19, డిసెంబర్ 2013, గురువారం

కిట్ కాట్ పేరెలాగ వచ్చింది?

కిట్ కాట్: చాక్లేట్లను తినే వాళ్ళందరికీ ఈ పేరు సుపరిచితమైనదే,

ఈ పేరును ఎక్కణ్ణించి సంగ్రహించారు?

క్రిస్టఫర్ కాట్లింగ్ – అనే చెఫ్ (వంటలలో  ప్రవీణుడు) ఒక షాపు నడుపుతూండేవాడు. 
ఆతని టిఫినీ సెంటరు ఎప్పుడూ కవులు, పబ్లిషర్లు, కార్యకర్తలు- మొదలైన వారితో కళకళలాడ్తూండేది.

సాహితీపిపాసులు గుమిగూడి, వారు చేసే చర్చోపచర్చలతో సదా సందడి సందడిగా ఉండేది. ఆ వాదోపవాదాలలో కొత్త కవితా రీతులూ, సంఘ, సామాజిక సిద్ధాంతాలెన్నో మొలకలెత్తి, చిగుళ్ళు తొడిగి, నవీన మధుర  ఫలములు సమాజానికి లభించేవి.

***********************************,

క్రిస్టఫర్ కాట్లింగ్ – అనే చెఫ్ (వంటలలో  ప్రవీణుడు).

Christopher Catling నడిపే చిన్న food  inn, బ్రిటన్ దేశభక్తులతో కిటకిటలాడ్తూండేది. 
అతడు కస్టమర్ లకు అందించే ’మీట్ పై ’ (meat pie)ను తింటూ అందరూ మాట్లాడుకునేవారు. బ్రిటన్ దేశచరిత్రలో మైలురాళ్ళను నెలకొల్పిన సంభాషణలు అనేకం ఆ చోట జరిగేవి.

కిట్ కాట్  లు జాకబ్ టాన్సన్ [1655 - 1736] ప్రాచీన ఆంగ్ల సాహిత్యాన్ని ప్రచురించేవాడు. 
"ఇవిగో వచ్చేసాయి, మన కాట్ లింగ్ గారి చేతి “కిట్ కాట్ లు” అంటూ నవ్వుతూ ఆ చిరుతిళ్ళను ఆస్వాదించేవాడు. 
జాకబ్ టాన్సన్ ప్రచురణ కర్త. ఆ చిన్న హోటల్లో ఐటమ్ లను, “మీట్ పై” ముక్కలకు జాకబ్ టాన్సన్ సరదాగా పెట్టిన పేరు “Kit Kat ” ఆ బుల్లి కెఫే యజమాని నామధేయాన్ని, ఇంగ్లీష్ భాషలో చిన్న శ్లేషపదముగా తీసుకోవడానికి బాగా తమాషాగా ఉపయోగపడింది.

Jacob Tonson పుస్తకప్రచురణ ద్వారా అనేక మంది (జాన్ డ్రైడెన్, జాన్ మిల్టన్ మున్నగు) కవుల రచనలు  18 వ శతాబ్దములో వెలుగులోనికి వచ్చినవి.

అంతే కాదు- అతడు విల్లియం షేక్ స్పియర్ ఇత్యాది ప్రముఖుల రచనలను కూడా కాపీరైట్సు- ని పొంది, ఇంగ్లీష్ లిటరేచర్ లోని విలువైన సాహితీ విలువలు- ప్రపంచానికి సన్నిహితపరిచాడు. అందువలన – ప్రపంచ సారస్వతము కొత్త పుంతలు తొక్కింది. ఛందస్సు, మతముల వరకే పరిమితమైన వ్రాతలు , కొత్త కోణాలలో కాంతిరేఖలను వెదజల్లసాగాయి. చరిత్ర, సామాజిక, ఆర్ధిక, మానసిక, రసాయన , సైన్సు – మున్నగు నవీనపంధాలలో వృద్ధి చెందాయి. ఎంతగా అభివృద్ధి గాంచాయనగా – అవధులు లేనంతగా, ఆ గగన పర్యంతము-అన్నంతగా ఐనవి.

జాకబ్ టాన్సన్ [1655 - 1736]| mutton pies కి పెట్టిన తమాషా నిక్ నేమ్, తర్వాత విక్రయాల గ్రాఫు గిన్నీస్ బుక్ రికార్డు స్థాయిలో ఫేమస్ ఐనది.

***************************************,


Kit Kat

Link for photo  (See)

Kit Kat Chunky bars కూడా బాగా పాప్యులర్ ఐనవి. 
Kit Kat  club 18 వ సెంచరీలో ఇంగ్లండులో- “హాస్య, విట్స్ (wits), నవ్వులతో వాతావరణం ప్రపుల్లంగా ఉండేది. దేశభక్తుల సమాహారముగా ఆ గదులు భాసించేవి. Jacob Tonson పుణ్యమా అని, ఒక క్లబ్ పేరు కాస్తా ఆహారరంగంలో నిలిచి, అందరి నాలుకల పైన ఆడుతూన్నది. పోప్, స్టీల్, అడ్డిసన్, కాన్ గ్రీవ్ మున్నగు వారు; ఈ కిట్ కాట్ క్లబ్ శాశ్వత సభ్యులు అనవచ్చును.

***********************************,

Kit Kat అనేది ఒకచాక్లేట్, ఔనా!? గత ద్విదశాబ్దాల క్రితం, నువ్వుజీడీలు, నిమ్మతొనలు, తీపి బిళ్ళలు, అటు  తర్వాత బిస్కట్లు – బాల బాలికలు తినే తినుబండారములు. వాటి తర్వాత పిప్పరమెంట్లు, లాలీపప్సు, అలాగే కిట్ కాట్ లూ- ఆధునీకరణతో ఫ్యాక్టరీలలో పెద్ద ఎత్తున తయారై  విపణివీధులలో వెల్లువెత్తినవి.

“Kit Kat Chunky bars “Have a Break, Have a Kit Kat” వగైరా వ్యాపార ప్రకటనలు, మార్కెట్ లోకి ప్రవేశించి, వాణిజ్యసరళికి ఆధునిక మార్గాలను ఏర్పరిచినవి. కిట్ కాట్ క్లబ్ - 18 వ సెంచరీలో  న్యూ వేవ్ లో సంచలన సూక్తులను రూపుదిద్దినవి. వ్యాపార ప్రకటనలు, అడ్వర్టైజ్ మెంట్సు కోసము- సారస్వతము ఆలంబనముగా- దీటైన పదాలూ, పలుకులూ చిత్రీకరణలైనవి. ఇది ఒక వింత పరిణామమే!!

***********************************,

17 వ శతాబ్దం ద్వితీయార్ధం చివర్లో, 18 వ  శతాబ్దములో – చిత్రంగా కిట్ కాట్ సైజు అనేది- ఒక స్టాండర్డ్ కొలత లాగా నిలద్రొక్కుకున్నది.

***********************************,

సర్ గాడ్ ఫ్రే అనే ఆర్టిస్టు కూడా Kit Kat Club లో మెంబరు.

అతను, కిట్ కాట్ చాక్ లెట్సుని ఫై కవర్ ని 36 by 28 inches కొలతలతో chocklate ను రూపొందించాడు. గతంలో కొన్ని ఏళ్ళు, ఆంధ్రదేశంలో “హార్లిక్స్ మూతలు” మూతలకు పేరుగా నిలిచినవి.

అదే విధంగా కిట్ కాట్, ఎర్రని రంగు cover, దానిపైనున్నటువంటి అక్షరములూ(Letters) కూడా 36/28 సైజు వాణిజ్య ఆకర్షణ ఐన కొలతగానూ, రంగు,లోగోలు – అదే తీరున స్థిరపడినవి.

***********************************,

అప్పుడప్పుడూ – కొన్ని నవీన గమనాలు గమ్మత్తుగా – ప్రజల వాడుక లో నానుడులలో – గడుసుగా జాగాను గడిస్తాయి – 
బట్టలు ఉతికే సబ్బుపొడి- అంటే “సర్ఫ్” నేది వాడుకంట; సబ్బు ఏ కంపెనీదైనా, ఏ బ్రాండుకు చెందినదైనా “సర్ఫ్, రిన్ బార్” అనీ, లక్సు సోపు, లైఫ్ బాయ్” అనీ- ఇలాగే స్థిరపడిన లిస్టులోని కొన్ని ఊత పదములు.

ఇంత అద్భుతంగా చాక్ లెట్సు కి మారుపేరుగా ఐ, 
చాకో బార్ లకు నిర్దేశిత కొలమానంగా అవతరించిన ఈ Kit Kat కి ఎవరైనా సరే,అభినందిస్తారు కదా!!!!!

పిల్లాజెల్లాకు, పిన్నలు, పెద్దలకు, అత్యంత చాక్ లెట్ ఐ, ఇంటింటింటా చప్పరిస్తూ, లొట్టలేస్తూ యావన్మందీ ఆస్వాదిస్తూ తింటూన్న ఈ కిట్ కాట్ , అదిగో;టి.వి. లో ప్రకటనలలో ప్రత్యక్షం; వహ్వారే!!!!!!

***********************************,
(Essay by:- kONamaanii)
***********************************,
కిట్ కాట్ పేరెలాగ వచ్చింది?
September 27, 2013 By: జాబిల్లి Category: కథలు 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...