26, మే 2012, శనివారం

అలక్ నిరంజన్! అలక్ నిరంజన్!


"అలక్ నిరంజన్" అనే ఊత పదం 
బహుళ వ్యాప్తిలో ఉండడం మనకు తెలిసినదే కదా!


'అలక్ నిరంజన్’ అనగా "లక్షణములను  
                తటస్థ చిత్తముతో భావించే వాడు" అని భావము. 
ఈ అలక్ నిరంజన్ అనే మాటకు 6-7 వ శతాబ్దముల నాటి నుండీ 
ఒక మంత్రము వలె జనవాక్యమై ప్రచారములోనికి వచ్చింది. 
నేడు ఆ "అలక్ నిరంజన్" పదము ఒక ఊనిక కల ఊత పదంగా 
అనేక జిహ్వాలపైన ఆడుతున్నది. 
అసలు ’అలక్ నిరంజన్’అనే శృతి సుభగమైన ఈ పదము ఎక్కడినుండి వచ్చింది?


అలక్ నిరంజన్  అనగానే యోగ సాంప్రదాయ అనుయాయులకు, 
నాథ సాంప్రదాయ ప్రవర్తకులకూ తటిల్లతలలాగా హృదయాలలో 
మెరిసే వ్యక్తియే "మత్స్యేంద్ర నాథ్". 
నిర్గుణ బ్రహ్మ తత్వ ప్రతిపాదిని ఈ పదము. 
శ్వేతేశ్వర ఉపనిషత్తు నుండి ఈ యోగ సాంప్రదాయ వేద వాక్యము- గ్రాహ్యమైనది. 
పరమ శివుని- "సత్ + చిత్ + ఆనందమూర్తి-" గా 
భక్తుల హృదయాలలో సాక్షాత్కరించడమే ఈ అలక్ నిరంజన్- పద సాకారత్వ మహిమ.


మనము చైత్ర మాసములో నూతన వత్సర శుభ ఘడియలను ఆహ్వానిస్తూ, 
ప్రసాదమును స్వీకరిస్తాము. 
అదే పంథాలో బెంగాల్, మున్నగు రాష్ట్రాల వారు వైశాఖ మాసములో 
కొత్త సంవత్సరమును ఉత్సాహభరితంగా చేసుకుంటారు. 
అదే రోజున మత్స్యేంద్ర నాథ్ జాతర జరుగుతుంది.


మాయా మచ్చీంద్ర- సినిమా తెలుగు 1975 లో వచ్చింది. 
(ఐతే సినిమా హిట్ అవలేదు). 
ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, రామకృష్ణలు ప్రధాన నటీ నటులు. 
;



మత్స్యేంద్ర నాథ్  శిష్యులు రెండు వర్గాలు - 
1. ముని యోగి చౌరంగిలు, 
2. గోరఖ్ నాథ్ వర్గీయులు.


గోరఖ్ నాథ్ మత్స్యేంద్ర నాథ్ శిష్యుడు. 
పింగళ అనే రాణి మత్స్యేంద్ర నాథ్ ను ప్రేమించి, పెళ్ళాడింది. 
గోరఖ్ నాథ్ తన గురువు ఉన్న దేశానికి (మధ్య భారత దేశములోని- త్రియా/ తర్యా సీమ)కు వెళ్ళాడు. 
భోగవిలాసాలలో మునిగి తేలుతూ, 
లోకములోని ప్రజల బాధలను గమనించని స్థితిలో ఉన్న 
మత్స్యేంద్ర నాథ్ లో జాగృతిని కలిగించాడు. 
గురువును అతి స్వతంత్ర బుద్ధితో, చాలా చనువు తీసుకుని, హెచ్చరిస్తూ,
మరల నిర్దేశించుకున్నట్టి మార్గములోనికి నడిపగలిగిన వింత ఘటన ఇది
గురు శిష్య బంధములో విభిన్న శైలిని ఆవిష్కరించిన సంఘటన, 
హిందూ ఇతిహాస, పురాణ గాథ- బహుశా ఇది ఒక్కటేనేమో!


అలాగే కేవలము సిద్ధాంతాలకే పరిమితము చేసేయకుండా, 
మాటల సూత్రాల గిరి గీతలలో  ఇమడ్చకుండా 
మానవులు ఆరోగ్య, జ్ఞాన, సముపార్జన లక్ష్యాలను రూపొందించిన 
అద్భుత యోగ గురువు మత్స్యేంద్ర నాథ్. 
నాథ సాంప్రదాయ స్థాపకుడైన మత్స్యేంద్ర నాథ్ 
"మీననాథ్" అనే పేరుతో కూడా  పిలువబడ్తున్నాడు. 
మత్స్యేంద్ర నాథ్ జాతర, అనగా మత్స్యేంద్ర నాథ్ రథ యాత్రను 
నేపాల్, మహారాష్ట్ర, బెంగాల్ ఇత్యాదిగా-
ఉత్తర భారత దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంటారు.


ఈ రోజు "నేపాల్ సంవత్" (New Year 1129 NS (Nepal Sambat)అంటే 


"నేపాలీయుల నూతన సంవత్సరము పండుగ"ను 
మన దక్షిణాదిలో "ఉగాది పండుగ" లా అన్న మాట. 


అలక్ నిరంజన్! అలక్ నిరంజన్! (Link: newAvakAya web magazine)
User Rating: / 1 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri   
Sunday, 22 April 2012 12:49



7, మే 2012, సోమవారం

గోరఖ్ నాథ్ - గూర్ఖాలు


Gurkhas,  Lashkar Gah















                    నమ్మకము, ధైర్య సాహసాలకు మారు పేర్లుగా నిలిచిన - "గూర్ఖాలు" 
మనకు సుపరిచితమైన పేరే! నిత్యమూ రాత్రుళ్ళు, లాఠీలతో చప్పుడు  చేస్తూ, 
కారుచీకటి వేళలలో ప్రజలకు మెలకువ తెప్పిస్తూ "పారా హుషార్!" చేస్తూ,
చోరభయాలనుండి కాపాడే విధిని 
స్వచ్ఛందముగా తమ భుజస్కంధాలపైన నిడుకొన్నవారు గూర్ఖాలు- అని 
ఆసేతుహిమాచల పర్యంతమే కాకుండా, యూరోపు వాసులకు కూడా తెలిసిన కబురు ఇది.


గూర్ఖా ప్రజలు- ఒక విలక్షణమైన ప్రత్యేకతను కలిగిఉన్నారు. 
బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు- ఇండియా  సైన్యంలో 
గూర్ఖా బెటాలియన్ ను ప్రత్యేకంగా ఏర్పరిచారు అంటే 
శతాబ్దాల క్రితం నుండీ గూర్ఖాల విశ్వాస, ధైర్యములు 
చరిత్రలో ప్రసిద్ధమైనవి అనే సంగతి తెలుస్తూన్నది.


&&&&


"గూర్ఖా, గూర్ఖా లాండ్"- అనే మాటల మూల ధాతువు ఏమిటో తెలుసునా?


8వ శతాబ్దములో హిమాలయ సాను సీమలలో 
"గూర్ఖా" అనే పేరు కొండ జాతి ప్రజలకు వచ్చినది. 
శిష్యుడైన "బప్పా రావల్" వలన గోరఖ్ నాథ్ గాథ ప్రజలకు అందుబాటులో ఉన్నది. 
గురు గోరఖ్ నాథ్ "అద్భుత ముని యోధుడు". 
బప్పా రావల్ అనే రాజపుత్ర ప్రభువు ద్వారా- గూర్ఖా- అనే పద ఆవిర్భావము సంభవించినది. 
హిందువుల ప్రకృతి పూజలో భాగంగా "గో మాత" గా వారు భావిస్తూ, 
పూజిస్తూన్న గోవు  (Prakrit phrase  'go rakkha' meaning 'protector of cows) - 
"గోరక్షణ"- గో రక్ష- అనే సంస్కృత పదము నుండి- 
ప్రాకృత పదమైన "గో రక్క" పునాదిగా 
"గూర్ఖా దేశము", గూర్ఖా ప్రజలు- ఒక విలక్షణమైన ప్రత్యేకతను కలిగిఉన్నారు.


&&&&


గోరఖ్ నాథ్ - నవ నాథ సాంప్రదాయ నిర్మాత. 
శైవ యోగి గోరఖ్ నాథ్, మానవుల ఆరోగ్య ప్రదీపకగా "యోగము"లను కనిపెట్టి, 
అందరికీ అందించాడు. 
11- 12 వ శతాబ్దాలలో గోరఖ్ నాథ్ నెలకొల్పిన యోగ సిద్ధాంత విధానాలు- 
సంఘజీవనములో మేలి మలుపు. 
గోరఖ్ నాథ్ ("Eternal sage" ) - వలన  హఠ యోగమునకు- గొప్ప ప్రచారము వచ్చినది.


&&&&&&&&


గోరఖ్ నాథ్ యుద్ధవిద్యలతో సాగిన యోగి. 
అంటే షాంగై - లో కుంగ్ ఫూ, కరాటే ఆదిగా స్వీయ రక్షణా విద్యలను, 
బౌద్ధ సన్యాసులు, బౌద్ధ గురు శిష్యులూ- పరంపరగా నేర్చిన విద్యల వలెనే- 
గోరఖ్ నాథ్ కూడా స్వయానా స్వీయ సంరక్షణకై రణ విద్యలకు ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. 
ఆఫ్ఘనిస్థాన్, పంజాబ్ మొదలుకొని అనేక దేశాలలో తిరుగుతూ, 
అనేక ప్రాంతాలలో సంచరిస్తూ, ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని నింపాడు. 
ఆతనిని హిమాలయాలలో, కొండజాతి ప్రజలు అనేకులు ఆయనను అనుసరించారు. 
అధికశాతం ఆయన అనుయాయులు ఐనారు. 
వారు తమ పేర్లను "గోరఖ్ బాబూజీ" పట్ల భక్తిసూచకంగా "గూర్ఖా" అని పెట్టుకోసాగారు.
అలాగ "గూర్ఖాలు జాతి"కి మూలధాతువును అందించిన మహర్షిగా 
gorakhnath ప్రజా వందనములను అందుకున్నాడు.


 గోరఖ్ నాథ్ సిద్ధాంతములకు భక్తుడై, 
ఆయనకు శిష్యుడైనాడు  "బప్పా రావల్". 
మేవార్ రాజపుత్ర వంశ మూల పురుషుడని చెప్పదగిన- బప్పా రావల్ వలన 
గోరఖ్ నాథ్ గాథ ప్రజకు అందుబాటులో ఉన్నది. 
బప్పా రావల్ అనే రాజపుత్ర ప్రభువు ద్వారా గూర్ఖా అనే పద ఆవిర్భావము యొక్క 
విపుల విస్తరణతో నేపాలీలకు గూర్ఖా - అనే నామ ప్రఖ్యాతులై, 
చరిత్రలో వారికి విభిన్నమైన గుర్తింపు లబించినది.
  




గోరఖ్ నాథ్ - గూర్ఖాలు (newaawakaaya.com)


Member Categories - తెలుసా!
Written by kusuma   
Sunday, 15 April 2012 13:06 
;  

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...