7, ఫిబ్రవరి 2013, గురువారం

చెన్నపట్టణం, మద్రాస్ అనే పేర్లు ఎలా కలిగినవి?


అర్ధ చంద్రాకారములో ఉన్నది  ఆ కొండ .
చంద్ర వంక ఆకారములో ఉన్నది కాబట్టి “చంద్రగిరి ” అన్నారు.
ఆ గిరి పాదమున కట్టిన కోట అవడముతో –
దానికి “చంద్రగిరి కోట”అనిన్నీ, ఆ ఊరికి “చంద్రగిరి”అనిన్నీ పేర్లు కలిగినవి.
శ్రీ కృష్ణ దేవ రాయలు “తిరుపతి మహా పుణ్యక్షేత్రము” ను దర్శించుకోవడానికై వచ్చినప్పుడు,
మార్గ మధ్యాన ఈ చంద్రగిరి దుర్గములో బస చేసేవాడు.
చంద్రగిరి పట్టణమును పాలించిన చక్రవర్తి “పెద వేంకట రాయలు”.
ఈతను విజయ నగర సామ్రాజ్య సామ్రాట్టులలో ఆఖరి ప్రభువు.
ఈతని సామంతుడైన రాజు దామెర్ల చెన్నప్ప నాయకుడు సిఫార్సు చేయగా-
సామ్రాట్ పెద వేంకట రాయలు అంగ్రేజీ వర్తకులకు – కోటను కట్టుకోవడానికి అనుమతిని ఇచ్చారు.
1639 లో ఆగస్ట్ 22 వ తేదీనాడు ఈ సంఘటన సంభవించినది.
ఫ్రాన్సిస్ డే – అనే ఆంగ్లేయుడు – “బ్రిటీష్ ఇండియా కంపెనీ తరఫున
ఇలాటి పర్మిషన్ ని సంపాదించగలిగాడు. 

***********************;

నాయక రాజులు తెలుగు సీమకు గుర్తింపు తెచ్చిన సామంత పరిపాలకులు.
దామెర్ల వెంకటాద్రి నాయకుడు తెలుగు వ్యక్తి:
ఈతని తండ్రి “దామెర్ల చెన్నప్ప నాయకుడు” శ్రీ కాళహస్తి కీ, వందవాసికీ ఏలిక.
దామెర్ల చెన్నప్ప నాయకుడు ఆరవీటి వంశీయులకు సామంత రాజు.
ఆరవీడు చక్రవర్తి ఐన “శ్రీ రంగ దేవ రాయలు” కు విధేయునిగా
శ్రీ కాళహస్తి నీ, వందవాసినీ ప్రాంతాలను పాలించాడు దామెర్ల చెన్నప్ప నాయకుడు.
ఈ తెలుగు ప్రభువు ఏలుబడిలో ఉన్నట్టి ప్రాంతములలో ఉన్న నగరమునకు
ఆతడి పేరుమీదనే “చెన్నపట్టణము” అని వచ్చినది.
చెన్నపట్టణమునకు హ్రస్వ రూపమే “చెన్నై”.

***********************;
చెన్నపట్టణము – మద్రాస్ సిటీ కి దక్షిణ దిక్కున ఉన్నది.
చెన్నపట్టణమునూ, ఈ జార్జ్ కోట ప్రాంతాన్నీ కలిపి

ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభావముతో
“మద్రాసు”అని  పేరు ఇవ్వబడినది.
కానీ ప్రజలకు “చెన్నపట్టణం” అనే నామధేయం చాలా ప్రీతికరమైనది.
అందుచేతనే మరల “చెన్నై” అనే పేరుతో పునః బారసాల జరిగినది.
చెన్నపట్టణమునకు చిట్టి పిలుపు “చెన్నై”.
తమిళ నాడు ప్రభుత్వము సాంప్రదాయనామమును స్వీకరించి,
1996 సంవత్సరములో    
మద్రాసుకు మళ్ళీ “చెన్నై” అనే పేరును నిశ్చయించినది.
ప్రజలు సంతోషముతో స్వాగతము పలికారు.
ఆమోదముద్రను పొంది ఐనది ఈనాడు అది చెన్నై.

***********************;

“మద్రాస్” కి మూల పదము:-
పాశ్చాత్యుల రాకతో మన హిందూదేశములోని
అనేక cities కి – కొత్త పేర్లు వచ్చినవి.
వాటిలో అధిక నిష్పత్తిలో  పోర్చుగీసు names మూలములుగా కలిగినవి.
“మాడ్రె డి డ్యూస్ (Maare de Dues) నుండి
“మద్రాస్” అని నిర్ధారించారు  కుంఫిణీ వాళ్ళు.
1639 లలో Fort St. George ని ఇంగ్లీషు వాళ్ళు కట్టారు.
ఆంగ్లేయులు సైంట్ జార్జ్ కోటను కట్టినారు.
అప్పటికే చెన్న పట్టణము అనే చిన్న నగరము ఉన్నది.
దామెర్ల చెన్నప్ప నాయకుని నామధేయాన్ని ఈ నగరము పొందినది.
కాలక్రమేణా జార్జి కోటకు చుట్టుపక్కలా విస్తరిస్తూ,
మద్రాసు మహా నగరము – గా రూపుదిద్దుకున్నది.
***********************;
చెన్న కేశవ పెరుమాళ్ కోవెల అక్కడి పుణ్య క్షేత్రము.
కనుక ఆ స్వామి పేరుతో పేరెన్నిక గన్నది “చెన్నై” అని కొందరి అభిప్రాయం.
***********************;
1) చంద్రగిరి: 2) మద్రాస్: 3) చెన్నై:
ఆయా పేర్లు వరుసగా ఇల్లాగ
ఆయా ఊళ్ళకు ఒనగూడినవన్న మాట!
***********************;
వ్యాస రచన: కాదంబరి:   
***********************;
;
                          ‘Town Temple'

;
 ఆధార పదములు:
( Telugu rule Damarla Chennappa Nayakudu :
  Chennapattanam (British Madras):- -> Chennai );

‘Town Temple' ; "The Arani zamindari's palace;
 Arani House.


; 
(Essay in "jaabilli" : below this LINK): 

చెన్నపట్టణం, మద్రాస్ అనే పేర్లు ఎలా కలిగినవో తెలుసునా? 
January 30, 2013 By: జాబిల్లి Category: వ్యాసాలు;


‘Town Temple': photo link:  (The Hindu)



2, ఫిబ్రవరి 2013, శనివారం

కన్నడములోనే అర్చనలు అక్కడ!



రుక్మాంగద రాయలు "సక్రేత పట్టణము"నకు ప్రధాన పాలకుడు. 
శఖ్యత, మైత్రీ బంధాలకు మారుపేరుగా ( Sakrepatna ) 
అతని ఏలుబడిలో రూపుదిద్దుకున్నది.
అతనికి ఇద్దరు తనూజలు. వారికి రెండు పట్టణాలను 
పరిణయ వేళల కానుకగా ఇచ్చాడు. 
అవే చిక్కమగళూరు, హీరేమగళూరు.
రుక్మాంగదుడు "అయ్యన్ కెరె జలాశయాన్ని" కట్టించినాడు. 
ప్రజలకు నేటికీ అధిక ఉపయోగము ఔతూన్నది.

*******************;

 ఇందిరా గాంధి ఈ చిక్ మగలూర్ నుండి పోటీ చేసారు. 
1978 లో ఎన్నికలలో నిలబడ్డా
ఆమె - ఇండియ, పార్లమెంటు , లోక్ సభ స్థానాన్ని గెలిచారు. 
అందుచేత వార్తలలో పతాకశీర్షికలను తుమ్కూరు దగ్గరలో ఉన్న 
ఈ ఊరు అలంకరించినది.

*******************;

“ చిక్ మగలూర్/  చిక్కమగళ్ ఊరు”/ Chikmagalur City
 (“చిక్క మగల్ ఊరు” = ) కు అర్ధము 
“చిన కుమార్తె ఊరు” అని.  
ఆ పట్టణమునకు 5 కి.మీ. దూరములో వేరొక భాగాన్ని పెద్ద  కూతురుకు ఇచ్చారు. 
దాని పేరు “హీరేమగలూర్”.
 'Chikmagalur (ಚಿಕ್ಕಮಗಳೂರು) కర్ణాటకలో చారిత్రక సంపదను కలిగిన గొప్ప డిస్ట్రిక్టు. 
ఈ జిల్లాలోనే “అమృత పుర” వద్ద -హొయసల కోవెలల సముదాయాలు  
కలగడానికి కారణము ఉంది.
పెద్ద కుమార్తెకు భరణముగా ఒసగబడిన “హీరేమగలూర్" సంస్కృతీ విలక్షణప్రదమై, 
చారిత్రక పరిశోధకుల శోధనలకు అనువైన (ఒకప్పుడు) అగ్రహారము-  అని పేర్కొనవచ్చును.

*******************;

కన్నడ భాషలోనే అర్చనలు అక్కడ మంత్రాలు పూజలూ:-

ఈ Hiremagalur ఊళ్ళో కోదండరామాలయము కలదు.
సీతా దేవి ఈ గుడిలో శ్రీరామచంద్రులకు కుడిపక్కన ఉన్నది.

సీతారామలక్ష్మణులు సమాన్యముగా నిలిచే స్థానములకు ఈ పద్ధతి కొంత విరుద్ధము. 
సాధారణముగా "భార్య తన భర్తకు ఎడమ వైపు - నిలబడుతుంది. 
పూజా పునస్కారాది సమయాలలో - ఆచరణలో ఉన్న 
హిందూ సాంప్రదాయములకు విభిన్నతను చేకూర్చినది 
ఈ కోవెలలో ప్రతిష్ఠితమైన జానకీ, లక్ష్మణ సమేత శ్రీ రామ చంద్రుడు.
అంతే కాదు!
ఆలయములలో దేవభాష ఐన సంస్కృతములో మంత్రోచ్ఛారణలు జరుగుతూంటాయి. 
కానీ “హీరేమగలూర్ లో గీర్వాణభాషలో అర్చనలు కాకుండా, 
స్వచ్ఛమైన కన్నడ భాషలో నుడువులు కొనసాగుతూ అర్చనలు జరుగుతూంటాయి.
ఇదీ ఈ ఊరి ప్రత్యేకత.

*******************;
;

Sri Kodanda Rama kOwela


;
;photo link (Karnataka state) 

10, జనవరి 2013, గురువారం

బుడ బుక్కలు - 1



:::::::::::::
                  కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసే తీరులో హాస్యం తొంగి చూస్తూ,
చిరు నవ్వులను విరబూయిస్తాయి.
ఈ కింది వ్యాఖ్యానాలను చూడండి, సారీ! చదివి చూడండి!

buDa bukkalu - 1;

Ask yourself ... 
If swimming is a good exercise to stay fit, then WHY WHALES are fat?
WHY is that everyone wantas to go to HEAVEN but nobody wants to die?
Shall I say that there is racial discrimination in CHESS as WHITE piece is moved first?
In our Country, we have freedom for SPEECH, then WHY telephone bills?
If MONEY doesn’t grow on tress then WHY do BANKS have branches?
WHY does a round PIZZA come in a SQUARE box?
WHY doesn’t GLUE stick to its bottle?
WHY do you still call it a BUILDING when its already BUILT?
If you aren’t supposed to DRINK AND DRIVE, then WHY do BARS have parking lots?
If it’s true that WE are here to help others, then what OTHERS are here for?
WE are really funny people dwelling in a SERIOUSLY funny world ............ ........ !!!!!!

:::::::::::


::









::::::::::
Funny Warld ; cupid speeks (: photo link :)
; 

నాసిక్ రత్నము ఆంధ్రా నుండి అమెరికా దాకా

 అది గొప్ప రత్నము. "నస్సక్ మణి - అని దాని పేరు. 
ఆంధ్ర ప్రదేశ్ లో, మహబూబ్ నగర్ జిల్లాలోని 
"అమరగిరి " ప్రాంతాలలో వెలికి తీయబడినది. 
ఈ Nassak Diamond   43.38 కారట్స్, 
అనగా 8.68 గ్రాములు బరువు గల అమూల్య మణి ఇది. 
15 వ శతాబ్దములో దొరికిన ఈ ఘన రత్నమును 
"దైవ నేత్రము" (the Eye of the Idol) అని భావిస్తారు.                
త్రిలింగదేశములో అనగా - 
మన తెలుగు నాట దొరికిన Nassac diamond ని  సానబట్టి, చెక్కి 
భగవంతునికి సమర్పించినారు. 
మహారాష్ట్రలోని త్రయంబకేశునికి అలంకృతమైనది. 
1500 నుండి 1818 ల వరకూ ఈ రత్నము 
పుణ్యక్షేత్రములో ప్రకాశములతో ఉన్నది. 
ఆంగ్లో-మరాఠా యుద్ధములు జరిగినవి. 
మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధము (The Third Anglo-Maratha War) ఫలితముగా 
British ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి స్వాధీనమైనది 
ఆ Triangular shape అద్భుత మణి.   
నాసిక్ నుండి గైకొనిన మణి కాబట్టి 
"Nassak Diamond " అని తెల్లవారు పిలిచారు.     
;
;
1818 లో బ్రిటీష్ ఆభరణ వ్యాపారి కంపెనీ 
"రండెల్ అండ్ బ్రిడ్జ్" దీనిని సంగ్రహించి, 
మరల సానబట్టారు. పిమ్మట చేతులు మారినది. 

మొదటి వెస్ట్ మినిస్టర్ మార్క్వెస్ 
(1st Marquess of Westminster) 
ఖడ్గము, డ్రస్సుపైన ధరించబడినది.

1930 లలో ప్రపంచంలోని 
తొలి మేలి రత్నములు 
 అంచనా వేసారు. 
అప్పటి లెక్కల ప్రకారం
24 రత్నములలో 
Nassac Diamond 
ఒకటిగా ఎంచబడినది. 
;

ఇది తదుపరి 1927 లో యునైటెడ్ స్టేట్స్ కి దిగుమతి ఐనది.  
1940 లో ఫ్రాన్స్ దేశములోని పారిస్ నుండి 
అమెరికన్ జ్యూయలర్స్ "హారీ విన్స్ టన్ సంపాదించాడు. 
మళ్ళీ చెక్కబడినదే నేటి మణి ఆకారము. 
Harry Winston 43.38 carats (8.68g) ఎమెరాల్డ్ - 
అనేక స్థానములను మారి, గ్రీన్ విచ్, కనెక్టికట్ లో ఉన్నది. 

*********************;

1940 లో ఫ్రాన్స్ దేశములోని పారిస్ నుండి 
అమెరికన్ జ్యూయలర్స్ "హారీ విన్స్ టన్ సంపాదించాడు. 
మళ్ళీ చెక్కబడినదే నేటి మణి ఆకారము.
Harry Winston 43.38 carats (8.68g) ఎమెరాల్డ్ - 
అనేక స్థానములను మారి, 
ఇప్పుడు గ్రీన్ విచ్, కనెక్టికట్ లో ఉన్నది.   

Now - Nassak Diamond is -
at Edward J. Hand, a trucking firm executive 
from Greenwich, Connecticut, USA   

****************************;
See essay : + informations about:
నాసిక్. त्र्यम्बकेश्वर , "కుశావర్తము" ; 
గౌతమీ నది, బ్రహ్మగిరి, అహల్యా, గౌతమ ఋషి;
my "akhila vanitha.blog " 

నాసిక్ రత్నము ; India netzone : (Link)

నాసిక్ రత్నము ఆంధ్రా నుండి అమెరికా లోకి....
;
కోణమానిని తెలుగు ప్రపంచం : వ్యూస్: 00050015

26, డిసెంబర్ 2012, బుధవారం

నీర్ మహల్ వింతలు, విశేషము

మహారాజా బీర్ బిక్రం మాణిక్య బహదూర్  
"మాణిక్య్  వంశము" నకు చెందిన వాడు. 
ప్రపంచములోనే రెండవ పెద్ద వంశము 
"మాణిక్య వంశము" అవడము ఒక గొప్ప విశేషము.
1930 లో - రుద్ర సాగర్ అనే సరస్సులో “నీర్ మహల్” కట్టించాడు.
జల మధ్యాన కట్టుదిట్టముగా కట్టబడిన  భవనములు 
మన దేశములో "రెండు మాత్రమే" ఉన్నవి.
అవి రాజస్థాన్ లోని "జల మహల్ మొదటిది: 
త్రిపుర లోని “నీర్ మహల్” రెండవది.
***************;     
నీర్ = నీరు: ఈ మాట ద్రవిడ భాషకు చెందినది.             
కానీ ఉత్తర భారత దేశ రాష్ట్రమైన త్రిపుర లోని 
సరసు నడుమ ఉన్న భవంతికి “నీర్ మహల్” అనే పేరు – 
ద్రావిడ లింగ్విస్టిక్ ధ్వనిని కలిగి, హిస్టరీ పరముగా 
కొంత కుతూహలమును కలిగిస్తూన్నది.     స్సు ఉన్నది 
(చరిత్ర పరిశోధకులు పరిశీలంచ వలసిన  విశేషము ఇది! )

***************;  
1 వ ప్రపంచ యుద్ధం, 2 World War ల నడిమి కాలంలో 
ఈ బిల్దింగ్ ని కట్టారు.
త్రిపుర రాజు పూనుకున్న నిర్మాణము ఇది.

'మేలా ఘర్’ వద్ద ఉన్న ఈ జల హర్మ్యము "
అగర్తల" కు 55ఖం లో ఉంది.
మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్   
రుద్ర సాగర్ విస్తీర్ణము 5.35sq.km
పడవలను ఎక్కి ఇక్కడకు చేరగలరు. 
నీర్ మహల్ ఎండా కాలపు విడిది గా నిర్మాణము జరిగినది. 
హిందూ ముస్లిం వాస్తు మేళన సౌందర్యాల కలబోత ఇది. 
మాణిక్య రాజు అభిరుచికి పట్టిన నిలువెత్తు దర్పణము ఈ నీర్ మహల్. 
రాజస్థాన్ లోని "జల మహల్" తర్వాత ఇదే ఘన హర్మ్యము.

***************;   

24 గదుల్తో చూపరులను ఆకట్టుకునే అందచందాలు నీర్ మహల్ ది.
"బ్రిటీష్ కంపెనీ - " "మార్టిన్ బర్న్స్" (.Martin & Burn Co ) కి 
కన్స్ట్రక్షన్ బాధ్యతలను రాజు అప్పగించారు. 
మొత్తానికి అది పూర్తి కావడానికి 9 ఏళ్ళు పట్టినది.

***************;
;

;













 నీర్-మహల్  లో రెండు భాగాలు కలవు. 
"ఆండర్ మహల్" పశ్చిమ దిశా భాగము. 
ఇందులో రాజ వంశీకులు బస చేయడానికై కేటాయించారు. 
తూర్పు దిక్కున "బాహ్య రంగము" అనవచ్చును. 
 ఆరు బయట లలిత కళా ధామము ఈ విభాగము.
డాన్సులు, ఇతర కల్చరల్ యాక్టివిటీలు 
జరిగే "నర్తనశాల" ఇది. 
రాచవారు తమ టెన్షన్ లని కాస్సేపైనా మరిచిపోవడానికని - 
 ఏర్పాటు చేసుకునే వినోద కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూంటవి.
అందాలకు నెలవు, టూరిస్టులకు నేత్ర పర్వము 
ప్రకృతి ఒడిలోని ఈ "నీర్ మహల్"!


25, డిసెంబర్ 2012, మంగళవారం

వివిధ దేశాలలో శాంతాక్లాజ్ పేర్లు


క్రిస్ మస్ పండగ వస్తూన్నది కదా!
(Christmas Eve on December 24)
మన తెలుగు సీమలో “శాంతా క్లాజ్” అనీ,
Jesus ని “ఏసు క్రీస్తు” అనీ పిలుస్తారు.
మన ఆంధ్ర ప్రదేశ్ లో “ఏసు క్రీస్తు”
అంటారని తెలుసు కదా!
“జీసస్!”, “జీసస్ క్రైస్త్!”-
అనేక ప్రపంచ భాషలలో అలాగే పిలుస్తారు.
కానీ ఆరు ఖండములలోని
వివిధ country లలో వేర్వేరు నామావళి ఉన్నవి.
అలాగే శాంతాక్ల్రాజ్ (santa-claus)కి కూడా   
ప్రదేశ వైవిధ్యతలతో, రక రకములైన పేర్లు ఉన్నవి.
ఆ యా పేర్లు అనేకములు వినిపిస్తూన్నవి.
ఉదాహరణకు:-     
హవాయి దీవులు:-
(యీ islands స్థానిక ప్రజల మాటలలోని
ధ్వనులు- ఆశ్చర్యాన్ని కలిగిస్తూన్నవి,
ఎందుకంటే ఆ దీవులలోని వ్యక్తులు
మాటలలో ఎక్కువగా
మన తెలుగు వలెనే ” అజంతములు”)

శాంతా క్లాస్- ని హవాయినులు “కనక లోక” అని,
జీసస్ ని “ఏసుక్రిష్టో” అనీ వారు పిలుస్తున్నారు.
ఇలాగే ఇతరత్రా విభిన్న names ఉన్నవి.
వాటిని చూద్దామా!?

1) ఆర్మేనియా:- గఘంట్ బాబా:
2) బాబా చఘలూ:- ఆఫ్ఘని స్థాన్:
3) పాపై నోయెల్:- ఈజిప్ట్: ఫ్రాన్స్: స్పెయిన్
4) పీర్ నోయెల్: ఫ్రెంచ్ :- బెల్జియం
5) కెనడా:  జౌలుపుక్కీ:- ఫిన్ లాండ్
6) Weihnachtsmann (“క్రిస్ట్ మస్ మ్యాన్”) నికొలస్:- జర్మనీ:
7) Dun Che Lao Ren (“క్రిస్ట్ మస్ ఓల్డ్ మ్యాన్”):- చైనా
8) కనక లోక :- హవాయ్ దీవులు (Hawaii Islands) 
9) బాబో నోయెల్:- (ఇరాన్)
10) నోయెల్ బాబా:- టర్కీ
11) పాపా నోయెల్ :- ఫ్రాన్స్ & స్పెయిన్
12) ఫాదర్ క్రిస్ట్ మస్ నోయెల్ :- యునైటెడ్ కింగ్ డమ్
13) ఫాపా నోయిల్:- లాటిన్ అమెరికా:
14) బబ్బూ నటాలీ :- ఇటలీ

**************************************;
వివిధ దేశాలలో శాంతాక్లాజ్ పేర్లు:-
(Santa Claus  names in world)
                        (సేకరణ: కుసుమ)  


 వివిధ దేశాలలో శాంతాక్లాజ్ పేర్లు 
December 24, 2012 By: జాబిల్లి Category: మీకు తెలుసా
;

శాంతాక్లాజ్ డ్రస్సు క్రియేటర్ (My essay: ) Link : konamanini

 (హాడన్ సాంద్ బ్లోమ్ ఒక ఆర్టిస్టు....................... ) 








;


 ;













00049774  viwes

అఖిలవనిత
 18993 పేజీవీక్షణలు - 686 పోస్ట్‌లు, చివరగా Dec 25, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం
 35424 పేజీవీక్షణలు - 966 పోస్ట్‌లు, చివరగా Dec 24, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
 2165 పేజీవీక్షణలు - 111 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది 
సోమవారం 24 డిసెంబర్ 2012



24, డిసెంబర్ 2012, సోమవారం

శాంతాక్లాజ్ డ్రస్సు క్రియేటర్

హాడన్ సాంద్ బ్లోమ్ ఒక ఆర్టిస్టు.
Haddon Hubbard Sundblom 
(June 22, 1899 – March 10, 1976) గ్రాఫిక్ డిజైనర్; 
ప్రస్తుతము ఆతనిని గుర్తుకు తెచ్చుకోవడము ఏలనో? 
క్రిస్మస్ పండగ అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చే తాత ఎవరు? 
గుబురు గడ్డము, బుర్ర  మీసాలు, ఎర్రని ఫర్ కోటు, red ప్యాంటు; 
బఫూన్ టోపీ తెల్లని ఉన్ని అంచుల మేళవింపులతో… 
ఆ! అతనే “క్రిస్మస్ తాత” ఉరఫ్ “శాంతా క్లాజ్”!!!!!!!!!!!  
“క్రిస్ మస్ తాత” ఇజీక్వల్టు “శాంతా క్లాజ్“, 
రూపు రేఖలకు సృష్టికర్త  హాడన్ సాండ్ బ్లోమ్!   
Christmas Festival సమయ సందర్భాలు కలిసి వచ్చినవి, 
కాబట్టి  హాడన్ సాండ్ బ్లోమ్ అనే  artist ని 
ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నాము!  

++++++++++++++++++++   


fat, jolly, red suit, white-bearded man

;




















సన్ బ్లోమ్ భావనలకు స్ఫూర్తి 
mr. మూర్ రచించిన ప్రఖ్యాత పద్యం ……! 
క్లెమెంట్ క్లార్క్ మూర్ ( (Clement Clarke Moore ) 
1822 లో రాసిన Poem “ఎ విజిట్ ఫ్రమ్ సైంట్ నికొలస్” 
(“1822 poem, “A Visit From St. Nicholas”  అది!                        
“ఇట్ వాస్ ది నైట్ బిఫోర్ క్రిస్ట్మస్” 
(“Twas the Night Before Christmas”) అనే శీర్షికతో 
పాప్యులర్ ఐనది.         
సైంట్ నికొలస్ పేరు కాల క్రమేణా “శాంతాక్లాజ్” గా అవతరించాడు. 
ఈ పరిణామం కేవలము “పేరు“నకు మాత్రమే కాదు, 
వేషమునకు సైతము వర్తించినది. 
“కోకో కోలా కంపెనీ” కోరిక మీద 
హాడన్ సాంద్ సన్ బ్లోమ్ కొత్త బాధ్యతను 
తన భుజాల మీద వేసుకున్నాడు. 
శాంతాక్లాజ్ క్రిస్టమస్  1931 ల నుండి 
“Santa Claus painting” 
వేసే ప్రయత్నాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహించాడు
సన్ బ్లోమ్ రూపొందించిన “శాంతాక్లాజ్ చిత్రము” 
సరి కొత్త దుస్తులతో “శాంతాక్లాజ్” ను ఆవిష్కరించినది.
అంతకు పూర్వము ఆకుపచ్చ మున్నగు రంగులతో 
శాంతాక్లాజ్ దుస్తులు ఉండేవి. 
సన్ బ్లోమ్ చిత్రణలోని “శాంతాక్లాజ్ ఆహార్య, వేషధారణలు” 
క్రమంగా కొత్త మైలు రాయిని నెలకొల్పిందని చెప్పక తప్పదు. 
ఎర్రని కోటు, ఉన్ని టోపీ, బూట్లు – 
ఇంత మేలిమి డ్రస్సులతో ధగ ధగా మెరుస్తూన్నాడు నేటి  శాంతాక్లాజ్. 

******************************: 

హాడన్ సాండ్ బ్లోమ్ పొరుగింటిలో ఇద్దరు బాలికలు ఉన్నారు. 
క్రిస్ట్ మస్ వేడుకల తరుణాలలో 
“మాకు ఏమి తెచ్చావు తాతా? 
మాకు ఇంకా కావాలి, ఉండు, నువ్వు నాకు కావల్సినవి తేలేదని 
అమ్మ నాన్నకు చెబుతాను!” అంటూ మారాము చేసేవారు.
ఆ ఇరువురు అమ్మాయిలు కూడా తన బొమ్మలకు అందచందాలను చేకూర్చారు. 
ఐతే Mr. Blomsand “రెండో స్థానంలో అబ్బాయిని వేసి, పరిపుష్ఠి చేకూర్చాడు.
శాంతాక్లాజ్ ను తనివితీరా అనేక ఫోజులతో చిత్రించి, 
మాగజైన్సు లకు కొత్తకోణాలు గల తాత బొమ్మలను అందించాడు.

******************************: 

సన్ బ్లోమ్ సృజన“శాంతాక్లాజ్” picture
కోకోకోలా ప్రకటనా సామ్రాజ్యానికి చిర కీర్తిని ఆర్జించిపెట్టినది కదూ!                      
“అందరికీ మెర్రీ క్రిస్ట్ మస్!” 

శాంతాక్లాజ్ dress క్రియేటర్ 984 :(Link 1)
December 23, 2012 By: జాబిల్లి Category: మీకు తెలుసా
santa claus costume: క్రిస్ మస్ 
By: kusuma 

******************************: 

శాంతాక్లాజ్ రాకకై ఎదురు చూస్తూన్న 
బాలబాలికలకు శుభాకాంక్షలు! 
“శాంతాక్లాజ్ స్వరూపానికి పునాది” అని 
ఆంగ్ల సాహిత్య లోకాన ఉన్న కవితను 
ఈ లింకు లో చూడండి!   

శాంతాక్లాజ్ (Link 2)
http://www.santaclaus.com/christmas-stories/twas-the-night-before-christmas.php

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Santa Clause did not normally wear

red to begin with.
Up until the 1950's Santa was normally depicted
wearing a green suit, sometimes also brown and white.

Believe it or not, his suit 'changed' to red
after Coca-Cola started running an add campaign using
the fat man, and the artist Haddon Sundblom
who painted him
for this ad dressed him in
red to match Coca-Cola's color

Santa Clause costume colour  (Link 3)
;

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...