4, ఫిబ్రవరి 2010, గురువారం

Chitravalokanam జంగిల్ బుక్ - సబూ దస్తగిర్ By kadambari piduri, Jan 18 2010 11:41PM

-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-హాలీవుడ్ సినీ లోకంలో Rudyard Kipling లబ్ధ ప్రతిష్ఠుడు.
ఆతని "Jungle Book "పిల్లలనూ, పెద్దలనూ అలరించినది.

ఇటు బాలీవుడ్ కూ,అటు హాలీవుడ్ కీ వారధి లాంటివి
రుడ్యార్డ్ కిప్లింగు ఇంగ్లీషులోని రచనలూ, వాని సినీ రూపాలూ !
రుడ్యార్డ్ కిప్లింగు రచనల ఆధారంగా నిర్మితమైన ఇంగ్లీష్ పిక్చర్లలో
ఒక భారతీయుడు కథానాయకుడుగా నటించాడు.
అతడే "సబూ దస్తగిర్"
(27 January 1924 – 2 December 1963)

సబూ ఒక మావటి వాని కుమారుడు.
నాటి బ్రిటీష్ ఈండియాలోని
మైసూరు రాజ్యంలోని కరపూరులో
mahout(= elephant rider ) కుటుంబములో
జన్మించాడు.
రాబర్ట్ ఫ్లాహర్టీ అనే డాక్యుమెంటరీ ప్రొడ్యూసరు
ఆతనిలోని టాలెంటును గుర్తించాడు.
తద్వారా సబూ వెండి తెరపైన హీరోగా అవతరించ గలిగాడు.

రుడ్యార్డ్ కిప్లింగు యొక్క Toomai of the Elephants లో
సబూ హీరోగా నటించాడు .
1940 లో భ్రిటిష్ ఫిల్మ్ అయిన
The Thief of Bagdad లో
సబూ పోషించిన "అబూ" పాత్ర
ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నది.

తిరిగి కిప్లింగు రచన ఆధారిత చలన చిత్రము
"జంగిల్ బుక్"లో మౌగ్లీగా నటించాడు సబూ దస్తగిర్.
Zoltán Korda జంగిల్ బుక్ దర్శకుడు.

ఆ తర్వాత అతడి జీవితం
అనేక ఒడిదుడుకులను లోనైనది.
రెండవ ప్రపంచ యుద్ధము లో ఉద్యోగాలు చేసాడు.
A Tiger Walks అనే సినిమా ఆతని చివరి సినిమా
1964 లో వచ్చిన “A Tiger Walks “.

"Sabu Visits The Twin Cities Alone " మున్నగు
సంగీత, అరణ్య సంబంధమైనవీ,
ఇతర ఆల్బం సినిమాలలో నటించాడు.
అమెరికాలో పాశ్చాత్య వనితను పెళ్ళి చేసుకున్నాడు.
ఆతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాలిఫోర్నియాలో చివరి శ్వాస విడిచాడు సబూ
.&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Chitravalokanam ; జంగిల్ బుక్ - సబూ దస్తగిర్ ;
By kadambari piduri, Jan 18 2010

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

its good 2 know about jungle book....
it was very interesting....
waiting 4 your next article....

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...