24, ఫిబ్రవరి 2015, మంగళవారం

వారముల పేర్లతో ఊళ్ళు, streets

""వాడల వాడల వెంట వసంతము
జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ": 
హోలీ ఆటపాటల మేలా ఇది.
ఈ మణిపూస అన్నమాచార్య సంకీర్తనా భాండాగారములోనిది.
వాడ - మొదలైన పదగుంఫన విదితమే!   
"వాడల వాడల వెంట వాఁడివో. " అని అన్నమయ్య సంకీర్తన చేసారు.
************************ 

వాడ , అంటే - పేట, వీధి అని అర్ధం. 
ఈ పదానికి మూలం మరాఠీ పదము ఐన "పేట్"/ "పేఠ్" = " పేట", వాడ.
తిరుమాడవీధి - మున్నగు పదాలు ఎరుకలో ఉన్నవే!
పేఠ్ – తెలుగున “పేట” అని ఉచ్ఛారణను పొందిన పదం.
పూనా పట్టణము మహారాష్ట్రలో వాణిజ్యకేంద్రము.
పూనా జనులకు - వారముల పేర్లతో ఉన్న వీధులు అక్కడ వ్యవహారములో ఉండి, సుపరిచితములైనవి.
పూనాలో ఇంచుమించు పద్ధెనిమిది పేటలలోని,
ఏడు  స్ట్రీట్స్ లకు = వీధులకు,వారముల నామములను కలిగి ఉన్నవి.
************************ 
17 – 18 శతాబ్దములలో వర్తకులు, ఆయా వీధులలో నిర్ణీత వారములందు మాత్రమే లావాదేవీలు, వర్తక కార్యకలాపాలను నిర్వర్తించే వారు.
నేడు పాతపట్టణముగా పూనావాసులకు, సంప్రదాయ కూడలిగా సుపరిచితమై ఉన్నది.
************************ 

సరే!  ఇప్పుడు మనం కొన్ని  జాగాలను ఇట్లాంటి వింత  ఉన్న  చూద్దాము.
భౌమ = భూమి సంబంధమైనది, భూమి పుత్ర - సూర్యుడు/ చంద్రుడు అని భావం. 
सार्वभौम - సార్వభౌమ:- సర్వ భూమినీ పరిపలన చేసేవాడు- చక్రవర్తి - అని అర్ధము. 
1] అ) ఆదివారము :- ఆదివారపు పేట –పేరు వినగానే తెలుస్తున్నది కదా!
తూర్పు గోదావరి జిల్లానందు, ద్రాక్షారామమునకు ఉత్తరదిశలో,
శివబాలయోగి దాదాపు పది, పన్నెండేళ్ళు తపస్సు చేసిన చోటు,
 Sunday Market , సంత – అని తాత్పర్యం. ఉన్నది.
2] భౌమ్య వారము:- Bhauma Nagar, Bhubaneswar - Odisha 
ఒరిస్సాలోని భువనేశ్వర్ లో "భౌమ నగర్" ఉన్నది. 
************************ 

 2] సోమవారము :-  
అ):- సోమవార పల్లె: - హుస్సేన్ జిల్లాలో, సులగోడు; ఆర్కల్ గుడ్ – 
 &) సోమవార్ పేట్ =  కొడగు , కర్ణాటక రాష్ట్రము లో ఉన్నది.
ఆ) :- విశాఖట్టణం – విశాఖ జిల్లాలోని, కశిం కోట మండలమున – సోమవారం గ్రామము ఉన్నది.
ఆ) వైరా మండలము లో; ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఉన్నది. ఇది తెలంగాణా రాష్ట్రమునందు ఉన్నది.
#(Somavaram is a Village in Wyra Mandal

************************ 

 3] మంగళవారము
మంగళగౌరీ వ్రతము - స్త్రీలకు తెలిసిన నోము. 
మంగళగౌరీ - కోవెల "గయ" లో కలదు.
అ) మంగళవారము:- శ్రీకాకుళం లోని - ఇచ్ఛాపురం మండలమునందు - + ఉన్నది.
 Jammadevi perta village
] 1662 లో పెట్టిన పేరు. “అష్టపుర” అనే పేరు కలిగి ఉన్నది, పిమ్మట 
ఆ] మంగళవార పేట :- రాయచూరు నందు ఉన్నది. 
************************ 

3) బుధవారము:- 
అ) గన్నవరం , అజ్జనపూడి గ్రామం, క్రిష్ణా జిల్లా లో ఉన్నది.
ఆ) మధ్యప్రదేశ్ లో బుర్హాన్ పూర్ ; నేపా నగర్ డిస్ట్రిక్ట్ లో - బుధవార బజార్ ఉన్నది.
ఇ) బుధవారము:- బుధవార్ పేఠ్ . పూనా - నందు కలదు.  
1703 నాటిది. ఔరంగజేబ్ స్థాపించెను.

************************ 
గురువారము /  లక్ష్మీ వారం :-
అని ఆంధ్రప్రదేశ్ లో - కొన్ని జిల్లాలలో వాడుకలో ఉన్నది.
మార్గశిర లక్ష్మివార వ్రతం - లక్ష్మీ పూజకు విశిష్టత కలిగిఉన్నది. 
పుష్యమాసము, మార్గశీర్షమాసములందున - గురువారం చేస్తున్న నోము మార్గశిర లక్ష్మీవార వ్రతము. 
అ) లక్ష్మివారపుపేట -రాజమండ్రి 
ఆ) గురువారపేట - పూనా 
************************ 

శుక్రవరము : - 
శ్రావణ శుక్రవారము, వరలక్ష్మీవ్రతము - ఇంటింటా గృహిణులు చేస్తూన్న వ్రతము.
అ) శుక్రవారమండపం . తూర్పు గోదావరి జిల్లాలోని కపిలేశ్వర పురం - లో ఉన్నది.  
కపిలేశ్వర అంతర్ భాగము, ఐరామ కాల్ (Ayiramkaal mandap) రీతి కలిగి ఉన్నది.
ఆ) paaliya rai shrine నందు కొలువై ఉన్నారు అమ్మవారు.  
"శుక్రవార అమ్మన్" :-
త్రిలోకజనని ఐన అమ్మవారు - పార్వతీదేవి అవతారము.
ఐ) "శుక్రవార అమ్మన్" , అంబాల్, అంబాళ్. 
త్రిపురసుందరి, చొక్కనాయకి, సుందరనాయకి – 
         మొదలైన నామావళితో కీర్తించబడుచున్నది.
************************ 

శనివారము :- 
అ) శనివారవాడ – అను పేరు కలిగిన వీధి పూనా లో ఉన్నది. 
ఇది ఒక రాజభవనము.  ఈ Royal Palace  1746 కట్టడము. 
పీష్వాలు 1838 వరకు పరిపాలించారు/
************************ 

[ వారముల పేర్లతో ఊళ్ళు, పల్లెలు, వీధులు, పేటలు, వాడలు ]
సేకరణా రచన:- కాదంబరికుసుమాంబ 

 Spinx amidst 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...