21, డిసెంబర్ 2009, సోమవారం

తిరుప్పుల్లాని - దర్భశయనము



తమిళ నాడు యొక్క రాష్ట్ర ప్రభుత్వ చిహ్నము "శ్రీ విల్లి పుత్తూరు దేవాలయపు ఎత్తైన గోపురము.
ఈ పుణ్య క్షేత్రములో శ్రీ రంగ నాథ స్వామి కోవెల ఉన్నది.2. తమిళ నాడు పుణ్య క్షేత్రముల నిలయము.
తమిళనాడులోని 'తిరుప్పుల్లాని" పాండ్య నాడుగా ప్రసిద్ధి కెక్కినది. ఇది రామనాథ పురము దగ్గర ఉన్నది.
శ్రీ రాముడు సముద్రము పైన వానరుల సహాయముతో వారధిని కట్టాడు.అప్పుడు ఇచ్చట రామ చంద్రులు విశ్రాంతి తీసుకున్నారు.
ప్రసిద్ధి ఐన ఈ పుణ్య క్షేత్రములో మూలవరులు కళ్యాణ జగన్నాధన్ (Kadaladaitta Perumaal) మరియు అమ్మవారు పద్మాసన అయినట్టి కళ్యాణ వల్లి.
తిరుప్పుల్లాని కోవెలలో వట పత్రశాయి ఐన శ్రీ మహా విష్ణు మూర్తి ,భక్తులకు "శ్రీ శేష శయన మూర్తి"గా
దర్శనము ఒసగి, నయన పర్వము చేస్తున్నారు.
ప్రాచీన తమిళ సంగం ఆధారముగా (ఆకనానూరు) ఈ దివ్య క్షేత్రము విశిష్టంగా ఉగ్గడించ బడినది.
తిరు మంగై ఆళ్వార్ పాశురము ద్వారా అనేక విశేషములు బోధపడుతున్నాయి.
జానకీ నాధుడు యుద్ధ సన్నాహములు చేసేటప్పుడు,పరమేశ లింగమును ప్రతిష్ఠించి,
వారం రోజులు ఉపవాస దీక్షతో,పూజా వ్రతమును కొన సాగించాడు.
దివ్య దేశములలో ఒకటైన ఈ తిరుప్పుల్లాని దర్భశయనముగా పేరు కాంచినది.
"పుల్ల"గ్రామము వద్ద ఈ సంఘటనము తటస్థించినది. మహా సాగరముపైన శ్రీ లంక వఱకు నిర్మించ బడినట్టి సేతు వారధి ఆరంభమైన చోటు అగుటచే చిన్న పల్లె అయినప్పటికీ,"పుల్ల"గ్రామము ధన్యమైనది.
ఇక్కడ హేమ తీర్థము, దగ్గరలో దేవీ పట్టణము వద్ద దశరధ నందనుడు పూజించిన "నవ పాషాణములు",
పాంబన్ బ్రిడ్జి, palk strait, rochy wave,తలై మన్నార్ ప్రయాణీకులను ఆకర్షించే అంశాలలోనివి.
ఈ అత్యంత ముఖ్యమైన విశేషముల వలన తిరుప్పుల్లాణి సదా మాననీయమైనది.

( తిరుప్పుల్లాని - దర్భశయనము By kadambari piduri
)

3, డిసెంబర్ 2009, గురువారం

తమిళ హాస్య నటి మనోరమ - జిప్సీ పాత్ర


-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-

Tit Bits ;

నక్కలవాళ్ళు స్త్రీ పాత్ర ;

మన తెలుగు చలన చిత్ర ప్రపంచములో బ్రహ్మానందం ఎలాగో అలాగే - తమిళ హాస్య నటి- మనోరమ అంతర్జాతీయంగా అరవ వాళ్ళ వెండి తెరకు వన్నెలను తెచ్చింది .
"తమిళ సినీ ఉలగం" సుప్రసిద్ధ హాస్య నటి మనోరమ .
సినీ రంగంలో బ్రహ్మానందం వలెనే మనోరమ కూడా గిన్నిస్ బుక్ రికార్డు కెక్కినది. 'కలైమా మణి ', 'పద్మశ్రీ'ఇత్యాదిగా అనేక బిరుదులు పొందినది ఆమె.
దాదాపు 1300 తమిళ సినిమాలలోనూ, 100 కి పైన తెలుగు సినిమాలలోనూ నటించిన మనోరమ, ఇతర భాషలను సైతము నేర్చుకుని, డబ్బింగు తనది తనే చెప్పేది .
1958 లో గీత రచయిత ఐన, కన్నదాసన్ నిర్మించిన
"మాలై ఇత మాగై " ఆమె తొలి చిత్రము.
టి.వి.సీరియల్ "సకల కళా భవన్"లో ఆమె జిప్సీ పాత్రను ధరించినది. ఆ పాత్ర కొండ జాతి స్త్రీ . నరికొరవలు తెగల వాళ్ళు నక్కలను వేటాడుతారు. బుట్టల అల్లిక , చీపుళ్ళు , రోళ్ళు , రుబ్బుడు పొత్రాలనూ అమ్ముతూ జీవితాలు గడిపే సంచార జాతి . సోది చెప్పే వృత్తి అదనం.మనోరమ నారి కొరవల వాడుక భాషను చులాగ్గా నేర్చుకుని సీరియలులో "శభాష్" అనిపించుకున్నది. ఐతే ఇలాంటి పాత్రను పోషించడం ఆమెకు కొత్త కాదు. రెండు దశాబ్దాల క్రితము - ఎ.పి. నాగరాజన్ తీసిన సినిమా "కణ్ కాట్చి" లో నటించిన కురవ వనిత పాత్రను ఆమె పోషించింది.తిరుపతి ప్రాంతాల నుండి మనకు కురవలు కనిపిస్తారు. కర్నాటక, తమిళనాడు, కేరళలలో విస్తరించారు. నారీ కురవలు - నక్కలనూ, కురివికారర్లు పిచ్చుకలనూ వేటాడి, పిట్టలను అమ్మి ఉపాధి సాగిస్తారు.

వీరి భాష "కుత్రాళ కురవంజి సాహిత్యము"గా రూపొందినది. తంజావూరు నాయకుల కాలములో యక్షగానాలు , కురవంజి రూపకములను రాజులు అభిమానించి అభివృద్ధి పరిచారు.

సోది చెప్పే కురతి మహిళలు జానపద హృదయాలకు సన్నిహితులు. శ్రీ లక్ష్మీదేవి శ్రీనివాస కళ్యాణమును జరిపించిన గాధ ప్రజలకు సుపరిచితమే! "కుర్తాళం జలపాతములు" ప్రజల వేసవి విడిది ఆహ్లాదకరమైనదే కదా !
( By ++++++++
kadambari piduri )



29, నవంబర్ 2009, ఆదివారం

సమాజ మూల సమస్యలపై గాంధీజీ అవగాహన

-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
సమాజ మూల సమస్యలపై గాంధీజీ అవగాహన
::::::
ప్రజలను పరిపాలించే చక్రవర్తికి గానీ, రాజకీయ నాయకునికి గానీ, దేశములోని సామాన్య జనము యొక్క సమస్యల పట్ల హృదయ స్పందన, పేదరికాన్ని రూపు మాపాలనే ఆస్థ, జిజ్ఞాస ఎంతో అవసరం. అట్టడుగు వర్గాల పట్ల, బీద సాదల సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని నిరంతరము పరితపించే మహోన్నత వ్యక్తిత్వాలే వారి పేరును చిర స్థాయిగా నిలబెడతాయి. ఇందుకు మహాత్మా గాంధీజీ జీవితములోని ప్రతి అంశమూ నిదర్శనమే!

మహాత్మా గాంధీజీ, సమాజములో అత్యధికంగా బాధలు పడుతూన్న పేద ప్రజానీకము యొక్క సమస్యలనూ, వాటి మూల కారణాలనూ తెలుసుకొనేవారు. బాపూజీ ఆ హేతువులను , పై పైన తడిమి, కేవలం తెలుసు కోవడం వరకూ మాత్రమే ఆగ లేదు; కార్యకర్తలను బృందాలుగా ఏర్పరచి, పంపించే వారు. పూర్తిగా పరిశోధనా స్థాయిలో నిర్వహించి, సామాజిక సమస్యల గురించి సంపూర్ణముగా అవగాహన చేసుకోవాలనీ, తద్వారా పరిష్కారాలనూ తయారు చేసే ప్రయత్నములో తల మునకలుగా ఉండే వారు.

మన జాతిపిత, మొదట సమాజ సేవా సంస్కర్త, తదుపరి రాజకీయ నాయకుడు! (నా దృష్టిలో , యాదృచ్ఛికముగా రాజకీయ నేత అయ్యారు. కాకతాళీయముగా, విధి మన భారత దేశానికి ఒక అద్భుత నాయకుని రూపములో , బాపూజీని నిర్మించి అందించినది.)

చంపారణ్యములో, పీడిత ప్రజలలో, స్త్రీల సమస్యలను అర్ధం చేసుకోవడానికై, మహాత్ముని ఆదేశాలతో సేవా దళాలు ఉపక్రమించారు. ఆ సీమలలోని మగువలు బయటి వాళ్ళకి తమ ఇక్కట్లను గురించి చెప్పుకోవడానికి ఇష్ట పడే వారు కాదు. వాలంటీరుల శ్రమ నిష్ఫలం అయ్యింది. సమస్యలే తెలియనప్పుడు, ఇంక సాల్వు చేయడమెలాగని? దాంతో, మళ్ళీ విసుగు చెందని విక్రమార్కునిలాగా, మోహన్ చంద్ కరం చంద్ గాంధీ స్త్రీలకే ఆ కార్య నిర్వహణా భారాన్ని అప్ప జెప్పారు.

కస్తుర్బా గాంధీ మరియూ అవంతికాబాయ్ గోఖలేల ఆధ్వర్యంలో వలంటీర్ల బృందము బయలు దేరినది. వాళ్ళు చంపారణ్యములో కాలికి బలపం కట్టుకుని తిరిగినప్పటికీ, ప్రయోజన శూన్యమే అయ్యింది. ఐనప్పటికీ కస్తూరి బాయి, అవంతికా బాయి గోఖలే, సభ్యులు నిస్పృహ చెంద లేదు; తమ పనినీ విరమించలేదు. సందె వేళకి ఒక వాడకు చేరుకున్నారు. ఒక గృహము తలుపు తట్టి, పిలిచింది ఆమె.
"అమ్మా! ఉదయం నుండీ తిరిగాము. మాకు గొంతెండి పోతూన్నది. బాగా దాహం వేస్తూన్నది. కాస్త మంచి తీర్థము ఇస్తారా?" అంటూ అవంతికా బాయి గోఖలే అడిగింది.

తలుపును కొంచెము తెరిచి, లో నుండి గ్లాసును అందించింది ఒకానొక వనిత.

"అమ్మా! మీ చేయిని చూసాను; లోటాను అందించిన మీ అరచేతిని చూసాను. ఆ చేయి తాలూకూ మనిషి కూడా కనిపిస్తే మాకు ఎంతో సంతోషము కలుగుతుంది" అని అడిగింది కస్తూర్బా గాంధీజీ.

ఇంటి లోపల ఉన్న ఆ మహిళ ఇలాగ అన్నది "అమ్మా! మేము ముగ్గురు ఆడ వాళ్ళము ఇక్కడ ఉంటున్నాము. చిరుగులు తక్కువగా ఉన్న కాస్త మంచి చీర మాకు ఒక్కటి మాత్రమే ఉన్నది. ఆ చీరను కట్టుకుని, మా అక్క ఇప్పుడే ఆమె బయటకు వెళ్ళి ఉంది. తక్కిన ఇద్దరమూ, అర కొరగా గావంచాను చుట్టుకుని ఉన్నాము. మరి ఇప్పుడు మీకెలా కనబడగలుగుతాము?" విలవిల లాడే హృదయాలను చిక్క బట్టుకుని, విలపిస్తూ తమ ఇబ్బందిని చెప్పేసారు.

ఆ సంఘటనకు కలవర పడని వారెవరుంటారు? ఆక్రోశముతో కుచించుకు పోతూన్న ఆ అమ్మాయిలతో కస్తూర్బా ఇలా సాంత్వన వచనాలతో ఊరడిల్లేలా జేసింది.
"సోదరీ మణులారా! తలుపులను( మూసి) వేసుకోండి. మీ మనసుల తలుపులను తెరిచారు"


(Kasturba told the weeping woman:
"Close the door. The doors of your heart are opened.")


30, సెప్టెంబర్ 2009, బుధవారం

టెంకాయ చిప్ప

వావిలి కొలను సుబ్బారావు గారు గొప్ప రామ భక్తుడు. రామాయణము ఆంధ్రీకరించి "ఆంధ్ర వాల్మీకి " బిరుదాంకితులు అయ్యారు.
సహజ కవి పోతన భాగవతము వెలసిన సీమ ఐన ఒంటిమిట్ట లోని
కోదండ రామాలయమును పునరుద్ధరించడానికి నడుం బిగించారు. ఆయనది వజ్ర సంకల్పమే! అలనాడు రామదాసుగా ప్రజల మానస పద్మములందు నెలకొనిన కంచర్ల గోపన్నను ఆదర్శముగా తీసుకున్నారు , ఈ " వాసుదాసు ". విరాళాలను పోగు చేశారు,
అయితే అందుకు ఆయన అనుసరించిన పద్ధతి విభిన్నముగా ఉండి , జనుల మన్ననలను అందుకున్నది.
సంచులూ, హుండీలు వంటి వాటిని పట్టుకోలేదు వావిలికొలను సుబ్బారావు. కేవలం ఒక కొబ్బరి చిప్ప ను బిక్షా పాత్రగా గైకొన్నారు. ప్రజానీకం ఇచ్చిన విరాళాలతో , కోదండ రామాలయ పునర్నిర్మాణము దిగ్విజయముగా పూర్తి చేయ గలిగారు వాసు దాసు.
తన బుజ్జి బిక్షా పాత్రపై ఎన లేని ప్రేమతో ఒక శతకమునే రచించారు. అది -

" ఆంధ్ర వాల్మీకి హస్తంబు నందు నిలిచి
రూప్యములు వేన వేలుగా ప్రోగు చేసి
దమ్మిడైనను వాని , లో దాచుకొనక
ధరణి జాపతి కర్పించి, ధన్యవైతివి కదా
కమ్రగుణముల కుప్ప ! టెంకాయ చిప్ప!





ఫిలిప్పీన్సులో మగ లతిక్ నాట్యము(magalatik Dance ) ప్రదర్శిస్తూంటారు.ప్రజలు
అభిమానించే ఈ డాన్సులో ఒక ప్రత్యేకత ఉన్నది.అది, శరీరముపైన - కొబ్బరి చిప్పలను కట్టుకుంటారు.ఆ నారికేళ డిప్పల పైన లయ బద్ధముగా ,మన కోలాటము వలె -కొడుతూ, చిందులు వేస్తారు.ఈ నాట్యము యుద్ధ సమయాలలో ,యోధులను ఉత్సాహ పరిచే గానముతో, నాట్యముతో కూర్చబడిఉంటుంది.స్పెయిన్ పాలనలో ఉన్నప్పుడు, ఇది రూపు దిద్దుకున్నది. స్థానికముగా నివసించే మోరోలు,అనే తెగ వారు, విదేశీయులతో (Moros ) పోరు సలప వలసి వచ్చినది బినాన్, లగునా వారు చేసిన "పోరు చిత్రణ"యే ఈ నర్తన కళగా ప్రదర్శన అయ్యింది.
(Binan, Laguna as a mock-war dance)

ఆ నగరము స్వేచ్ఛ ప్రదర్శన కొరకై పోరాడిన (Town’s patron saint, San Isidro Labrador.)సైంట్ శాన్ ఇసిడ్రో లాబ్రేడర్ అనే యోధుని స్మరిస్తూ, మెగా లతిక్ నాట్యములలో అధికముగా కొనసాగుతూంటాయి.
ఈ నాట్యములో వేసే అడుగులను క్రమమైన పద్ధతితో,లెక్క ప్రకారము జరుగుతూంటాయి.

All dancers are male; with harnesses of coconut shells
attached on their chests, backs, thighs and hips.

Here are the steps of maglalatik dance:
_______________________________________

1. 6 8-counts jogging to get to place -

2. 4 steps forward while pounding chest

3. 4 basic clap cycles in place -
4. 4 basic clap cycles to get to two rows

5. 8 quick clap cycles to do the ripple effect - 6. 8 quick clap cycles to circle around partner- 7. CIRCLE UP

2 8-counts + 1 4-count for first clap - cp after 1 8-count 3X- - Finishing clap - 8. 8 high-low clap cycles to move to position -
9. 8 cycles of 6 hit clapping - 10. 16 counts for tricks with clapping in the background

11. 4 basic to get to two sides - 12. 8 quick clap cycles for the battle -
13. 4 quick clap cycles to get to end

after last clap POSE


---*Note:*---

-----*Learning "maglalatik" Dance is quiet hard for me, but ofcourse, we can learn something. It's a nice dance!*-----

21, సెప్టెంబర్ 2009, సోమవారం

మేలిమి బంగారము వంటి ఈ పాట

మేలిమి బంగారము వంటి ఈ పాటను వీడియో-లో వినండి.





మేలిమి బంగారము వంటి పాట

చక్రవర్తుల రాజగోపాలాచారి స్వాతంత్ర్య పోరాటములో పాల్గొన్న దేశభక్తుడు.
ఆయన స్థాపించిన "స్వతంత్ర్య పార్టీ" ఆనాటి రోజులలో పేరెన్నిక గన్నది. గొప్ప రచయిత కూడా.
రాజాజీ రాసిన తమిళ పాట
" kurai onrum ellai maraimoorthi kanna " ను
1966 లో U.N. లో M.S. సుబ్బులక్ష్మి గానం చేసారు.

ఆమె, భర్త T. సదాశివమ్ లు తమ ఇంటికి భోజనమునకు రమ్మని,
రాజాజీని ఆయన అనుచరులనూ ఆహ్వానించారు.
విందులో అరిసెలు, బొబ్బట్లు వంటి రుచికరమైన పిండి వంటలను కూడా వడ్డించారు.
బెల్లంతో తయరు చేసిన భక్ష్యాలను అందరూ తిని, ప్రశంసించారు.
రాజాజీ "విందు సంపూర్ణంగా రుచికరముగా ఉందమ్మా! "అని మెచ్చుకుంటూ కృతజ్ఞతలను తెలిపారు.
ఆనక, కొంచెం తాళి ఇలా అడిగారు
" సదాశివం గారూ! వంటింట్లో బెల్లానికి చీమలు ఏమైనా పట్టాయా?" ఆ ప్రశ్న దంపతులను తికమక పెట్టినది.
అప్పుడు వంటింట్లోకి వెళ్ళి, పరిశీలించారు ; నిజంగానే చీమలు పుట్టలు పుట్టలుగా బెల్లానికి పట్టి ఉన్నాయి.
రాజాజీ నిశిత పరిశీలనా శక్తికి అక్కడ ఉన్నవారు అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
" కల్తీ లేని తీపి వస్తువులకు చీమలు పడతాయని గుర్తించారు; అన్యాపదేశంగా వారు ఇచ్చిన విందును రాజాజీ మెచ్చుకున్నారని "
సుబ్బులక్ష్మి దంపతులు, సంతోషం పొందారు.

( Pramukhula Haasyam " కల్తీలేని మధురభక్ష్యాలు "

By kadambari piduri
___________________________________________


kurai onrum illai marai mUrti kaNNA!
kurai onrum illai kaNNA!kurai onrum illai gOvindA!( 2 )

kaNNukku teriyaamal nirkinray^, kaNNA !
kaNNukku tteriyaamal
ninraalum enakkukurai onrum illai marai mUrthy, kaNNA!
vENdiyaadait tanDida vEnkaTEsan enrikkaa
vENdiyadu vEronrum enakkillai, kaNNA
maNivaNNA, malaiappA!
gOviMdaa!gOviMdaa! gOviMdaa! gOviMdaa!

tiraiyinpin^ nirkinraai, kaNNA! -kaNNA!
tiraiyinpin^ nirkinraai, kaNNA! -kaNNA!
unnai+maraiyODum gnAnaiyir- maTTumE kANbAr -
enraalum +
kurai onrum illai marai mUrthy kaNNA!
kurai onrum illai kaNNA!
kunrin mEl kaLLaagi mirkinra varadA!
kunrin mEl kaLLaagi mirkinra varadA!
maNivaNNA, malaiappA!
gOvindA, gOvindA !
gOvindA, gOvindA !gOvindA, gOvindA !
kalinaaLuk irangi kaLLilE
irangaisilaiyaaga kOilil nirakkinraay^ , kEsavA!
yaarum marukkaada ,malai appA!
yaarum marukkaada malayappA!-
un maarbil +yenrum yeduM daaruLum
karuNai kaadal annaiyenrum
irundhida yEdhu kurai enakku?
yenrum irundiDa - yEdhu kurai enakku?
kurai Onrum illai marai mUrti , kaNNA!
kurai Onrum illai marai mUrti , kaNNA!
maNivaNNA, malaiappA! gOvindA, gOvindA !
gOvindA ! gOvindA ! gOvindA !

పాట :---
కురై ఓన్రుం ఇల్లై మరై మూర్తి కణ్ణా!
కురై ఓన్రుం ఇల్లై కణ్ణా!
కురై ఓన్రుం ఇల్లై గోవిందా!( 2 )

కణ్ణుక్కు తెరియామల్ నిర్కిన్రయ్, కణ్ణా
కణ్ణుక్కు త్తెరియామల్ నిన్రాలుం ఎనక్కు
కురై ఒన్రుం ఇల్లై మరై మూర్థ్య్, కణ్ణా!

వేణ్దియాదైత్ తండిద వేంకటేసన్ ఎన్రిక్కా
వేణ్దియదు వేరొన్రుం ఎనక్కిల్లై, కణ్ణా
మణివణ్ణా, మలైఅప్పా! గోవిందా!గోవిందా!
గోవిందా! గోవిందా!

తిరైయింపిన్ నిర్కిన్రాఇ, కణ్ణా! -కణ్ణా!
తిరైయింపిన్ నిర్కిన్రాఇ, కణ్ణా! -కణ్ణా!
ఉన్నై+మరైయోడుం గ్నానైయిర్-
మట్టుమే కాణ్బార్ - ఎన్రాలుం
కురై ఒన్రుం ఇల్లై మరై మూర్థ్య్ కణ్ణా!
కురై ఒన్రుం ఇల్లై కణ్ణా!

కున్రిన్ మేల్ కళ్ళాగి మిర్కిన్ర వరదా!
కున్రిన్ మేల్ కళ్ళాగి మిర్కిన్ర వరదా!
మణివణ్ణా, మలైఅప్పా! గోవిందా, గోవిందా !
గోవిందా, గోవిందా !గోవిందా, గోవిందా !

కలినాళుక్ ఇరంగి కళ్ళిలే ఇరంగై
సిలైయాగ కోఇలిల్ నిరక్కిన్రాయ్ , కేసవా!
యారుం మరుక్కాద ,మలై అప్పా!
యారుం మరుక్కాద మలయప్పా!-
ఉన్ మార్బిల్ +
యెన్రుం యెదుం ధారుళుం కరుణై కాదల్ అన్నై
యెన్రుం ఇరుంధిద యేధు కురై ఎనక్కు?
యెన్రుం ఇరుందిడ - యేధు కురై ఎనక్కు?
కురై ఓన్రుం ఇల్లై మరై మూర్తి , కణ్ణా!
కురై ఓన్రుం ఇల్లై మరై మూర్తి , కణ్ణా!
మణివణ్ణా, మలైఅప్పా! గోవిందా, గోవిందా !
గోవిందా ! గోవిందా ! గోవిందా !

========================================
Meaning: "I have no grievances at all absolutely, vEdha nayakA! kaNNA!
Youare not seen by mt eyes;
Even though You are not seen by my naked eyes, Ihave no grievances!
(implies; I have, because I am not able to see you)

తాత్పర్యము :
________
1.వేద నాయకా! అత్యాస లేదు. నా బాహ్య చక్షువులతో నీవు కనుపించుట లేదు.
Whatever I wish, You are able to give me,
Then, whatelse do I need? (exceptYou); Hence, I have no grievances;
maNivaNNA! malai appA! GovindhA!
నేను ఏది కోరినా నువ్వు ఇయ్య గలవు,నువ్వు తప్ప ,నాకు ఇంకేమి కావాలి?
అందు చేతనే నేనేమీ కోర నక్కర్లేదు. మణివణ్ణా! మలయప్పా!
You are standing behind the curtain (imples stage; You are a soothradhaari);
Only vEdic scholars and gnAnis can see You;
Even then, I have nogrievances
(implies, I have because I am not able to see You);
తెర వెనుక ఉండి,మమ్మల్ని నడిపించే సూత్రధారివి నీవే కదా!
వేద పండితులు, జ్ఞానులు మాత్రమే నిన్ను వీక్షించ గలరు.
ఐ కూడా , నాకు అసూయ, ఖేదము లేవు.
During these "kali" yugam,
You have come and entered and stayed as an archAform at TirumalA, kEsavA!
No one can deny Your Existence, GovindhA!
When the Merciful, Goddess stays in Your chest all the time,
why should Ihave any "kuRai"? GovindhA!"
కేశవా! ఈ కలి యుగములో అర్చా మూర్తిగా నీవు వచ్చి, తిరుమలైలో వెలిసి ఉన్నావు.
ఎవ్వరూ నీ వ్యాప్తిని అడ్డుకోలేరు.
కారుణ్యము,అనుగ్రహమును ఒసగే దేవత, నీ హృదయ సీమ పై స్థిర పడి ఉన్నది కదా,
మరి, నాకు వేరే శంక (కురవై ) ఏల ? గోవిందా!

శ్రీ పద్మావతీ సమేత శ్రీనివాస పరబ్రహ్మణే నమః

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...