9, సెప్టెంబర్ 2014, మంగళవారం

హరిసేవ: పాయసం / పరమాన్నం బెల్లం తోటీ చేస్తారు పంచదారతోటీ చేస్తారు. ఎక్కువ ఏది బాగుంటుంది అంటే ........

హరిసేవ: పాయసం / పరమాన్నం బెల్లం తోటీ చేస్తారు పంచదారతోటీ చేస్తారు. ఎక్కువ ఏది బాగుంటుంది అంటే ........

:- పాయసం / పరమాన్నం బెల్లం తోటీ చేస్తారు పంచదారతోటీ చేస్తారు. ఎక్కువ ఏది బాగుంటుంది అంటే బెల్లంతోటి చేసిన పాయసమే బాగుంటుంది అంటారు.

చక్కెర - ఫ్యాక్టరీనుండి వస్తుంది. భగవంతునికి అర్చనాక్రమం లో వీలైనంతవరకూ, హస్తకళలల్కు, కుటీరపరిశ్రమలకు అందుబాటులో ఉండే ఆటలో ప్రయాణించడమే సమర్ధనీయం. మన హిందువులు- నైవేద్యానికి శాకాహారానికి అధికప్రాధాన్యత ఉన్నది.

"చక్కెర తాయారీలో జంతువుల ఎముకల పొడిని కలుపురారని" విన్నాము. ఇందులో వాస్తవం ఎంత ఉన్నదో మాకు తెలీదు కానీ, మేము చక్కెరపదార్ధాలను పూజాకార్యక్రమాలలో మానేసాము. -  కాదంబరీకుసుమాంబ

1, సెప్టెంబర్ 2014, సోమవారం

తమిళ నాణెంపై తెలుగు లిపి , arai kasu amman

కోవెలలు నిర్మాణరీతులు విభిన్నతలతో మనోరంజనము గావిస్తూన్నవి. నదీతీరములు, నదీ, సాగర సంగమప్రాంతములు, గిరిశృంగములు, ప్రకృతిసౌందర్య శోభితప్రాంతములు- దేవాలయ నిర్మాణములకు అనువుగా ఎన్నిక ఔతూ సాంప్రదాయ గౌరవమును పొందుతున్నవి.

పైన నుడివిన ప్రదేశాలకు అదనంగా చెప్పవలసినవి గుహాలయాలు.

దృఢమైన కొండలలో సహజంగా ఏర్పడిన గుహలు ప్రధమగణ్యాలు. తర్వాత మానవుల ఆసక్తి ప్రకారం ఏర్పడిన గుహాలయాలు కూడా జనామోదాన్ని పొందినవి. గుహాలయాలు శిల్పుల ఓరిమికి, శిల్పవిన్నాణతలకు నికషోపలములు. అట్లాంటి గుహాలయలలో పేరెన్నిక గన్నది బృహదాంబ ఆలయం. 

పుదుక్కోట సమీపాన తిరుగోకర్ణము అనే ప్రాంతమున ఉన్న పెనుశిల లోపల ఉన్న జోడీలు బృహదాంబ గుడి, గోకర్ణేశ్వరగుడి. శ్రీబృహదాంబ అమ్మకు మరో పేరు ఉన్నది. ఆమెను జనులు "అరై కాసు అమ్మన్" అని ప్రేమతో పిలుస్తున్నారు.   

ఈ అమ్మవారు తొండైమాను సామ్రాట్టులు, పుదుక్కోటై చక్రవర్తులకు ఇలవేల్పు. తొండైమాను సామ్రాట్టులు అనగానే మనకు తిరుపతి దివ్యక్షేత్రము గుర్తుకు వస్తుంది. ఆ సీమకు "తొండై మండలము" అని ప్రఖ్యాతి గాంచినది. 

అన్నమాచార్య రచన "కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు” అనే కృతిని గుర్తుకు తెచ్చుకోండి.   

"కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

దొమ్ముల సేసిన యట్టి; తొండమాన్ చక్కురవర్తి (= చక్రవర్తి)  

ఇమ్మన్న వరములనెల్ల ఇచ్చినవాడు  ........  " 

అని కీర్తిస్తూ ఈ కీర్తనలో మెచ్చుకున్నాడు.                                          

తొండై మాన్ సామ్రాట్టులు ఈ అరకాసు సృజనకర్తలు.  

తొండైమాను సామ్రాట్టులు “మేము శ్రీబృహదాంబా సేవకులం!” అని వినయవిధేయతలతో చెప్పారు. 
వారు’శ్రీ బృహదాంబాదాసులు ‘గా రాజ్యపాలన చేసారు. 
ఈ పద్ధతి వలన పాలకులకు “మేమే అందరికన్నా సరాధికులము" వంటి అహంకారము, దురూహలుఏర్పడవు. నియంతలుగా మారకుండా సత్పరిపాలకులుగా అధికారులను తీర్చిదిద్దగలిగిన సదాచారము ఇది. 
పల్లవులు, చోళులు, తొండైమాను సామ్రాట్టులు మొదలు నాయకరాజుల దాకా శ్రీ బృహదాంబ గోకర్ణ ఆలయములను అభివృద్ధి చేశారు. అంటే 7వశతాబ్దం నుండి 17వశతాబ్దం వఱకూ  విభిన్న కళానైపుణ్యాలకు నెలవైనవి ఈ గుళ్ళు.

శ్రీబృహదాంబా అమ్మవారికి ప్రత్యేకించి చెప్పకోవలసిన ప్రత్యేకత ఉన్నది. ఈ దేవికి “అరకాసు అమ్మన్” అని ప్రసిద్ధనామధేయం కలదు. ఈ పేరు రావడానికి కొన్ని వింత హేతువులు కలవు. ఆ హేతువులు ఏమిటి?

మహారాజా కులదైవం నామముతో "అమ్మన్ కాసు" లను ఉత్పత్తిచేసి, ప్రజావళికి పంచేవారు.

రత్నమంగళం అను అందచందాలకు ఆలవాలమై, పచ్చని ప్రకృతి ఆహ్లాదకరమై, భక్తులను పలుకరిస్తూన పల్లెటూరు. అక్కడ అమ్మాళ్ చల్లని తల్లి. 1730 లలో పరిశోధకుని కృషివలన ఒక వింత నాణెం గురించి తెలిసింది. అదే “అరకాసు”. ఇది కేవలం ఒక నాణెమే. ఐతే చెప్పుకోవలసింది ఏమున్నది? “అరకాసు అమ్మన్” అని పేరుగాంచిన తల్లి “శ్రీబృహదాంబ అమ్మవారు”. 

బృహదాంబాళ్ "కాసు విలువ" - 6 నయాపైసలు/ ఆరు దమ్మిడీలు.

6 కాణీల విలువలో సగమే అర్ధణా. "అరై కాసు" అంటే తెలుగుభాషలో అర్ధణా అంటే 3 పైసల విలువ గల నాణెము.   

శ్రీబృహదాంబ నాణెం స్పెషాలిటీ:-  శ్రీబృహదాంబా తల్లి పేరున ఒక కాసును రూపొందించినారు.

పుదుక్కోటై లో ఉన్న ‘నాణెముల తయారీ కేంద్రం(మింట్) లోనే ఈ కాసు తయారైనది. 
అటుపిమ్మట అదే నాణెమును లండన్ లో మిషన్లతో చేసారు. అంటే ఒకే నమూనా ఐన నాణెమును ఇటు కుటీర పరిశ్రమ పద్ధతితో, కళాకారులు స్వహస్తములతో చేసారు. అలాగే అటు యాంత్రిక పద్ధతితోనూ తయారైనట్టి ఈ నాణెము చారిత్రకప్రాధాన్యత కలిగినది ఐనది. అన్నిటికీ పతాకశీర్షికగా మన తెలుగువారికి గర్వకారణమైన విశేషం ‘అమ్మవారి కాసు‘ లో ఉన్నది.

అదేమిటో మీరు ఊహించగలరా!?                                  

శ్రీబృహదాంబఅంబాళ్ చిత్తరువును కాసుకు ఒకవైపున చెక్కారు. అదే చిత్రం నాణెమునకు వెనుక “శ్రీవిజయ” అని తెలుగు అక్షరములతో ముద్రణ జరిగినది. తమిళ దేశమున తెలుగులిపికి కల గౌరవము తమిళుల సహృదయతకు తార్కాణము.

నవరాత్రులలో అమ్మన్ కాసును తొండైమాన్ ప్రభువులు సందర్శకులకు ఇచ్చారు. వాళ్ళు తమను చూడడానికై కొలువుకు ఆత్మీయతతో వస్తూన వాళ్ళకు కానుకలతో పాటుగా అరకాసు బహూకరించే ఆచారాన్ని నెలకొల్పారు. దసరా వేడుకల సందర్భంగా ఇట్లా అమ్మన్ కాసు లభించిన వారు ‘అది తమ భాగ్యదాయిని ’ అని భావిస్తూ భద్రంగా దాచుకునే వాళ్ళు. 
అమ్మన్ పేరు పై రూపొందిన రాగి లోహం కాసులు తిరుగోకర్ణ మ్యూజియాన (tiru gokarnam museum) ఉన్నవి.    

కాసు – కథా కమామిషూ:-

రాజులు, పాలకులు ఎక్కువగా స్త్రీలు అనేక బంగారు బిళ్ళలను హారముగా ధరిస్తూండేవారు. దానిని “కాసుల  పేరు” అని పిలుస్తారు. కాసు అంటే అణా విలువ ఎత్తు- అని ఊహ కలదు. ఫదహారు అణాలు అనగా ఒక రూప్యం = ఒక రూపాయి సమానము. ఆనాటి ఈ ఆర్ధికప్రామాణికత ఆధారంగా ఏర్పడిన తెలుగు నానుడులు చాలా ఉన్నవి.         

ఈ రూపాయికి, అణాపైసల కొలమానము ప్రాచీన భారతావనిలో ఉన్నది. అనేక ఆచారాలకు ఈ కొలమానము గొప్ప పునాది ఐనది. తద్వారా వచ్చిన లోకోక్తులు చాలా భాషా కోశాగారమునందలి కలిమి, నిధులుగా ఏర్పడినవి.

పదహారు కళలు, = షోడశ కళలు; షోడశి; పదహారు = పదారు;; పదహారేళ్ళ వయసు, పదారేళ్ళ ప్రాయము; ఈ కోవకు చెందినవి.    

పదహారణాల తెలుగుదనం ఉట్టిపడుతూన్న పల్లె పడుచు; పదారు వయసు, "(నోటిలోని) పళ్ళు పదారూ రాలునులే!"

పావడా, ఓణీలను కట్టుకుని, మొగలిరేకుల పూలజడను వేసుకుని, తిలకం దిద్దుకుని ఆ పడతి పదారణాల తెనుగుదనము ఉట్టిపడుతూన్నది.

ఇలాగ రూపాయి మన దేశ విపణివీధికి మూలస్తంభం ఐనది. 
ఆ రూప్యమునకు పునాది పైసా. దీనికి ప్రత్యామ్నాయ రూపములు, ఇందాక పేర్కొన్నట్లు నయాపైసలు, దమ్మిడీ, కాణీ, చిల్లికాణీ, గవ్వ మొదలైనవి. 

"అణా పైసలతో/ అణా కాణీలతో సహా బాకీని చెల్లుబెట్టుట" అనే వాడుక ఇందువలన వచ్చింది.      
;      

శ్రీ బృహదాంబా అమ్మాళ్ కి రూపాయి కూడా అక్కర్లేదు, అర్ధణా చాలు, ఆమె అపార అనుగ్రహం భక్తులకు లభిస్తున్నది. ప్రజలు బెల్లం పానకమును అమ్మవారికి నైవేద్యాలుగా ఇస్తారు. 
“అంబాల్” ఫొటో ఎదుట ‘అరకాసు బిళ్ళ”ను ఉంచి, బెల్లం నైవేద్యం పెట్టి, భక్తితో పూజిస్తే, పోగొట్టుకున్న వస్తువులు దొరుకును, అని నమ్ముతున్నారు. భక్తుల విశ్వాసము పలుమార్లు “నిజం”ఔతూ ఋజువు అవుతూన్న సంఘటనలు భక్తిశ్రద్ధలను ఇనుమడింపజేస్తున్నవి. 

******************************,

తమిళ నాణెంపై తెలుగు లిపి  
User Rating:  / 1 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri
Monday, 14 July 2014 08:38
Hits: 584 

26, ఆగస్టు 2014, మంగళవారం

ఆకాశ వాణి - అశరీర వాణి

ప్రత్యూష కిరణాలతో "ఆకాశవాణి, శుభోదయం" అనే వాక్కులు నిద్ర మగతను  చెదరగొట్టేవి. 
భక్తిరంజని, సూక్తిముక్తావళి, వారం వారం "గాంధీ మార్గం", ప్రమదావనం, పాడిపంటలు,జనరంజని, ఈ పద్ధతిగా శ్రోతలను నిరంతరం అలరిస్తూ, నిత్యం ప్రజలను సాహితీసంపన్నులను చేస్తూ, భావిభారత పౌరులను తీర్చిదిద్ది, దశాబ్దం క్రితం దాకా (దూరదర్శన్ ప్రజా జీవనములోనికి వచ్చే దాకా) అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక వినోదసాధనం రేడియో.

కరెంటుతో పని లేకుండా, బాటరీలతో నడిచే పెట్టె - ఒకటుంది, అదే 'ట్రాన్సిస్టర్ ' అనగా రేడియోకి సిస్టర్ (సోదరి).

బుల్లిపెట్టెనుండి వీనులవిందుచేసే కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సాధనోపకరణమే "ఆకాశవాణి".  ఈ "ఆకాశవాణి" నామధేయాన్ని ఏ బారసాల కార్యక్రమాలలో ఎవరు నిర్ణయించారు? ఎక్కడ ఈ పేరుకు బీజం ఏర్పడింది?

*****

ఆకాశవాణి అంటే “అశరీరవాణి” అనవచ్చును. దేవతలు భక్తులకు, లోకానికి ఏవైనా  సందేశాలనూ, ముందు జాగ్రత్తలనూ  హెచ్చరికలనూ – తాము కనబడకుండా కేవలము వాక్కుద్వారా తెలుపుతారు. ఇలాంటి నమ్మకములు వివిధ సమాజములలో ఉన్నవి. హిందూ ఇతిహాసములలో ఇలాటి కథలు ఉన్నవి. శ్రీమద్ భాగవతము” లో సింహభాగము శ్రీక్రిష్ణలీలలు.

దేవకీ వసుదేవులకు పరిణయము జరిగింది. దేవకీదేవి సోదరుడు కంసుడు. చెల్లెలి పెళ్ళి చేసిన తర్వాత; ఆ నవవధూవరుల జంటతో రధములో పట్టణానికి బైలుదేరాడు. వారిని వ్యాహ్యాళికి తీసుకువెళ్తూండగా మహామాయాదేవి గగనము నుండి మేఘగర్జన ధ్వనితో పల్కింది.

ఆమె ఆకాశవాణిగా “శ్రీక్రిష్ణ జననము”ను గురించి మేనమామ కంసునికి “తస్మాత్ జాగ్రత్త”పలికింది. అటు తర్వాత శ్రీక్రిష్ణావతారము- క్రిష్ణయ్య సాహసాలు యశోదను, గోపికలనూ, నందబాలురను మాత్రమే కాదు, నిఖిల లోకాలనూ పరవశింపజేస్తూన్నవి. జగత్తు అతనిని దైవముగా ఎన్నుకుని, పూజించడానికి 
ఆస్కారం ఏర్పడింది. తదాది శ్రీకృష్ణుడు  అవతారపురుషుడు ఐ దశావతారములలో సుస్థిర స్థానము కలిగినది.

గాధలోని ఈ పదమే స్ఫూర్తినిచ్చినది. ఎం.వి.గోపాలస్వామి గారికి తటాలున ఆ పదము స్ఫురించినది. కన్నడసీమలో అలాగ నామకరణం జరిగి, “ఆకాశవాణి” అనే పేరు రేడియోకి ఏర్పడినది.

***** 

ఎం.వి.గోపాలస్వామి నివాసగృహము పేరు “విఠల్ విహార్”.

ఆల్  ఇండియా రేడియో (నేడు) ఉన్న స్థలానికి దగ్గరలో ఉన్నది ఆ ఇల్లు. అక్కడ కన్నడ సాహితీ అభిమానులు లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కేవలం పిచ్చాపాటి అనుకుంటే Image: churumuri.wordpress.com
IMAGE: CHURUMURI.WORDPRESS.COM

పొరబడినట్లే! వారివి ఆషామాషీ కబుర్లు, మాటల దొంతర్లు కావు. 
ఆ లోగిలిలో రూపు దిద్దుకుంటూన్నట్టి ఆశావహ దృక్పథాలు. స్వాతంత్ర్యభారతావని యొక్క బంగారుభవిష్యత్తును తీర్చిదిద్దవలసిన విధివిధానముల సోపానపంక్తులు.

దేశప్రగతి, భావిభారత పురోభివృద్ధికై పౌరులుగా తాము చేయాల్సిన బృహత్ కార్యాలు మున్నగు అనేక విలువైన అంశాలు మాటల, చర్చల సోపానాలు ఔతున్నవి.


*****

ఆంగ్లేయుల ప్రభావముచే తొట్ట తొలి రోజులలో “All India Radio ” అనే పేరు ఉండేది.

వందల సంవత్సరాలపాటు పరపాలనలో మ్రగ్గినది ఇండియా. 
స్వాతంత్ర్యాన్ని పొందిన భారతావనికి స్వాతంత్ర్యచింతన పొంగే కొత్త ఆలోచనలు తన మానససరోవరాన నింపుకోవలసిన అగత్యం కలిగింది. స్వాతంత్ర బానిసత్వపు ఛాయలను గుర్తుకు తెచ్చే ప్రతి యోచన కంటగింపుగా ఉండేది. స్వేచ్ఛా భావాలకు ప్రతిబింబాలైన పథకరచనలకై పండితపామరుల కృషి ప్రశంసాత్మకంగా ఉండేది.

అవిగో! అప్పటి అట్లాంటి భావాజలాల నుండి ఉత్పన్నమైన అనేక పదప్రసూనములలో ఈ ఆకాశవాణి అనే శృతిసుభగత్వమైన పలుకు. 

English ఛాయలు కలిగి ఉన్నది, కాబట్టి ఆల్ ఇండియా రేడియో అనే పేరుకి బదులుగా ఏమని పిలిస్తే బాగుంటుంది? దీనికి ప్రత్యామ్నాయమైన నామమును ఆలోచించాల్సిన అక్కర కలిగినది. 
వారు కొన్ని పేర్లను గూర్చి సూచనలు ఇస్తూ ఆలోచిస్తూన్నారు.

అప్పుడు “ఆకాశవాణి” అనే పేరు తెఱ పైకి వచ్చింది.  
ఆ పేరును సూచించిన వ్యక్తి ఎం.వి.గోపాలస్వామి. 
మొట్టమొదట మైసూరు నుండి ప్రసారాలు ప్రారంభమైనవి. 
M.V.Gopalaswami ఇంటిలో కొత్త నామధేయానికి ఊతం వచ్చింది. 
అప్పుడు ప్రస్తుతం మన శ్రవణేంద్రియలలో చేరే మధుర మాధుర్య నామం "ఆకాశవాణి"  ఊపిరిపోసుకున్నది.  

రవీంద్రనాధటాగూరు ఈ పదాన్ని సాహిత్యంలో తన రచనలలో వాడారు. 
ఐతే ‘రేడియోకి ఆ పేరు పెట్టవలెను ‘ అనే దృష్టితో కాదు- అని వాదాలు  ఉన్నవి.

@@@@@

ఆకాశ వాణి - అశరీర వాణి  (LINK- web magazine)
User Rating:  / 2 
Member Categories - తెలుసా!
Written by kusuma kumari
Wednesday, 30 July 2014 09:43
Hits: 163 

21, ఆగస్టు 2014, గురువారం

మహాశిల్పి ఆర్నికో

"ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగునో"
శిల్పకళకు వన్నెలను చేకూర్చిన ఈ పాట మనకు చెవులలో ఉలి శబ్దాలను, 
మనో నేత్రంలో సుందర శిల్పాలను దృశ్యమానం చేస్తుంది.   

నా చిన్నప్పుడు "ఆర్నికా హైర్ ఆయిలు" తరచూ ప్రకటనలలో కనబడేది. ఆ నూనెను కురుల కోసం స్పెషల్ గా తెప్పించుకునే వాళ్ళు. టిబెట్ దేశ శిల్పి పేరు ఇట్లాంటిదే! అరానికో/ అనికో/ అనిగే అని స్థానిక ప్రజల  గౌరవాన్ని పొందిన చారిత్రక వ్యక్తి అతను. 

2] బీజింగ్ లో మియాయింగ్ కోవెల వద్ద ఈతని విగ్రహం ఉన్నది.(Araniko, Miaoying Temple, Beijing) 

॑॑॑॑॑#####


అభయ మల్ల, జయభీమ్ దేవ్ మల్ల పరిపాలనాకాలమున కళా మార్పిడి కార్యక్రమాలు చురుకుగా సాగినవి. అనికో  ఖాట్మండు లోయ ప్రాంతం నివాసి. అనికో జన్మతః శిల్పవిద్యలో ప్రజ్ఞావంతుడు. అనికో నేర్పరితనాన్ని తెలుసుకున్న మల్ల చక్రవర్తి "టిబెట్ లో స్వర్ణ స్థూపమును నిర్మించు, అర్నికో!" ఆదేశించాడు. 


అందుకు సంతోషంగా అంగీకరించాడు ఆర్నికో. నియమనిష్ఠలతో ఆ మహత్కార్యాన్ని పూర్తి చేసాడు. 


యువాన్ వంశ పాలనకు ఆద్యుడైన కుబ్లైఖాన్ నేపాల్, టిబెట్ చిత్ర, శిల్ప కళలను గాంచి ముగ్ధుడు ఐనాడు.  మల్ల ప్రభువులను 'మహాశిల్పి ఆర్నికోని మా సీమకు పంపించండి, ఆతని ద్వారా నవీన శిల్పరీతులను మా ప్రాంతాలలో ఆవిష్కరణలు చేయాలని మా ఆకాంక్ష.' అని కుబ్లైఖాన్ కోరాడు. అందుకు మల్ల చక్రవర్తులు, ఆనికో సంతోషంతో సమ్మతించారు. 


ప్రభువుల అనుజ్ఞతో అనికో చైనాకు వెళ్ళాడు. 


మంగోలు సామ్రాజ్యములోని స్థిరకళలకు అదనపు సొగసులను అందించి, చైతన్యాన్ని నింపాడు అనికో.  


#####


లలిత్ పూర్ మండలంలోని 'పాటన్' (पाटन) అనే గ్రామంలో జన్మించాడు. లలిత్ పూర్ మండలంలోని 'పాటన్ ' (पाटन) అనే గ్రామంలో జన్మించాడు అర్నికో. "ఆరణికో" విగ్రహం కీర్తిపూర్ లోని నేపాల్ భాషా అకాడమీ ప్రాంగణమున ఉన్నది. (Statue of Araniko at Nepal  Bhasa Academy, Kirtipur) 1245 - 1306 CE కాలము వ్యక్తి. 


అమరశిల్పి జక్కన, రువారి మల్లిటమ్మల వలె - ఆరణికో మధ్య, దక్షిణ ఆసియా ఖండ దేశాల కళలకు ఒరవడి పెట్టాడు. నేపాల్, టిబెట్, యువాన్ చీనా మొదలగు దేశాలలో నేటికీ ఆరణికో కళారీతుల ప్రభావం అనుసరణలో ఉన్నదంటే 'అతను నెలకొల్పిన  సరి క్రొత్త విధానాలూ అద్భుతమైనవి అని ఋజువు ఔతూన్నవి.          


##### 


కళాజగతినందు ఆదాన ప్రదానాలు సాధారణం. అభయ మల్ల, జయభీమ్‌ దేవ్ మల్ల  పరిపాలనాకాలమున కళా మార్పిడి కార్యక్రమాలు చురుకుగా సాగినవి. కుబైఖాన్ హిమాలయ కళాపద్ధతులను(trans-Himalayan artistic tradition), చీనా కళల సమ్మిళితమైన నవ్యత్వానికి శ్రీకారం చుట్టాడు. ఇట్టి స్థిరకళల మార్పిడి వలన చైనా సమాజానికి అమోఘ సౌందర్య ఆవిష్కరణలు లభించినవి. ఫలితంగా అక్కడ వర్ణమయ  సృజనాత్మకలు వెల్లివిరిసినవి.                   


#####


ఆర్నికో (అర్నికో) తాత, నాయనమ్మలు మిత్ర, కుందలక్ష్మి. చైనా చారిత్రక ఆధారముల ప్రకారము (ఉచ్ఛారణా పరిణామములో) "మి-తి-ర", "కున్-ది-ల-క్విమెయి" అని మారినవి. తల్లిదండ్రులు "ల-కె-న", "షు-మ-కె-తై"(లక్ష్మణ్, సుమకేతి). 

విజేతల జీవితాలలోని ముఖ్య సంఘటనలను జనులు పదేపదే చేసుకుంటూంటారు. తద్వారా తర్వాతి తరములకు కొన్ని కథలు ఆశువుగానూ, పాటలుగానూ, సాహిత్యరూపేణా నిధులు దొరుకుతూన్నవి. 

ఆర్నికోకు ప్రజలచేత నెమరు వేయబడేటటువంటి అలాంటి స్మృతులు ఉన్నవి. 


తండ్రి బౌద్ధ కోవెలకు బాలుడు ఆర్నికోతో వెళ్ళాడు. మూడేళ్ళ బాల ఆర్నికో, తండ్రిని కొన్ని సందేహాలను అడిగాడు. "ఈ స్తంభములను ఎవరు చెక్కారు? వీని పునాదులను, పైన 'అండా" లను ఎవరు నిర్మించారు?" (wooden sthambha, bhumis, anda) 


మూడేళ్ళ చిన్నారి ప్రశ్నలు  పెద్దల మేధావితనానికి దీటుగా ఉన్నవి. 


అందరూ "ఆనికో గొప్ప శిల్పి ఔతాడు. భవిష్యత్తులో అతడు పేరు ప్రఖ్యాతులను ఆర్జించి, గొప్పవాడౌతాడు." అని అనుకున్నారు.  


వాళ్ళ నమ్మకం, పలుకులు వాస్తవం అయినవి. 


#####


దక్షిణ భారతదేశ కోవెలల పై కప్పులకు "విమానము" అని చెబుతారు. గర్భగుడి, స్తంభములు, రంగమండపము ఇత్యాదులు ఉన్నవి. అట్లాగే బుద్ధదేవుని చైత్యములు, ఆరాధనామందిరములను 'పగోడా' అని పిలుస్తారు.  బుద్ధుని ఆరాధనామందిరములకు 13 వలయాలు ఉంటాయి. పదమూడు రింగులను ఒకదానిపైన ఒకటి పేర్చుటచే అవి క్రమపద్ధతి వలన లయాత్మకత ఒనగూడి, భక్తిభావ, ధ్యాన, ఏకాగ్రతలకు అనువైన వాతావరణాన్ని నెలకొల్పుతాయి.  ఈ విశిష్టతకు మెరుగులు దిద్దిన వాస్తుచిత్రణాశిల్పిఆర్నికో సదా స్మరణీయుడు ఐనాడు.


బీజింగ్, నేపాల్ లోని నేపాల్  కీర్తిపూర్ మున్నగుప్రాంతాలలో అతని ప్రతిమలను ప్రజలు స్థాపించుకున్నారు.         


#####


పగోడా, డగోబాల తేడా:


డగోబాలు ‘గంట ఆకారముతో ఉంటాయి. డగోబాలు నిర్మాణశైలికి ‘మన దేశములోని స్థూపము మంచి ఉదాహరణ. శ్రీలంక (పాత పేరు సింహళము), థాయిలాండ్, కొరియా మొదలైన దేశాలలో సాక్షాత్కరిస్తున్నవి. బౌద్ధ పరివ్రాజకులకు, బౌద్ధ సన్యాసులకు ధ్యానప్రదేశాలుగా ఉపయోగము కలిగినవి.బుద్ధదేవుని చైత్య, ఆరామాల శైలులు వర్ణచిత్రాలను, పుష్పములు, జంతువులు ప్రతీకలుగా ఉన్నవి. ఏనుగులు, ఫలములు, జంతు, వృక్షములు డిజైన్లతో, ఎంబ్రాయిడరీ తీరుతెన్నులై, ఆకట్టుకుంటూంటాయి. హిందూ శిల్పములు దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుషులు, మనుష్యులు, సైనికులు, యోధుల సాహసాలు, గజ, శరభ, సింహాది క్రూర మృగాలను వేటాడే దృశ్యాలు అనేక ఉన్నవి. ఇవి కథాకథనశైలికి ప్రతిబింబాలు.  ఆ స్త్రీలు, రామచిలుకలు, మయూరి మున్నగు పెంపుడు పక్షులతో వయ్యారమొలికించే వనితామణులు అలనాటి ప్రజాజీవనవిధానాలను కన్నులకు బొమ్మలు కట్టినట్లు ఉండే విధానము నెలకొన్నది. హంపీలో మహిళల హెయిర్ స్టైల్సు సంఖ్యాపరంగా, వివరణాపరంగా ‘న భూతో న భవిష్యతి|’.


నాటివరకూ మనుజుల సంగీత, నాట్యాది లలితకళలను, నిత్య జీవనశైలిని, వీరుల యుద్ధవిధానాలనూ (మధ్య ప్రదేశ్ లోని ఖజురాహో సుప్రసిద్ధమైనది. చంద్రవంశ రాజైన చండేల ప్రభువులు కొన్ని అడుగులు ముందుకు వేసారు. వారు వాత్స్యాయన కామసూత్రాలను శిల్పములుగా చెక్కించి, ప్రపంచములోని ఇతరదేశాలకు, పాశ్చాత్యులకూ పరిశోధనలకు కేంద్రమైనది.) గ్రీకులు, కుషాణులు, కనిష్క చక్రవర్తి, మొదలైన వారి ప్రభావముచే “గాంధారశైలి” మన దేశానికి లభించినది. అట్లాగే బౌద్ధులు, జైనులు మున్నగువారివలన “ప్రతీక శైలి”ని లబ్ధిగా హిందువులు పొందారు. 


ఈ మార్గమున దృశ్యకళలైన చిత్రలేఖనములు, కుడ్యచిత్రాలు, మురల్ శైలి, ఫ్రెస్కో కళ, అదే తీరుగా ‘డగోబా’ ఆరాధనామందిరములు మన దేశానికి అందిపువచ్చిన కళా విన్నాణాలు. 


 #####


మహాశిల్పి ఆర్నికో ; Link - essay in Webmagazine

User Rating:  / 1 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri
Monday, 11 August 2014 07:23
Hits: 106

&&&&&&&&&&&&&&&&&&&&&&

కోణమానిని తెలుగు ప్రపంచం
పేజీ వీక్షణ చార్ట్ 51989 పేజీవీక్షణలు - 989 +1 పోస్ట్‌లు, చివరగా Aug 21, 2014న ప్రచురించబడింది

అఖిలవనిత
పేజీ వీక్షణ చార్ట్ 27446 పేజీవీక్షణలు - 719 పోస్ట్‌లు, చివరగా Aug 14, 2014న ప్రచురించబడింది

Telugu Ratna Malika

పేజీ వీక్షణ చార్ట్ 3673 పేజీవీక్షణలు - 116 పోస్ట్‌లు, చివరగా Apr 17, 2014న ప్రచురించబడింది
{konamanini views = 56470$
కోణమానిని తెలుగు ప్రపంచం
పేజీ వీక్షణ చార్ట్ 51846 పేజీవీక్షణలు - 988 పోస్ట్‌లు, చివరగా Aug 14, 2014న ప్రచురించబడింది }

14, ఆగస్టు 2014, గురువారం

చుట్టూ మూగిన చిలకల్లారా!

చుట్టూ మూగిన చిలకల్లారా! 
చెట్టూచేమకు కథలే చెప్పి 
వెంటనె వస్తారా? 
మీరు వెంటనె వస్తారా? ...........  
ఈ మా పిల్లలవద్ద, మీరే సొంపగు కథలు నేర్చుకోండీ!
కంచికి పోవని కమ్మని గమ్మత్తు కథలను నేర్వండి ||
;
కొమ్మల వాలిన కోయిలలారా! 
చిగురుటాకులకు పాటలు నేర్పి, 
వెంటనె వస్తారా? 
మీరు వెంటనె వస్తారా? ...........  
ఈ మా పిల్లలవద్ద, మీరే సొగసౌ గానం నేర్వండి 
మహతి, కచ్ఛపి వీణలెరుగని పాటలునేర్వండి  ||
;
పూవుల షికార్ల తుమ్మెదలారా!
పుప్పొడి గ్రోలే మధుపములా! 
పూలకు తేనెలమాటలు నేర్పి
వెంటనె వస్తారా? 
మీరు వెంటనె వస్తారా? ...........  
ఈమా పిల్లలవద్ద, వాణీరాయంచ శిష్యుడైనది ;
సుధామాధురిని మించిన పలుకులు కమ్మగ నేర్వండి ||

చుట్టూ మూగిన చిలకల్లారా! (LINK web magazine "New Awa)

User Rating:  / 1 
Member Categories - బాల
Written by kusuma kumari
Friday, 13 June 2014 16:08
Hits: 186 [2 comments]

{konamanin views - 56402} 


Happy independence day august 15 2014 


స్వాతంత్ర్య ఉత్సాహ శుభాకాంక్షలు

7, జులై 2014, సోమవారం

అర్జున వివాహం - ఇండోనేషియా కథా రూపం


“అజిబీ- ధపపా - విశ్వేసకి" అంటే - అర్జునుడు, జిష్ణు, బీభత్స, ధనుంజయ (ధనము+ జయము), ఫల్గుణ, పార్ధ, విజయ, శ్వేతవాహన, సవ్యసాచి, కిరీటి 
(శ్రీ కృష్ణార్జున యుద్ధం) ఈ పది పేర్లనూ మారువేషంలో ఉన్న అర్జునునికి చమత్కారంగా "పూసలు గుచ్చి" వేసారు. శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే తెలుగు సినిమాలో వీరార్జునునికి ఇలాటి వింత నామకరణం చేసిన ప్రఖ్యాత తెలుగు సినీ రచయిత పింగళి నాగేంద్ర రావు గారు.

*******

బాలిదేశ చక్రవర్తి అర్జునుని కథే "అర్జున వివాహము". ఈ కథాంశం ఇండొనేషియాలో ఆబాలగోపాలమూ ఇష్టపడే కథా ప్రదర్శనా కళా స్వరూపము. 
అర్జున వివాహము ఇతివృత్తాన్ని ఆస్థాన కవి కణ్వ మహా భారతమునుండి గైకొన్నాడు. బాలిదేశ ద్వీపసముదాయాలలో నేటికీ ఆదరించబడుతున్ననృత్య, నాటక కళా రూపము. మన దేశములోని ప్రాచీన కావ్యం "కిరాతార్జునీయా"నికీ, జావా దీవినందలి ప్రాచుర్యగాధకూ అనేక పోలికలు ఉన్నవి.   

*******

కథాకమామిషూ

11వ శతాబ్దములో ఇండొనేషియా ప్రాంతమైన "కెదిరి" సామ్రాజ్యాన్ని  ఆస్థాన కవి ‘కణ్వ’. తూర్పు జావాలో ఉన్న రాజ్యం కెదిరి. రేఖామాత్రంగా మహాభారత వివరములను స్వీకరించి తన స్వీయపంధాలో పాత్రలను తీర్చిదిద్దాడు కవి కణ్వ. 
మహాభారతమును చదివినవారికీ, ఆ కథ తెలిసిన వారికీ ఈ జావా గాధ లోని అంశాలకూ, వేదవ్యాస కృత "జయమ్" కూ, అలాగే భాస విరచిత "కిరాతార్జునీయము"నకూ గల సామ్య, భిన్నత్వాలను గుర్తు పట్టగలుగుతారు. మాయల మరాఠీ, 

కీలుగుర్రం, పాతాళభైరవి వంటివీ, సుప్రసిద్ధ "కాశీ మజిలీ  కథలు" లోని అంశాలు- కథాక్రమములో కణ్వగ్రహించి, ఒక అందమైన కావ్యాన్ని జావా ద్వీపవాసులకు అందించిన తీరు ప్రశంసార్హమైనది.  

*******

అర్జునుడు హస్తినాపుర ప్రభువైన పాండు రాజుకు మూడవ తనయుడు అర్జున్. అర్జున్ ఏకాగ్రత, ధీరతలను ఆర్జించి, తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుని, రానున్నమహాసంగ్రామంలో యోధానుయోధుడుగా తనను తాను మలుచుకొనుటకు సంకల్పించుకున్నాడు. అందుకై అర్జున్ తపస్సు చేయనారంభించాడు. 

ఈమన్ ఈమంతక రాజ్య పాలకుడు "నివాతకవచ". పర రాజ్యాలను ఆక్రమించే క్రూరుడు. అధికారలాలస మిక్కుటంగా కలిగి, అనేక దుష్ట కార్యాలను చేయడానికి ఎంత మాత్రమూ సంకోచించని రాక్షసుడు నివాతకవచ. అతడు "దేవీ సుప్రభ" అనే స్వర్గ దేవత చాలా అందగత్తె అని విన్నాడు. ఆమెను పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు.  దేవేంద్రుని వద్దకు వెళ్ళిన నివాతకవచుడు "నీ కుమార్తె సుప్రబను నాకు ఇచ్చి వివాహం చేయి ఇంద్రా!" అని అడిగాడు. 
"నీవు నా ఆత్మజకు తగిన వరుడివి కావు" అంటూ ఇంద్రుడు తిరస్కరించాడు. 
క్రుద్ధుడైన నివాతకవచ నాకముపై దండెత్తి, మహేంద్ర భవనమును గెలిచి, ఆక్రమించాడు.  

*******

మహేంద్రునికి మిగిలినది ఒక్కటే దారి, మానవుల సహాయాన్ని పొందడము. కనుక ఆతడు యోచించి, అర్జునుని వదకు వెళ్ళాలని తలిచాడు. ఆ తరుణాన అర్జునుడు ఇంద్రకీలాద్రిపైన ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. భవిష్యత్తులో జరగబోయే భారత యుద్ధములో వీరునిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకై, అందుకు తగినంత శక్తిసామర్ధ్యాలను ఆర్జించుటకై అర్జునుడు తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు "నా సమస్యలను పరిష్కరించి, నన్ను కాపాడగలిగే సామర్ధ్యాలు అర్జున్ కి ఉన్నవా?" అని సంశయము వచ్చినది. అర్జునుని పరాక్రమాన్ని పరీక్షకు పెట్టే అవకాశము, అర్జునునితో రణరంగమున ఎదుర్కొనుట!" అని అనుకున్నాడు.

అర్జునుని సామర్ధ్యాన్ని పరీక్షించ దలచాడు దేవరాజు. అందు నిమిత్తము ఏడుగురు అప్సరసలను నియమించాడు. "అర్జున తపోభంగము చేయుడు" అని సప్త అప్సరసలను పంపించాడు. వారిలో ఇద్దరు కొరవ వారికన్నా మిక్కిలి అందగత్తెలు. అచ్చరల హొయలులు, ఒలకబోసిన వయ్యారములు- అర్జునుని నిగ్రహాన్ని భంగపరచలేకపోయాయి.  

*******

ఇంద్రునికి యుద్ధములో సహాయపడగలిగిన వాడు అర్జున. ఇది తెలిసిన నివాతుడు అర్జునునిపైకి మొమాంగ్ మూర్ఖ అనే రాక్షసుణ్ణి ఉసిగొలిపాడు. నివాతునికి అర్జునుడు అమేయ విక్రముడని అర్ధమైనది. అతడు అర్జునుని పైకి పోరాడమని- మొమాంగ్ మూర్ఖ అనే రాక్షసుని పంపించాడు. కొండ ఉన్న గ్రామానికి వచ్చాడు. 

అడవి పంది వేషాలను ధరించాడు. కామరూపధారి ఐన మొమాంగ్ మూర్ఖ పల్లెను ధ్వంసము చేసాడు.

పల్లె జనపదములను, అటవీ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత అర్జునుని భుజస్కంధాలపైన పడినది. ఇక తప్పనిసరై, కాస్సేపు తన మౌన తపముని పక్కన బెట్టి, విల్లంబులను చేత బూనాడు. ఒకే శరముతో వరాహ రూపంలోని  మొమాంగ్ మూర్ఖని కూల్చాడు. ఇంద్రునికే కాదు, నివాతునికి కూడా "అర్జునుడే నిజమైన కథానాయకుడు, బాహు విక్రమశాలి" అని తేటతెల్లమైనది.  

*******

అర్జునుడు ఆశ్చర్యపడేలా అప్పుడే అక్కడే అప్పటికప్పుడే ఒక కొత్త మనిషి ఎదురైనాడు. అతను "ఈ సూకరమును (అడవిపందిని) నేను బాణముతో కూల్చాను" అన్నాడు. 
ఆశ్చర్యచకితుడైన అర్జునుడు " కాదు, ఒక్క బాణముతో నేను ఈ వరాహాన్ని కూల్చాను" అన్నాడు. కొంతసేపటికి వాతావరణములో ఆగ్రహ సెగలు నిండాయి. 
ఇద్దరూ భూ నభోంతరాళాలు దద్దరిల్లేలా యుద్ధం చేసారు. కొసకు ఆ హీరో అర్జునుని కొట్టిన దెబ్బకు, అర్జునుడు నేలపై చతికిలబడినాడు.  అతడెవరో కాదు, సాక్షాత్తూ పరమేశ్వరుడే!! (God Syiwa).

"స్వామీ, మహాదేవ శంభో! నీవని ఎరుగని నేను నీపై రణ దుందుభి మ్రోగించాను. నన్ను క్షమించు శివా!"  అన్నాడు అర్జునుడు.

"అర్జునా! నీవే నిజమైన వీరునివి! నీవు అలౌకిక శక్తులను ఇప్పటికే సాధించినట్టి - పట్టుదల కలిగిన మహా యోధునివి. ఇదిగో! మహామహిమన్వితమైన పాశుపతము. దీనిని నీకు ఇస్తున్నాను. ఈ బాణం తిరుగులేనిది, భద్రం!" అంటూ అనుగ్రహించాడు పశుపతినాధుడు. శైవ (GodSyiwa) ధూమరూపముగా మాయమైనాడు. 

అర్జునుడు ఇంద్రకీలాద్రికి వెళ్ళసాగాడు. తపోగిరికి మరలిపోవుచుండగా అర్జునుని వద్దకు 'ఇంద్రుడు పంపిన దూత ' వచ్చాడు. 
"అసురునిపై యుద్ధం చేయడానికై ఇంద్రుడు అర్జునుని సాయమును కోరాడు. శరణాగతి అనగా శరణు కోరిన వారిని రక్షించడము తన కర్తవ్యమని భావించిన అర్జునుడు, వెంటనే తన అంగీకారము తెలిపాడు.  అర్జునునితో రణ వ్యూహమును గూర్చి చర్చించాడు ఇంద్ర. 
"ఆ రక్కసుడు తుది లేని వరము కలవాడు. ఆతని ప్రాణ రహస్యాన్ని తెలుసుకోగలిగితేనే అతడిని గెలువగలము అర్జునా!" అన్నాడు దేవాధిపతి. వారి పథక రచన ప్రకారము "సుప్రభ"ను నివాతకవచుని దరికి పంపాడు ఇంద్రుడు. ఆమెకు రక్షాకవచముగా వెంట వెంట వెళ్ళినవాడు కథానాయకుడైన అర్జునుడు.

"నివాతకవచుడు సూక్ష్మ రూపములో ఎవరికీ కనబడకుండా ఉండగలుగుతున్నాడు కదా!, ఆ రహస్యమేమిటి? దానిని నువ్వు కనుక్కోవలెను" అని గొప్ప విధిని ఇంద్రుడు అప్సరసకు పురమాయించాడు. 

*******

అర్జున్ ఒక వ్యూహం పన్నాడు. అర్జునుని పధకమును ఇంద్ర, సుప్రభలు అంగీకరించినారు. సూక్ష్మరూపాన అర్జున్ రహస్యముగా సుప్రభను కాపాడుతూ బయలుదేరగా, ఆమె నివాతకవచుని వద్దకు వెళ్ళినది. ఆమెను చూడగానే నివాతకవచుడు సంతోషంతో సుస్వాగతం పలికాడు. 
సుప్రభ ప్రేమ పలుకులతో నివాతకవచుని మైమరిపించింది. "నీకు అద్వితీయ విజయాలు ఎలాగ లభిస్తూన్నవి? సునాయాసముగా విజేతవు ఔతూన్నావు, ఎలాగ? " అంటూ అసలు ఊసును అడిగింది సుప్రభ. 
నివాతకవచ సులభంగానే వివరించాడు - "చాలాకాలము క్రిందట నాకు యుద్ధ వేళలలో కొన్ని అద్భుత శక్తులను దేవతలు ఇచ్చారు." అని చెప్పాడు. 

అంతర్హితముగా అక్కడే ఉన్న అర్జునుడు రాక్షసుని ప్రాణరహస్యం గూర్చి కొంత తెలుసుకున్నాడు. వెంటనే బైటి ద్వారం వద్ద రాక్షసులను బాణ పరంపరతో మట్టి కరిపించి, సుప్రభను తోడ్కొని ఇంద్రుని కలిసాడు.

*******

సుప్రభ తప్పించుకున్నదని తెలిసిన నివాతకవచ క్రుద్ధుడైనాడు. మళ్ళీ ఇంద్రలోకాన్ని మహాసైన్యాలతో ముట్టడి చేసాడు.

"ఇంద్రా! అర్జునా! పిరికిపందలలాగా లోపల ఉన్నారెందుకు? బైటికి వచ్చి ముఖాముఖీ నాతో పోరాడండి." అని నివాతకవచ"పెడ బొబ్బలు పెట్టాడు. 
అర్జునుడు ఇంద్ర మహలు నుండి వెలుపలికి వచ్చి, ద్వంద్వ యుద్ధము చేయసాగాడు.నివాతకవచ ఎంతసేపటినుంచీ యుద్ధం చేస్తూన్నా, అలసట అతనికి కలగడము లేదు. 

భీకరపోరాటాన్ని చేస్తూంటే రోజులు గడిచిపోతున్నాయి. అంత సమరమునందూ నివాతకవచ తన నోరు తెరవకుండా జాగ్రత్త పడ్డాడు. అందుచేత అతనిని ఓడించడం కష్టసాధ్యమైంది.  

అర్జునుడు మరొక ఉపాయాన్ని ఎన్నుకున్నాడు.

కింద పడినట్లు నటిస్తూ అర్జునుడు "నన్ను కనికరించు. నా దైవము ఆనతి పై నేను నిన్ను ఎదిరించాల్సి వచ్చింది. దయ చూపు!" అంటూ విలవిలలాడసాగాడు. 

అర్జునుడు నిజంగానే కిందపడ్డాడని అనుకున్నాడు రాక్షసుడు. అర్జునుని ఆ మాటలకు గటిగా నవ్వుతూ అన్నాడు "ఓ అర్జునా! నీవు మహా యోధుడవని విన్నాను. నాకు సమ ఉజ్జీవని అనుకున్నాను. కానీ చిన్న కోడిపిల్లలాంటి వాడివని నేననుకోలేదు" అన్నాడు.   అది చెబుతూ "నా జిహ్వ మాత్రమే బలహీనమైనది. నాలుక లోనే నా ప్రాణము దాగిఉన్నది" అని అసలు గుట్టును విప్పేసాడు. “ఐతే నేనే సర్వం సహా చక్రవర్తిని అని నీవు ఒప్పుకున్నట్లే కదా!" అన్నాడు. 

అర్జునుడు "ఔను!" అంటూ అంగీకారాన్ని తెలిపాడు.

"గెలుపు నాదే! నేనే గెలిచాను." అని పట్టరాని ఆనందంతో దిక్కులు పిక్కటిల్లేలా వికటాట్టహాసం చేయసాగాడు. 

"హ్హ! హ్హ! హ్హ! పిరికిపంద........." అతని మాటలు పూర్తి అవుతూండగానే, అర్జునుడు పాశుపతాస్త్రం నుండి సంధించిన బాణం,  ఆ నివాతకవచుని నోటిలోని నాలుకను ఛేదించింది.  

*******

ఇంద్రుడు "అర్జునా! నీవు మాకు చేసిన మేలు మరువ లేనిది. నీ ఈ ధైర్య సాహస కార్యాన్ని భగవంతుడే కాదు, మానవజాతికి అమూల్య ఉపకారము. దేవుడు శివుడు నీకు అమోఘ ధనుర్బాణాలను ప్రసాదించాడు. ఇక నేను నీకు ప్రత్యుపకారమును ఏమివ్వగలను? బహుమానముగా సప్త దేవ కన్యలను నీకు ఇస్తున్నాను. ఈ ఏడుగురు సుందరీమణులను పరిణయమాడు" అన్నాడు. అర్జునుడు దివ్య కన్యలను పెళ్ళి చేసుకున్నాడు. వారిలో సుప్రభ, తిలోత్తమలు కూడా ఉన్నారు. స్వర్గ భోగాలను అనుభవిస్తూ దివిలో ఏడు నెలలు గడిపాడు అర్జున్. 
తర్వాత ఇంద్రునికి వద్ద సెలవు తీసుకున్నాడు. నాకలోకవాసులకు వీడ్కోలు తెలిపిన అర్జున్ తన స్వదేశమును చేరి, తన దేశమునకూ, తన ప్రజానీకమునకూ రక్షణాది బాధ్యతలను నిర్వర్తించ సాగాడు. అన్న దమ్ములనూ, కుటుంబీకులనూ కలిసి, సుఖసంతోషాలతో జీవితాన్ని గడపసాగాడు. అర్జున.

*******

మానవ ప్రయత్నమే గొప్పదని నిరూపించడమే భగవానుని అభిలాష. నిరర్ధక ప్రార్ధనాదికముల కంటే మానవుని ప్రయత్నబలమే సార్ధకమైనదని ఋజువు చేయదలిచాడు కవి. అట్లా ధ్యేయనిరూపణ చేసిన రచనను కణ్వుడు చేసాడు. మనిషి ప్రయత్న సిద్ధియే దైవ శక్తి కన్నా మేల్తరమైనది- అని, మనిషిలోని అంతర్లీన తేజస్సుకు పెద్దపీటను వేశాడు ఎంపు కణ్వ. మనిషి ప్రభావ ఉత్తేజాలను ఋజువు చేసే తరహాలో అనేక అంశాలు పుష్కలముగా ఉన్నవి కాబట్టి - కణ్వ రచన - జావాదేశ జనుల చేత ఇతిహాస స్థాయిలో గౌరవించబడ్తూ ఉన్నది.         

*******  
;
Email User Rating:  / 1 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri
Saturday, 28 June 2014 09:36
Hits: 183

30, జూన్ 2014, సోమవారం

కోహకన్ - ప్రేమకథ

कोहकन అనే పదం హిందీ, తత్సంబంధిత భాషలలో చోటుచేసుకున్నది. కోహకాన్ {कोहकन} ఎవరు?

కోహకాన్ ఒక ప్రేమికుడు. పర్షియన్ ఇతిహాసం, జానపద గాధ. లైలామజ్ఞూల కథలు వంటివి, ఈ కథను అనుసరించి, తర్వాతి తరముల వారికి అందినవి, అని విమర్శకుల అభిప్రాయాలు. 
ఈ కథ ప్రపంచ సాహిత్యములో, మమతానురాగాలకు ప్రాధాన్యాన్నిఇచ్చినది. 
అప్పటిదాకా వచ్చిన “హెలెన్ ఆఫ్ ట్రాయ్”, "క్లియోపాత్రా” మున్నగునవి, కేవలం యుద్ధ పరంపరలను పూసగుచ్చినవి. వీనిలో ప్రేమానుభూతులకు జాగా లేదు. ఒక స్త్రీ కోసమో, లేదా ఒక ఆడదాని పేరుతో, ఆయా ప్రాంతాలపై, దేశాలపైనా తమ తమ అధికారాలను సుస్థిరం చేసుకొనుట, తమ శక్తిని ఋజువు చేసుకునే నిమిత్తం జరిగిన పోరాటాలు! వీటిలో హింస, ద్వేషం మాత్రమే ఉన్నవి. అట్టి తరుణంలో ఆ ఖండములలోని ఇంగ్లీషు, ఉర్దూ ఎట్సెట్రా లిటరేచర్ ని ప్రభావితం చేసిన చారిత్రక ఘటన కోహకన్ వలపు కథ.

పాశ్చాత్యులకు “ప్రేమ”ను ప్రధానాంశముగా అందించిన కథ, మధ్యప్రాచ్యానికి చెందిన ఈ కోహకాన్ కథ. ఇందుకనే కోహకాన్ కథ పద్యకావాలుగా, నాటకములుగా సాహిత్యములో చోటు చేసుకుంటూనే ఉన్నది. అసలు కథ కొద్ది కొద్ది మార్పులు చేర్పులతో, కవుల లేఖనములలో చిత్రితమౌతూ వస్తూనే ఉన్నది.
*******

కథా ప్రారంభం:

వానలు మృగ్యమై, (పర్షియా)దేశములో కరువు వచ్చింది. కథానాయకుడైన కోహకాన్ ఒక పడతిని ప్రేమించాడు. ఆమె పేరు షిరీన్. వారి ప్రేమను ఇష్టపడని రాజు, కోహకాన్ కి ఒక పని అప్పగించాడు. “కొండపైన పెద్ద జలాశయాన్ని అతను స్వయంగా నిర్మించాలి.”- ఇదీ ఆ షరతు.
అసాధ్యం ఐనట్టి ఆ ఫనిని చేయలేకపోతే కోహకాన్ ఇకపై సిమ్రాన్ గురించి ఆలోచించకూడదు. – అని నియమాన్ని పెట్టాడు రాజు.

కోహకాన్ క్లిష్టమైన ఆ కార్యాన్ని చేయడానికి వెనుకంజ వేయ లేదు. నిరంతరము చెమటోడ్చి కోహకాన్ మెట్లు కట్టాడు. రోజుల తరబడి అతనొక్కడే పెద్ద చెరువును తవ్వాడు.

కోహకాన్ పట్టుదల శ్లాఘనీయమైనది. ఒకే చేతిపైన అతను కొండను తొలిచి, పైన పెద్ద తటాకమును నిర్మించాడు. బెహిస్తన్ లో పర్వతాన్ని దాదాపు సగం త్రవ్వాడు. అప్పటికి అతని శ్రమ ఫలించింది. (Behistun Inscription) ఎట్టకేలకు నీళ్ళు పడటంతో అతని ఆనందానికి అవధులు లేవు.

ఐతే ఈ కథ, సాహిత్యమున మాత్రమే కాక డిక్షనరీలలో కూడా ఎలా చోటు చేసుకున్నది? 
ప్రస్తుతం మనం కోహకాన్ ని హీరోగా తీసుకున్నాము కదా!

అట్లాగే ఒక ప్రతినాయకుడు కూడా ఇందులో ఉన్నాడు. అతడే “ఖుస్రూ”. ఖుస్రూ గుర్రము నెక్కి వెళ్తూ యువరాణి షిరీన్ ని చూసాడు. చూసి మొదటి చూపుల్లోనే ప్రేమించాడు. ఖుస్రూ కుట్రకు ప్రేమికుడు కోహికాన్ బలి అయ్యాడు. ప్రియుడు కోహికాన్ విషాద వార్తను విన్న షిరీన్ ఆత్మహత్య చేసుకున్నది. విషాదాంత కావ్యాన్ని లోకానికి మిగిలించి, అజరామరమై ఆ జంట మిగిలింది.
*******

కొహ్కన్ అంటే “కొండను తవ్వే వాడు” అని అర్ధం. నిష్ఫలమైన శ్రమ, నిష్ప్రయోజనమైన పని అను భావార్ధమున ఈ పదము స్థిరపడింది. చేసిన శ్రమకు ప్రతిఫలం దక్కక, కొసకు ఇక్కట్ల పాలవడానికి “కొహకాన్”అనే మాట డిక్షనరీలలకు చేరింది. మన ఇతిహాసములకు అనేక ప్రక్షిప్తములు ఉన్నవి. భక్తులు అమిత శ్రద్ధతో స్థానిక అంశాలను కొంచెం కొంచెం జోడిస్తూ, మూలకథకు భంగం జరగకుండా రాసారు. అదేరీతిగా కోహకాన్ గాధ ఆయా దేశాలలో కొద్ది మార్పులతో రచించబడింది.

800 ఏళ్ళ క్రితం "కోహకాన్" కథను ఇరాన్ లో పద్యసంపుటిగా రాసారు. ఇక్బాల్ మొదలైన కవులు స్వచ్ఛమైన ప్రేమభావనను అక్షరబద్ధం చేసారు. 12వశతాబ్దములో జరిగిన కొహకాన్ కథ రచయితలను, ప్రజలనూ ఆకర్షించింది. 2008 లో “షిరీన్” అనే సినిమా వచ్చింది. కొహకాన్ లెజెండ్ చుట్టూ తిరుగినది. ఇరాన్ లోని కర్మన్ షా నగరునందు జరిగింది. ఇరాన్ నందు పడమట ప్రాంత మండలములో ఈ సంఘటన జరిగినదని ప్రజలు భావిస్తున్నారు.

కొహకాన్ (Kohakan) అసలు పేరు “ఫర్హాద్” అని కొందరు ప్రస్తావించినారు. పర్షియన్ కవి ‘ఫిరదౌసీ’గ్రంధము “షానామా” (book of kings).అతను రచించిన కథలో కొంత భిన్నంగా ఉన్నది.

*******

రెండవ కథ:

ఖుస్రూ రాజు భార్య షిరీన్ ప్రేమకథగా వివరించబడినది. ఫర్హాద్ తన కర్తవ్యాన్ని పూర్తిచేసాడు. మహాతటాకమును త్రవ్వాడు. ఖుస్రూ అతనిని మోసగించాడు. వేదనతో తన చేతిలోని గొడ్డలిని విసిరివేసాడు కొహకన్. ఆ గొడ్డలి కూరుకుపోయిన చోట ఒక దానిమ్మచెట్టు మొలిచింది. ఆ “అనార్ చెట్టు”కి కాసే పండ్లు అన్ని రకముల రోగాలను నయం చేస్తాయని ప్రజల నమ్మిక.

*******
ప్రశ్న: మూవీలుగా వచ్చిన కథ ఇది. రోమియో జూలియట్, లైలామజ్ఞూ వగైరా స్టోరీలకు మూలం ఇచ్చినది. నువ్వు చెప్పదలచుకున్నది అంతేనా!?

ఆన్సర్: నీటికరువును నివారణగా రాజు విధించిన డ్యూటీ నాకు బాగా నచ్చింది.

“ప్రేయసి రావే! ఊర్వశి రావే!” అంటూ దేవదాసులాగా మందుబుడ్డీ ఎట్సెట్రా లని పుచ్చుకోకుండా , ఇలాగ కాస్త కష్టపడి ఏదైనా సాధించి చూపిస్తే బాగుంటుంది. ప్రజలకూ, ప్రకృతికీ, పర్యావరణానికీ ఎంతెంతో మేలు చేసిన వారౌతారు. ఒకవేళ వాళ్ళ లవ్ స్టోరీ గెలిస్తే విజేతలు ఔతారు. కాదూ, చరిత్రలో ట్రాజెడీ కావ్యాలకు మేటరును ఇచ్చినట్లు ఔతుంది.

ప్రశ్నదారులు:- గాడిద గుడ్డు! రామాయణం లో పిడల వేట అంటే ఇదే!

ఆన్సరుదారుడు:- ఊహూ! కాదు మ్యాన్! ఉభయతారకం అంటే ఇది అన్న మాట!
*******
కొహ్‌కన్ అంటే కొండలుత్రవ్వేవా డు. కోహ్ అంటే కొండ (కోహ్-ఇ-నూర్ లో కోహ్ లాగా అన్నమాట). అయనపేరు అసలుపేరు  ఫర్హాద్. (ఈ అంశాన్ని చెప్పిన హితులకు నా కృతజ్ఞతలు.)

**************

కోహకన్ - ఓ పర్షియన్ జానపద గాథ {LINK - Web patrika};  
User Rating:  / 2       
Member Categories - తెలుసా!
Written by kadambari piduri
Tuesday, 10 June 2014 07:29
Hits: 199
**************
{హమ్మయ్య! వైరస్ నుండి ఇప్పటికి నా బ్లాగు కుదుటన పడినది.
చాలా వ్యవధి తర్వాత మళ్ళీ కొత్త పోస్టును వేయగలుగుతున్నాను, ఇదిగో ఇట్లాగ!  }


1000 పోస్టులు వేసి ఈ బ్లాగుకు "శుభం" కార్డును వేసే ఉద్దేశ్యము.
ఇప్పటికి 986 పోస్టులు ఐనవి.
14 లేదా, 1116 లక్ష్యానికైతే plus16, వెరసి 30 పోస్టుల బాకీ ముందు ఉన్నది.
ఇందుకు అందరి ఆశీస్సులను ఆశిస్తూ, కోణమానిని;
కోణమానిని తెలుగు ప్రపంచం
పేజీ వీక్షణ చార్ట్ 50615 పేజీవీక్షణలు - 986 పోస్ట్‌లు, చివరగా April 20, 2014న ప్రచురించబడింది
**************

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...