5, జులై 2012, గురువారం

ఆరుద్ర - అశ్వశాల/ హస్త బల్


giri durgamu











;
;
;                                                                            భాగవతుల శివ శంకర శాస్త్రి 
(Bhagavatula Siva Sankara Sastri) 
"ఆరుద్ర" (Arudra) కలం పేరుతో 
ప్రఖ్యాతి గాంచారు. "సమగ్రాంధ్ర సాహిత్యము" 
తెలుగు సాహిత్యానికి 
ఆయన అందించిన 
విశిష్ట ఉద్గ్రంధరత్నము.
విజయనగరంలో మహారాజా వారి 
“హస్త బల్” అనే నాటకశాల (hasti= elephant) ఉన్నది. 
ఆ స్టేజీ మీద ఆరుద్రకు సన్మానం వైభవంగా జరిగింది. ఆ సన్మాన సభలో దిగ్గజాల్లాంటి పండితులు మాట్లాడారు. "మహారాజా వారు ఏనుగులు కోసమని కట్టిన 
ఈ ‘హస్తబల్ ‘ స్థలంలో సాహిత్యంలో గజరాజు వంటి ఆరుద్ర గారికి 
సత్కారం జరగడం గొప్ప ఔచిత్యం.” 
అంటూ వక్తలు తమ ప్రసంగాలలో ఉటంకించారు.


అపరిమిత శ్రమతో అద్భుత పరిశోధనలను, అందించిన ఆరుద్ర మాట్లాడుతూ 
మహారాజా వారికి ఏనుగులు లేవు. 
ఇక్కడ ఆయన ఏనాడూ ఏనుగుల్ని కట్ట లేదు. 
ఇది అశ్వశాల మాత్రమే! 
'stable’ అంటే గుర్రాల శాల. తెలుగులో “ఇ” అని - 
ఇంగ్లీష్ లో S అనే letter ఆదిని ఉన్న పదాలకు 'ఇ'ని చేర్చే పదాల పరిణామం ఉన్నది. 
ఉదాహరణకు ‘ఇస్కూలు ’ అని పలుకుతారు. 
అలాగే stable పరిణతి జరిగింది. 
స్టేబుల్, ఇస్టేబుల్, అస్తేబుల్, అస్తబల్ అయి, హస్త బల్ ఐనది” అన్నారు.


చరిత్రను అంత నిశిత పరిశోధన చేసిన ఆరుద్ర మీద ప్రశంసల జల్లులు కురిశాయి.


* * * * *


కొన్ని సినిమాలకి తాపీ ధర్మా రావు, ఆరుద్ర సంయుక్తంగా రచనల పని చేసారు. 
వెండి తెర పైన “ తాపీ, ఆరుద్ర” అని వేసే వారు. 
అందుకు, ఆరుద్ర అందుకున్న చమత్కారం ఇది.
“ఒకరు తాపీ, మరొకరు ఆదుర్దా”


ఒకరు తాపీ, మరొకరు ఆదుర్దా.”ఆరుద్ర-అశ్వశాల (NEW AvakAya)
User Rating: / 2 
Member Categories - ప్రముఖుల హాస్యం
Written by kusuma   
Friday, 28 October 2011 13:57

1, జులై 2012, ఆదివారం

"అజిబీధ- పపా - విశ్వేసకి", పింగళి


శ్రీ కృష్ణార్జున యుద్ధము ; అజిబీధ-పపా విశ్వేసకి(1963)















;                                         "అజిబీధ- పపా - విశ్వేసకి" - 
     ఈ పేరు ఎవరిదో గుర్తు పట్టగలరా?
అలనాటి సినిమా శ్రీ కృష్ణార్జున యుద్ధం లోనిది. 
శ్రీ కృష్ణార్జున యుద్ధం - లో గీతరచన కూడా వారిదే! 
(కె.వి.రెడ్డి సుందరమైన పనితనంతో- పింగళి పద వైచిత్రీ నైపుణ్యాలు తోడైనది. 
1963 లో విడుదలైన ఈ తెలుగు మూవీ అద్భుత విజయాలతో నిర్మాతలకు 
కాసులపంటలను పండించింది). 
ఇలాటి చమత్కార పదాల సృష్టి కర్త వేరెవరో కాదు, పింగళి నాగేంద్ర రావు
పింగళి పద చిత్ర కవితా విన్యాసాలకు నోచుకున్నట్టి-  
మాయాబజార్, పాతాళభైరవి, మిస్సమ్మ- 
అలాగ ప్రతి చలనచిత్రమూ ఆణిముత్యము అని 
                            సకలాంధ్ర జనులకూ విదితమే!


"వచ్చిన వాడు అర్జునుడు, ఫల్గుణుడు, 
        సుభద్రా పరిణయమే ముఖ్య గమ్యము" 
          బావ శ్రీకృష్ణపరమాత్మ అందదండలు ఉండనే ఉన్నాయి. 
ఇక యతి వేషంలో కోటలో పాగా వేయడమెంతసేపు?! 
ఔరా! ఆహాహా! ఇంతటి చమత్కార కథ లభిస్తే 
గమ్మున ఊరుకుంటాడా మన పింగళి నాగేంద్ర రావు వారు!? 
సంభాషణలలో ఆయన హస్తవాసి అమోఘమైనదని నిరూపించేసారు.


* * * * * *
ఇంతకీ పాఠక మహాశయులారా! 
"అజిబీధ- పపా - విశ్వేసకి" 
ఈ పద నామధేయానికి మూలము ఏమిటో మీరు కనిపెట్టారా?


ఉరుము ఉరిమితే, మెరుపు మెరిస్తే ఫస్టు ఫస్టుగా 
ఒక వ్యక్తి పేరును తలుస్తారు. ఏకైక మనిషి నామమది, 
"జయమ్" - అనే పేరుతో వేదవ్యాస మహర్షి రచించిన 
                                మహేతిహాసమే మహాభారతము. 
మహాభారతములోని పాండవ మధ్యముడు అర్జునుడు. 
మేఘాడంబర వేళలలో, సౌదామినీ ఝలక్ ల తరుణాలలో భయం వేస్తే 
(పాత రోజులలో లెండి!)  గబగబా గభాలున ఉచ్ఛరిస్తారు ఆతని పది పేర్లనీ!
నిజానికి అన్ని పేర్లూ నుడవాలి గానీ, 
అత్యధిక ప్రజలకు మొదటి రెండు మూడు పేరులు మాత్రమే నెమరుకు వస్తాయి. 
(అర్జున, ఫల్గుణ - పార్ధ, కిరీటి......అంటూంటారు) 
తర్వాతి పేర్లన్నీ గాలిదేవుడికన్న మాట! 
సరే! మరి ఇప్పుడు అర్జునుని ఎన్ని పేర్లతో పిలిచారు? 
                                             కొంచెం పరికించుదము!


1) పార్ధ= పృధా తనయుడు- పార్ధుడు. అలాగే కుంతీ పుత్రుడు "కౌంతేయుడు"(కుంతీ దేవి మొదటి పేరు పృధ- ఆమె దత్తత తీసుకోబడిన పిమ్మట "కుంతీ దేవి" ఐనది)
2) జిష్ణు= ఎవరూ అర్జునిని జయించ లేరు,
3) కిరీటి = ఇంద్రుడు -కిరీటము-ను సుతుని శీర్షమున ఉంచి, అలంకరించాడు. 
           దగ ద్ధగాజమాన కిరీటము కలిగినందున- "కిరీటి".
4) శ్వేతవాహన= తన రథమునకు తెల్లని రంగు కల గుఱ్ఱములను పూన్చిన వాడు
5) బీభత్స= రణరంగములో శత్రువులను వణుకు పుట్టించే వాడు  ;
6) విజయ - విజయము సాధించే వాడు;
7) ఫల్గుణ= ఉత్తర ఫల్గుణ- అనే నక్షత్రమున జన్మించిన వాడు;
8) సవ్యసాచి = కుడి, ఎడమ,-రెండు చేతులతోనూ 
బాణములను సంధించే ప్రావీణ్యత అర్జునుని సొమ్ము
9) ధనంజయ= (धनन्‍जय) = గొప్ప సంపదలను గడించిన విజేత
10) గాండీవి=  గాండీవము- అనే నామము కల ధనుస్సు కలిగిన వ్యక్తి అర్జునుడు;


అర్జునుని ఇతర పేర్లని కూడా చూద్దాము.
అర్జున= తెల్లని వాడు
కృష్ణ= నల్లని మేని వన్నె కలవాడు 
               (కుంతీదేవి, కృష్ణుని పై భక్తితో తన  తనయుని "కృష్ణ" అని పిలిచినది)
గుడాకేశ= దట్టమైన కేశములు కలవాడు
కపిధ్వజుడు= రధముపై ధ్వజ చిహ్నము 'హనుమంతుడు'
భారత= కురు వంశ మూలపురుషుడు (scion) 
శకుంతలా  దుష్యంతుల కొడుకు "భరతుడు"- పేరును అర్జునుడు పొందాడు.
పరంతప= తన ఏకాగ్రతతో రిపులను గెలిచే వాడు
కృష్ణ= నల్లని మేని వన్నె కల వాడు


సన్యాసి గారికి బారసాల చేసారు మన పింగళి వారు.
ఇంకా "పాండవ మధ్యమ, మహా బంధు, పరంగం, కౌంతేయ" ఇత్యాది 
సమాస విశేషణ నామధేయాలు అర్జునినికి అనేకము ఉన్నవి. 
ఇన్ని పేర్లలో- పది పేర్లను సెలెక్ట్ చేసి 
"అజభీదపపావిశ్వేసకీ స్వామి"ని సృష్టించారు 
పింగళి నాగేంద్రరావు గారు. 
అదీ సంగతి. 
అది సరే గానీ, ఆ పేర్ల మొదటి అక్షరాలతో అల్లిన దండ కదా 
ఈ మాయా ఋషి 'వరుని' పేరు! పింగళి నాగేంద్ర రావూజీ 
అందులో ఇమిడ్చి, ఇరికించిన దశ నామావళి స్ఫురణకు వస్తున్నవా? 
ఇప్పుడు చిటికెలో ఆ దశ నామావళినీ పట్టేసారు కదూ! 
అవి ఇవిగో, కనండి!
"అజిబీ- ధపపా - విశ్వేసకి" - 
10 పేర్లలోని మొదటి అక్షరాల సొగసరి, గడసరి కూర్పు ఇది.


అర్జునుడు, జిష్ణు, బీభత్స, ధనుంజయ (ధనము+ జయము), 
ఫల్గుణ, పార్ధ, విజయ, శ్వేతవాహన, సవ్యసాచి, కిరీటి


ఇవీ పింగళి శంఖములో చేరిన తీర్ధ జలములు. 
అంతేనా? అంతే కాదు, అర్జున, శ్రీకృష్ణులు- 
"నర నారాయణులు" అవతారసంభూతులు. 
ఈ ద్వయ నామాలలో "నర/నరుని" అంశయే 
 సాంప్రదాయం ప్రకారం ఆశ్రమములలో 
సన్యాసాశ్రమమును స్వీకరించే  అర్హతను పొందిన వారికి 
ఋషి/ మఠాధిపతులు నూతన నామమును అనుగ్రహిస్తారు. 
 పింగళి నాగేశ్వరరావు 
;


కానీ పింగళి నాగేశ్వరరావు                          బలరాముని దుర్గమును చేరి, 
గడ్డాలు, మీసాలతో                                    దొంగసన్యాసిగా మారిన అర్జునునికి 
సరి కొత్త పేరును పెట్టారు!


చప్పట్లోయ్! చప్పట్లు!!!!!!!!


"అజిబీ- ధ పపా - విశ్వేసకి" - గారికీ జై జై జోహార్లు.

అజిబీధ- పపా - విశ్వేసకి (newAvakAya- web mag)
User Rating: / 1 
Member Categories - మాయాబజార్
Written by kadambari piduri   
Saturday, 23 June 2012 13:33
;

27, జూన్ 2012, బుధవారం

భక్తపూర్ big tree
















భక్తపూర్ దేవాలయాలు ఉన్న ఊరు.
ఈ చిన్న సిటీ నేపాల్ లో ఉన్నది.
ఇక్కడ ఉన్న పెద్ద చెట్టును ఫొటో ఇది.
నయనానందకరం,
ప్రకృతి ప్రేమికులకు ఆనందదాయకమీ మహా తరువు. 




Bhaktapur big tree


;;;;;;;;; 

20, జూన్ 2012, బుధవారం

"సావేరీ- ఉదయ రాగము"



సరస్వతీ వీణ















;
సావేరీ రాగమునకు ఒక ప్రత్యేకత ఉన్నది.      
ప్రభాత కాలములో ఆలపించే మృదు రాగం ఇది. 
కనుకనే దీనిని "ఉదయ రాగము" అని సంభావిస్తారు.
గాయత్రీ మంత్రము- ఉచ్ఛారణకు ఇది మేలైన రాగముగా ఎన్నుకోబడినది. 
కర్ణాటక సంగీతములో జన్య రాగములలోని- 
15 వ మేళకర్త రాగము, మాయామాళవ గౌళ రాగము విభాగమునకు సంగీత శాస్త్రజ్ఞులు చేర్చారు. 
సావేరీ రాగము- కరుణరస ప్రభావిని.   మనసులను ఆర్ద్ర రస ప్లావితము చేస్తుంది. 
అందుచేతనే  ఉషోదయమున గానము చేసే రాగాభరణములలో 
(భూపాళ రాగము మున్నగు వానివలె)- 
ఇది ముఖ్యస్థానాన్ని అలంకరించినది. 
(Sama Veda,Morning  raga(Saweri Raga) 
గాయత్రీ మంత్రోచ్ఛారణము :- మెదడులోని ప్రకంపనలు సున్నితముగా కదలడము"ను 
Waves నకు మేధస్సును పాజిటివ్ దృక్పధ మార్గములో, 
ఆశావహ కోణములలో చలించే రీతిని- రికార్డు చేసారు, 
వైజ్ఞానికముగా ఇది నిరూపితమైనది.
అత్యంత పురాతన కాలములో - క్రీస్తు పూర్వము -
వేద కాలములో భారత దేశములో 
సంగీతమునకు సిద్దాంతబద్ధత ఏర్పడిన అద్బుతము ఇది.
ఇండియాలో కర్ణాటక సంగీత, శాస్త్రీయ  సంగీతములకు
పునాది "సామవేదము" గా అవతరించినది. 
   

7, జూన్ 2012, గురువారం

మూడు తరాలు




బామ్మ సణుగుడు విరామమెరుగని ఆమె గొణుగుడు సాగుతూనే ఉన్నది.
ఇంట్లోకి అప్పుడే అడుగుపెట్టిన అన్నయ్య కేసి చూస్తూ,
“ఏమిటన్నయ్యా! బయట మళ్ళీ ఏం విడ్డూరాలు అగుపడ్డాయి? 
ఇంత కుంభవృష్టిలో ఇద్దరూ ఎక్కడైనా ఆగి,నెమ్మదిగా 
 రావాల్సింది! ఇలాగ తడిసి ముద్దలౌతూ వచ్చారు?” 
తువ్వాళ్ళు ఇద్దరికీ ఇస్తూ అన్నాడు ప్రదీప్.
ప్రదీప్ కి స్కూటర్ తాళాలను ఇస్తూ చిన్నగా నవ్వేసాడు అనురాగ్.
వంటింట్లోకి వెళ్ళి పాలగిన్నెను స్టవ్వుపై పెట్టేసి, 
అక్కడే ఫిల్టర్ లో ఉన్న డికాక్షన్ ను, చక్కెరను గిన్నెలో కలిపి, 
వేడి కాఫీని ఒక స్టీలు గ్లాసులో పోసి బామ్మకు ఇచ్చాడు.
వానలో తడిసి, చలికి వణుకుతూనే చీర మార్చుకున్నది.
కాసె పోసి, మడి కట్టుకునే ఆ ఏడు గజాల చీరకట్టు తెలుగుదనపు అందానికి ప్రతీక.
అనురాగ్ బామ్మకు పొగలు కక్కుతూన్న కాఫీ గ్లాసును అందించాడు.
ఆమె కోపం కాస్త చల్లబడింది.
మేడ మీదనుంచి అమ్మ వచ్చింది.
“కేకేసి పిలిస్తే వచ్చేదాన్నిగా! కాఫీ మీరే కలుపుకున్నారే!” కాస్తంత నొచ్చుకొంటూ అన్నది.
“మన  యువతరం పిల్లకాయల్లో బద్ధకాన్ని పోషించేది-
ఇలాటి అమాయకపు సాంప్రదాయపు మాతృమూర్తుల ప్రేమలే, కదరా అన్నాయ్!”
తమ్ముడు ప్రవీణ్ గడుసు మాటలకు చిరునవ్వును బదులుగా ఇచ్చాడు అనురాగ్.
‘వీడెప్పుడూ ఇంతే! పోసుకోలు కబుర్ల రాయుడు! 
తామిద్దరూ లోనికి రాగానే టీ కలిపి ఇచ్చి సేదదీర్చే ప్రయత్నాలేమీ చేయడు,
కానీ అమ్మ లాంటి వాళ్ళను మాత్రం- బోల్తా కొట్టించే డైలాగు బాణాలను 
తన మాటల తూణీరంలోఅట్టిపెట్టుకుంటాడు.
సెగల పానీయం అంగిట్లోకి జారాక, బామ్మ శాంతించింది.
కోడలుతో అన్నది-
“చూశావా కలికాలం చోద్యాలు కాకపోతే ఇదేమిటి?
మన కాలంలో ఎరుగుదుమా?”
కిసుక్కున నవ్వాడు ప్రవీణ్.
అతని వైపు కొరకొరా చూసింది బామ్మ.
” అనురాగ్ నెమ్మది, వీడెప్పుడూ ఇంతే! పెద్దవాళ్ళను లెక్క పెట్టడు. 
గంపలు గంపల నిర్లక్ష్యాన్నివసతో కలిపి పోసి ఉంటుంది తన ముద్దుల కోడలు!” అనుకుంది.
పరిస్థితిని బ్యాలెన్సు చేస్తూ అన్నాడు అనురాగ్.
“దారిలో ఓ చిన్న ఇన్సిడెంటు జరిగింది”
ప్రవీణ్ సోఫాలోకి ఒక్క గంతు వేసి, కూర్చుంటూ అడిగాడు.
బామ్మ, అనురాగ్ ల వివరణలతో వెలువడిన కథా సారాంశం ఇది.


***                           ***                             ***                              ***


అనురాగ్ , బామ్మను గుడికి తీసుకువెళ్ళాడు.
గంట తర్వాత బయలుదేరుతూంటే దేవళంలో 
బామ్మ యొక్క చిన్ననాటి స్నేహితులు తారసిల్లారు.
అనుకోకుండా కలవడంతో అందరూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఇంకేం! ఆ పాత స్నేహితుల ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళారు.
పాత స్నేహాలతో కొత్త చుట్టరికాలను కలిపేసింది బామ్మ!
అదే, తన పెద్ద మనుమడితో ఆ ఇంటి కన్యామణితో వివాహ బంధాన్ని కుదిరించేసింది.


***                            ***                               ***                                ***


"మన బామ్మకు హ్యాట్సాఫ్ అన్నాయ్! ఇదే ఏ మ్యారేజ్ బ్యూరో ద్వారానో ఐతే
దండిగా ఫీజులు అయ్యేవి. ఒక్క దమ్మిడీ ఖర్చు చేయకండానే నీకు పెళ్ళి కుదిర్చేసింది,
బామ్మా! నా మ్యారేజ్ కికూడా నువ్వే బాధ్యత తీసుకోవాలి”
“అంతకంటేనా? భగవంతుడు శీతకన్ను వేయకుండా ఉంటే  
నీక్కూడా బాసికం కట్టడం నా చేతుల మీదుగానే జరిపిస్తానురా భడవా!”


***                                     ***                                 ***                                   ***


దారి మళ్ళిన సంభాషణను చెవి పట్టుకుని,
మళ్ళీ అసలు సంగతికి తెచ్చారు.
ఇంటికి తిరిగివస్తూన్నారు, అంతలోనే కుండపోత వాన.
“మనం ఏదైనా పనిమీద వస్తేనే ఇలాటి అవాంతరాలన్నీను!  
హ్హు, ఇలాగ అంకపొంకాల వాన,నా చిన్నప్పుడు తిరునాళ్ళకు వెళూంటే కురిసింది.
మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఇలాగ ఈ దబాటు వాన!”
బామ్మ విసురుతూన్న నానార్ధాలను వినాలనిపించిందో ఏమో-
వాన చినుకులు నింగికీ నేలకూ ఏకధారలుగా మారాయి. 
“Rain! rain! gO away!” పిల్లలు కేరింతలాడ్తూన్నారు. 
“కురిసింది వాన! నా గుండెలోన…..” కుర్రకారు హమ్ చేస్తూన్నారు.
అంతలోనే చిన్న సంఘటన!
ఆట్టే బయటికి రాని బామ్మకు  అది సహించరాని విషయమే!
కింద కాలువలుగా నీళ్ళు వడివడిగా ప్రవహిస్తూన్నాయి. 
పాదం లోతు జల ప్రవాహాలు రోడ్డు అంతటా!
అందరూ స్కూటర్లూ, బల్కులూ, మోపెడ్లనూ ఆపేసారు. 
షాపుల ముందరా, బస్ స్టాండులలో,
షెల్టర్లు ఎక్కడ దొరికితే అక్కడ ముడుచుకునుంటూ నిలబడ్డారు.
బామ్మతో బాటుగా అనురాగ్ కూడా ఒక ఇంటి చూరులాంటి చోటులో నిలుచున్నాడు.
అప్పటికే చాలామంది పిప్పళ్ళ బస్తాలో కూరినట్లుగా ఉన్నారు జనం. 
‘బామ్మకు అసలే మడి. మడి పేరుతో ఎవ్వరినీ, 
ఇంట్లో వాళ్ళను కూడా తాకకుండా ఉండే అలవాటును చేసిన సాంప్రదాయం…..’
“ఛి ఛీ!” అనుకుంటూ ఎవ్వరినీ తాకకుండా పక్కకు పక్కకు ఒదుగుతూ
పాపం! ఆమె నానా అవస్థలు పడుతూన్నది. 
ఇప్పుడు అందరూ అటుకేసి చూస్తూన్నారు.
హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనన.
ఒక యువకుడు తన గర్ల్ ఫ్రెండును చటుక్కున రెండు చేతుల్లో ఎత్తుకుని
దబ్బున ఆ సన్నని ప్రవాహాన్ని దబ్బున దాటేశాడు.
అతడి కరకమలాలలో ప్రేయసి కిలకిలా నవ్వుల గ్రుమ్మరింతలు.
బామ్మ లాంటి వాళ్ళు నిశ్చేష్ఠులౌతూ, కాస్సేపటిదాకా అలాగే ఉన్నారు
‘ఇంతలు కన్నులుండ విప్పార్చి అలాగే వీక్షిస్తూ…………..’
యువత, పిల్లలూ ఆట్టే రియాక్టు అవలేదు కానీ,
ఎవరికి తోచినట్లుగా వాళ్ళు కామెంట్సు చేస్తూ మాట్లాడుకుంటూన్నారు.
“గురుడు సినిమాల్లో హీరోగా ట్రై చేసుకోవచ్చు”
“లవరేనంటావా?” “ఝనక్ ఝనక్ పాయల్ నో? పుస్కి పుస్కీనో ఐ ఉంటుంది”
“ఇలాటి వానలో తడుస్తూంటే ఇప్పుడు బాగానే ఉంటుంది,
రేపు జలుబూ, దగ్గూ….”
అప్పటికే మరి కొందరు ఆరుబైటకు అడుగేశారు, జడివానకు జడియకుండా.
అప్పటికి కాస్త తగ్గుముఖంపడ్తూన్న వానను చూస్తూనే బామ్మ 
“ఇక! పద! త్వరగా ఇల్లు చేరదాము”
“బామ్మా! నువ్వూ, తాతయ్యా 
మీ పెళ్ళైన కొత్తల్లో ఎప్పుడైనా సరదాగా
వర్షంలో తడుస్తూ ఆటలాడుకున్నారా?”
ప్రవీణ్ చిలిపితనానికి తల్లి, 
అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన తండ్రి ముసిముసినవ్వులు నవ్వుకుంటూ......
వంటింట్లోకి వేళ్ళి, భోజనపదార్ధాలను  మైక్రో ఓవెన్ లోనూ, 
స్టవ్వు మీదా వేడి చేసే కార్యక్రామాన్ని మొదలెట్టారు.
అనురాగ్ “తనకు ఇందాక బామ్మ ద్వారా పరిచయం ఐన 
కన్నెపిల్ల బొమ్మని మనసులో ప్రతిష్ఠించుకుని” తన కలకు వన్నెలను అద్దుతున్నాడు.
ప్రవీణ్ కొంటె మాటలకు బదులుగా బామ్మ తర్జని చూపిస్తూ అన్నది
“భడవా! పెద్దంతరం చిన్నంతరం ఎరగరు కదా 
ఈ కాలం పిల్లలు  మరీ కలికాలం కదూ! ” *


మూడు తరాలు
1892- జనవరి 2012 ; (Link- web)
Posted on January,2012 by విహంగ
http://vihanga.com/?p=1893

26, మే 2012, శనివారం

అలక్ నిరంజన్! అలక్ నిరంజన్!


"అలక్ నిరంజన్" అనే ఊత పదం 
బహుళ వ్యాప్తిలో ఉండడం మనకు తెలిసినదే కదా!


'అలక్ నిరంజన్’ అనగా "లక్షణములను  
                తటస్థ చిత్తముతో భావించే వాడు" అని భావము. 
ఈ అలక్ నిరంజన్ అనే మాటకు 6-7 వ శతాబ్దముల నాటి నుండీ 
ఒక మంత్రము వలె జనవాక్యమై ప్రచారములోనికి వచ్చింది. 
నేడు ఆ "అలక్ నిరంజన్" పదము ఒక ఊనిక కల ఊత పదంగా 
అనేక జిహ్వాలపైన ఆడుతున్నది. 
అసలు ’అలక్ నిరంజన్’అనే శృతి సుభగమైన ఈ పదము ఎక్కడినుండి వచ్చింది?


అలక్ నిరంజన్  అనగానే యోగ సాంప్రదాయ అనుయాయులకు, 
నాథ సాంప్రదాయ ప్రవర్తకులకూ తటిల్లతలలాగా హృదయాలలో 
మెరిసే వ్యక్తియే "మత్స్యేంద్ర నాథ్". 
నిర్గుణ బ్రహ్మ తత్వ ప్రతిపాదిని ఈ పదము. 
శ్వేతేశ్వర ఉపనిషత్తు నుండి ఈ యోగ సాంప్రదాయ వేద వాక్యము- గ్రాహ్యమైనది. 
పరమ శివుని- "సత్ + చిత్ + ఆనందమూర్తి-" గా 
భక్తుల హృదయాలలో సాక్షాత్కరించడమే ఈ అలక్ నిరంజన్- పద సాకారత్వ మహిమ.


మనము చైత్ర మాసములో నూతన వత్సర శుభ ఘడియలను ఆహ్వానిస్తూ, 
ప్రసాదమును స్వీకరిస్తాము. 
అదే పంథాలో బెంగాల్, మున్నగు రాష్ట్రాల వారు వైశాఖ మాసములో 
కొత్త సంవత్సరమును ఉత్సాహభరితంగా చేసుకుంటారు. 
అదే రోజున మత్స్యేంద్ర నాథ్ జాతర జరుగుతుంది.


మాయా మచ్చీంద్ర- సినిమా తెలుగు 1975 లో వచ్చింది. 
(ఐతే సినిమా హిట్ అవలేదు). 
ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, రామకృష్ణలు ప్రధాన నటీ నటులు. 
;



మత్స్యేంద్ర నాథ్  శిష్యులు రెండు వర్గాలు - 
1. ముని యోగి చౌరంగిలు, 
2. గోరఖ్ నాథ్ వర్గీయులు.


గోరఖ్ నాథ్ మత్స్యేంద్ర నాథ్ శిష్యుడు. 
పింగళ అనే రాణి మత్స్యేంద్ర నాథ్ ను ప్రేమించి, పెళ్ళాడింది. 
గోరఖ్ నాథ్ తన గురువు ఉన్న దేశానికి (మధ్య భారత దేశములోని- త్రియా/ తర్యా సీమ)కు వెళ్ళాడు. 
భోగవిలాసాలలో మునిగి తేలుతూ, 
లోకములోని ప్రజల బాధలను గమనించని స్థితిలో ఉన్న 
మత్స్యేంద్ర నాథ్ లో జాగృతిని కలిగించాడు. 
గురువును అతి స్వతంత్ర బుద్ధితో, చాలా చనువు తీసుకుని, హెచ్చరిస్తూ,
మరల నిర్దేశించుకున్నట్టి మార్గములోనికి నడిపగలిగిన వింత ఘటన ఇది
గురు శిష్య బంధములో విభిన్న శైలిని ఆవిష్కరించిన సంఘటన, 
హిందూ ఇతిహాస, పురాణ గాథ- బహుశా ఇది ఒక్కటేనేమో!


అలాగే కేవలము సిద్ధాంతాలకే పరిమితము చేసేయకుండా, 
మాటల సూత్రాల గిరి గీతలలో  ఇమడ్చకుండా 
మానవులు ఆరోగ్య, జ్ఞాన, సముపార్జన లక్ష్యాలను రూపొందించిన 
అద్భుత యోగ గురువు మత్స్యేంద్ర నాథ్. 
నాథ సాంప్రదాయ స్థాపకుడైన మత్స్యేంద్ర నాథ్ 
"మీననాథ్" అనే పేరుతో కూడా  పిలువబడ్తున్నాడు. 
మత్స్యేంద్ర నాథ్ జాతర, అనగా మత్స్యేంద్ర నాథ్ రథ యాత్రను 
నేపాల్, మహారాష్ట్ర, బెంగాల్ ఇత్యాదిగా-
ఉత్తర భారత దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంటారు.


ఈ రోజు "నేపాల్ సంవత్" (New Year 1129 NS (Nepal Sambat)అంటే 


"నేపాలీయుల నూతన సంవత్సరము పండుగ"ను 
మన దక్షిణాదిలో "ఉగాది పండుగ" లా అన్న మాట. 


అలక్ నిరంజన్! అలక్ నిరంజన్! (Link: newAvakAya web magazine)
User Rating: / 1 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri   
Sunday, 22 April 2012 12:49



7, మే 2012, సోమవారం

గోరఖ్ నాథ్ - గూర్ఖాలు


Gurkhas,  Lashkar Gah















                    నమ్మకము, ధైర్య సాహసాలకు మారు పేర్లుగా నిలిచిన - "గూర్ఖాలు" 
మనకు సుపరిచితమైన పేరే! నిత్యమూ రాత్రుళ్ళు, లాఠీలతో చప్పుడు  చేస్తూ, 
కారుచీకటి వేళలలో ప్రజలకు మెలకువ తెప్పిస్తూ "పారా హుషార్!" చేస్తూ,
చోరభయాలనుండి కాపాడే విధిని 
స్వచ్ఛందముగా తమ భుజస్కంధాలపైన నిడుకొన్నవారు గూర్ఖాలు- అని 
ఆసేతుహిమాచల పర్యంతమే కాకుండా, యూరోపు వాసులకు కూడా తెలిసిన కబురు ఇది.


గూర్ఖా ప్రజలు- ఒక విలక్షణమైన ప్రత్యేకతను కలిగిఉన్నారు. 
బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు- ఇండియా  సైన్యంలో 
గూర్ఖా బెటాలియన్ ను ప్రత్యేకంగా ఏర్పరిచారు అంటే 
శతాబ్దాల క్రితం నుండీ గూర్ఖాల విశ్వాస, ధైర్యములు 
చరిత్రలో ప్రసిద్ధమైనవి అనే సంగతి తెలుస్తూన్నది.


&&&&


"గూర్ఖా, గూర్ఖా లాండ్"- అనే మాటల మూల ధాతువు ఏమిటో తెలుసునా?


8వ శతాబ్దములో హిమాలయ సాను సీమలలో 
"గూర్ఖా" అనే పేరు కొండ జాతి ప్రజలకు వచ్చినది. 
శిష్యుడైన "బప్పా రావల్" వలన గోరఖ్ నాథ్ గాథ ప్రజలకు అందుబాటులో ఉన్నది. 
గురు గోరఖ్ నాథ్ "అద్భుత ముని యోధుడు". 
బప్పా రావల్ అనే రాజపుత్ర ప్రభువు ద్వారా- గూర్ఖా- అనే పద ఆవిర్భావము సంభవించినది. 
హిందువుల ప్రకృతి పూజలో భాగంగా "గో మాత" గా వారు భావిస్తూ, 
పూజిస్తూన్న గోవు  (Prakrit phrase  'go rakkha' meaning 'protector of cows) - 
"గోరక్షణ"- గో రక్ష- అనే సంస్కృత పదము నుండి- 
ప్రాకృత పదమైన "గో రక్క" పునాదిగా 
"గూర్ఖా దేశము", గూర్ఖా ప్రజలు- ఒక విలక్షణమైన ప్రత్యేకతను కలిగిఉన్నారు.


&&&&


గోరఖ్ నాథ్ - నవ నాథ సాంప్రదాయ నిర్మాత. 
శైవ యోగి గోరఖ్ నాథ్, మానవుల ఆరోగ్య ప్రదీపకగా "యోగము"లను కనిపెట్టి, 
అందరికీ అందించాడు. 
11- 12 వ శతాబ్దాలలో గోరఖ్ నాథ్ నెలకొల్పిన యోగ సిద్ధాంత విధానాలు- 
సంఘజీవనములో మేలి మలుపు. 
గోరఖ్ నాథ్ ("Eternal sage" ) - వలన  హఠ యోగమునకు- గొప్ప ప్రచారము వచ్చినది.


&&&&&&&&


గోరఖ్ నాథ్ యుద్ధవిద్యలతో సాగిన యోగి. 
అంటే షాంగై - లో కుంగ్ ఫూ, కరాటే ఆదిగా స్వీయ రక్షణా విద్యలను, 
బౌద్ధ సన్యాసులు, బౌద్ధ గురు శిష్యులూ- పరంపరగా నేర్చిన విద్యల వలెనే- 
గోరఖ్ నాథ్ కూడా స్వయానా స్వీయ సంరక్షణకై రణ విద్యలకు ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. 
ఆఫ్ఘనిస్థాన్, పంజాబ్ మొదలుకొని అనేక దేశాలలో తిరుగుతూ, 
అనేక ప్రాంతాలలో సంచరిస్తూ, ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని నింపాడు. 
ఆతనిని హిమాలయాలలో, కొండజాతి ప్రజలు అనేకులు ఆయనను అనుసరించారు. 
అధికశాతం ఆయన అనుయాయులు ఐనారు. 
వారు తమ పేర్లను "గోరఖ్ బాబూజీ" పట్ల భక్తిసూచకంగా "గూర్ఖా" అని పెట్టుకోసాగారు.
అలాగ "గూర్ఖాలు జాతి"కి మూలధాతువును అందించిన మహర్షిగా 
gorakhnath ప్రజా వందనములను అందుకున్నాడు.


 గోరఖ్ నాథ్ సిద్ధాంతములకు భక్తుడై, 
ఆయనకు శిష్యుడైనాడు  "బప్పా రావల్". 
మేవార్ రాజపుత్ర వంశ మూల పురుషుడని చెప్పదగిన- బప్పా రావల్ వలన 
గోరఖ్ నాథ్ గాథ ప్రజకు అందుబాటులో ఉన్నది. 
బప్పా రావల్ అనే రాజపుత్ర ప్రభువు ద్వారా గూర్ఖా అనే పద ఆవిర్భావము యొక్క 
విపుల విస్తరణతో నేపాలీలకు గూర్ఖా - అనే నామ ప్రఖ్యాతులై, 
చరిత్రలో వారికి విభిన్నమైన గుర్తింపు లబించినది.
  




గోరఖ్ నాథ్ - గూర్ఖాలు (newaawakaaya.com)


Member Categories - తెలుసా!
Written by kusuma   
Sunday, 15 April 2012 13:06 
;  

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...