13, జులై 2011, బుధవారం

ఆభరణ వడియాలు(బొరీలు)

                    

ఉత్తర భారత దేశంలో వడియాలను నక్షత్ర బొరీ/ గైనా బొరీలు మొదలైన పేర్లతో వ్యవహరిస్తారు.
బెంగాల్ రాష్ట్రములో ” ఆభరణ వడియాలు తయారీ”చాలా ప్రసిద్ధి చెందింది.ఈ వడియాలు,
జిలేబీల తయారీతో పోల్చ వచ్చును.
అక్కడి వనితామణుల హస్త నైపుణ్యానికి నిదర్శనాలు. 
నంది గ్రామ్, తాముల్క్, దిసరి, మహిషా దల్, మైనా ఇత్యాది పల్లెటూళ్ళ మహిళలు,
ప్రజలు ఇలాంటి “నగల వడియాలు” పెట్టడంలో నిష్ణాతులు.
స్థానికంగా ఈ కళా వడియాలను -
నక్షత్ర బొరీ/ గైనా బొరీలు (Gayna Bori అనీ, Naksha bori)  అని కూడా పిలుస్తారు.
వీటినే  లెంటిల్ చంక్స్(Lentil chunks)  అని కూడా వ్యవహరిస్తారు.
1954 సంవత్సరములనుండీ, అనేక ఏళ్ళుగా –
ఈ వడియాలు – బెంగాల్ లోని కొన్ని జిల్లాల జనానీకానికి ఉపాధి మార్గంగా ఏర్పడింది.
ఎంతోమందికి కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందిన ఈ “ఆర్నమెంట్ వడియాలు” , వందలాది కుటుంబాలకు , ఆర్ధిక పరంగా –
చన్నీళ్ళకు వేణ్ణీళ్ళు వలె – చేయూతను ఇచ్చినది.
వడియాలు, అప్పడాల పని స్త్రీలు చేసేదే! అనే సామాజిక అభిప్రాయాలు ఉన్నాయి.
అందుచేతనే, పురుషులలో తక్కువమంది – దేవ వ్రత బాబు లాంటి వారు ఈ పనికి మొగ్గు చూపుతున్నారు.
తాముల్క్ దగ్గరలోని – సారంగపూర్ గ్రామానికి చెందిన స్త్రీలు  మీరా , మైతీ మున్నగు అతివలు రంగవల్లికలతో – సరి
సమానంగా ఈ వడియాల సృజనను – కళ గా గౌరవిస్తూ, అభివృద్ధి చేసారు.
మనుమరాలు సేనా మైతీ, మీరా సమీప బంధువు హిరణ్మయీ దేవి, పెద్ద “Naksha bori” వడియాన్ని తయారు
చేసారు.
కళ్యాణి – అనే ఊరు వద్ద 59 వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ మీటింగులు జరిగాయి.
ఆ సందర్భంలో – హిరణ్మయీ దేవి తయారు చేసిన వడియాలను ‘సేనా మైతీ’ ఉత్సాహంతో ప్రదర్శనలో ఉంచింది.
ఆ సభకి  మహా కవి, గీతాంజలి కావ్య కర్త, నోబుల్ ప్రైజ్ గ్రహీత ఐన “రవీంద్ర నాథ టాగూర్” వచ్చారు.
ఆమె  Gayna Bori/Naksha bori ని గురు దేవులు రబీంద్ర నాథ్ టాగోర్ కు ఆప్యాయతతో,
వినయ పూర్వకంగా బహూకరించింది.
ఆ కానుకను  సంతోషంతో, ఆ సున్నిత కళా రూపాన్ని, ప్రశంసా పూర్వకంగా స్వీకరించారు.
వీటిని  చేసే పద్ధతి :
మన దక్షిణ భారత దేశంలో మినప పప్పునూ, సగ్గు బియ్యాన్నీ అధికంగా వడియాల తయారీలో వినియోగిస్తున్నారు)
(అంటే వీటిలో జిగురు శాతం ఎక్కువ కాబట్టి, ఈ పప్పుదినుసులను ఎక్కువగా వాడుతారు.
ఏడాదికి సరిపడేటన్ని రెడీ చేసుకుంటారు.
నాణ్యతా పరంగా నేతి మినుములు,బిరికలాయ్ పప్పు, లెంటిల్ పప్పులు  ఎన్నికైనవి.
లెంటిల్స్(Lentils)  పప్పు వీనికి శ్రేష్ఠము. బిరికలాయ్ పప్పుతో సిద్ధమౌతూన్న బొరీలు, రుచికరంగా ఉంటాయి.
వీటిని నీళ్ళలో నానబెట్టాలి. గరిట జారుగా రుబ్బి , ఉంచాలి.
ఇతర రకాల మినప పప్పుతో కూడా బొరీలను చేయొచ్చు.
రక రకాల మసాళాలను మిళాయించి చేస్తూంటారు.
బోరీ లను కొన్ని ఋతువులలోనే చేసే వీలు ఉన్నది. ఇవి   ప్రత్యేక వాతావరణం లోనే చెయ్యాలి, ఆయా ప్రత్యేకఋతువులలోనూ చేయాలి.
శీతా కాలము మాత్రమే వీని తయారీకి అనువు ఐనది.
సాధారణంగా  కార్తీక మాసంలో మొదలై, మార్గశిర మాసం కొస దాకా ఈ బొరీల పని, బృహత్తర కార్యక్రమంగా కొనసాగుతుంది.
వడియాలు పిండిని వండి, రెడీ చేయటం,పెట్టడం  కన్నా ఆ వడియాలను ఎండబెట్టడమే క్లిష్టతరమైన పని:—–
@) మొదటి అర్ధ గంట సేపు మంచి ఎండలో ఎండబెట్టాలి.
అటు తర్వాత – నీడలో ఆరనివ్వాలి.
@) ఏ మాత్రం గాలి తాకినా, విడిలిపోయే ఛాన్సు ఎక్కువ.
బాగా ఆరిన బొరీలను నిల్వ చేసుకోవాలి.
@) అప్పుడప్పుడూ,పాత్రలలో జాగ్రత్త పరిచిన బొరీలను,బయటకు తీసి, ఎండలో ఆరనిచ్చి,
మరల నిల్వ పాత్రలలోనికి తీసి పెడతారు.మట్టి పాత్రలలో స్టోర్ చేస్తారు.
పెట్టెలలో, బాక్సులలో ఐతే , వానిలో కాగితాల ముక్కలను వేసి, అందులో బొరీలను భద్రపరుచుకుంటారు.
ఆట్టే ఎండ, గాలి తగల కుండా, జాగ్రత్తగా ఎండబెట్టాలి. అనగా వడియాలు చేసాక,
ఎండబెట్టే కార్యక్రమంలో ఎక్కువ  శ్రద్ధ అవసరము.
ఎండ ఎక్కువైతే, వడియాలు పొడి  పొడిగా ఐపోతాయి.వాతావరణము పొడిగా, తేమ తక్కువగా ఉండాలి.
నీరెండలో మాత్రమే ఈ వడియాలను ఎండ బెట్ట వచ్చును.
అందువలననే వీటిని ఒకేసారి చాలా ఎక్కువగా చేసుకుని, పెద్ద మొత్తాలుగా నిలువ చేసి వాడుకుంటారు.
బొరీలను, జిలేబీల మాదిరిగా, స్పీడుగా  డిజైన్ లతో చేయడం,
అనుభవం మీద సంపాదించే కళా విద్య  అనొచ్చు. చెవుల లోలాకులు,  నెక్లేసులు, కిరీటాలు, పక్షులు,
కర్ణాభరణాలు, రక రకాల ఆకారాలు రూపొందుతాయి.ఇప్పుడు బెంగాల్  స్థానిక మార్కెట్టులో ఇవి లభిస్తున్నాయి.
- కాదంబరి
This entry was posted in వ్యాసాలు and tagged ఆభరణ వడియాలు, కాదంబరి, కార్తీక మాసం, కుటీర పరిశ్రమ, బెంగాల్, రబీంద్ర నాథ్ టాగోర్, Gayna Bori, Lentil. Bookmark the permalink. 
ఆభరణ వడియాలు (బొరీలు)   (Link for extra matter )Link 2 read simple food (link 3 read ) విహంగ      (link for Essay)
Posted on June,2011 by విహంగGayna Bori, ornament vadiyamulu ; 
           A Home maker's Diary (India): Gayna/ Naksha Bori (Sundried Lentil paste Designs)
( helping essay- "ఆభరణాలను పోలే వడియాలు, అర్నబ్ దత్తా, కలకతా")

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

లెంటిల్స్(Lentils) అంటే ఏవిటో కాస్త తెలుగులో write చేస్తారా?

kadambari చెప్పారు...

minappappu = అని తెలుగులో అజ్ఞాత గారూ!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...