15, అక్టోబర్ 2012, సోమవారం

రావికొండలరావ్ కనుబొమ్మలు


1968 లలో ఒక తమాషా జరిగింది."వరకట్నం"  ఎన్.టి. రామారావు నిర్మిస్తున్నారు. 
ఆ సినిమాలో రావి కొండలరావు నటిస్తూ ఉన్నప్పుడు ఇలాగైంది. 

ఎన్.టి.రామారావుని అందరూ "పెద్దాయన" అని పిలిచేవారు. 
“బ్రదర్! కూర్చోండి. మంచివేషం మీరైతే బావుంటుంది. 
తమ్ముడితో మాట్లాడండి. డేట్స్ ఇస్తారు. 
"All the best!!!!! ” అన్నారు అన్నగారు.  
ఆనందంతో ఉక్కిరిబిక్కిరి ఔతూన్న  రావి కొండలరావు. 
తత్క్షణమే  త్రివిక్రమరావును కలిసాడు. 
షూటింగ్ తేదీల కాగితం మీద 'సంతకాలు' పెట్టాడు, 
ఆమైన దర్జాగా 'సొంత కాలు' బయటపెట్టి బయటపడ్డాడు 
"అమందానంద కందళిత హృదయారవిందుండనై” అని రావి కొమ్మలరావు,  
సారీ! రావి కొండలరావు తన “కనుబొమ్మలాట” అనే వ్యాసంలో ఉటంకించాడు.

******************;Photo Curtesy:-
telugu-movie-artist-address

(Link For Image)
******************;
సరే! షూటింగు తొలిరోజు, 
వాహినీలో చాలా సహజమైన సెట్ వేశారు కళాదర్శకుడు ఎస్.కృష్ణారావు
మేకప్ రూమ్ కి వెళ్ళి కూర్చున్నాడు రావి కొండలరావు. 
అక్కడ రావికి వేయాల్సిన డ్రెస్సు- పెద్దకోటు, జుబ్బా, తలపాగా- వగైరాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 
భక్తవత్సలం మేకప్ వేస్తూ 
“సార్, కనుబొమ్మలు సన్నగా చేయాలి. కిందాపైనా తీసేస్తాను”అన్నారు చేతిలో బ్లేడును ఆడిస్తూ. 
ఇంకేముంది? రావి కొండలరావు దిగ్గుమన్నాడు. 
“వద్దండీ- నాకు అలవాటు లేదు. 
ఏ సినిమాలో అలా కనుబొమ్మలు తియ్యలేదు. 
బయట తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. 
మగాళ్ళం కదా. వద్దు లెండి” రావి అభ్యంతరం అది. 
భక్తవత్సలం బహు వాత్సల్యంతో 
“మీ ఇష్టం తర్వాత పెద్దాయన ఇష్టం!” సింపుల్ గా అనేసి ఊరుకున్నారు. 

మేకప్ పూర్తి చేసాక, మీసం కూడా అతికించాడు భక్తవత్సలం. 
“ఇంకా మీకు బొట్టు పెట్టాలి. సెట్టుకి వెళ్తే పెద్దాయనే పెడతారు” అని చెప్పేసారు. 
ముఖ్యపాత్రలకి ముఖాన బొట్టు పెట్టవలసి వస్తే రామారావుగారే దిద్దేవారు-  
అవి పౌరాణికమ్ములైనా, సాంఘిక సినిమాలైనా!  
డ్రెస్సు వేసేసుకుని సెట్లోకి వెళ్ళాడు. రావి. 
తన వెనకాలే భక్తవత్సలం గారు వచ్చి నించున్నారు. 
నందమూరి రామారావు ఈయనగారి మేకప్, దుస్తులూ 
ఎలాగ ఉన్నాయో నిదానించి చూసారు, 
మరి మొదటి రోజు కదా! 
ఆయన  అలాగ ఎగాదిగా చూస్తూ ఉంటే, 
హెడ్ మాస్టరు ముందు స్కూలు పిల్లాడిలా బుద్ధిగా 
అటెన్షన్ ఫోజులో అట్టే నిటారుగా ఉండిపోయాడు.
'బేబీ లైటు'ను తిప్పి, రావి కొండలరావు వదన పద్మము మీదికి తిప్పి, 
తేరిపార చూసి - "ఏమిటీ, ఐ బ్రోస్ (Eye Brows) తియ్యలేదేం?" క్వశ్చనించారు. 

"ఈ సార్ వద్దన్నారు. అందుకనీ …" ఆని నసిగారు భక్తవత్సలం.

“వద్దేమిటి? నో బ్రదర్! కన్ను విశాలంగా కనిపిస్తుంది. చూడండి”
అంటూ ఎన్.టి.ఆర్. చెయ్యి చాచగానే 
అప్పటికే తన చేతిలో రెడీగా ఉంచుకున్న బ్లేడును ఠకాల్న అందించారు భక్తవత్సలం. 
కొండలరావు నుదుటిమీద చెయ్యి ఆనించి, 
బ్లేడుతో సర్ సర్ ని ‘ఆపరేషన్’చేసేసారు. 
కొండలరావు నోరెత్తితే ఒట్టు. ఒక కన్ను అయ్యింది. 
రెండో కన్నునూ కడు ‘విశాలం’చేసేసారు. 
“వూ!”అని గర్జించి “బ్రదర్ కి అద్దం చూపించండి” అన్నారు. 
కొండలరావు  ముఖము మీద అద్దం ప్రత్యక్షమైంది. 

“ఎలా ఉందిప్పుడు?” రావికి ఆట్టే తేడా కనిపించలేదు గానీ  
కంటి పైన చిన్నమంట! 
“ఏం?” ఆయనే అన్నారు మళ్ళీ. 
“చాలా బాగుంది” అన్నాడు రావి అన్నగారి ముందు. 
పీత కష్టాలు పీతవి. ఏన్.ఏ.టి. లో వేషమంటే సామాన్యమా?

గీసేసిన భ్రూలతలతోటి బైట తిరిగితే చూస్తూన్నవాళ్ళు 
ఏమని అంటారో అని బెరుకు, భీతిన్నీ! 
రావికొండలరావు మనసులో అలాగ అల్లకల్లోలం సద్దుమణగనేలేదు, 
పాపం! అతనికి అప్పటికి  తెలిసింది “ఇప్పటిదాకా జరిగింది మేకప్ టెస్టు మాత్రమే
'అసలు షూటింగ్'-  అవాళ లేదు
గృహోన్ముఖుడైన కొండలరావు అవస్థలెలాగున్నవో చెప్పలేదు. 
"కొండ అద్దమందు కొంచెమై ఉండదా?"  అన్నట్లు, 
అంత గొప్ప అగ్ర నటుడు తన చేతుల్లో అద్దాన్ని పట్టుకొనగా 
తన ముఖబింబాన్ని (గజ గజా వణుక్కుంటూ
తనివితీరా తిలకించుకోగలిగిన రావి కొండలరావు  లక్కీఫెలోనే కదా!
*************************; 
రాజనాల పాట ఇందులో హై లైట్.
బండి ఎక్కి, బహు హుషారుగా అతడు పారాహుషార్ తో ఎలుగెత్తి, 
పదం లంకించుకుంటం ఒక ఎత్తు.
ఆ పాటలో రావి కొండలరావు నటనా చమత్కారం మరో ఎత్తు. 
ఎడ్ల బండి వెనుక రావి కొండలరావు పరిగెడుతూ, 
"మహ ప్రభో" అని అంటూ ఎలుగెత్తి కేక పెడుతూ running చేస్తూ ఉంటాడు. 
అప్పుడు కొండలరావు పంచె ఊడింది. తన పుట్ట గోచీని సర్దుకుంటూ - 
ఈ అనుచరుడు - రెండు చేతులూ పైకెత్తి, నమస్కారాలు పెడ్తూ - Ravi kondala rao.
సీను గొప్పగా నచ్చింది, అక్కడ సెట్ మీద - ఉన్న వారికీ; ఆనక ప్రేక్షకులకూ.
N.T.Rama Rao ఐతే- "నిజంగానే ఊడిందని- అనుకోలేదు.
రావి- కావాలనే అలాగ చేసారనీ, ఆ నాటి షూటింగులో అది  కూడా అంతర్భాగమనిన్నీ అనుకొన్నాడు.
రాజనాల ( Full nme: రాజనాలకాళేశ్వర రావు నాయుడు) విలన్ పాత్రలలో 
ఎదురు లేని నటునిగా పేరొందాడు. 
అందులోనూ ఈ సోషల్ మూవీ "వరకట్నం" లో సినిమాలో సైతం - 
రాజనాల ప్రతి నాయకుడే ఐనప్పటికీ- 
N.T.R. అతనికి తన సంస్థ నిర్మిస్తూన్న ఈ సాంఘిక పిక్చర్ లో 
పుష్కలముగా ఆక్షన్ కి ఆస్కారం ఉన్న పాటను ఇచ్చాడు- అంటే 
ఆయనకు తన సమర్ధతపై ఎంత నమ్మకము ఉన్నదో అర్ధమౌతుంది. 

************************;

రావికొండలరావ్ eye brows 
(Link: Essay: రావికొండలరావు కనుబొమలు!:-
New awa - WEB Magaine)
User Rating: / 1  
Member Categories - మాయాబజార్
Written by kadambari piduri   
Sunday, 30 September 2012 14:57

అలనాటి పాటలు1968 (Link: 
Read the full song, "akshara wanam" Blog)
;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...