1965 ల నుండి ఆకాశవాణి(అదేనండీ! రేడియో)లో భారత, భాగవత, రామాయణములను తెలుగులో వ్యాఖ్యానములను విపులముగా, వివరంగా చెప్పేవారు. అలాగే శ్రోతల కోసం "ప్రశ్నోత్తరములు" శీర్షిక సర్వ జనానురంజకముగా ఉండేది. విలక్షణ కంఠముతో పాప్యులారిటీని సముపార్జించారు, ఆయనే "ఉషశ్రీ".మిమిక్రీ కళాకారుల ఐటమ్ లలో ఆయన గాత్రము, శైలి, ఉచ్ఛారణ ఉండేవంటే ఉషశ్రీ కంఠములోని వైవిధ్యత ఎంతగా ప్రజలను ఆకట్టుకున్నదో గ్రహించ వచ్చును.
విజయవాడలో రేడియో కేంద్రములో ఉన్న రోజులలో ఒక వింత సంఘటన జరిగింది. పనిలో తల దూర్చారంటే, ఉషశ్రీకి బయటి ప్రపంచము తెలిసేది కాదు. సాహిత్యాభిలాష మిక్కుటము కాబట్టి పరిసరాల గురించి ఉషశ్రీకి ఆట్టే పట్టేది కాదు.
ఒకతను రేడియో స్టేషనులో కాంట్రాక్టు ఉద్యోగము కోసము ఆశతో ప్రయత్నము చేసుకుంటున్నాడు. ఉషశ్రీ పని ఒత్తిడితో సతమతమౌతూన్నారు.
ఉషశ్రీ రికమెండేషనుకై ఆతడు ప్రయత్నం చేయసాగాడు. ఐతే కార్య భారము వలన ఒకింత విసుగ్గా ఉన్నారు ఉషశ్రీ. తన ఎదుట కొత్త మనిషి నిలబడి ఉన్నాడనే స్పృహ కూడా లేకుండింది. అటూ ఇటూ పరిగెత్తుతూన్నపుడు, రవ్వంత అతను గోచరించాడు
.
"ఏం కావాలి? నాయనా!"
"తమరేది ఇప్పించినా సరే!" - చేతులు నులుముకుంటూ అన్నాడు అతడు.
వెంటనే ఆఫీసు కుర్రాణ్ణి పిలిచి "వీరికి టీ ఇచ్చి పంపించు" అనేసి తిరిగి తన పనిలోతల మునకలయ్యారు ఉషశ్రీ.
18, ఆగస్టు 2009, మంగళవారం
ఏం కావాలి? నాయనా !
15, ఆగస్టు 2009, శనివారం
గాంధీ తాతకు జేజేలు!
మా గాంధి నామము మరువం!మరువం!
---------------- -----------------
1)కొల్లాయి గట్టితేనేమి
మా గాంధి-కులము ఏదీ ఐతేను ఏమి
(=కోమటై పుట్టితేనేమి? )
2)వెన్న పూస మనసు-కన్న తల్లి ప్రేమ
పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు //
3)నాల్గు పరకల పిలక, నాట్యమాడే పిలక
నాలుగు వేదాల నాణ్యమెరిగిన పిలక //
4)బోసి నోర్విప్పితే -ముత్యాల తొలకరే!
చిరు నవ్వు నవ్వితే -వరహాల వానలే!//
మన భారత దేశమునకు స్వాతంత్ర్యమును ఆర్జించే దిశలో సాగిన పోరాటాలలో-సాహిత్యం వేసిన ఉరుకుల పరుగుల-ముందడుగులలో-ఎన్నెన్నో కవితల ఆణి ముత్యాలలో, ఇలాగ ఒకటి, రెండు గీతాలను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుందాము.
నా చిన్నప్పుడు,ఆకాశ వాణిలో, అదేనండీ రేడియోలో నన్న మాట, ఒంటి కాలి మీద నిలబడి మరీ పిల్లకాయలము, ఏక దీక్షగా, ఏకాగ్రతతో వింటూండే వాళ్ళము. ఆ రోజులలో, రేడియో అపురూపమైన వస్తువు. దానిని పాడు చేస్తారేమో ననే భీతితో, భయంతో పిన్నలకు అందకుండా పెద్దలు, అలమారలో భద్రంగా పై అరలలో పెట్టేవారు. బాల బాలికలు వినదగినవీ, వారి విద్యాభివృద్ధికీ, వారిలో దేశ భక్తిని పెంపొందింపజేయగల ఐటంసు అని వారు అనుకున్న ప్రోగ్రాములనూ విన నిచ్చే వారు. అందుకే ఆ కొన్ని కార్యక్రమాలనూ, ఒంటి కాలి తపస్సు చేస్తూ, దోరగా చెవులు అప్పగించి మరీ వినే వాళ్ళము.
11, ఆగస్టు 2009, మంగళవారం
మజాగా చేసిన మనువు
మజాగా చేసిన మనువు ::::
----------------
భాషకు సంబంధించిన హాస్య,చమత్కారములు,హృదయాహ్లాదకారకములే!ఆ దిశలో,భాషా గని నుండి అగణిత సంఘటనలు మనకు లభిస్తూనే ఉంటాయి.ఆ రత్నాలను,తుడిచి,మసక బారనీయకుండా,మరల మరల,అందరికీ మానస సీమలలో దృశ్యమానం చేయడమే,ఈ పౌనః పౌన్యత వలన లభించే ప్రయోజనం.
************************************************
స్వాతంత్ర్య సమరము అంటేనే,పూచిక పుల్లకి కూడా దేశభక్తినీ,ఆవేశాణ్ణీ,ఉత్తేజాన్నీ కలిగించే చారిత్రక సంఘటనల సమామ్నాయము.అదే దేశ భక్తి ప్రతి ఒక్క వ్యక్తిలో "ఈ సీమ నా మాతృభూమి,ఇందు ఉద్భవించిన ప్రతి అంశాన్నీ పరి రక్షించుకోవాలి."అనే తపన.
ఫలితంగా,సమాజమునకు లభించిన సాంస్కృతిక సంపదను భద్ర పరుచుకో సాగారు.అదే విధంగా,సంఘాన్ని పట్టి పీడిస్తూన్న,మూఢ నమ్మకాల బూజును దులిపి వేసి, నవ్య సామాజిక చిత్రణమును,నవీన వర్ణ భరితంగా చేయడానికి నడుం కట్టారు.ఈ మహోద్యమములో,ఎందరో,సంఘ సంస్కర్తలు తమ జీవితాలను ధార పోసారు.
వారి త్యాగమయ గాథలకు చలువ పందిళ్ళు వేసిన అలనాటి,స్వరాజ్య పోరాట కాలము ,మహనీయుల చేతలతో పునీతమైనది.
***********************************************
దుర్గా భాయి దేశ్ ముఖ్ మడమ తిప్పని యోధ వనిత.ప్రాణ భీతినెరుగని మహిళ.నేతి సీతా దేవి ఆమె జీవిత చరిత్రను అక్షర బద్ధము చేసారు.
దుర్గాభాయ్ ప్రజలలో అమితముగా వాసికెక్కినది.ఆట్టే ఫ్యాషన్లు తెలియని ఆ రోజులలో,"దుర్గా బాయ్ అంచు చీరలు-విపణి వీధులలో,(అదే లెండీ:మార్కెట్టులో అన్న మాట!)వచ్చాయి;స్త్రీలు"దుర్గా భాయి అంచు చీరలను కట్టు కున్నారు"అంటే,ఆమెకు ఎంతటి పేరు,ప్రఖ్యాతులు వచ్చాయో మనము అర్ధము చేసుకోవచ్చును.
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""
గోరా భార్య పేరు సరస్వతి.కాకినాడ శానిటరీ ఇనస్పెక్టరు,దుర్గ,మున్నగు వారు కొద్ది మంది ఒక వితంతు వివాహాన్ని,చేయడానికి నడుం బిగించారు."నాస్తికులు"అంటూ,దూషించారు,సాంప్రదాయ వాదులు.ఆ పరిణయ వేదికకు,పురోహితులు ఎవ్వరూ రాలేదు.
తత్ఫలితంగా,మార్పును కాంక్షిస్తూన్న ,పురోగామి వర్గీయులు,వేసిన ముందడుగులు,గొప్ప ప్రభంజనాన్నే పుట్టించాయి.
అయ్యగారి అచ్యుత రామయ్య గారు,అర్జెంటుగా మంత్ర విధిని నేర్చుకున్నారు.
ఆయన పెళ్ళి మంత్రాలు చదివి,ఆ పెళ్ళిని చేసారు.
దుర్గ,ఆమె మరదలు తిమ్మా బాయి వీణతో హాజరయ్యారు.వారి సంగీత సామ్రాజ్యములో ఆ నాటి మేజువాణి వేడుక పరి పూర్ణమయ్యినది.

10, ఆగస్టు 2009, సోమవారం
భట్రాజీయం/భట్టు రాజీయం
ఒక సభా వేదిక మీద ప్రముఖులు ఆసీనులై ఉన్నారు. ఆహ్వానితులలో పట్టాభి సీతారామయ్య, సి.పి.భట్ ఉన్నారు.
ప్రత్యేక అతిథిగా వచ్చిన C.P. Bhat వక్త. భట్టు గారు ఉపన్యసిస్తూ,"భోగ రాజు పట్టాభిరామయ్య ధర్మ గుణములో ధర్మ రాజు, త్యాగములో త్యాగరాజును మించిన మహోన్నత శీలుడు,....."అంటూ ఇలాగ పట్టాభి గొప్పదనాన్ని గురించి చాలా చాలా పొగిడాడు. ఈ పద్ధతిలో సాగిన ఆయన వాక్కులు యావత్తూ సీతారామయ్య గూర్చిన ప్రశంసా వాక్యాలతోనే నిండి పోయినాయి.
తదుపరి,సన్మాన గ్రహీత అయిన పట్టాభి సీత రామయ్య ప్రసంగిస్తూ ఇలా పలికారు.
"...నా సంగతేమో గానీ, ఇవాళ వారి మెప్పు ల వలన నేను ఆనందములో తడిసి, తరించి పోయాను. నా మీద అమిత అభిమానంతో, "భట్"గారు,"రాజు"లాగా నన్ను పొగిడారు."
పూర్వ కాలంలో చక్రవర్తులను, సామ్రాట్టులను పొగిడే వృత్తిలతో భట్రాజులు,
వందిమాగధులు మున్నగువారు ఉండేవారు.
"భట్రాజీయం"లోని శ్లేష అర్ధమైన సభికుల నవ్వులతో ఆవరణ కోలాహలంగా మారినది.
(kadambari piduri,
read my articles,songs for kids in ;
july,29,2009)
7, ఆగస్టు 2009, శుక్రవారం
గురువుకు తగ్గ శిష్యుడు
శా."నా మార్గమ్మును కాదు, శిష్యుడయినన్ నా తాత ముత్తాతలం
దే మార్గమ్మును కాదు; వీని దెదియో? ఈ వూర్గ మట్లౌటచే,
సామాన్యుండనరాదు వీని కవితాసమ్రాడ్వ్తమా హేతువై,
ఈ వుచ్చిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్ ."
సత్యనారాయణగారికి గుడివాడ ఎ.ఎన్.ఆర్. కాలేజీలో సన్మానం జరిగింది. ఆ సందర్భములో, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు తొమ్మిది ఆశీర్వచన పద్యాలు చెప్పారు. వానిలోని ఎనిమిదవది పైన చెప్పిన శార్దూల ఛందస్సులోని పద్యము.
“నా శిష్యుడే అయినా, ఇతనిది నా పద్ధతి కాదు. నా తాత ముత్తాతల పద్ధతీ కాదు. (= మన పూర్వ కవులు) ఇతడిని సామాన్యుడు అని అనుకోకూడదు. కవితాసంరాడ్వ్తమాహేతువై ఈ నా శిష్యుడిని వరించింది. నాకెంతో సంతోషంగా ఉన్నది."
కోట సుందరరామశర్మగారు తమ కాలం నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,ఇలాగ సెలవిచ్చారు"చెళ్ళపిళ్ళవారి శిష్యుడిని అని చెప్పుకోవడం మా రోజులలో తెలుగు కవులకి, పండితులకీ ఒక certificate , యోగ్యతాపత్రం లాంటివే!. ఒక నెలో, రెండునెలలో చెళ్ళపిళ్ళ వారి దగ్గిర చేరి, వారి శిష్యుడినే అని వందలమంది గర్వంగా,ఆనందంతో చెప్పుకునేవారు.".
Aavakaya website lo చూడుము
By kadambari piduri,Jul 25 2009 1:35PM
("బాస, భాష" జొన్నలగడ్డ తో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి సంభాషణ)
3, ఆగస్టు 2009, సోమవారం
పూల రంగడివి నీవేనయా!

నీవేమో పూల రంగడివి!
-----------------
వెన్నెలల పందిరిలో-వెండి మబ్బుల్లు!వెండి మేఘాల పైన-జాబిల్లి ఠీవి చూడు !మేఘ మల్హారం పాట-హర్ష వర్షమే జగతికి!కస్తూరి రంగయ్యా!-కావేటి రంగయ్యా!-మా బాలుడు 'టింగు రంగడు'!నీవు' పూల రంగడివి' !బాలలతో తారంగం-ముద్దుల మురిపెమ్ములు!ఆటలు ఆడేటందుకు-వేగిరమే రావయ్యా! రంగ నాథ !*********************************************************************************************************
శ్రీగంధము శ్రీపాద వస్త్రము

శ్రీవారి సేవలో ప్రతి అంశమూ నిత్య నూతనమే! ఆసక్తిదాయకమే!
గర్భ గృహము, స్వామి వారి శయన మందిరముల మధ్య ఉన్నది"కుల శేఖర పడి". తిరుమలేశునికి ప్రతి శుక్రవారము అభిషేకములు చేస్తారు.
శుద్ధి పరచిన కర్పూరము, పసుపు ముద్దలను కలిపిన జలములను బయటే తయారు చేసి రజత కలశాలలో నింపి తీసుకుని వస్తారు. గర్భగుడికి తీసుకుని వచ్చి ఆ మధుర సన్నివేశాన్ని ప్రకటిస్తారు.
"ఇందిరా నిజ మందిరా!"
"హరి అంతరంగ శ్రీ లక్ష్మీ దేవి"
శయనవేళలలోన భోగ శ్రీనివాసునిగా భక్తుల హృదయారవిందములలో కొలువు దీరుతాడు శ్రీ వేంకట రమణుడు.
అందువలననే, భోగ శ్రీనివాసుని అలంకార సేవా విశేషములలో విశేషముగా ఎన్న దగినది శ్రీ గంధ సేవ.
ఆ భోగ శ్రీనివాసుని హృదయ భాగములో "శ్రీ గంధము రూపులో" లక్ష్మీదేవి కొలువు ఉన్నది.
"హృదయ లక్ష్మీ దేవికి గంధము"ను అద్దుతారు. ఆ గంధపు ముద్ద యొక్క పరిమాణములో సగము భాగమును పద్మావతీదేవికి అలదుతారు.
ఇలాగే శ్రీ వారి పాద కవచములను పునుగు నూనెను పూసి, వస్త్రముతో తుడుస్తారు.
ఇలాగే శ్రీ వారి పాద కవచములను పునుగు నూనెను పూసి, వస్త్రముతో తుడుస్తారు.
ఈ వస్త్రమునే "శ్రీ పాద వస్త్రము"అని పిలుస్తారు."విశ్వ రూప సేవ"లో భక్తుల కళ్ళకు అద్దించి నుదుటికి తాకిస్తారు.
శ్రీ సప్త గిరీశ, శ్రీ వేంకటేశుని సేవలో వినియోగించిన వస్తు సంభారాలను స్పర్శించిన భక్తులకు లభించే పవిత్ర భక్తి భావనా తాదాత్మ్యతల విలువలు తులతూచ లేనివే కదా!
(See my articles);
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
రెట్ట మత శాస్త్రము ::::: '''''''''''''''''''' వ్య...
-
రాధికా సాంత్వనము (రచన: ముద్దు పళని ) ::: ,,,,,,,,,,,,,,, " తేటలుగా జిగి ముత్యపు : పేటలుగా,పంచదార వూటలుగా,పూ : తోటలుగా, రా చిలుకల : ...