8, మార్చి 2013, శుక్రవారం

చిమ్నాజీ అప్పా, బేలాపుర్ దుర్గము

"అప్పాజీ" అనగానే శ్రీకృష్ణదేవరాయలును ఆదర్శప్రాయ, 
వీర చక్రవర్తిగా తీర్చిదిద్దిన "మహామంత్రి తిమ్మరుసు" జ్ఞాపకం వస్తారు.
అప్పాజీ - అంటే "తండ్రి" అని అర్ధం.
మహారాష్ట్ర చరిత్రలో ఇలాగ "అప్పా" అనే ప్రశంసతో గౌరవించబడిన 
మరో రణ ప్రజ్ఞ కల వ్యక్తి మరొకడు ఉన్నాడు. 
ఆతనే "చిమ్నాజీ అప్పా" (1707 - 1741).
బాలాజీ విశ్వనాథ్ కుమారుడు. 
మరాఠీ సామ్రాజ్య అధినేత బాజీ రావు పీష్వా సోదరుడు చిమ్నాజీ అప్పా. 
రణరంగంలో ఆధునిక పద్ధతులను అభివృద్ధి చేసిన యోధుడు, 
సేనలను ధీటుగా ముందుకు నడపగల నైపుణ్యత  కల సేనాపతి. 
పోర్చుగీసు వాళ్ళు ఆక్రమించిన - వాసీ, రెండు కోటలను స్వాధీనపరచుకుని, 
మరాఠా జయకేతనాలను కోటబురుజులపైన ఎగురవేయగలిగాడు.  
"మరల కోటను పాశ్చాత్యుల నుండి గెలిస్తే, 
ఆ కోట వద్ద ఉన్న అమృతేశ్వర స్వామిని 
మారేడు దళముల దండలను వేసి పూజలు చేస్తాను" 
అని చిమ్నాజీ అప్పా మొక్కుకున్నాడు.
అనుకున్నట్లుగానే విజయ ఢంకాను మ్రోగించగలిగాడు.  
చిమ్నాజీ అప్పా తన మొక్కును తీర్చుకున్నాడు. 
ఆ నాటినుంచీ "బేలాపుర్ దుర్గము" అనే పేరు వచ్చింది. 
సంస్కృత భాషలో "బిల్వ వృక్షము" అని మారేడు చెట్టుకు పేరు. 
కాబట్టి "బేలాపూర్" నామము ఆ దుర్గానికి కలిగినది.
బిల్వ దళ హారములచే అర్చన చేసిన స్థలము ఐనందున, 
బేలాపూర్ అనే పేరు ఆ కోటకు ఒప్పినది.
సాహస వీరుడు, పరాక్రమవంతుడైన 
చిమ్నాజీ అప్పా విగ్రహమును  ప్రజలు నెలకొల్పారు. 
;


;
************************;
Tags:-
chimnaajii appaa;  (Link)
a garland of beli leaves;
Amruthaishwar temple;
Belapur Fort;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...