7, ఫిబ్రవరి 2013, గురువారం

చెన్నపట్టణం, మద్రాస్ అనే పేర్లు ఎలా కలిగినవి?


అర్ధ చంద్రాకారములో ఉన్నది  ఆ కొండ .
చంద్ర వంక ఆకారములో ఉన్నది కాబట్టి “చంద్రగిరి ” అన్నారు.
ఆ గిరి పాదమున కట్టిన కోట అవడముతో –
దానికి “చంద్రగిరి కోట”అనిన్నీ, ఆ ఊరికి “చంద్రగిరి”అనిన్నీ పేర్లు కలిగినవి.
శ్రీ కృష్ణ దేవ రాయలు “తిరుపతి మహా పుణ్యక్షేత్రము” ను దర్శించుకోవడానికై వచ్చినప్పుడు,
మార్గ మధ్యాన ఈ చంద్రగిరి దుర్గములో బస చేసేవాడు.
చంద్రగిరి పట్టణమును పాలించిన చక్రవర్తి “పెద వేంకట రాయలు”.
ఈతను విజయ నగర సామ్రాజ్య సామ్రాట్టులలో ఆఖరి ప్రభువు.
ఈతని సామంతుడైన రాజు దామెర్ల చెన్నప్ప నాయకుడు సిఫార్సు చేయగా-
సామ్రాట్ పెద వేంకట రాయలు అంగ్రేజీ వర్తకులకు – కోటను కట్టుకోవడానికి అనుమతిని ఇచ్చారు.
1639 లో ఆగస్ట్ 22 వ తేదీనాడు ఈ సంఘటన సంభవించినది.
ఫ్రాన్సిస్ డే – అనే ఆంగ్లేయుడు – “బ్రిటీష్ ఇండియా కంపెనీ తరఫున
ఇలాటి పర్మిషన్ ని సంపాదించగలిగాడు. 

***********************;

నాయక రాజులు తెలుగు సీమకు గుర్తింపు తెచ్చిన సామంత పరిపాలకులు.
దామెర్ల వెంకటాద్రి నాయకుడు తెలుగు వ్యక్తి:
ఈతని తండ్రి “దామెర్ల చెన్నప్ప నాయకుడు” శ్రీ కాళహస్తి కీ, వందవాసికీ ఏలిక.
దామెర్ల చెన్నప్ప నాయకుడు ఆరవీటి వంశీయులకు సామంత రాజు.
ఆరవీడు చక్రవర్తి ఐన “శ్రీ రంగ దేవ రాయలు” కు విధేయునిగా
శ్రీ కాళహస్తి నీ, వందవాసినీ ప్రాంతాలను పాలించాడు దామెర్ల చెన్నప్ప నాయకుడు.
ఈ తెలుగు ప్రభువు ఏలుబడిలో ఉన్నట్టి ప్రాంతములలో ఉన్న నగరమునకు
ఆతడి పేరుమీదనే “చెన్నపట్టణము” అని వచ్చినది.
చెన్నపట్టణమునకు హ్రస్వ రూపమే “చెన్నై”.

***********************;
చెన్నపట్టణము – మద్రాస్ సిటీ కి దక్షిణ దిక్కున ఉన్నది.
చెన్నపట్టణమునూ, ఈ జార్జ్ కోట ప్రాంతాన్నీ కలిపి

ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభావముతో
“మద్రాసు”అని  పేరు ఇవ్వబడినది.
కానీ ప్రజలకు “చెన్నపట్టణం” అనే నామధేయం చాలా ప్రీతికరమైనది.
అందుచేతనే మరల “చెన్నై” అనే పేరుతో పునః బారసాల జరిగినది.
చెన్నపట్టణమునకు చిట్టి పిలుపు “చెన్నై”.
తమిళ నాడు ప్రభుత్వము సాంప్రదాయనామమును స్వీకరించి,
1996 సంవత్సరములో    
మద్రాసుకు మళ్ళీ “చెన్నై” అనే పేరును నిశ్చయించినది.
ప్రజలు సంతోషముతో స్వాగతము పలికారు.
ఆమోదముద్రను పొంది ఐనది ఈనాడు అది చెన్నై.

***********************;

“మద్రాస్” కి మూల పదము:-
పాశ్చాత్యుల రాకతో మన హిందూదేశములోని
అనేక cities కి – కొత్త పేర్లు వచ్చినవి.
వాటిలో అధిక నిష్పత్తిలో  పోర్చుగీసు names మూలములుగా కలిగినవి.
“మాడ్రె డి డ్యూస్ (Maare de Dues) నుండి
“మద్రాస్” అని నిర్ధారించారు  కుంఫిణీ వాళ్ళు.
1639 లలో Fort St. George ని ఇంగ్లీషు వాళ్ళు కట్టారు.
ఆంగ్లేయులు సైంట్ జార్జ్ కోటను కట్టినారు.
అప్పటికే చెన్న పట్టణము అనే చిన్న నగరము ఉన్నది.
దామెర్ల చెన్నప్ప నాయకుని నామధేయాన్ని ఈ నగరము పొందినది.
కాలక్రమేణా జార్జి కోటకు చుట్టుపక్కలా విస్తరిస్తూ,
మద్రాసు మహా నగరము – గా రూపుదిద్దుకున్నది.
***********************;
చెన్న కేశవ పెరుమాళ్ కోవెల అక్కడి పుణ్య క్షేత్రము.
కనుక ఆ స్వామి పేరుతో పేరెన్నిక గన్నది “చెన్నై” అని కొందరి అభిప్రాయం.
***********************;
1) చంద్రగిరి: 2) మద్రాస్: 3) చెన్నై:
ఆయా పేర్లు వరుసగా ఇల్లాగ
ఆయా ఊళ్ళకు ఒనగూడినవన్న మాట!
***********************;
వ్యాస రచన: కాదంబరి:   
***********************;
;
                          ‘Town Temple'

;
 ఆధార పదములు:
( Telugu rule Damarla Chennappa Nayakudu :
  Chennapattanam (British Madras):- -> Chennai );

‘Town Temple' ; "The Arani zamindari's palace;
 Arani House.(Essay in "jaabilli" : below this LINK): 

చెన్నపట్టణం, మద్రాస్ అనే పేర్లు ఎలా కలిగినవో తెలుసునా? 
January 30, 2013 By: జాబిల్లి Category: వ్యాసాలు;


‘Town Temple': photo link:  (The Hindu)4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

thank you for this information.
very informative.
:venkat

కమనీయం చెప్పారు...నాకు తెలిసినసమాచారం ప్రకారం ,అప్పటికే అక్కడ ఉన్న 'ముత్తరాసుపట్నం 'నుంచి మద్రాసు అన్న పేరు వచ్చిందని.చెన్నపట్నం గురించి మీరు రాసినదంతా యదార్థమే.మొత్తం మీద తెలుగు పట్టణమైన మద్రాసుని మన అసమర్థత వలన కోల్పోయేము.

kadambari చెప్పారు...

Thank you!
అజ్ఞాత గారూ!

(akhilavanitha.blog/)

kadambari చెప్పారు...

కృతజ్ఞతలు కమనీయం గారూ!
ఊళ్ళకే కాదు, వాడలకూ సహేతుక నామావళి
లభిస్తూ ఉంటూన్నవి.
మద్రాసు ఉరఫ్ చెన్నై కోసం
నాటి రాజకీయ నాయకులు
టంగుటూరి ప్రకాశం పంతులు- మున్నగువారు
ఎంతో ప్రయత్నించారు.
ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పట్టణాలే కాదు,
గ్రామాలు , ఇళ్ళ పేర్లూ మున్నగునవి-
చరిత్రకు తీపి గురుతులు.
(akhilavanitha.blog/)

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...