధ్యాత్మిక వాదనలనుండి, లౌకిక కావ్య, కవితల వఱకూ".వానిలో కొన్నింటిని స్పర్శిద్దాము.

"భూతల స్వర్గము”, “మరో ప్రపంచము”, “ఉటోపియా”, కల్పనాచమత్కారములైనవి. ఇవి కల్పనలే ఐనప్పటికీ ఎల్లరూ తరచూ మననం చేసుకుంటూ నిఘంటువులలో ఈ అమూల్య పదముల ఉనికిని భద్రపరస్తూ వస్తున్నారు.

రవీంద్రనాథ టాగూర్ మొదలైన మహనీయుల మనోఫలకాలపై ఆదర్శ ప్రపంచాన్ని ఎలా సృష్టించాలి? వంటి అనేక ఆలోచనలకు మంచి పునాదులను వేసినవి.   Where the mind is without fear” ఈ కోవలోనికి వచ్చినవి కొన్ని ఉన్నవి.   “ఉటోపియ”, “భూతల స్వర్గము”, “మరో ప్రపంచము” కల్పనా చమత్కారములైనవి. ఇవి కల్పనలే ఐనప్పటికీ ఎల్లరూ తరచూ మననం చేసుకుంటూ నిఘంటువులలో ఈ అమూల్య పదముల ఉనికిని భద్రపరస్తూ వస్తున్నారు.

ఈ కోవలోనికి వచ్చినవి కొన్ని ఉన్నవి.
ఉటోపియా (utopia) :- పాశ్చాత్య దేశాలలో నిర్వచనంగా రూపొందిన పదము. పడమటిసీమలలో తత్వవేత్తలు ప్లేటో, అరిస్టోక్రాటీల్, సోక్రటీసు- మున్నగు వారు పేదల కష్టాలను పరిష్కరించే బాట కొఱకై అన్వేషణలు చేసారు. ప్రజలందరూ సర్వసమానులై ఆనందమయమైన జీవితాన్ని గడుపగలిగిన రాజ్యం ఏర్పడాలని ఆకాక్షలతో ఇటువంటి నిర్వచన పదములను పరికల్పించారు. వాళ్ళు తమ ఆశలను  చక్రవర్తులకు బోధిస్తూ, ఆ రాజులను ఆశయాలను ఆచరించే దిశగా పయనించేటందులకు ఎంతో కృషి చేసారు. ఈ ప్రయత్నాలలో ప్రాణాలను సైతం కోల్పోయినవారు సోక్రటీసు, ఏసుక్రీస్తు (జీసస్): మొదలైన వారెందరో!  

*******

ప్రాచీన హిందూదేశము నందు అట్టివారు ఉన్నారా? వారిలో ప్రధమగణ్యత గాంచిన మహనీయుడు? ఆయనయే "గురు రవిదాసు". ఆయన సృష్టించిన మహా జగత్తు "బేగమ్ పురా" సీమ. మరి ఈ "గురు రవిదాసు ఎవరు? ఎప్పటివ్యక్తి?

मीराबाई रैदास को अपना गुरु मानते हुए कहती हैं -
गुरु मिलिया रैदास दीन्ही ज्ञान की गुटकी।

హిందీ భక్తి గీతములలో అగ్రతాంబూలం అందుకున్నవి మీరాబాయి ఆశువుగా చెప్పి, ఆలపించిన గీతాలు. ఆమె నుడివిన పద్యము ఇది. ఈ పద్యం ‘చారిత్రక ప్రాధాన్యాన్ని ’ పొందినది. ఎందుకంటే ఇందులో ఆమె పేర్కొనిన పేరు గురించి, మీరా ‘తన గురువు రైదాసు ‘ అని చెప్పినది. సుప్రసిద్ధ శ్రీకృష్ణ భక్తితత్పరత కలిగి, అనేక హిందీ భజన్స్ తో ప్రసిద్ధి గాంచిన స్త్రీ భక్త మీరాబాయి. ఈమె గురువు రవిదాసు.

"మీరాబాయీ రైదాస్ కో అప్నా గురూ మాన్ తే హుఏ కహతీ హై|
   గురు మిలియా రైదాస్ దీన్హీ జ్ఞాన్ కీ గుట్ కీ||" 

అను "దోహా" ఈ విశేషానికి ఆధారమైనది.
మొదట క్లుప్తంగా భక్త మీరాకథను జ్ఞాపకం చేసుకుందాము.
శ్రీకృష్ణ భక్తి పూర్ణ ఐన రాజపుత్ర స్త్రీ మీరాబాయి. క్షత్రియవంశము యొక్క ఆ నాటి కట్టుబాట్లకు విరుద్ధంగా మీరాబాయి  ప్రవర్తన ఉన్నదని, ఆమె భక్తిమార్గం గృహిణీమార్గానికి వ్యతిరిక్తంగా ఉన్నదనీ, భావించిన పురుషులు కొందరు ఆమెను శిక్షించేటందుకు ప్రయత్నించారు. మీరాబాయి విపరీతమైన కష్టాలకు గురి ఐనా, వెరువలేదు, శ్రీకృష్ణ సంకీర్తనలను ఆపలేదు. 
హిందీ సాహిత్య మహల్ లో మీరా భజనలు (మీరా భజన్స్) సుస్థిర స్థానాన్ని సంపాదించినవి. 
ఆ మీరాబాయి 'తన గురువు 'గా ప్రస్తావించిన వ్యక్తియే రవిదాసు.

క్రిష్ణ భక్తి పారవశ్యాన, భక్త మీరా గానం చేసిన హిందీ పాటలు "మీరా భజనలు" జనులకు ఎంతో ప్రీతిపాత్రమైనవి.  భక్త మీరాబాయి యొక్క గురువు "రవిదాసు". అనే యోగి. "రై దాసు" అని ప్రసిద్ధనామం ఈయనది. రైదాసు తెలిపిన మహోజ్వల జగతి పేరే "బేగం పురా".

@@@@@@@@

గురు రవిదాసు జీవితము ఒడిదుడుకులకు లోనైనది.  నిమ్న కులస్థుడైనా, వ్యుత్పత్తి, ప్రతిభ కలిగిన  మహోన్నత వ్యక్తియై , సకల జనుల  ప్రశంసాపాత్రుడైనాడు.  
"మీరాబాయీ రైదాస్ కో అప్ నా గురు మాంతే జాన్ కీ గుట్ కీ||"
రవిదాసు తరచుగా తలచిన నామ సంకీర్తన చేసేవాడు.

********

రైదాసు/ రవిదాసు హీనకులమునకు చెందినవ్యక్తి.  కానీ ఆతని జిహ్వ నుండి వెలువడినవి అమోఘ భక్తి సూక్తులు, అవి ఎల్లరి గౌరవములను పొందినవి. రవిదాస్ అక్షరములను పలకపై దిద్దకుండానే విజ్ఞానము గడించగలిగాడు. రవిదాసును సిక్కులు "సంత్ శిరోమణి" అనీ, "సంత్ శిరోమణి రవిదాస్" అనీ ప్రేమాస్పద బిరుదులను పొందాడు. "గోబింద్" - అనగా "గోవిందుడు". రామ్ , రాజా రామ్ చంద (రామచంద్రులు), రఘునాధ్, హరి,  క్రిష్ణ, మధో (మాధవ స్వామి, మాధవుడు, భగవానుడు, భగవాన్) విష్ణు నామములలో పునః  పునః నుడివిన మాటలు ఈ నామావళి, ఈ పేర్లు దేవుని, భగవంతునికి సంబోధనలు. భక్తి కీర్తనాకారులు ఇట్లాగ కొన్ని పేర్లను ఇష్టముగా మనం చేస్తూంటారు.

అలౌకిక శక్తికి ప్రతీకలుగా ఈ రీతి పదావళి సాహిత్యశోభకు దోహదములు, అలౌకిక ఆనంద శాంతిప్రదాతలు. అతను చెప్పిన ఒక పద్యం మానవుల ఆశాసౌధాలకు పునాది. భావికాలమున ఆ పలుకులు వాస్తవ రూపాన్ని దాల్చుతాయని కవి విశ్వాసమునకు అందలి పలుకులు స్ఫూర్తి ఐనవి.

సిక్కుల ప్రబోధకులను "గురు" అని గౌరవిస్తున్నారు. "గురు రైదాస్", "సంత్ కులభూషణ్, కవి రైదాస్" - అని - గౌరవమును పొందారు. గురు రైదాస్ కవితలందున పైన పేర్కొన్న రీతిగా పరమాత్మ సంబోధనలు ముచ్చటగొలుపుతూన్నవి.

"అంతర్ కైసా, కనక్ కథిక్ జల్ తరన్ జైసా|
  బేగం పురా సహార్ ఖొ నావ్|"
  (अंतर कैसा, कनक ...... बेगम पुरा सहार नाव) 
వంటి దోహాలు గురు రవిదాసుని కదళీఫల మాధుర్య రీతిని శ్రోతలు ఆస్వాదిస్తున్నారు. రవిదాస్ పలుకులు పామరులకు సైత అర్ధం ఔతున్నవి. కనుకనే "ఆది గ్రంధము" నందు రవిదాస్ పదములు ముత్యాలకోవలు ఐనవి. సిక్కుల పవిత్రగ్రంధం "ఆది గ్రంధ". గురు అర్జున్ సింగ్ సంకలనం చేస్తూ "ఆదిగ్రంథ్" లో దాదాపు 40 రవిదాస్ పదములను పొందుపరిచారు.
"గురు మిలియా రాయ్ దాస్ జీ" అని అవి,రవిదాస్ పదములకు నామధేయాన్ని కలిగినవి. 
రవిదాస్ జయంతిని పంజాబు రాష్ట్రీయులు మార్చి నెలలో జరుపుకుంటారు.

******

గురు రవిదాసు స్వాప్నికజగత్తు "బేగం పురా" ఏ తీరుగ ఉండాలని ఆశించారు?
“నా కులమంటే అర్ధం ఏమిటి? ? పుట్టుక అంటే ఏమిటి? రామా! నేను నీ సంరక్షణలో ఉన్నాను!”  
చెప్పులు కుట్టే వాడైన రవిదాస్ ఇప్పుడు చెబుతున్నాడు.  
ఇట్లాగ బేగం పురా చల్లని నీడలో (Begumpura  "land without sorrow")

గురు రవిదాసు ఊహాలోకం గొప్ప ఆశావాదమార్గమున కదలినది. సంత్ రవిదాసు బాధాపీడితజనులకని రూపొందించిన ప్రపంచమైన 'బేగమ్  పురా' యొక్క స్వరూపాన్ని తీర్చి తీరు అమోఘమైనది. శోకరహితమై ఉత్సాహపూరితమైన ఆ చోటును “బేగం పురా” అని పిలుస్తారు. 
అక్కడ బాధ  ఉండదు, పన్నులు, సుంకములు ఉండవు, ఎవరికీ ఆస్థి ఉండదు, చెడు చేసే వారు ఉండరు, దుఃఖము, భీతి, శోధనలూ, వేధింపులూ ఉండవు గాక ఉండవు.

“ఓ సోదరా! నేను అట్లాంటి అమూల్యప్రపంచమును స్వంతం చేసుకోవడానికి వచ్చాను.
ఎంతో దూరాన ఉన్న నా ఇల్లు అది, అందులో అచ్చట నివసిస్తున్నవారు,
ఎవరి కోరుకున్న విధంగా వారు మెలగగలుగుతారు.
అవీ ఇవీ అన్ని పనులనూ చేసుకోవచ్చును,
ఊహాప్రపంచాలలో ఇచ్చవచ్చిన రీతిగా విహరిస్తారు.
ఓహ్! రవిదాసు అనే చర్మకారుడు ,,,,,,,,,,,,,,," 
(జంతు చర్మాల్ని, తోళ్ళను శుభ్రం చేసేవాడు, చెప్పులు కుట్టే వాడు -
అని ఆ మహాత్ముడు నిర్దేశించిన 'రేపటి ప్రపంచం' ఆచరణలోనికి రావడానికై  ఎల్ల జనులు, సంఘీభావనతో పురోగమించడమే ముందున్న కర్తవ్యం. బేగం పురా” అనేది అందమైన ఊహాప్రపంచము.  ఇక్కడ బేగమ్ పురా:- బేగమ్  పుర షహర్ - కు నిర్వచనము- దుఃఖము లేని ప్రదేశము. ఇది ఆదర్శ ప్రాంతము.”

@@@@@@@@

రవిదాసు నుడువులు కొన్ని:- 

 "నేను నీ సంరక్షణలో ఉన్నాను, రామా!- అన్నాడు 
                పాదరక్షా క్రియుడైన రవిదాస్."
“బేగం పురా - ఇది ఆదర్శ ప్రాంతము.”
“బేగమ్ పురానందు పన్నులు, సుంకములు ఉండవు. 
ఎవరికీ ఆస్థి స్వంతమై ఉండదు. “
“ఖేదరహితమైన ప్రదేశమే బేగమ్  పుర.  
   వేదనజాడలు ఉండని సీమ బేగమ్ పురా షహర్. “
“ఎవరూ తప్పులు, నేరపూరితమైన పొరపాట్లను చేయరు. "
  "బాధ, భీతి, వేధింపుల జాడలు ఉండని ప్రాంతము బేగమ్ పురా."

"ఓ నా సోదరా! 
  సుదూరంగా ఉన్న నా గృహం నుండి తీసుకొనుటకై వచ్చాను, 
    ఈ బేగమ్ పుర లో ప్రతి అంశముపైన హక్కు ఉన్నది. “

“మనిషి ఇదీ అదీ అనే తేడా లేకుండా అన్ని పనులనూ చేసుకోగలరు. 
తమకు ఇష్టమైన చోట యధేచ్ఛగా వెళ్ళవచ్చును. 
గాధాహర్మ్యాలకు, సుందర భవనాలకు - తిరుగాడగలరు.”

“ఓహ్! చెబుతున్నాడు రైదాస్, 
     ఒక తోళ్ళు శుభ్రం చేసే వ్యక్తి ఇప్పుడు స్వేచ్ఛా జీవి ఐనాడు.“

*******

క్రీ.శ. పదిహేనవ శతాబ్దములో సంత్ కులభూషణ్ కవి రైదాస్సు భాషితములు, 
వీరు నిర్దేశించిన ఆశావహ ప్రపంచము, అక్కడి జనులు మెలగవలసిన తీరుతెన్నులు, 
ప్రజలు గడపదగిన ఆదర్శ జీవనపద్ధతులు, ఆకాశదీపములైనవి. దిక్సూచి, మార్గదర్శినులు ఇవి.

*******
గురు రవిదాసు-బేగమ్ పురా  (Link - newaawakaaya.com)
User Rating:  / 1 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri
Saturday, 06 December 2014 17:32

Hits: 102 
**********************

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 54831 pageviews - 1002 posts, last published on Dec 5, 2014 - 2 followers
Create new postGo to post listView blog
అఖిలవనిత
Pageview chart 28914 pageviews - 743 posts, last published on Nov 30, 2014
Create new postGo to post listView blog
Telugu Ratna Malika
Pageview chart 3879 pageviews - 125 posts, last published on Nov 30, 2014

5, డిసెంబర్ 2014, శుక్రవారం

మధుబిందువులు (Review)

“మధు బిందువులు” పేరు చూడాగానే బోధపడ్తుంది, ఇవి సున్నిత భావాల కవితలు అని. 
శ్రీమతి సులోచనా సింహాద్రి చిత్రణలోని సుకుమార భావాలకు ప్రతిబింబాలు ఇందులోని కవితలు, 
ఈ మధు బిందువులు. శ్రీమతి సులోచనా సింహాద్రి 60 సంవత్సరాల వయసులో వెలువరించిన సంపుటి మధు బిందువులు. ఈ చక్కటి పేరును అనుకోకుండా అందించిన వారు డా. ఆచార్య తిరుమల. ముందుమాటలో “మధు లోచని”లో ఆచార్య తిరుమల వెల్లడించిన వాక్కులు మధు బిందువులు సంపుటికి జూకా మల్లెలై గుబాళించినవి.
“మధు బిందువులు” ని సులోచనా సింహాద్రి తన పతిదేవులు కీ|| శే|| పి. సిమ్హాద్రిగారికి photo వేసి “అంకితం” ఇచ్చారు. సులోచనా సింహాద్రి “అంకితం” లో-

 “నలుబదేండ్లు నగుమోముతో; మురిపించావు!
మాటలతో మెప్పించి మరపించావు! ………ప్రేమ దృక్కులు ప్రసరించి, నీ అడుగు జాడలలో నడిపించావు!కష్ట సుఖాలు కలిసి పంచుకున్నాము, నీలో కలిసి నీ ఆశయాలు తీర్చితి;నన్ను ఒంటరిని చేసిన ఈ కాలమునకు ఓర్చితి!అనునిత్యం నాలో నిను దర్శించి, ఆనందాశ్రువులతో నిన్ను అభిషేకించి,అంకితముగా ఈ మధు బిందువులై రాలితి!నీ పవిత్ర పదములపై వాలితి ||

- అని కృతజ్ఞతతో పేర్కొన్నారు.

సులోచనా సింహాద్రి మొదటి కవిత “నేను” ఆమె జీవిత చిత్రము అనవచ్చును.

“ఆశల అంతస్థుపై నిలిచి ఆనందించాను; ఆనందాన్ని అందరికి పంచాలని ప్రయత్నించాను,
అంతరంగంలో అనుభవాలను రంగరించాను, ఆవేదనల అగ్ని ఖడ్గాల్ని అంతం చేసాను, ఆశయాల అనుబంధాల్ని దృఢీకరించాను,
అనాధలకు ఆశ్రయాన్ని కల్పించి ఆదుకున్నాను, అనురాగ సుగంధాల్ని ఆస్వాదించాను ………” 
-అంటూ ఇలా పేర్కొన్నారు “అకారణ ఆవేశాగ్నులకు ఆహుతయ్యాను….” 
ఈ మాట పఠిత మనసును చివుక్కుమనిపిస్తుంది. ఆ తర్వాతి వాక్యం ఇది.
“అమూల్యమైన తనూజులను ఆశీర్వదించాను,
ఈ జీవిత చరమ చరణాన్ని, ఆలపిస్తున్న నేను,
నా హృదయాలయంలో, నీ ఆత్మను ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాను!
అవ్యక్తమైన అక్షర సౌందర్యాన్ని, క్షణాల అద్దాల్లో దర్శిస్తున్నాను!” – “నేను”లో ఆమె తన భర్తనుగూర్చి అర్చనా సుమమాలతో తెలిపారు.

సులోచన గారి నిష్కల్మష మానస జల’దర్శనములు’ (mirrors) ఇందులోని ప్రతి అక్షరమున్ను! ఆమె కవితల్లోనే కాక, మొదటి పేజీలలో స్నేహ మంజరీ సౌరభాలను వెదజల్లిన వాక్యాలు ఉన్నవి. “అంకితం” తర్వాతి పేజీ “ఆంతర్యం!” వచనములో ఆమె అభిప్రాయాలను నుడివారు, అవి వానజల్లుతో తడిసిన పుడమి సౌగంధాలను తెచ్చినవి. ఇందులోని దాదాపు అన్ని వాక్యాలనీ ఉటంకించవలసి వస్తున్నదీ అంటే అది ఆమె భావశబలతకు కలిగి ఉన్న గొప్పశక్తి!- అని చెప్పగలము.

“ఆవిర్భవించిన ప్రతి భావాన్ని విని ఆనందించి,
ఆశీర్వదించిన అమ్మకు అభివందనములు.
నా మనసు భావోద్రేకమయినది.
ప్రేమాభిమానాల కోసం ఆరాటం,
సాహిత్యాభిలాష, కవిత్వానందానుభూతి
నా భావాలను అందరికి చెప్పాలన్న తహతహ
నాకు ప్రేరణ కలిగించి ఈ కవితలు మనో వేగంతో జలజల రాలాయి!”

ఆమె కవి కౌస్తుభ తిరుమల గారికి, డా|| కృష్ణకుమారి గారికి (బహుశా నాయని కృష్ణకుమారి ఐ ఉండవచ్చు-kusuma), తన గేయాలను ముద్రించిన ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, విశ్వ రచన, జాగృతి, పక్ష పత్రికలు మున్నగు వారికి, అలాగే విశ్వసాహితి సంస్థ అధ్యక్షులు శ్రీ పోతుకూచి సాంబశివరావు గారికి కృతజ్ఞతలను తెలిపారు.. ఆమె – తనపై మాతృభావంతో అండగా నిలిచిన కొరుప్రోలు మాధవరావు గారికి శుభాశీస్సులు పలికారు. ఈ గేయ సంపుటి విషయంలో తనలో ఒక భావాన్ని కుసుమింపజేసిన శ్రీమతి పి.కుసుమ కుమారిగారికి స్నేహ సుమాంజలులు. అంతే కాదు! ‘నా మీద అభిమానంతో ఈ సంపుటిని మీకు అందిస్తున్న స్వరసుధ సంస్థకు, ముఖ్యంగా కార్యదర్శి మధుగారికి, అందంగా ముద్రించిన మాధవి ప్రింటర్స్-గణేశ్ బాబుకు నా ఆశీస్సులు అని పేరు పేరునా ధన్యవాదాలు తెలిపిన తీరు, ఆమె మంచి హృదయానికి ప్రతిబింబమే! తర్వాత Bio-Data ను విపులంగా ఇచ్చారు. 1927 లో జన్మించిన సులోచన గారు తమ కాలం విలువ తెలిసిన మనీషి. ప్రతి క్షణాన్నీ సత్కార్యాలకు, ఆశయ సాధనకు వినియోగిస్తూ బతుకు బాటలో ముందుకు నడిచారు.

ఈమె “మధు బిందువులు” 63 పేజీల అక్షర చిత్రములు ఉన్న బొమ్మలకొలువులు. “ప్రేమ” అనే మొదటి కవితతో ఆమె సుకుమార ఆలోచనలు కల వ్యక్తి- అని తెలుస్తుంది.

ప్రేమతో నిండిన పిలుపు కోసం, ప్రేమ లాలించే మనిషి కోసం ,
ప్రేమ కరిగిన హృదయం కోసం , ప్రేమ చూసే కనుల కోసం,
ప్రేమ నొలికించే మాటల కోసం , వేచి ఉన్నా వేచి ఉన్నా;
ఎన్నటికో ఆ తరుణం! ఎన్నటికో వీక్షణం? …..
– కర్పూరం లాంటి మధుర స్వప్నం కరిగిపోయింది…. మధుమాసం మనోహర పుష్పాల పరిమళాలు ప్రసరించింది; పూజామందిరం ఘంటల రవళుల భక్తిగానం శ్రావ్యం చేసింది” అంటూ ‘రాగంతో అనురాగం రంజిల్లిన విధానాన్ని’ పూసగుచ్చారు ఆమె. (ఐతే ఘంటల నాదము- అనాలేమో!?)

అకారాది క్రమములో ప్రేయసీ ప్రియుల ఊహలను వర్ణించిన చమత్కార వల్లరి ఇది.

అత్తరి వేచి యుండె నతడు;
క్షణమొక యుగముగ తోచుచుండె నతనికి!
ఆమె అందానికి ముగ్ధుడై వలచి విరహమొందె …….
అంకితమయి పోతి అంతఃకరణమందు,
అహ! హ! హ! ప్రేమ భంగుల వన్నెచిత్రము లింతె కాదా!

***************************,
భావ వీచికలు- ఏడు కవితలు సందేశాత్మకతతో ఆలోచనాత్మకంగా ఉన్నవి.

హిందూ సమిష్ఠి కుటుంబాన్ని కట్టి ఉంచేవి;
కఠిన శాసనాలు కావు ప్రేమపాశాలు” (-1-) అని శ్రీమతి సులోచన నొక్కి చెప్పారు.

మనసు అనే మహాసముద్రంలో; అలలు ఆలోచనలు;
ఉప్పొంగి పోయి తిరిగి;
ఆ మహాసముద్రంలోనే; అదృశ్యం అయిపోతాయి” (-7-)
అనే అందమైన వ్యక్తీకరణ.

“కవితా కాంక్ష” – “కనులకు కునుకు పట్టే సమయం కాదిది;
కనులు మూయక కాచుకునే/.......  అంతా నిశ్శబ్దం!” అన్నారు. ;

-5- కొంత నిరాశను చిప్పిల్లిన కవిత:-
“చింత లేని రోజు ఉన్నదా? … నిజానికి నిలకడ ఉన్నదా? . త్యాగానికి విలువ ఉన్నదా? స్నేహానికి హద్దులున్నవా? స్త్రీకి స్వాతంత్ర్యమున్నదా?”

-6, 7, 8, 9- భక్తి కవితలు.

దేవాధిదేవ అని స్తుతియించితి నేను ……
పరమ పావన పరాత్పరా! ….. పుణ్యాల పంటలు పరమేశు పదములు;
భక్తితో చదివితి నీ చరితం భాగవతము; హరి నామ సంకిర్తనమే నా జన్మ సార్ధకము,
నీ నామ స్మరణమే నా ఆంతర్య మందిరాంతర ప్రతిధ్వనుల సంగమం!
సంగీతమును ఆస్వాదించే తీరు (కవిత-8-) లోనిది.
సరిగమల రాగాలు సంగీతము; వెల్లువలై విరిసేను సంగీతము;
వరదలై పారేను ప్రేమ సంగీతము…….. నాదమై నా హృదయం; పొంగి పొరలేను; 
సరాగాల సంగీతముల; మానస మయూరి నాట్యమాడేను.”

*************,

ఉత్తమపురుషలోని -12- ఆమె వ్యక్తిత్వానికి ఆనవాలు.
కష్టాలలో ధృతిని వీడకుండ, తన వారికి సైతం మార్గదర్శనం చేయగల ప్రౌఢ వనితగా ఆమె ద్యోతకమౌతుంది.

నీ చిఱునవ్వును నేనే! నీ అశ్రుబిందువును నేనే;
కంటకాల మధ్య వికసించిన పూవును నేనే ;
నడుమ నీటిలోని నీ ప్రతిబింబాన్ని నేనే;
నిను వీడని నీడను నేనే;
నిను వీడి సోపానముల నెక్కినది నేనే;

నీ జీవనసాగరంలో నావను నడిపినది నేనే;
సంసారపుటెడారిలో దారి చూపినది నేనే;
నీ మోడై పోయిన జీవితాన్ని చిగురించినది నేనే;
నీ చీకటి జీవితానికి దివ్యమైన జ్యోతిని నేనే ; –

నీలో కోటి దీపాలు పెరిగించింది నేనే ; నీవు నేనే , నేను నీవే!”

******************************,
ఆ ప్రతి అణువు నొక రసతరంగిణీ భావమై;
ఆ భావములు నదులై పారు, జలధిలో అలలులా పొరలిపోవాలి;
నా కన్నీటి గాధ లేమని వివరింతు;
వినే వారెవ్వరు? విస్మరించేవారే గాని!

(-6-) పరమ పవిత్రమైన ప్రేమను పొందితి;
నిన్ను పరిణయమాడి; నలుబది వత్సరములు;
నాల్గు క్షణములా అదృష్టము;
భోగ్యనయితి భాగ్యనైతి; నీవు లేక అభాగ్యనైతి;
జీవితాన్ని భరించుట ఇక ఎటులనో!"          - 6 –— (పేజీ 47)

*******************;
ఈ లోకం (-3-) స్త్రీ మూర్తిమత్వమును రూపు దిద్దిన ప్రయత్నం చేసారు.
స్త్రీ మాతృ మూర్తి ; స్త్రీ సౌందర్య మూర్తి;
ఆమెలో ఏం చూస్తావు?; ఓ మానవుడా! —
ఆమె త్యాగము, ప్రేమ; అణువంత నీలో ఉందా?;
ప్రేమలోనే పుట్టి ప్రేమకోసమే త్యాగం చేస్తుంది……… .

అని చెబ్తూ ఆమె కవిత్వ శైలిలో కొత్త దనాన్ని ప్రవేశపెట్టారు. ఒక పట్టికలాగా అనిపిస్తుంది కానీ, సొగసైన బొమ్మలకొలువు వంటి పదముల కూటమి ఇక్కడ ఉన్నది.

“అందము ఆనందము; ప్రళయము ప్రణయము;
ప్రశాంతము ప్రావీణ్యము; రౌద్రము రసజ్ఞత;
శాంతము శౌర్యము; ధీరత్వము దీనత్వము;
ఛిద్రూపి బహురూపి; మిళితమైన స్త్రీలో ఏం చూస్తావు?; ఓ మానవుడా!’…..
ఆమె త్యాగము, ప్రేమ; అణువంత నీలో ఉందా?
ప్రేమలోనే పుట్టి, ప్రేమ కోసమే త్యాగం చేస్తుంది”

**************
వృద్ధాప్యము జీవితములోని అంతర్భాగము, నిరాశతో గడపకూడదు, ఆదర్శముల ఆచరణకై ప్రయత్నించాలి. ఈ కాన్సెప్టు కలిగిన వారు ధన్యులు. ఆమె సానుకూల దృక్పధము ముదావహం. “చిగురుటాకులో ఉన్న అందం; పండుటాకులోనూ ;ఉండటమే జీవనలీల, 
సొగసును ఆనందించగలగడమే జీవితానికి అర్ధం; ఇదే సుమా! పరమార్ధం!

***************
పదే పదే ఒకే పదమును ఉపయోగించడం పద్య, కవితలకు, 
ఒకింత సొబగు మెరుపును తెస్తుంది. 
జీవితం:- శీర్షిక లోని పూ గుచ్ఛములు; పద వాక్యాలు:

"రుధిరం ఎఱుపు; క్రోధం ఎఱుపు; వెలుగు తెలుపు;
శాంతం తెలుపు; ఆకులు పచ్చన; ఆనందం పచ్చన;
చీకటి నలుపు; దుఃఖం నలుపు; 
రంగు రంగుల భావాలే జీవితం."

“ఓ జీవితమా! మనసు లేని; మమత లేని నీవురాబోకు; 
నా హృదయం లోకి; నా దరి చేరకు, నీవు రాబోకు ..” ఈ పై భావం కాస్త తికమకగా ఉన్నది.

జీవిత సమరంలో సాహసం; సంతోష సాగరంలో సంగమం; 
హాస్య లాస్యాలతో హర్షం; క్రోధానలంలో హిమ బిందువులు;…….
జాలిగుండెలో కరుణామృతము; జాలువారుగా ప్రవహించి;
పిల్ల కాలువలై విరిసి నదులై పారి; మహాసముద్రంలా పొంగిపొరలాలి.

చుక్కాని లేని ఓ జీవితమా! సంసార సాగరాన మునిగితివా; 
విజ్ఞానం అనే ఓడలో; వైరాగ్యం పొంది; భగవధ్యానం తెడ్డుగా స్వీకరించు; 
అదే జీవితానికి పరమావధి

**************;

-8- ‘జీవితం ఒక కొలను; వానజల్లుకి కొలను ఉప్పొంగుతుంది .. …
నిడివి తెలియని జీవితం; తన ప్రతిబింబాన్ని కొలనులో తనివార చూస్తుంది

**************
భగవానుని సాక్షాత్కారమునకై పరితాపం కవితలలో నిబద్ధపరిచారు ఈమె. (పేజీ24):
“ఈ జీవకోటిలో నీవొక; పరమాణువువి; దానిలో ఐక్యమై పో”

-11- “ఏటి కా దరి నీవుంటి; ఏటికీ దరి నేనుంటి; జగమంతా నీలోనే ఉన్నది;
నీ దరి చేరుట నెటులో; నావ లేదు, ఈదగ లేను;
నీ దరి చేరుట ఎటులో; మార్గము చూపుము దైవమా!

అలతి అలతి పదాల కూరిమి కవిత ఇది.
************,
సంఘ సేవా కార్యక్రమములలో క్రియాశీలతతో పాల్గొన్న ఈమె – 
ఈ కవితలో వెలిబుచ్చిన దేశ భక్త్యావేశసంరంభభావాలు ; దేశభక్తి దీప్తిగా -
దేదీప్యమైన దీపము వెలిగించు;
తేజముతో ప్రజ్వరిల్లు దీపము వెలిగించు;…
దేశ సౌభాగ్యాన్ని వెలిగించు;
వెలిగించు, వెలిగించు;
దివ్యమైన దీపము వెలిగించు;
అంటూ సందేశం ఇచ్చారు కవయిత్రి

*****************,;
కలియుగం:-
వసుధైక కుటుంబకాన్ని వాస్తవ చిత్రంగా దర్శించండి’ – అన్నారు. 
వృద్ధాప్యం చరమాంకంలో పలకరించే దశలో కవయిత్రిగా కదిలేభావాలను సులభంగానే చిత్రించగలిగారు. ఆమె కొన్నిసార్లు భవ్య ఆశావహ దృక్పధాన్ని వెల్లడించారు. 
మరి కొన్నిసార్లు నిరాశా వాక్కులు వెల్లడి చేసారు.
ఈ వృద్ధాప్యంలో నా జీవితం ఎవరి కోసం?;
ఓ జీవితమా! నీకు పరిహాసమా?;
జీవిత సంధ్యలో ప్రేమానురాగాల కోసం;
కొట్టాడుతూ ఈ నిశీధి గుండెలో;
ఒంటరి తనం భయంకరంగా వెంటాడుతూంది! ……
…నేనిక ఓర్వ లేను దైవమా!; నీ దరి చేర్చుకో;

******************,
సరోజినీ నాయుడు పద్యం వంటి చక్కని కవిత- “నడుస్తూంది జీవితం”:
యవ్వనంలో – పచ్చనిచివురులు,
పసిపాపల ముద్దులొలికే మాటలు;
వయసులోనే, కొడుకులు, కూతుండ్రు మనవల; ప్రేమానురాగాలు, మమకారాలు;
వృద్ధాప్యంలో ఎండిన ఆకులు, చలనం లేని శిలలు;
చేయూత నిచ్చే సమయాన వారి మాటలు; హృదయాన్ని దహించే ఆరని మంటలు'

కొన్ని సార్లు నిరాశా వాక్కులను సులోచనా సింహాద్రి కలం నుండి వచ్చినవి. 
కొన్ని పోలికలు నైస్. “మేలలో దొరకని తాయిలం లాంటిది” (పేజీ 31); 
పండుగలనూ, పసి పిల్లలనూ ఇష్టపడే సులోచనా సింహాద్రి తన భావాలకు 
“అక్షర రూపము”ను ఇచ్చారు. 
ఐతే నేటి సమాజంలోని ఆర్ధిక అసమానతలను కూడా కవితాత్మకంగా విశ్లేషించారు.

తేజంతో ప్రజ్వరిల్లే చిచ్చు బుడ్లా?
హృదయాల పొంగి పొరలే ఆశ నిరాశల అఘాధాలా;
ఏది దీపావళీ? ఏది దీపావళీ?’ (page 32);

**********************;

భోగి పండుగ వచ్చింది; చలిచలి గిలిగిలిగిలి;
భోగి మంటలు; ఎక్కడ చూసినా భోగి మంటలు;
బాలికల పట్టు పావడాల గరగరలు;
నవ వధూవరుల నును సిగ్గు దొంతరలు;
అలంకరించిన బసవన్నల డూడూలు;
రైతన్నల పల్లెపదాలు; పసిడి ఛాయల ధాన్య రాసులు, భోగి పండుగ వచ్చింది..
అని తెలుపుతూ, శ్రీమతి సులోచనా సింహాద్రి

మేలు కలయికలు” లో
రేగుపండ్ల పులుపుతో కొత్త చెఱకు తీపి మేళవింపులు, గానకచ్చేరీలు;
హరిదాసు మేళ తాళాలు; శిల్ప కళలు బొమ్మల కొలువులు;
సంక్రాంతి కవి సమ్మేళనాలు; పాతకొత్తల మేలు కలయికలే;
మన భోగి పండుగ” మానసోల్లాసముతో’ అన్నారు.

కనుమరుగౌతూన్న అందమైన సంప్రదాయాలను 
పాఠకుల నేత్రాలలో బొమ్మ కట్టిస్తూనే ఉంటాయి ఇలాటి చక్కని పదచిత్రాలు ఎన్నో!

పసిపాప కిలకిలలు:-
పసిపాప కిలకిలలు; సెలయేటి గలగలలు;
అమ్మ చిరునవ్వులే; చిరుగాలి రెపరెపలు;
చెట్ల గుబురులో చిరుగాలి రెమ్మల రెపరెపలు……
ఈ భావాలు అన్నీ ‘మనసు వింతగా గతంలోకి జారుకున్న వైనము మనల్ని చకితుల్ని చేస్తుంది.

-2- “నా పాలు త్రాగి ఆనందంతో కేరింత లేసిన; నా పాపవేనా నీవు?
నీ వొడిలో పాపను చూసి నీవే తల్లివైనావని మురిసేను;
నా పక్కన గ్రక్కున నా వొడి లో చేరి కొంగులో;
తలదాచుకున్న ముద్దులొలికే పాపడవేనా నీవు:
తలనెరసి పిల్లల తండ్రి వైనందుకు గర్వించాను;
అలనాడు చూసిన మీలోని నా పాపలంతా ఏరి? ఏరి? ఎక్కడ?

- 3 – “చిన్నారి పాపల్లారా! చిట్టి చిట్టి పాపల్లారా!! అందరూ రారండి!
అందమైన పాపల్లారా! రారండి! రారండి!
అల్లరి చేద్దాం! అమ్మ వొడిలో చేరుదాము! అందరూ రారండి!” ( page 35 )

శ్రీమతి సులోచన ఆధునిక స్త్రీ- గూర్చి, పాతతరంవాళ్ళకు ఉండే ఒపీనియన్సునే చెప్పారు. 
ఇంగ్లీష్ మాటలను తెలుగు లిపితో ఇచ్చిన పద్ధతి కాస్త నవ్వు తెప్పిస్తుంది.

చీరలు రవికలు పోయి; జీన్స్ టీ షర్టులు వచ్చె;
వాలుజడలు సిగలు పోయి; బాబ్ కట్స్ వచ్చె;
పసుపు పారాణి పోయి; స్నోలు పౌడర్లు మేకప్ లు వచ్చె;
కళ్ళకు కాటుక పోయి; ఐ లైనర్లు వచ్చె; తాంబూలం పోయి;
లిప్ స్టిక్ వచ్చె పెదాలకు;
చేతులకు కాళ్ళకు; మేనీక్యూర్ పెడిక్యూ ర్ /; ….
అంటూ తనవైన కొన్ని అభిప్రాయాలను నిష్కర్షగా చెప్పేసారు.
శ్రీమతి సులోచనా సింహాద్రి ఇలాగ – 
‘ప్రేమలు తక్కువ షోకులు ఎక్కువ; సంసారం పట్టించుకోరు’
**************
ఊహాలోకం:-
ఏ లోకంలో నీవు నేను కలుసుకున్నాము;
ఆ లోకంలోనే మళ్ళీమళ్ళీ కలుసుకుందామా?’ –
అంటూన్న శ్రీమతి సులోచన గారి ఆందోళనలలో కొంత కన్ప్యూజన్లు ఉన్నవనిపిస్తుంది.

వద్దు! వద్దు! విడిపోవద్దు!
మరల మరల కలుసుకుందాము; ఈ లోకంలో…..

కొంత అస్తవ్యస్తంగా అనిపించినా, సౌమ్యత అంతస్సూత్రంగా సులోచన గారి “ఊహాలోకం” సాగినది.

కనుల నీరు నిండెను; కాననంలో దారి కానరాకున్నది;
మబ్బు క్రమ్ముకుని చీకటయినది; హృదయంలో అలజడి చెలరేగినది;
ముఖాన స్వేదబిందువులు రాలుచున్నవి; దారి చూపు దైవమా;
పతి లేని, వొంటెరి దాన్ని!; దారి చూపు దైవమా!” {10} ;
**************
మనసులో కన్నీటి అంజలి :- 
అనే విభాగంలో ప్రతి అక్షరము- కన్నీటి తేమగాలి తాకిన ఆర్ద్రతా నీరదమే!
-2-
“నాహృదయం విచ్ఛిన్న మయిపోతూంది; ఓర్చుట నెటులో;
నీవు విడనాడి నాల్గు వత్సరములు గడిచినవి;
నేను నీ వియోగ మరి నెట్లు ఓర్తునో; (ది ~ రి?)
ఐక ఎన్ని రోజులీ జన్మ; ఈ అశ్రువుల కంత మెపుడో;
నాల్గు వత్సరముల నాడు నీ వెంతయో; నాలుగు గంటల సమయంలో; 
నాతో బాసలు చేసితివి; మరి కొన్ని గంటలకు; నీ అసువులు బాసితివి...........'
(బాపి – అని ముద్రారాక్షసం ఇక్కడ - ksm ):
నా అశ్రువులు ధారలై పారుతున్నవి;
నీ అనుంగు పుత్రుల నడుమ నను విడిచితివి;
ఔర! ఏమి సేతు? నేనేమి చేతు!
నేనేమి తప్పిదములు చేసినానో క్షమియింపుము;
నన్నీ బంధాల నుండి విముక్తి చేయుము;
ఓ నాధా! ఓ దైవమా!

-3- “ఈ అవనిలో ; అనంతమయిన (నీ) అనుబంధం; 
అనుక్షణం (నా) అంతరంగంలో; ఆరాటం; ఆనందం; అనుభవము; ఆశ్రయం; 
అనురాగం; – మరపురాని మధుర క్షణాలుగా; 
మమతల మల్లికా సుమాలుగా నిలిచి మనసు; 
బృందావనిన పరిమళాలను వెదజల్లుతున్నాయి ప్రతి నిముషము! 
ప్రతీ క్షణం; నీ లాస్యం మరువలేను; 
నీ తీక్షణ వీక్షణం; నా కనులలో నిలిచినవి; 
నా హృదిలో అలజడిని; 
అశ్రువుల జడివాన కొలుచుచున్నది.

**************************,

-16- నీ చిరునగవు నా చిదానందాలు;
నీ కనుసన్న నా మధుర బాసలు;
నీ అడుగు జాడ నా రాజమార్గాలు

-18- మమతలే నింపావు జీవితంలో;
చివరికి మధుర స్మృతులే నిల్పినావు;
ఏ తీరు ఏ తెన్ను కానరాకున్నాది;
నా అధరాలు అదురుతున్నాయి;
నా మేను వణుకుచున్నది ;
నాలోని శక్తులుడిగినవి; జీవచ్ఛవమైతి;
నా కేది దారి? నీ పాదముల చెంత చేరుటకు;
ఎవరు? ఎవరు ? నాకీ శిక్ష విధించారు;
నేనే పాపము చేసితో;
పరమపద సోపానముల నే రీతి ఎక్కుదును;
నీ దివ్య దర్శనమెప్పుడో?
ఈ నిశీధి ఆర్ణవంలో జ్యోతుల నెక్కడ గాంచెద;
కాలం కదలిపోతూంది; {చెద;}
జీవితం ఆగేదెప్పుడు? ……
కథలు కారుణ్యాలయి; గాధలు అగాధములయినవి;
నా మొర లెవరాలకింతురు?

************************************,
-19-   ఈ మనసు ఏల? ఈ మమకారాలు ఏల?
        “నీలి నీడను నడుస్తాను: నీ ఛాయను చరిస్తాను :
          నీ హృదిలో హర్షిస్తాను; ……..?”

-23-“మరువలేను నిన్ను;
మలుపు లేదు నా మనుగడలో; …”
-24-  ఓ విధీ! ఏమిటి నీ నిర్ణయం:
ఓ మదీ! ఏమిటి నీ ఆశయం:
ఓ తుదీ! నీదే గెలుపు.”

-25-  నీ చెంత నేనెంత; నీ లోకమే నా లోకము;
          నీ చెంత నేనెంత? ఆవంత గాక! అణువంత గాక!
 -27- పగిలెను హృదయ కలశము; అతుకుట ఎటులో

“సులోచనా సింహాద్రి గారి అంతరాంతరాళలో నుంచి 
ఉవ్వెత్తున ఎగసిపడిన భావ తరంగాలు ఇవి.  
అందుచేతనే ఇందులోని ప్రతి అక్షరాన్నీ ఉటంకించవలసి వస్తూన్నది. 
ఆమె జీవిత కాంచన కలశం లో నింపిన కవితా సీమలో 
చిలికిన విషాదముతో కూడిన తీపి గత స్మృతుల మధు బిందువులు ఇవి.

-28- నీవేనా ; నా హృదిలో;
నా మదిలో; నీవేనా;
అనురాగ మాలికలు అల్లినది;
వివిధ కుసుమాల; సుగంధాలు వెదజల్లినవి;
అవి ముత్యాల సరాలై; నా కంఠాన్ని అలంకరించినవి;
అవి రత్నాల రాశులై; నా హృదయాన్ని స్పృశించినవి;
ప్రతి ముత్యం ఒక ప్రేమ వాక్కుగా;
ప్రతి రత్నం ఒక ప్రేమ దృక్కుగా;
ప్రతి పుష్పం ఒక అనురాగ బంధంగా వెలిసినది; ;
ఆ చూపులే నన్ను అయస్కాంతంలా ఆకట్టుకున్నాయి;
అవి మరువరాని మధురానుభూతులైనాయి;
ఆ తీరాలు పవిత్రమయినవి;
ఆ ప్రేమ ఫలించి ఆ నోము పండింది;
ఆ చూపులే జీవిత పధాన్ని నడిపించినవి;
అయినా; ఈ నాడు జీవితంలో
ఆ చూపులే కానరావు ఇక. (58 పుట);

“సులోచనా సింహాద్రి తన మనవళ్ళకు పంచిన మాధుర్యాలు; 
నా ముద్దుల మనుమడు స్వధీప్ ను ఉద్దేశించి:- అనే కవిత ఉన్నది.

నా కనులు నిను లాలించెనోయి
నిదుర పోవోయి;
నీ కనులలో నా మమత కురియుచున్నాది;
నా కనులలో నీ నవ్వు వికసించెనోయి;
నా హృదయమంతా నీ నవ్వు వికసించెనోయి;
నీ కోసమే నా జీవితమోయి ;
నా కోసమే నీవు ఉద్భవించావోయి;
నాతో నీ తెలిసి తెలియని బాసలు చేసేవోయి  ||

నీ ముద్దుల మురిపాలతో; మురిపించావోయి;
నీ లాలింపు కోసమే నే గానం చేసానోయి;
నా కనులు నిను లాలించెనోయి

*******************************,

అమ్మ:- అనే శీర్షిక – 'కవిణి' ఎడదలోని సౌకుమార్య భావ నళినముల విరబూతలు;

అమృతమయమయిన ప్రేమనిచ్చిన అమ్మవు;
మమత నిచ్చిన మాతృమూర్తి వీవు;
కష్టముల కోర్చి త్యాగము చేసిన త్యాగమూర్తివీవు;
కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాని ప్రార్ధిస్తూ;
ఈ నీ డెబ్భయ్యవ సంవత్సరములో,
రిక్త హస్తములతో;
నీ పాదములకు నమస్కరిస్తున్నా;
మా తల్లి చల్లని చూపులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తున్నా

ఇక్కడ తన యొక్క కన్నతల్లిని గూర్చిన కవితనూ, 
అదే పట్టున – తానే అమ్మ ఐ, తన బిడ్డల పట్ల బాధ్యతలను నేరవేర్చినట్టి జననిగా 
తన ఆచరణలనూ ఒకే సూత్రంలో కూర్చారు సులోచనగారు,
రెండింటికీ విడిగా ఉప శీర్షికలు పెడ్తే బాగుండేదేమో!?

ఆనందమయిన అమ్మగా;
ప్రేమమయమయిన అమ్మగా;
ముద్దులు కురిపించిన అమ్మగా;
మీ ఆశలు తీర్చిన అమ్మగా;
మీ విద్యాబుద్ధులు గరపిన అమ్మగా;
మీ అభివృద్ధి ఆశయంగా అలరించాను;
మీ కాంతి నిచ్చే కనులలో;
మెరసిపోతున్న మురిపాలు;
రునగవుల దరహాసములు;
ముత్యాల పలుకుల జల్లులు;
ముఖాన్న చిందేటి అందాలు;
నా జీవితానికి మేటి అలల నురగల వెలుగుతళుకులు;
నా మేటి మేధావి పుత్రుడవు సుధీర!
నా బంగారు కలలే పండించావు శోభ!
నా జీవితానికి రేఖనే గీచావు సురేఖ!
నా ఆశయాలకు రూపాన్నిచ్చేవు స్వరూప!”- (page 62) ;

మధు బిందువులు:- అనే కవితను కొసమెరుపుగా చేర్చారు.

వసంతాన్న ప్రేమ చిగురించె మమకారాలు –
ఆనందం అర్ణవమై;
శిశిరం మంచు కరడు కట్టిన హృదయమై;
హేమంతాన్న హృదయం కరిగి
అనుభవాల అనుబంధాలతో అలరారి;
గ్రీష్మంలోఅశ్రుపూరితమై;
లోకం పోకడలను గుర్తించే జీవితము;
ఈ జీవిత ఋతువుల విశ్లేషణే;
భావ పరంపరలై మదిలో వీచికలై;
కవితలై ఉద్భవించిన మధు బిందువులు
****************************

జనవరి 1993లో 500 ప్రతులు ముద్రణ జరిగింది.
అప్పటి అడ్రసు: -
కృష్ణపురి కాలనీ. 38- వెస్ట్ మారేడుపల్లి, సికిందరాబాదు;
****************************
;

;
Title:Madhu binduvulu ;Author:Sulochana Simhadri
మధుబిందువులు;;;;;;;;;
More articles by అతిథి » Written by: అతిథి 
Tags: Articles by Kadambari, spotlight
madhu binduwulu; 2014 April;photo (3)
వ్యాసకర్త: కాదంబరి
******
1) మధుబిందువులు  (link- pustakam. neT ) :-  
http://pustakam.net/?p=16733  
 మధుబిందువులు
 మృదుల భావనలు 
2) More articles by అతిథి ;&related articles, pustakam (LINK) 

    శృంగార నైషధము” విశ్లేషణ – కొల్లా శ్రీకృష్ణారావు




















3) మధుబిందువులు  (link- jalleda )
వ్యాసకర్త: కాదంబరి ****** “మధు బిందువులు” పేరు చూడాగానే బోధపడ్తుంది, ఇవి 
సున్నిత భావాల కవితలు అని. శ్రీమతి సులోచనా సింహాద్రి చిత్రణలోని సుకుమార 
భావాలకు ప్రతిబింబాలు ఇందులోని కవితలు, 
ఈ మధు బిందువులు. శ్రీమతి సులోచనా 
సింహాద్రి 60 సంవత్సరాల వయసులో వెలువరించిన సంపుటి మధు బిందువులు. 
ఈ చక్కటి పేరును అనుకోకుండా అందించిన వారు డా. ఆచార్య తిరుమల. 
ముందుమాటలో “మధు లోచని”లో ఆచార్య  
****************************************, 
పి. సులోచనాసింహాద్రి (NAME -  వికాసధాత్రి ) - link 

అఖిలవనిత
Pageview chart 28845 pageviews - 743 posts, last published on Nov 30, 2014
Telugu Ratna Malika
Pageview chart 3861 pageviews - 125 posts, last published on Nov 30, 2014
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 54575 pageviews - 1001 posts, last published on Nov 28, 2014 - 2 followers

57565 - konamanini blog views - 11:08 AM 12/5/2014

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...