10, అక్టోబర్ 2010, ఆదివారం

kandahar - మలయాళ భాష సినిమా













మలయాళ భాషలో వస్తూన్న “కాందహార్” సినిమా
వార్తలలో చోటు చేసుకుంటూన్నది.
మోహన్ లాల్ ఇందులో ముఖ్య పాత్రను ధరిస్తున్నాడు.
మేజర్ రవి దర్శకత్వంలో శర వేగంతో నిర్మాణమైన ఈ మూవీని
అతి శీఘ్రంగా , త్వరలో ( 2010 December - వచ్చే ఏడాది 2011 జనవరి నాటికి )
విడుదల చేయాలనే దృఢ సంకల్పంతో నిర్మాతలు ఉన్నారు.
గణేశ్ వెంకట్రామన్ మున్నగు వారు నటిస్తూన్నారు.
Major Ravi దర్శకునిగా
బహుశా ప్రపంచ సినిమా చరిత్రలోనే విశిష్ట స్థానాన్ని ఆర్జించాడని చెప్ప వచ్చును,
ఎందుకని అంటే ఆతడు
”Indian Army”- లో వీర జవాన్ గా 1975 లో జాయిన్ ఐ,
పదవీ కాలంలో ప్రతిష్ఠాత్మకమైన అనేక అవార్డులను పొందారు.
సినీ చరిత్రలో తన స్వీయ అనుభవాలే
మూల ధాతువులుగా చలన చిత్ర సారధ్యం వహించడము గొప్ప విశేషమే కదా!
సరే!
'నిఖిల్ కుంత డైరెక్టర్'గా నటుడు గణేష్ వెంకట్రామన్
ఇత్యాదిగా హేమా హేమీలు ఈ బృహత్తర కార్యంలో భాగస్వాములు.
(2006లో release అయిన
The Angrez లో నటుడు గణేష్ వెంకట్రామన్.
“ది అంగ్రేజ్ “ పూర్తిగా నిర్మించ బడినది మన ఆంధ్ర రాజధాని హైద్రా బాద్ లోనే.
భాగ్య నగరాన్నే నేపథ్యంగా movie లోని కథను అల్లుకున్నారు.)

అన్నిటి కంటే గొప్ప సంగతి, అతి ప్రముఖ విశిష్టత “kandahar” కు ఉన్నది.
అది ఏమిటో అందరికీ అర్ధమైనదనే అనుకుంటూన్నాను.
అమితాబ్ బచ్చన్ ఇందులో ఉన్నారు.
Big B నటించిన ఈ మలయాళ భాషా చిత్రం –
ఎప్పుడెప్పడు వెండి తెర మీద కన్నుల పండుగ చేస్తుందా ..........
అని ప్రేక్షక లోకం ఉత్కంఠతో ఎదురు చూస్తూన్నది.
అన్నట్టు నేడే, ఈ నాడే .........
బిగ్ బీ - Amitabh Bachchan (11 October 1942)) పుట్టిన రోజు కదండీ!

” Happy Bith Day to you!
Happy Bith Day to you!
Happy Bith Day Dear Amitab!
Happy Bith Day to you!"

భువన సామ్రాజ్ఞీ! శ్రీ కనక దుర్గా!



















నాద రూపిణీ
బిందు మండల వాసినీ!
సేద దీరగ రావె
నా మదియె నీ డోల ||

తామరస నేత్రి
తల్లి! లలితా దేవి!
కోమల ద్యుతి గాత్రి
శ్రీ కనక దుర్గా! ||

కామాక్షి! శ్రిత కల్ప వల్లీమ తల్లీ!
శ్యామా! చతుర్దశ
భువన సామ్రాజ్ఞీ! ||

సురేంద్ర కీలాద్రి పయి
నెలకొని ఉన్నట్టి
వరేందు బింబాననా!
లోక పావని జనని! ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

naada rUpiNI
biMdu maMDala vaasinI!
sEda dIraga raave
naa madiye nI DOla ||


taamarasa nEtri
talli! lalitaa dEvi!
kOmala dyuti gaatri
SrI kanaka durgaa! ||

kaamaakshi! Srita kalpa vaiima tallI!
Syaamaa! chaturdaSa
bhuvana saamraaj~nI! ||

surEMdra kIlaadri payi
nelakoni unnaTTi
varEMdu biMbaananaa!
lOka paavani janani! ||

8, అక్టోబర్ 2010, శుక్రవారం

బొట్టు,సింధూరము - కథ,కమామిషూ
















కుంకుమ రంగును కలిగి ఉన్నట్టి ఖనిజము ఏదైనా ప్రకృతిలో ఉన్నదా?:---
ఎర్ర పొడిని కలిగిన శిలలు-"వెర్మిల్లియన్ (vermillion) వర్గమునకు చెందినవి.
భూమిలోని"మినరల్ సిన్నెబార్ "నుండి ఈ పొడిని వెలికి తీస్తారు.
ఆఫ్రికాలోనూ, కొన్నిఇతర ఖండాలలోనూ అటవీ తెగలకు చెందిన మనుజులు
ఈ అరుణ వర్ణ చూర్ణాన్ని, తమ దేహాలకు పూసుకుంటారు.
అనేక మంది గిరి జనులు, తమ ఉనికిని తెలియ జేసే సాధనములుగా
ఈ లేపన ప్రక్రియను సాంప్రదాయములుగా నిబద్ధించుకుని, అనుసరిస్తూన్నారు.
తద్వారా చూర్ణ వర్ణ సమ్మేళన ప్రక్రియ ఒక అద్భుతమైన కళగా అభివృద్ధి చెందినది.
మన దేశంలో " తిలక ధారణ "కూడా ఇదే చందముగా కళాత్మకంగా పురోగతి గాంచినది.
రంగ వల్లికల
కు భూమి, గోరింటాకుకు కర చరణములూ,
కుంకుమకు మేనులు వేదికలుగా - సరి కొత్త కళా రూపములు నిలదొక్కు కున్నాయి.
Tattooలుగా ఆధునిక ప్రపంచాన్ని అలరిస్తూ, మన సంప్రదాయాలను
ధ్వజారోహణ పర్వము చేయిస్తూ, మనకు గర్వ కారణములుగా నిల బడినవి.
1. vermillion = maang
2.colour cordinals;
3.Hextri plet ;
4.E 34234;
5. B (r,g,b ) ( 22766,
52 );
6. HSV ( h,s, v )
ఇత్యాదిగ అనేక సైంటిఫిక్ సమాచారములు ఉన్నవి.















ఈ రీతిగనే మరి కొన్ని వివరములు :---

1. వెర్మిల్లియన్ :--- ఆరంజ్ రంగుతో మిశ్రితమైన ఎర్రని మూల ద్రవ్యము.
[ మన భారత దేశములో
విరివిగా వాడే పదార్ధము ఇదే!
2. రసాయనికంగా ఈ పిగ్మెంటులో "mercuric sulfide Hgs " ఉన్నది.
విశిష్టత:--- వెర్మిల్లియన్ రాళ్ళలో నిక్షిప్తమైన మెర్క్యూరిక్ సల్ఫైడ్, Hgs వలననే,
భిన్నమైన మెరుపుతో ఆకర్షణీయమై,
బహుళ వ్యాప్తిలో ఉపయోగములో ఉన్నది.
ప్రజల సాంప్రదాయక ఆచారాలలోనూ, నాట్య కళా కారులూ,
అలంకరణ సామగ్రిలలోనూ విస్తృతముగా ఉపకరణముగా ఉన్నది.
ఇతర మెర్క్యురీ (పాద రసము) మూల మిశ్రముల వలెనే (mercury compounds ),
ఈ వెర్మిల్లియన్ ఖనిజ శిలలు "టాక్సిక్" ( toxic) ను కలిగి ఉన్నవి.
ఇంతటి విశిష్టతను కలిగి ఉన్న " సింధూర ఖనిజాలను ,
వైద్య, పరిశ్రామికాది ఇతర రంగాలలో వాని ఉపయోగములపైన దృష్టి సారించ వలయును.
భౌగోళిక శాస్త్ర వేత్తలు, సైంటిస్టులు "కుంకుమ రాళ్ళ గురించీ,
ముగ్గులు, రంగ వల్లికలు ,మేకప్పులకై,
పర్వ దినముల వేడుకల సందర్భముగా అలంకరణ సామగ్రిగా
వాడే వర్ణ సంభరిత వస్తు సమామ్నాయాలపైన
మరిన్ని ప్రయోగాలను చేయాలి.
హిందూ ధర్మాన్ని అనుసరించే ప్రజలలో " తిలక ధారణము".
బొట్టు, కుంకుమలు, కాటుక - ముఖ సౌందర్యానికి దోహదము చేసే, పవిత్ర భావనలను ప్రోది చేసే
లాలిత్యమైన ఆచారముగానూ నేల నాలుగు చెరగులా పరి వ్యాప్తి చెంది ఉన్నది.
ఈ నాడు ఇదే మనోహరమైన సాంప్రదాయము,
Tattoosగా ఆమోదము పొంది,
జనులలో ప్రఖ్యాతి గాంచినది.
ప్రాచీన కాలములో, "బొట్టు తయారీ, పచ్చ బొట్టులు వేయుట- ,
కాటుక చేయుట - కుటీర పరిశ్రమల స్థాయిలో
ఎంతో మందికి జీవనోపాధిని కలిగించినవి.
నేడు బ్యూటీ క్లినిక్కులు, వైద్య రంగములోనూ టాట్టూసు కళ
ఎందరికో బ్రతుకు తెరువును కల్పిస్తూన్నది.
అందుకే మన వైశిష్ట్యమును రంగరించుకున్న
మన కుంకుమ, చందన, విభూది రేఖాది
సాంప్రదాయములు, సరి కొత్త మార్పులతో, ప్రచారములోనికి రావాలి.
యావన్మందీ అనుసరించ గలిగినదీ, అభిలషణీయమైనదీ ,
ఆచరణాత్మకమైనదీ ఐనట్టి
ఈ కళాత్మక సాంప్రదాయాలకు పలుకుదాము జేజేలు, జోహార్లు!
"సర్వే జనాః సుఖినో భవంతు ."

7, అక్టోబర్ 2010, గురువారం

నచ్చని మీసాల మహేష్




















"డాక్టర్ కజిన్స్" గొప్ప “art critic””.
ఆయన తిరువనంత పురం మ్యూజియం కొరకు చిత్ర, పటముల కలెక్షన్ చేస్తున్నారు.
అలాగ ఆర్ట్, కళా ఖండాల సేకరణ పనిలో బెజ వాడకు వచ్చారు.
అలాగ వచ్చినప్పుడు “గూడూరి నమశ్శివాయ గారి” వద్ద ఉన్న్న ఒక బొమ్మను చూసీ చూడగానే,
ఆయనకు ఎంతో నచ్చింది.
ఆ పెయింటింగును ప్రశంసిస్తూ ఉన్న పళాన 5000/- రూపాయల చెక్కును ఇచ్చి,వెంటనే తీసుకున్నారు.
ఈ బొమ్మ శ్రీ అడవి బాపిరాజు చిత్ర లేఖన కళలో ఉద్భవించిన కళా ఖండము.

ఈ “చిత్రము”నకు నేపథ్యములో, కొంచెం intrest అయిన సంఘటనలు ఉన్నవి.

నేటి విజయ వాడ – నాటి బెజ వాడలో “శరభయ్య గారు” సుప్రసిద్ధులు”.
ఆయన కట్టించిన దేవళములు - “ శరభయ్య గుళ్ళు “ అని ప్రఖ్యాతి పొందినవి.
“ములుగు పాపయ " దేవీ భాగవతమును రచించారు.
“ములుగు పాపయారాధ్యుల” గ్రంధం యొక్క ముద్రణా బాధ్యతను శరభయ్య స్వీకరించారు.
పాపయారాధ్యులు, శరభయ్య – ఇద్దరూ వీర శైవారాధ్యులు .
శరభయ్య “cover page మీద పరమేశుని బొమ్మను గీసి పెట్టండి.” అని,
అడవి బాపిరాజును అడిగారు ;
శరభయ్య ముందే 100 రూపాయలు ఇచ్చారు కూడా!
అప్పట్లో, అప్పటికే “రవి వర్మ” వేసిన చిత్ర కళా ఖండములు
జన బాహుళ్యము హృదయ సీమలలో ప్రతిష్ఠితమై ఉన్నాయి.

పాశ్చాత్య కళా లావణ్య రహస్యాలను ఆకళింపు చేసుకున్న గొప్ప ఆర్టిస్టు రవి వర్మ
"గంగావతరణము” మున్నగు పటములలో రవి వర్మ లేఖినిలో
ఈశుని రూపం మార్గ దర్శకముగా ఉంటూన్నది.
ఆయన తన చిత్రములలో “ శివునికి మీసములతో ...” అలంకరించాడు.
బాపిరాజుకు రవివర్మ అంటే భక్తి ఉన్నది,
కానీ – చిత్ర లేఖనా ప్రపంచంలో తాను ఎంచుకున్న పద్ధతి సుస్పష్టం.
ఎవరినీ అనుకరించకుండా ఉండటంలోనే
బాపిరాజుకళా మార్గ వైశిష్ట్యత నిబిడీకృతమై ఉన్నది.
భావుకుడు, లాక్షణిక, అలంకార శాస్త్ర ,
సాహిత్య రహస్యాలను ఔపోసన పట్టిన మేధావి.
బాపి రాజు విరచిత మహేశుడు – శరభయ్యకు నచ్చ లేదు.
“ మీసములు లేకుండా ఉన్న ఆ బొమ్మ ”ఆయనను ఆకట్టుకో లేక పోయింది.
“ చీ! ఇదేం బొమ్మ” అని తీసి పారేశారు.
అదిగో! అలాగ ఒక ప్రముఖ వ్యక్తికి నచ్చని బొమ్మ , ఇంకొకరి ప్రశంసలను ఇట్టే గడించింది.
tiruvanamta puram musiam లో ప్రదర్శనకై
డాక్టర్ కజిన్సు కొన సాగించిన అన్వేషణలో సాధించిన –
అడవి బాపిరాజు చిత్రించిన “మహా దేవుడు” తర్వాతి చిత్ర కళాకారులకు ఒరవడి ఐనది.

ఈ "అడివోరి సిన్నోడు" (అడివి బాపి రాజు) గురించిన సంఘటనలను
ఆసక్తిదాయకంగా వర్ణించారు ఇలాగ "శ్రీ రాంభట్ల కృష్ణ మూర్తి .

5, అక్టోబర్ 2010, మంగళవారం

కర్పూర హారతులు కనక దుర్గమ్మా!















వర మంజరీ సౌరభమ్ములను
ఈ - ధర వాసులకు ఒసగు కనక దుర్గమ్మా!!
హారతులు గొనుమా!
కర్పూర హారతులను గొనుమా! ||వర మంజరీ||

గిరి ఇంద్ర కీలాద్రి నీ - నిజ వాసమై
సుర రాజు సౌధాళినే మించెను
నీరదమ్ములు కొండ - కొమ్ములకు చేరి
నీహార ఛత్రమ్ములై వెలసెనమ్మా! ||వర మంజరీ||

నీ మృదు వీక్షణమ్ములందున దుర్గ!
పదహారు - కళల లే వెన్నియల కాంతులు
సౌజన్య వాణీ!సదా శివు(నీ) రా రాణి!
నట రాజు సామ్రాజ్ఞి!- నళినాక్షి! రావమ్మ!
హారతులు గొనుమా!
కర్పూర హారతులను గొనుమా! ||వర మంజరీ||

1, అక్టోబర్ 2010, శుక్రవారం

ఆ ఫొటో




















బాపూజీ "అహింసా విధానము" తో
స్వాతంత్ర్య సముపార్జనను సాధ్యము చేసిన తీరు
ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేసింది.
గాంధి మహాత్ముడు నిర్మించిన ఈ బాట "అహింసో పరమో ధర్మః" అనే సిద్ధాంతము
పాశ్చాత్య దేశాలనే కాక యావత్ దేశాల మేధావులనూ, రాజకీయ నాయకులనూ, ప్రజలనూ
అన్ని వర్గాలనూ ఆకర్షించింది.
అనేక అంశాలను యుద్ధముతో అక్కర లేకుండా -
"అహింసయే ప్రథమ ధ్యేయమైన పద్ధతిని"
లోకానికి అందించిన నాయకుడు మన మోహన్ చంద్ కరం చంద్ గాంధీ.
"ఇలాంటి వ్యక్తి ఒకడు - మన మధ్య నిజంగా జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు"
అని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ నొక్కి వక్కాణించారు.
ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఫొటోలు ఎంపిక చేయ బడిన వానిలో ఒకటి
“ మహాత్మా గాంధీ – రాట్నము ” .
ఈ ఛాయా చిత్రాన్ని 1946 సంవత్సరంలో తీసారు.
మార్గరెట్ బర్క్ వైట్ తన cameraలో ఫ్లాష్ కొఱకై
ఆమె - three light balls ను ఉపయోగించినది.
ఆ నాడు వాతావరణం అనుకూలంగా లేదు;
కెమేరాలోని సాంకేతిక పరికరాల వాడుకలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి.
అయినప్పటికీ Gandhi at his Spinning Wheel” ఫొటో
ప్రపంచ ఛాయా చిత్రాలలో అగ్ర పీఠంలో చేరింది.
అందరి మన్ననలను పొందుతూ, నేటికీ ఎల్లరినీ ఆకట్టుకుంటూన్న
ఈ ఫొటోను తీసిన Margaret Bourke White భాగ్య శాలినియే కదా!

నేడు అక్టోబర్ 1 - International Music Day

















నేడు అక్టోబర్ 1 - International Music Day
1999 సం|| లో బౌద్ధ మత యోగి, దలైలామా ఆదర్శ రూపమైన
World Festival of Sacred Music రూపు దిద్ద బడినది.
International Music Day కి ఇది అనుబంధ స్వరూపము – అని పేర్కొన వచ్చును.
రవి శంకర్ ప్రఖ్యాత భారతీయ సంగీత విద్వాంసుడు.
ఈతనికి సంగీత ప్రపంచములో
సుప్రసిద్ధుడైన యెహుదీ మెనుహిన్ ( (Yehudi Menuhin) తో ఆత్మీయ మైత్రి కలదు.
అక్టోబర్ ఒకటవ తేదీన “అంతర్జాతీయ సంగీత దినోత్సవము”
ప్రపంచ వ్యాప్తంగా లలిత కళారాధాకులు జరుపు కొను చున్నారు.
ఈ సంగీత ఉత్సవములకు పునాది -
యూదు జాతీయుడు , వయోలీన్ విద్వాంసుడైన మెనూహిన్ మున్నగు వారి అద్భుత కృషియే!
1975 లో మ్యూజిక్ ఆత్మీయుల సమిష్ఠి పరిశ్రమ వలన
"ఇంటెర్నేషనల్ సంగీత దినోత్సవము "రూపొందినది.
International Music Council వారి కార్యక్రమాలు, ప్రపంచ దేశాల విభిన్న సంస్కృతుల మధ్య సమన్వయము ,
అనేక జాతుల మధ్య సఖ్యత, స్నేహాలకు ఆలంబనగా ఆదాన ప్రదానములు ధ్యేయములుగా
ఈ అంతర్జాతీయ సంగీత దినోత్సవము నిర్మాణము జరిగినది.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...