23, ఏప్రిల్ 2009, గురువారం

ఆకాంక్ష











ఆకాంక్ష

By kadambari piduri, Aug 3 2008 2:09AM

శృతి మురిసిన, ధృతి పెరిగిన 
హృది తనిసిన కావ్యంబై 
భువి పాడిన, దివి చూచిన 
రవి తలచిన రాగంబై 

ఝరి పొంగిన, విరి విరిసిన 
ఫణి ఊగిన నాట్యంబై 
ధర తెరచిన అధర పదమై 
ద్యుతి కొలిచిన క్రాంతి పథమై 
దిశ కొలిచిన భావ హృదియై 

తెలి కిరణము విసరునట్టి హరి విల్లై 
కవి కజ్జల బిందు నృత్యమీ పగిదిని 
పుడమి యందు పులకలెత్త 
నవరస (స్యందిత) రంగ వేదికల పయిన 
అనవరతము"కవి మౌనీంద్రు"ని 
ధ్యానాంతరాళములయందున నర్తనమై 
తాండవమై నట్టువాంగ శృంగోత్తుంగమ్మై 
నీలాంబర పర్యంతము, ఎగసి ఉప్పొంగవలెను! 

మరల మర
ల వర్షితమై 
కళా
ప్రకృతిగా ఇలాతలము 
హర్ష మంద 
హాసమ్ముల ప్రతికృతిగా 
రసజ్ఞుల హృదయ స్వర్ణ మందిరముల 
 సాక్షాత్కరించి, 
                     తేజరిల్ల వలెను


'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''


చదువన్నది ఇంద్ర పదవి

చదువన్నది ఇంద్ర పదవి!


నిశానీలు, వ్రేలి ముద్ర మానాలి 
సత్వరమే సంతకాలు చేయాలి 
త్వర త్వరగా పుస్తకాలు చదవాలి 

మా తాతలు చదివారా? 
ముత్తాతలు చదివారా? 
అని ఎదురు ప్రశ్నలే వద్దు! 
విద్య లేని మొద్దులనే 
నానుడి నువు వినలేదా?! ఓరన్నా! 

చదువన్నది ఇంద్ర పదవి 
సంఘంలో విలువున్నది 
బ్రతుకు చక్కదిద్దగలుగు 
రహదారి విద్యయే నన్నా!

'''''''''''''''''''''''''''''''''''''''''

గిన్నిస్ రికార్డ్ వ్రతం

By kadambari piduri, Oct 6 2008 6:15PM
తిరువనంత పురము దగ్గర ఉన్న
 "అట్టుక్కల్" వార్తలలో ప్రాధాన్యాన్ని పొందినది. 
తమిళనాడులో "శిలప్పదిగారమ్ "
అనే అద్భుత కావ్యము వెలుయుటకు కారణమైన
 స్త్రీ "కన్నగి". 

కోవెలన్ భార్య కణ్ణగి. 
ఆమె భర్త అకారణముగా ,"దొంగ" అని నిరూపించబడుటచే
దారుణ శిక్షకు గురి అయ్యాడు. 
క్రోధ ,రోషాలతో ఉన్న కణ్ణగి శాపము వలన పట్టణము అగ్నికి ఆహుతి అయ్యింది. 
కోపముతో కణ్ణగి
 పశ్చిమ దిశగా నడుస్తూ వెళుతూండగా
 అట్టుక్కల్ వనితా మణులు ఆమెకు ఆతిథ్యము ఇచ్చారు.

 అచ్చట "భగవతీ కోవెల" వెలసినది. 

క్రితము 'మార్చి'నెలలో,
 25 లక్షల మంది స్త్రీలు అక్కడ పొంగళ్ళు పెట్టారు. 
పర్వదినము నాడు 25 లక్షల మంది మగువలు పొంగళ్ళు పెట్టుట
 ఒక అద్భుత సంఘటన!

కనుకనే ఇది గిన్నిస్ రికార్డుకు ఎక్కిన వ్రతము ఐనది . 
ఈ "అట్టుక్కల్ పొంగల్"
రికార్డును సాధించిన నోముగా
 భారతీయ రమణీ మణులకు గర్వ కారణమైనది. 


'''''''''

Views (85)

పురాణ పాత్రలు- నామకరణములు

'''''''''''''''''''''''''''''''''''''''''''''




By kadambari piduri


* 
"శ్రీ రామ" అని పురుషోత్తమునకు నామకరణము చేసిన
 భాగ్యశాలి వశిష్ఠ మహాముని.
 "అందరి మనస్సులను రంజింపజేస్తూ,
ఎల్లరకు ఆనందమును కలిగించు భగవంతుడు శ్రీ రామ చంద్రుడు. 

* 
గర్గ ముని" శ్రీ కృష్ణునికీ, రాధా దేవి"kii  ఆ పేర్లను పెట్టాడు. 

"సర్వమ్ కరోతీతి కృష్ణః" 
"కృష్ణ వర్ణమ్ నీలః !" 
"కర్షతి చిత్తమితి కృష్ణమ్" 


అని కృష్ణ నామ వ్యుత్పత్తులు. 
తేట భాషలో చెప్పుకోవాలంటే 
మనసులను ఆకర్షించేవాడు శ్రీ కృష్ణ మూర్తి. 

* "హనుమ" అని శ్రీ ఆంజనేయ స్వామికి
 దేవతల ప్రభువైన మహేంద్రుడు పేరిడెను. 
అన్యులకు ఆ వాయు పుత్రుని కంఠములోని హారము కనపడదు.
 శ్రీ రామ చంద్రుడు సీతాన్వేషణ చేయుచూ వచ్చి, హారమును తిలకించి
 "హనుమా!" అని పేరు పెట్టి పిలిచెను. 
ఐనా "రామ బంటు"గానే ప్రజలందరి పూజలను
 హనుమంతుడు అందుకొనుటయే విచిత్రం! విశేషం! 
మన సాంప్రదాయాలలోని విశిష్టతయే అది! 

Views (46)

22, ఏప్రిల్ 2009, బుధవారం

నెల వంక!

moonlight-maiden.jpg

నెలవంక

నెల వంక! నెల వంక! 
మొయిలమ్మ చెవి జూకా! // 

వెన్నెలల ఊయలలో 
కను తెరచి, చిరు నవ్వు 
చిందించు పాపాయి! 
నెల వంక! నెల వంక! // 

పరమేశు సిగలోన 
గీఱగా నవ్వును! 
గీఱ "నీ కంటే"ను 
చిన్నబోవును,లెమ్ము! // 

నెలవంక! నీ అలుక 
తీర్చడము తేలిక! 
నూలు పోగొక్కటి 
ఇస్తాను కానుక! //

Why, విజయ?!

Why, విజయ?!?

By kadambari piduri, Jul 31 2008 4:17AM
సినిమా హీరో డాక్టర్ రాజశేఖర్ ను 
జర్నలిస్టులు కలిసారు. 

ఇంకేముంది? 
ప్రశ్నల వర్షం కురియ సాగింది. 

పాత్రికేయులు అడిగారు 

* "రాజశేఖర్ గారూ! ఈ మధ్య మీరు వైవిధ్యం గల పాత్రలు చేయడం లేదే!" 

* "విభిన్నత గలిగిన పాత్రలను ఒప్పుకోవడం లేదా?" 

* "అదేమిటి సార్!మీ అభిమానులను నిరాశకు గురి చేస్తారా? మీరు వైవిధ్యం కోసం ప్రయత్నించరా?" 

తెలుగు సరిగా రాని అతను కొంచెం గాభరా పడుతూ అన్నాడు కదా!!
 "నేనేమిటీ? వై.విజయ ఏమిటీ? ఏ...ఏమిటి అంటున్నారూ మీరు?" 

"ఇంకా నయం! పాత్ర ధారణ అంటే గిన్నెలని పట్టుకుని నిలబడాలీ అని అనుకోలేదు మన హీరో గారు!"
అని తమాషా కామెంట్. 

తెలుగు సరిగా అర్ధం కాని రాజ శేఖర్ 
సినిమా నటి వై.విజయ గురించి 
పత్రికా విలేఖరులు ఏదో క్వశ్చెనింగు చేస్తూ, 
తనతోవాళ్ళు "పింగ్ పాంగ్"ఆడుతున్నారని సందేహంతో 
సందిగ్ధంలో పడి సభలో నవ్వులు పుట్టించారు. 
Views (70) 

తెలుగుతల్లి


తెలుగుతల్లి :::::

''''''''''''''''''

వన్నె వాసి కెక్కె 
నా తెలుగు భాష 
"తిన్నె పసిడి"కెక్కె 
 
నా తెనుగు భాష // 

చుక్క చుక్కను తెనుగు 
అక్షరమె మెరిసినది 
పచ్చ పచ్చని చేల 
నాంధ్రమ్ము మురిసినది // 

తెఱచినది భాషను 
దిక్కులంచుల దాక 
పరచినది భావాల 
నింగి ఆవల దాక /
/
Add to Social

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...