27, ఏప్రిల్ 2010, మంగళవారం

కవిరాజు answer
























" వీర గంధము తెచ్చినారము
వీరుడెవ్వరొ తెలుపుడీ!
పూసి పోదుము - మెడను వైతుము
పూల దండలు రక్తితో......." అనే పాట , నాటి భారత స్వాతంత్రోద్యమము సందర్భముగా దశ దిశలా మార్మ్రోగినది.
ఆ పాటను రాసిన వాడు " కవి రాజు - త్రిపురనేని రామ స్వామి.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

త్రిపురనేని రామస్వామి హేతు వాది, " పచ్చి నిహలిస్టు " అని,
దూషణ భూషణ తిరస్కారములను ఎదుర్కొన్నారు.
అయినప్పటికీ,
" కవి రాజు " అని పండితమ్మన్యుల చేత బిరుదును పొందారు.
తెనాలిలో వారి ఇంటికి గల "సూతాశ్రమము" అను పేరే
పండితప్రకాండుల కూడలి అయి, సరస్వతీ నిలయమై ప్రకాశించినది.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

పటిష్ఠమైన ఆస్థిక వాది విశ్వనాథ
సత్యనారాయణ కూడా ఆ చర్చా గృహానికి వస్తూ ఉండే వారు.
సూతాశ్రమంలో కవిరాజు అరటి చెట్టుకు పాదు చేస్తున్నారు.

" ఈశాన్యమూల కదళీ తరువును వేయకూడదట!"
సందేహాన్ని వెలిబుచ్చుతూ అన్నారు సనాతన ధర్మభావాలు బలంగా కల విశ్వనాథ.

"అవును! నిజమే! ఇంకో వారానికి ఇది పక్వానికి వస్తుంది,
అప్పుడు కోసేస్తాను లెండి!"
అనే చెణుకు కవిరాజు సమాధానంగా వెలువడింది.

Pramukhula Haasyam

సూతాశ్రమము

By kadambari piduri, Jan 16 2010 9:53PM

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


త్రిపురనేని రామస్వామి(1887 janavari 15 - 1943 janavari 16 ) - అంగలూరు లో,( క్రిష్ణా జిల్లా)ఒక రైతు కుంటుంబంలో జన్మించారు.
ఆతని కొడుకు " గోపీ చంద్" ,తండ్రీలెనే రచయితగా,మానసిక శాస్త్ర ప్రభావమును శైలిలో ప్రవేశ పెట్టి, కొత్త ఒరవడిని తెలుగు సాహిత్యంలో ప్రవేశ పెట్టాడు;
గోపీ చందు తనయుడైన సాయి చంద్ సినిమా నటుడు.
ఈ విధంగా కవిరాజు కుటుంబము, కళా జగత్తులో రాణించింది.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

త్రిపురనేని రామస్వామి చౌదరి , ప్రజలను చైతన్య పరిచే పాటలను రచించారు.
advocate ఐన త్రిపురనేని రామ స్వామి "తెనాలి" కేంద్రముగా తన కార్యకలాపాలను విస్తరించారు. ఆయన భావ జాలం, ప్రజలకు మేలు కొలుపుగా , కలమును విదిలించారు.హేతువాద భావాలతో సంఘములోని సనాతన వాదులలో అలజడి కలిగింది
ప్రజలను చైతన్య పరిచే పాటలను రచించారు.
విప్లవ తలపుల వ్యక్పక్తీకరణను సమర్ధవంతంగా నిర్వహించిన స్వాతంత్రోద్యమ వాది అతను.
సాహితీ వేదికగా తన గృహ సామ్రాజ్యాన్ని నిర్మించిన రామ స్వామి " సూతాశ్రమము" అని తన ఇంటికి నామ కరణము చేసారు.
సూత" నామ ధేయము మీద ఆయనకు గల మక్కువకు నిలువుటద్దాలూ " సూతాశ్రమ గీతాలు".

రామస్వామి యొక్క రచనలు -
_________________

సూతపురాణము
కొండవీటి పతనము
కుప్పుస్వామి శతకం
మాల దాసరి
గోపాలరాయ శతకం
పల్నాటి పౌరుషం
శంబూకవధ
సూతాశ్రమ గీతాలు
ధూర్త మావన శతకము
ఖూనీ ( విశ్వ నాథ సత్యనారాయణ రచన " వేన రాజు " పై విమర్శనాత్మకమైన రామ స్వామి రచన ఇది.)
భగవద్గీత
రాణా ప్రతాప్

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

త్రిపురనేని రామస్వామి ప్రముఖ హేతువాది," కవిరాజు" బిరుదాంకితుడై, జనులచే శ్లాఘించ బడ్డాడు. గా ప్రసిద్ధి చెందిన రచయిత, సంఘసంస్కర్త.
సంస్కృత భాషలోని " వివాహ మంత్రములు"ను, తేట తెలుగులో అనువదించి, సామాన్యులకు అర్ధమయ్యేలా అందుబాటులోనికి తీసుకు వచ్చాడు.

రావిపూడి వెంకటాద్రి మున్నగు శిష్యులతో ఆతని ఇల్లూ వాకిలీ కళ కళలాడుతూండేది.
తన గురువు ఐన రామ స్వామి బిరుదు ఐన" కవి రాజు" పేరుతో, - రావిపూడి వేంకటాద్రి , నాగండ్లలో " కవిరాజాశ్రమము"ను స్థాపించారు; తమ ఆలోచనలను ప్రచార కేంద్రముగా నెలకొల్పారు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
1955లో త్రిపురనేని రామస్వామి చూపిన ఆధునిక పద్ధతిని అనుసరించి,విజయరాజకుమార్, పెళ్ళి చేసుకునారు. తెనాలిలో ఆంధ్రపత్రిక విలేఖరిగా పని చేస్తూన్న వెంకటప్పయ్య శాస్త్రి గారి కుమార్తె కన్యాకుమారిని పరిణయమాడారు. ఆచార్య రంగా, కొత్త రఘురామయ్య, ఆవుల గోపాలకృష్ణమూర్తి మొదలైన వారు ప్రముఖులు అనేకుల ఆశీస్సులతో, వారి పెళ్ళి గుంటూరులోని "సరస్వతీ మహలు"లో జరిగినది.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...