12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

రామస్వామి దీక్షితులు కనిపెట్టిన “హంసధ్వని రాగము”

-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-



కర్ణాటక సంగీత సరస్వతీదేవి కిరీటములో పొదిగి ఉన్న
త్రి రత్నములు శ్రీ త్యాగరాజు, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామశాస్త్రి గార్లు.

ముత్తుస్వామి జనకుడు శ్రీ రామస్వామి దీక్షితులు,
“హంసధ్వని రాగమును” కనిపెట్టిన మేధావి.
ఈ భక్త శిరోమణి “ కాశ్యప” సగోత్రీకుడు.

అతని పూర్వీకులు ( గోవింద దీక్షితులు నిర్మించిన అగ్రహారము ఐన) గోవిందపురములో
రామస్వామి క్రీస్తు శకము 1735 లో జన్మించెను.
వేంకటేశ్వర దీక్షితులు, భాగీరథి అతని తల్లి దండ్రులు. వారు 1751లో పరలోకగతులైరి.
పిమ్మట రామస్వామి తంజావూరునకు వెడలెను.
అచ్చట రాజాస్థానములో సంగీత విద్వాంసుడు వీరభద్రయ్య వద్ద
రామస్వామి సంగీతవిద్యను అభ్యసించి, తిరిగి తన స్వగ్రామమునకు వచ్చెను.
సంగీతము పట్ల గల అమిత జిజ్ఞాసతో, అనురక్తితో,
మరల విద్యాభ్యాస ప్రయాణమును కొనసాగించెను.
మధ్వార్జున క్షేత్రమునందు వేంకట వైద్యనాథ దీక్షితులు అనే వైణికుడు నివసించు చుండెను.
వెంకట వైద్యనాథ దీక్షితులు యొక్క పూర్వీకుడు “వేంకటమఖి”అమోఘ పండితుడు;
వేంకటమఖి రచించిన “ చతుర్దండి ప్రకాశిక”
కర్ణాటక సంగీతము నేర్చుకొను వారికి కరదీపిక వంటిది.

వేంకట ముఖి 72 మేళ రాగములను సూత్రీకరించెను.
తనను ఆశ్రయించిన రామస్వామిలోని భక్తి శ్రద్ధలకు, సంగీతము పట్ల ఆసక్తి
వైద్యనాథులకు ఎంతో నచ్చాయి.

తన పూర్వీకులు ఒసగినట్టి, ఆ జన్యు రాగ సంపదలను,
వైద్యనాథ దీక్షిత పండితవరేణ్యులు నిష్కామముగా బోధించెను.
రామస్వామి సంగీత విద్యలను క్షుణ్ణముగా అభ్యసించెను.
స్వయంకృషితో రామస్వామి దీక్షితులు కనిపెట్టిన “హంసధ్వని రాగము”
కర్ణాటక సంగీతసీమలో ప్రాచుర్యము పొందినది.
వేంకట వైద్యనాథులు, రామస్వామి దీక్షితులు ఇద్దరూ అపురూపమైన గురు శిష్యులే!
వారు ఇరువురూ పరస్పరమూ పౌర్ణమి చంద్రుడు, పాల వెన్నెల వంటి వారు.

{ Telusaa!

హంసధ్వని రాగం

By kadambari piduri, Dec 21 2009 11:49PM }

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

హంస ధ్వని రాగము లో శ్రావ్యమైన ఒక త్యాగ రాయ కృతి ఇది;


అబీష్ట వరద ;;;
రాగం: హంస ధ్వని ;
29 - ధీర శంకరాభరణం జన్య ;
ఆరోహణ: స - రి 2 - గ3 - ఫ - ని3 - శ ;
అవరోహణ: స - ని 3 - ప - గ 3 - రి 2 - స ;
తాళం: ఆది
త్యాగరాజ కృతి ;

(పల్లవి) ;

అభీష్ట వరద శ్రీ మహా గణపతే ఆగమ
వేదాంత్యంతరహిత పతే || అభీష్ట ||

(అనుపల్లవి ):

కవీంద్ర రవి వినుత
కనక మయ దివ్య చరణ
కమలములు నమ్మితిని ||అభీష్ట ||

(చరణం ) :

ముక్తి మార్గమునకు మొదటి దైవము
నీ శక్తి సుముఖత భక్తులగు వారికి
సిద్ధి బుద్ధి వర ఫలము నొసగిన
సద్గురు శ్రీ త్యాగ రాజు పొగడిన ||అబీష్ట ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


వందేహం జగద్వల్లభం దుర్లభం
మందర ధరం గురుం మాధవం భూధవం

నర హరిం మురహరం నారాయణం పరం
హరిం అచ్యుతం ఘన విహంగ వాహనం
పురుషోత్తమం పరం పుండరీకేక్షణం
కరుణాభరణం కలయామి శరణం

నంద నిజ నందనం, నందక గదా ధరం
ఇందిరా నాధ మరవింద నాభం
ఇందు రవి లోచనం హిత దాస పదం
ము-కుందం యదు కులం గోప గోవిందం

రామ నామం యజ్ఞ రక్షణం లక్షణం
వామనం కామితం వాసు దేవం
శ్రీ మదావాసినం శ్రీ వెంకటేశ్వరం
శ్యామలం కోమలం శాంతమూర్తిం



7, ఫిబ్రవరి 2010, ఆదివారం

నిఘంటు మణి వేదిక { స - హ - sa - ha }

-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-



niGaMTu maNi vEdika ( sa ) ;;;;;

@) saMvat = saMvatsaramu ;
@) saMkhyaM = yuddhamu ;;;;;
@) saMKyaa = vichaaraNa , lekka ; aatma j~naanamu ;;;;;
@) saMKyaavat = paMDituDu ; kavi ;
@) saMdhyaa = suuryOdayamunaku pUrvamu aidu GaDiyalu,
mariyu – sUryAstamaya pUrvamu mUDu GaDiyalu ;;;

@) sapaada = okaTiM baavu ; [ 1 + paavu ::
@) saptama = EDavadi ,
@) saptati@h = Debbhai (# sevan #)/ Debbadi (# seventy #);;;
@) samaa = saMvatsaramu (# year#)sahasraM = vEyi / veyyi ,,, sahasra kiraNa@h = vEyi kiraNamulu kaliginaTTi vaaDu,, anagaa “ suuryuDu ‘ ;;; sahasraakshuDu + iMdruDu (# iMdra, the king of Heaven had thousand eyes #) ;;;

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

[ itaramulu } ;;;;;;;;

@) saMKyaM = yuddhamu .
@) saMKyaa + aatma j~naanamu ;
@) saMKyaavat = paMDituDu;
@) saMva patha@h = Uru;
@) saMlApamu = parasparamu kaburlu,maaTalaaDukonuTa;
@) saMvaada@h = saMBAshaNamu;
@) saMSlEsha@h = aaliMganamu;
@) saMsad =saBa;
@) saMsaara@H = prapaMchamu;
@) saMsRti@h = saMsAramu;
@) saMsRshTi@h = kalayika;
@) saMsthaa = uniki;
@) saktu@h = pEla piMDi;

@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@

{ నిఘంటు మణి వేదిక స ;;;;; }

@) సంవత్ = సంవత్సరము ;
@) సంఖ్యం = యుద్ధము ;;;;; సంఖ్యా = విచారణ , లెక్క ; ఆత్మ జ్ఞానము ;;;;;
@)సంఖ్యావత్ = పండితుడు ; కవి ;
@) సంధ్యా = సూర్యోదయమునకు పూర్వము ఐదు ఘడియలు, మరియు – సూర్యాస్తమయ పూర్వము మూడు ఘడియలు ;;;

@) సపాద = ఒకటిం బావు ; [ 1 + పావు ::
@) సప్తమ = ఏడవది ,
@) సప్తతిః = డెబ్భై ( sevan )/ డెబ్బది ( seventy );;;
@) సమా = సంవత్సరము ( year)సహస్రం = వేయి / వెయ్యి ,,,
@) సహస్ర కిరణః = వేయి కిరణములు కలిగినట్టి వాడు,, అనగా “ సూర్యుడు ‘ ;;;
@) సహస్రాక్షుడు = ఇంద్రుడు ( iMdra, the king of Heaven had thousand eyes )

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


[ ఇతరములు } ;;;;;;;;

@) సంఖ్యం = యుద్ధము .
@)సంఖ్యా = ఆత్మ జ్ఞానము ;

@) సంఖ్యావత్ = పండితుడు;
@) సంవ పథః = ఊరు;
@) సంలాపము = పరస్పరము కబుర్లు,మాటలాడుకొనుట;
@) సంవాదః = సంభాషణము;
@) సంశ్లేషః = ఆలింగనము;
@) సంసద్ = సభ;
@) సంసారః = ప్రపంచము;
@) సంసృతిః = సంసారము;
@) సంసృష్టిః = కలయిక;
@) సంస్థా = ఉనికి;
@) సక్తుః = పేల పిండి;

@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@@@

niGaMTu maNi vEdika ; sa - ha - # sa - ha # ; ;


@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@

@) haTTa@h = aMgaDi , koTTu , baDDI koTTu #shop # shaapu ;;;; vipaNi = #market # ;
@) hATakaM = baMgaaramu; aparaMji; pasiDi; svarNamu; suvarNamu; hEmamu;kaaMchanamu;
@) haridraa = pasupu
@) haayana@h = saMvatsaramu;
@) hari@h = pachchagaa unnadi ; vishNuvu ; iMdruDu; siMhamu; kOti, gu~r~ramu;
@) hvaanaM = pilupu;
@) Harit = pachchani;
@) haya@h = turagamu/ #horse#;
@) harmyaM = bhavanamu; ( gagana harmyamulu ) #building#

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

{ నిఘంటు మణి వేదిక ; హ - ha } ;;;;;

@) హట్టః = అంగడి , కొట్టు , బడ్డీ కొట్టు shop షాపు ;;;; విపణి = market ;

@) హాటకం = బంగారము; అపరంజి; పసిడి; స్వర్ణము; సువర్ణము; హేమము;కాంచనము;
@) హరిద్రా = పసుపు
@) హాయనః = సంవత్సరము;
@) హరిః = పచ్చగా ఉన్నది ; విష్ణువు ; ఇంద్రుడు; సింహము; కోతి, గుఱ్ఱము;
@) హ్వానం = పిలుపు;
@) హరిత్ = పచ్చని;
@) హయః = తురగము/ horse;
@) హర్మ్యం = భవనము; ( గగన హర్మ్యములు ) building

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

4, ఫిబ్రవరి 2010, గురువారం

Chitravalokanam జంగిల్ బుక్ - సబూ దస్తగిర్ By kadambari piduri, Jan 18 2010 11:41PM

-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-



హాలీవుడ్ సినీ లోకంలో Rudyard Kipling లబ్ధ ప్రతిష్ఠుడు.
ఆతని "Jungle Book "పిల్లలనూ, పెద్దలనూ అలరించినది.

ఇటు బాలీవుడ్ కూ,అటు హాలీవుడ్ కీ వారధి లాంటివి
రుడ్యార్డ్ కిప్లింగు ఇంగ్లీషులోని రచనలూ, వాని సినీ రూపాలూ !
రుడ్యార్డ్ కిప్లింగు రచనల ఆధారంగా నిర్మితమైన ఇంగ్లీష్ పిక్చర్లలో
ఒక భారతీయుడు కథానాయకుడుగా నటించాడు.
అతడే "సబూ దస్తగిర్"
(27 January 1924 – 2 December 1963)

సబూ ఒక మావటి వాని కుమారుడు.
నాటి బ్రిటీష్ ఈండియాలోని
మైసూరు రాజ్యంలోని కరపూరులో
mahout(= elephant rider ) కుటుంబములో
జన్మించాడు.
రాబర్ట్ ఫ్లాహర్టీ అనే డాక్యుమెంటరీ ప్రొడ్యూసరు
ఆతనిలోని టాలెంటును గుర్తించాడు.
తద్వారా సబూ వెండి తెరపైన హీరోగా అవతరించ గలిగాడు.

రుడ్యార్డ్ కిప్లింగు యొక్క Toomai of the Elephants లో
సబూ హీరోగా నటించాడు .
1940 లో భ్రిటిష్ ఫిల్మ్ అయిన
The Thief of Bagdad లో
సబూ పోషించిన "అబూ" పాత్ర
ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నది.

తిరిగి కిప్లింగు రచన ఆధారిత చలన చిత్రము
"జంగిల్ బుక్"లో మౌగ్లీగా నటించాడు సబూ దస్తగిర్.
Zoltán Korda జంగిల్ బుక్ దర్శకుడు.

ఆ తర్వాత అతడి జీవితం
అనేక ఒడిదుడుకులను లోనైనది.
రెండవ ప్రపంచ యుద్ధము లో ఉద్యోగాలు చేసాడు.
A Tiger Walks అనే సినిమా ఆతని చివరి సినిమా
1964 లో వచ్చిన “A Tiger Walks “.

"Sabu Visits The Twin Cities Alone " మున్నగు
సంగీత, అరణ్య సంబంధమైనవీ,
ఇతర ఆల్బం సినిమాలలో నటించాడు.
అమెరికాలో పాశ్చాత్య వనితను పెళ్ళి చేసుకున్నాడు.
ఆతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాలిఫోర్నియాలో చివరి శ్వాస విడిచాడు సబూ
.&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Chitravalokanam ; జంగిల్ బుక్ - సబూ దస్తగిర్ ;
By kadambari piduri, Jan 18 2010

14, జనవరి 2010, గురువారం

ఉక్కుమనిషి























ఆ పిల్లవానికి సెగ గడ్డ వచ్చినది.

అక్కడ గ్రామంలో సెగ్గడ్డలకు నాటు వైద్యం చేయడంలో పేరొందిన మనిషి ఉన్నాడు. ఆ అబ్బాయి ఆ నాటు వైద్యుని దగ్గఱకు వెళ్ళాడు.

సరే! ఈ మన హీరో అన్నాడు:

"నాకు గజ్జలలో సెగగడ్డ వచ్చింది. మందు వేయి భయ్యా!"

అతని వైద్య విధానము ఆ పిల్లవాడికి తెలుసు. అదేమిటంటే, కాల్చిన ఇనుప వస్తువుతో, గడ్డ మీద వాత పెట్టడము అన్న మాట!


వైద్యశిఖామణి కుంపటిలో నిప్పులు రాజేసాడు. నిప్పులలో ఇనుప గరిటనూ, కడ్డీనీ కాల్చాడు. ఆ ఇనప వస్తువులు బాగా ఎర్రగా కాలాయి.

టెన్షన్ తో ఆ బాలుని కళ్ళలో నుండి కన్నీళ్ళు ఉబికి వస్తుంటే ఆపుకుంటూన్నాడు. దానిని గమనించిన గ్రామ డాక్టరు మనసులో జాలి, కరుణ కలుగసాగాయి. దాంతో, అతను తన పద్ధతిని క్రూరంగా అమలు చేయలేక పస్తాయించ సాగాడు.

కాస్సేపు చూసి, పిల్లాడు అన్నాడు కదా "అదేమిటీ? ఇంకా ఆలస్యం చేస్తున్నారు. ఆ సరంజామా చల్లారి పోతున్నాయి; చప్పున ఇక్కడ అంటించు,భయ్యా!"

ధైర్యం ఆ బాలుని సొత్తు కదా మరి ! పెద్దవాళ్ళనైనా తోడు తీసుకు వెళ్ళకుండా, ఇంత ధైర్యంగా అలాంటి క్రూర వైద్యాన్ని చేయించుకో గలిగిన ఆ బాలుని పేరు తెలుసా?

పేరు ప్రఖ్యాతులు గడించిన "సర్దార్ వల్లభాయి పటేల్".

"ఉక్కు మనిషి " అని ఆప్యాయంగా ప్రజలు పిలుచుకునే వల్లభాయ్ పటేలు, అక్టోబరు 1875 వ సంవత్సరములో 31 వ తేదీ అక్టోబరు నెలలో (born 31st of October 1875. ) పుట్టాడు.

ఆ రోజులలో లక్షలాది రూపాయిలను ఆర్జించగలిగిన బారిష్టరు ప్రాక్టీసును వదిలివేసాడు.

దేశభక్తితో స్వాతంత్ర్య పోరాటములో పాల్గొని గాంధీజీ, నెహ్రూలకు కుడి భుజము అయ్యాడు.

Share My Feelings

ఉక్కుమనిషి

By kadambari piduri, Dec 25 2009 6:25AM

4, జనవరి 2010, సోమవారం

శుభాశీస్సులు


మలై కళ్ళన్, అగ్గిరాముడు అద్భుత విజయాల్ని సొంతం చేసుకున్న చలనచిత్రాలు. ఈ రెండింటిలోనూ కథానాయిక పద్మశ్రీ భానుమతీ రామక్రిష్ణ. ఎం.జి.రామచంద్రన్ ఇంకా తమిళ సినిమా రంగములో నిలదొక్కుకోలేదు."రామచంద్రన్!" అని పిలిచేది.

కొంత హస్త సాముద్రికము నేర్చుకున్న భానుమతి సెట్టింగ్సు వద్ద తీరుబడిగా ఉన్నప్పుడు M.G.R. చేతులోని రేఖలను చూసి, చెప్పింది "రామచంద్రన్! మీకు భవిష్యత్తులో రాజపరిపాలనాయోగము ఉన్నది."దాన్ని స్పోర్టివ్ గా తీసుకుని అతను నవ్వేసారు. Puliakulam వద్ద షూటింగు జరుగుతున్నప్పుడు ఈ సంఘటన సంభవించినది. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఎం.జి.రామచంద్రన్ తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు. ఆ చీఫ్ మినిష్టరుకు అభినందనలు చెప్పడానికి భానుమతీ రామక్రిష్ణ వెళ్ళారు. ఆమెను చూస్తూనే అన్నారు ఎం.జి.రామచంద్రన్ ఇలాగ,"అమ్మా! ఆ రోజు మీరు చెప్పిన జ్యోతిష్యం నిజమైనది. మీ వాక్కు ఫలించినది." నిజానికి ఆమెకు కూడా తాను చెప్పిన హస్త సాముద్రికము సరిగా గుర్తు ఉన్నదో లేదో గానీ, రామచంద్రన్ మాత్రం ఆమె "నోటి చలువ"ను బాగా జ్ఞాపకం ఉంచుకున్నారు.

Views (26)

శుభాశీస్సులు











1, జనవరి 2010, శుక్రవారం

Tamil cinema లో ఖడ్గ యుద్ధం




Chitravalokanam

ఆకలికి అదెంత పని!


"పురచ్చి తలైవర్" అని అరవ వాళ్ళు ఆప్యాయతగా ఎం.జి.రామ చంద్రన్ ని పిలుస్తారు. ఈ తమిళ కథానాయకుడు శ్రీలంకలోని కాండీ పట్టణములో జన్మించారు. (17వ తేదీ, జనవరి - 1917 - డిసెంబర్, 24, 1987).

పాత తెలుగు సినిమాలలో రాజనాల లాగా, తమిళ చిత్రాలలో ప్రతినాయక పాత్రలలో ప్రసిద్ధి కెక్కినవారు ఎం.ఎన్.నంబియార్ .

ఒక రోజు రామచంద్రన్ కు, నంబియారుకు జరిగే కత్తి యుద్ధం సీనులను నిర్మాత, దర్శకులు చిత్రిస్తున్నారు. వారి ఖడ్గ యుద్ధం ఉదయం నుండీ షూటింగు చేస్తున్నారు.

హీరోయిన్ గా నటిస్తున్నవారు మన భానుమతి. వారి పోరును చూస్తూ, హీరోది పై చేయి ఐనప్పుడల్లా ఆమె సంతోషాన్నీ, అతను లోబడినప్పుడు భీతినీ ఇలాగ ముఖ కవళికలో నానా రసాద్యవస్థలనూ ప్రతిఫలించాలి. అంతే! ఆమె పాత్రకు ఉన్న పరిమితి అది.

ఎంతకీ ఆ పోరాట ఘట్టము ఓ.కే. అవటం లేదు.డైరెక్టరుకు హీరో, విలన్ కత్తి విసుర్లు అస్సలు నచ్చడమే లేదు. మధ్యాహ్నమూ, అపరాహ్నమూ కూడా అవురున్నాయి.

పాపం! ఇవతల భానుమతికి ఆకలి దంచేస్తూన్నది. చూసి, చూసి విసుగెత్తి, గట్టిగా అరిచింది "రామచంద్రన్!నంబియార్ కబంధ హస్తాల నుండి నన్ను రక్షించడానికి ఇంత సమయం తీసుకుంటున్నారేంటి? ఆ ఖడ్గాన్ని ఇలా ఇవ్వండి, చిటికెలో నాకు కావల్సిందేదో నేనే సాధించుకుంటాను."

అటో ఇటో తేల్చేసే స్వభావం గల ఆమె పరుషమైన మాటలకు అక్కడ ఉన్న యావన్మందీ నిశ్చేష్ఠులై, చూస్తూ నిలబడ్డారు. గుండు సూది వేస్తే ఖంగున వినిపించేటంత నిశ్శబ్దం నెలకొన్నది.

అగ్ర నటుడైన ఎం.జి.ఆర్.కు ఎక్కడ కోపం వస్తుందోననే భయంతో అంతా ఖిన్నులై, శిలా ప్రతిమల వలె ఉన్నారు. కానీ అనుకోకుండా వింత జరిగింది.

అకస్మాత్తుగా భానుమతి నోటి నుండి వెలువడిన ఆ పలుకులకు హీరోకు నవ్వు తెప్పించాయి. తెరలు తెరలుగా నవ్వాడు అలనాటి కథా నాయకుడు, ఆ నాటికి భవిష్యత్త్త్తులో కాబోతూన్న తమిళ సీమ ముఖ్యమంత్రి.

అసహనంతో , ఆకలి వేస్తూంటే చిర్రెత్తుకొచ్చిన ఆమె స్థితి అతనికి అప్పటికి బోధ పడింది.

అంతేకాదు, స్వల్పంగా ఎప్పుడూ నవ్వే నంబియార్ పెదవులపైన కూడా ఆ నాడు మందహాసాలు విరబూసాయి.

By kadambari piduri, Dec 20 2009 9:05AM

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...