15, జూన్ 2011, బుధవారం

సాహితీ సేవలో మణిదీపాలు


                      మాతృభాషలలోని సాహిత్యము యొక్క ఆసుపాసులను శోధించి ఎన్నో అమూల్య విషయాలను ప్రజలకు అందించారు ఎందరో మహానుభావులు. ఈ కృషిలో ఎన్నో శ్రమదమాదులకు ఓర్చి చేసిన వారి నిష్కామ సేవలను గమనిస్తే, ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోను కాక తప్పదు.


డాక్టర్ వుమ్మెత్తల సత్యనారాయణ ప్రఖ్యాత రచయిత "గోపీచంద్" గురించి పరిశోధించారు. ఉపపత్తుల కొరకై అనేక గ్రంధాలయాలలోని పుస్తకములను క్షుణ్ణంగా పరిశీలించారు. వేటపాలెంలోని "సారస్వత నికేతనము", గుంటూరు "ఆంధ్ర క్రైస్తవ కళాశాల గ్రంధాలయము"లు ప్రత్యేక స్మరణ యోగ్యములు. గోపీచంద్ తొలి కథానిక "ఒలింపియస్" నాకు లభించినది వేటపాలెంలోని సారస్వత నికేతనము"లో..అతని కథా సంపుటములలో వేటిలోనూ చేరలేదిది. "అపూర్వోపన్యాసములు" తొలి తెలుగు కథానికగా నేను భావించేందుకు వీలు కల్పించినట్టి 1903 సంవత్సరపు "కల్పలత" అనే పత్రికలు లభించింది కూడా ఇక్కడే!...అంటూ వివరించారు.తెలుగులోఅచ్చు అయిన తొలి కథానిక ఏది?" అనే అంశం అనేక పరిశోధనలకు ఆస్కారం కలిగించింది. మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తిలోని బ్రాహ్మణ వీధిలో వీరు నెలకొల్పిన "సాహిత్య వేదిక" ద్వారా తెలుగు భాషకు, సాహిత్యానికి ఎంతో సేవ చేసారు. తెలుగు తల్లి సాహితీ భవనములో ఇటువంటి నిష్కామ సాహితీ కృషీవలుర సేవలు సదా వెలుగులను అందించే "మణి దీపములే" !


&&&&&&&&&&&&&&&&&&&&&&&&
మహాత్మా గాంధీజీ స్వాతంత్ర్యోద్యమ సమావేశాలు జరిగినప్పుడు, 
ఆయన చేతి కర్రను ఇక్కడి వారు స్వీకరించారు.
వారు ఇక్కడ దానిని భద్రపరిచారు.
ఆ అమూల్య వస్తువు "జాతిపిత చేతి కర్ర"
వేటపాలెములోని సారస్వత నికేతనము లో ఉన్నదని, 
కొందరి ప్రముఖుల జీవిత కథలలో ఉన్నదిమరి!
మరి......ఇప్పటికీ -........ ఇంకా అక్కడ ఉన్నదా???????

&&&&&&&&&&&&&&&&&&&&&&&&

         
           {Telusaa!   [Link for ESSAY ]
              By kadambari piduri,
                         Aug 3 2008 1:35AM}

&&&&&&&&&&&&&&&&&&&&&&&


కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...