8, అక్టోబర్ 2013, మంగళవారం

కిమ్ కవీంద్ర ఘటా పంచానన - కాశీనాధులు కిమిన్నాస్తి!

తిరుపతి వేంకటకవులు"అష్టావధానప్రక్రియ”కు ఆంధ్ర సారస్వత ఆస్థానమునందు రత్న పీఠమును నిర్మించి అందు ఆసీనను గావించిన పుంభావ సరస్వతులు.

చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వీరినిద్దరినీ “జతగా చేర్చి, జంటగా కవితా జననికి ఫాలమున కస్తూరి తిలకమును దిద్దించుటను” ప్రోత్సహించారు. 
చిత్రమేమిటంటే ఆ ఇద్దరు ఒకే ఊరివారు కారు. ఒకరిది ఆ నాడు ఫ్రెంచివారి ఆధీనంలో ఉన్న యానాం- ఇంకొకరిది భీమవరం వద్ద ఎండగండి అనే కుగ్రామము. 
ఈ కవిద్వయం ఆశుపద్యోక్తులలో అద్వితీయ ఛందోవిన్యాసాలను చేసారు, హాస్య దామినీ ఝటిత్ చమక్కులను మెరిపించారు. నాటకములకు వీరి పద్యములు ఆచంద్రార్కం నిలిచే ‘కొటేషన్లు'గా స్థిరపడినవి అంటే అతిశయోక్తి కాదు. 

దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి- తెనుగు అక్షర గోదావరీ దరిని విహరించే రీతిగా దోహదము చేసిన వ్యక్తి చర్లబ్రహ్మయ్యశాస్త్రి. ఆ కవిద్వయానికి కోమలమైన కవితల అల్లికలను నేర్పారు. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తొలుత “పద్య రచన, గోణము కట్టుట, పద్యాలను” చెప్పగలిగారు. 
అటు తర్వాత చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తనకు కవితాప్రయాణములో జంటగా ఉండగలిగిన 
దివాకర్ల తిరుపతి శాస్త్రికి ఛందోబద్ధ పద్య, కావ్య రచనలను నేర్పిసాధన చేయించారు. 
కనుకనే “చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి నాకు గురుతుల్యులు” అని పేర్కొని, 
దివాకర్ల తిరుపతి శాస్త్రి, తన గురుస్థానములో చెళ్ళపిళ్ళ గారిని ఉంచుకుని, 
ఆరాధనా భావంతో మెలిగారు.

- - - - -

పౌరాణిక నాటకముల ప్రదర్శనలకై అనేక నాటకసంఘములూ, థియేటర్లు వెలిసినవి అంటే అప్పట్లో పౌరాణిక నాటకములు పట్టిన రాజ యోగము ఎంతటి శిఖరాగ్రాలను అధిరోహించినవో- వేరే చెప్పనవసరం లేదు.

అప్పుడే మూకీలు, తర్వాత టాకీలూ వచ్చినవి. ప్రదర్శనారంగములు సాహితీ అక్షయపాత్రలనుండి పౌరాణిక నాటకములు, ప్రాచీన ఇతిహాస, జానపద కథలు- సునాయాసంగా గైకొన్నవి.

- - - - -

“పాండవోద్యోగ విజయాలు” ప్రభావం సంఘంలో సహస్రకిరణతేజములైనవి. 
అప్పటిదాకా పండితుల జ్ఞానశాలలకు మాత్రమే పరిమితమైన 
పద్య, సంస్కృత భాషాపదసుధా వర్షధారలు విద్యాగంధం లేని పామరుల దోసిళ్ళలో కురిసింది. నిత్యజీవితంలో- వాడుకునే జాతీయాల ఓలె వీరి పద్దెములు మారినవి.

“అదిగో ద్వారక! ఆలమందలవిగో…”

“వచ్చినవాడు అర్జునుడు, అవశ్యము గెల్తుమనంగరాదు..”

“బావా! ఎప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ …………"

"బావా! ఎక్కడనుండి రాక ఇటకు? ఎల్లరున్ సుఖులే కదా?........."

“జెండాపై కపిరాజు ……”

“అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు……”

“అన్నమాట జవదాటని……”

ఇలాగ, ఒకటేమిటి? వీరి “శ్రీకృష్ణ రాయబార (పాండవోద్యోగ విజయములు; – పడక సీను)  ఒక్కమాటలో చెప్పాలంటే "సినిమాలకు లభించిన ఆదిబిక్ష వీరి నాటకరచనలు. సినిమాలకు మొదటినటీనటులు, విదూషకులు సంభాషణలకూ, పాటలకూ, పద్య గాన, సంగీతబాణీలకూ శ్రీకారం చుట్టినవానిలో తిరుపతి వేంకట కవుల రచనలకు ప్రధమతాంబూలం దక్కుతుంది.

"జంటకవులు" అనే పదానికి నిఘంటువులో చేర్చవలసిన పదమౌక్తికముగా మార్చినవారు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి. 
చర్ల బ్రహ్మయ్యశాస్త్రి శిష్యులైన తిరుపతి వేంకట కవులు రాయబారమునకు వెళ్ళిన కృష్ణుని సంభాషణలు ఇలాగే ఉంటాయి- అనిపించేలా వెదజల్లిన పన్నీటిఅత్తరు అక్షరముల గురుమూర్తులు.

- - - - -

తమ రచనలలో చిరంజీవులైన తిరుపతి వేంకటకవులు ఆశువుగా అనేక కవితలు చెప్పారు. అనేక అష్టావధానములు, శతావధానములు జరిగినవి. వీరి ప్రతి ప్రదర్శనా సభికులకు పదేపదే చెప్పుకునే మంచి సంఘటనలుగా మారుతూండేవి. ఒకసారి ఒక సాహితీ సభలో తటస్థ పడిన విశేషం ఇది!

- - - - -


కిమ్ కవీంద్ర ఘటా పంచానన:

తిరుపతి వేంకట కవులకి “కిమ్ కవీంద్ర ఘటా పంచానన “ అనే బిరుదు ఉన్నది. 
ఒక సమావేశములో అష్టావధానముప్రదర్శనలో ఒకతను వింత ప్రశ్నను, జవాబునూ సృజించాడు.
ప్రక్రియ:  దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం, అప్రస్తుతప్రసంగము (అడిగే వాడికి చెప్పే వాడు లోకువ- ఇక్కడ పృచ్ఛకుడు తమాషాప్రశ్నలు వేసి, అవధానిని ఖంగు తినిపించాలని ప్రయత్నిస్తూంటాడు), గంటల లెక్కను విని చెప్పుట, వ్యస్త అక్షరి, అనే 8 విభాగములు ఒండే సాహితీ క్రీడ. ఎనిమిది అంశములు కాస్త భేదములతో ఉంచి నిర్వహిస్తారు.

పృచ్ఛకుడు, రవంత గేలిచేస్తూ “కిమ్ కవీంద్ర ఘటా పంచానన”- అంటే- 
అంటూ అక్షరాక్షరాన్నీ విడగొట్టి, భావాన్ని చించేసి- ఒక కొత్త అర్ధాన్ని నిర్వచించాడు.

“కిమ్ కవీంద్ర= జల విహంగాలలో గొప్పవి ఐనట్టి: ఘటా = పెద్ద గుంపు; 
పంచ =బాగా వెడల్పు ఐన; అవననము = ముఖము కలిగిన: 
అనగా ఈ బిరుదార్ధమును “పెద్ద కొంగలు” అని వివరణను చెప్పుకోగలము.” 
కాశీనాధుని వక్రభాష్యం విని సభికులు అవాక్కయ్యారు.

చెళ్ళపిళ్ళ చటుక్కున ఇలాగ అన్నారు 
“యదార్ధవాక్కులు వీరివి. కాశీనాధులు గారు సెలవిచ్చినట్లు 
మా బిరుదుకు అర్ధం ‘ఘన బకములే!’ 
ఇక మరో అంశం సైతం మన నుడువులలో చోటు చేసుకోవడం సముచితము. 
అదేమిటనగా-కాశీనాధ నామధేయానికి కూడా విలక్షణత ఉన్నది. 
“కా” = నీళ్ళు; “అశి”= తిరుగాడునట: పదార్ధము ఏమనగా- ‘ పెద్ద చేపలు ’. 
అందుచేత ప్రస్తుత ప్రసంగమున వారి పాలిట పెద్ద కొంగలం మేమే!”

కిమ్ మత్స్యం గప్ చుప్! 
ఇక కాశీనాధులు కిమిన్నాస్తి.

- - - - -

{ఆచార్యులు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి - సెప్టెంబర్ 5 వ తేదీ 2013 న “టీచర్స్ డే” – ని పురస్కరింఛి )

  ***********************************************************,
కిమ్ కవీంద్ర ఘటా పంచానన - కాశీనాధులు కిమిన్నాస్తి  (NewAwky.com)
Email User Rating:  / 3 
Member Categories - ప్రముఖుల హాస్యం
Written by kusuma kumari
Monday, 23 September 2013 15:22
Hits: 122 

17, ఆగస్టు 2013, శనివారం

ఈ యజమాని చాలా మంచివాడు!

రావూరి భరద్వాజ ధనికొండ హనుమంత రావు వద్ద ఉద్యోగం చేసారు. 
తర్వాత ఆయన వద్ద పని మానేసారు. 1958 లో ఒక ఫౌంటెన్ పెన్ కంపెనీలో చేరారు. 
ఒకనాడు కలములను మిషనులలో తయారు చేస్తున్నారు. అప్పుడు ఒక పెన్నుకాస్తా పాడైంది. 
దాంతో ఆ కంపెనీ ఓనర్ కివిపరీతమైన కోపం వచ్చింది. 
రౌద్రంతో ఎదురుగా దొరికిన రావూరి భరద్వాజను చడామడా తిట్టేసాడు. 

నిజానికి ఆ యజమాని యొక్క అన్న కుమారుని వలన ‘తయారీలో ఉన్న ఆ పెన్ను‘ పాడైంది. 
రావూరి భరద్వాజ నెమ్మదిగా విషయాన్ని విడమర్చి చెప్పాలని ప్రయత్నించాడు. 
కానీ క్రోధావేశాలతో ఊగిపోతూన్న ఆ కంపెనీ స్వంతదారు- “నోర్ముయ్! మాట్లాడావంటే పళ్ళు రాలగొడ్తాను.” అని ఱంకెలు వేసాడు.

కొంతకాలం గడిచింది. ఒక రోజు ఆ యజమాని కొడుకు రావూరి భరద్వాజ వద్దకు వచ్చి చిన్న సాయాన్ని అడిగాడు. 
అతని రిక్వెస్టును మన్నించి రావూరి భరద్వాజ తనకు చేతనైన హెల్ప్ చేసాడు. 
ఆ దొరగారి కుమారుడిని తనకు తెలిసిన చోట ఉద్యోగం ఇప్పించాడు రావూరి భరద్వాజ. 
ఆయన అలాగ ఉద్యోగం  ఇప్పించిన చోట చేరాడు ఆ అబ్బాయి. ఉద్యోగం పురుష లక్షణం- అని అప్పటి నానుడి. సంతోషంతో పనిలో చేరిన స్వామి తనయునితో ఇలా చెప్పాడు రావూరి భరద్వాజ

“అబ్బీ! జాగ్రత్తగా పని చేసుకో! ఈ యజమాని చాలా మంచివాడు. 
మీ నాన్నగారి మాదిరిగా నిష్కారణంగా కోపగించుకోడు. చేయని తప్పుకు పళ్ళు రాలగొడ్తానని మాత్రం అసలే అనడు.” 
*****************************************,

{ఆధారము:- “నాకు దేవుని చూడాలని ఉంది”- "తెలుగు విద్యార్ధి} 
  
ఈ యజమాని చాలా మంచివాడు! (Web magazine; link)

Add new comment
Hits: 247
ఈ యజమాని చాలా మంచివాడు!
Member Categories - తెలుసా!
Written by kusuma kumari
17 July 2013 

15, ఆగస్టు 2013, గురువారం

"సారనాధ్" పేరు ఎలా వచ్చింది?

#"సారనాధ్" పేరు ఎలా వచ్చింది?:-
మన  దేశములో తొలి జింకల పార్కు ఏది?:-
మన పావన త్రివర్ణ పతాకములో మధ్య ఉన్న ధర్మచక్రము- ను 
ఉత్తర ప్రదేశ్ లోని "సారనాధ్ స్థూపము” నుండి గైకొన్నారు. 

ఈ విశేషము మన అందరికీ తెలిసినదే!

హిందూ దేశములో మొట్టమొదటి 'సాధు జంతు ఉద్యాన వనము ', 
అనగా "అభయారణ్యం" ఉన్నదా? 
ఐతే అది ఏది? ఎక్కడ ఉన్నది?

*************************;
;
గౌతమ బుద్ధుని జీవిత గాధతో ముడి ఉన్న చారిత్రకాంశము ఇది.
దేవ భాష/ సంస్కృతభాష రాజ భాషగా ఉన్న రోజులు అవి. 

త్రిపీటకములు:-  
"బుద్ధమ్ శరణమ్ గచ్ఛామి।
సంఘం శరణమ్ గచ్ఛామి। 
ధర్మం శరణమ్ గచ్ఛామి। "

త్రి పీటకములు ("Three Baskets") బౌద్ధ మతమునకు పునాదిరాళ్ళు. 
     
పామరుని నుడికారములుగా ఈసడించబడి, నిరాదరణకు గురైన  భాషలు సాహిత్యములో చోటుకు నోచుకోలేదు. 
అలాటి అతి ప్రాచీన కాలాన బుద్ధభగవానుడు సామాన్యుల భాషకు పట్టం కట్టాడు. 
భాషాపరంగా అద్భుత సాహసి ఆయన- అని నిక్కంగా వక్కాణించవచ్చు. 
"పాలీ భాష" లోనే ఆయన బోధనలన్నీ కొనసాగాయి.

అలాగే అప్పటి ప్రాంత, దేశాదుల పేర్లు "బుద్ధ జాతక కథలు" లో 
"పాళీ భాష"లోని స్వస్వరూపాలలోనే ఋజువును పొందినవి. 

*************************;

జింకకు అనేక నామములు కలవు. సారంగము, మృగము, మృగోద్యానము- మొదలైన పేర్ల లిస్టు ఉన్నది.
అలాగే - ఆ నాటి సమాజములో ఇలాటి "పాలీ పద పుష్పములు" లెక్కకు మించి ఉన్నవి. 
అట్టి కొన్ని పలుకులు చూద్దాము.
ఋషి పట్టణం, ధర్మ చక్రము, ఇత్యాది గీర్వాణ పదములకు ప్రతిగా-  
ఆయా మాటలు బౌద్ధ పరివ్రాజకులు వ్యాప్తిలోనికి తేగలిగారు.   
“మృదావ” అంటే- హరిణముల పార్కు, వీనినే నేడు "అభయారణ్యాలుగా" తీర్చిదిద్దారు. 
ఋషి పట్టణము నకు పాలీ ధ్వని- “ఇసి పటన” గా రూపుదిద్దుకున్నది. 

*************************;

జ్యూయన్ సాంగ్ (Xuanzang) ప్రఖ్యాత చీనా యాత్రికుడు, యాత్రారచనలను- 
తాను చూసిన అగణిత అంశాలను పూసగుచ్చినట్లు, అక్షర రూపాలను కల్పించడములో ఆయనది అందె వేసిన చెయ్యి. 
అతని హస్త తూలిక (pen) - అప్పటి బౌద్ధ సమావేశాలనూ, సాహిత్యాన్నీ అక్షర బద్ధం చేసినది. 
ఆ రచనలలో - ఈ సమాచారములను ఉటంకించాడు. 
నిగ్రోధమిగ జాతక కథ  (Nigrodhamiga Jataka - J.i.145ff) హరిణ వన వివరములను రాసాడు. 
బెనారస్ రాజు (= కాశీ ప్రభువు) "హరిణాలు స్వేచ్ఛగా తిరుగాడేటందు కోసమని- అడవిని కానుకగా సమర్పించుకున్నాడు. 

*************************;

సారంగము:-  
మన పావన త్రివర్ణ పతాకములో మధ్య ఉన్న ధర్మచక్రము- ను 
సారనాధ్ స్థూపము నుండి గైకొన్నారు. 
ఈ విశేషము మన అందరికీ తెలిసినదే! 
ఉత్తర ప్రదేశ్ లోని "సారనాధ్" కు ఆ పేరు ఎలా వచ్చింది? 
ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు. 
 సారంగము అనే సంస్కృత పదమునకు "జింక" అని అర్ధము కదా! 

సారంగ నామము ఆధారమైనది. జింకను అలంకారముగా తన చేతిలో ధరించిన వ్యక్తి “సారంగ పాణి”. 
ఆ! మీరు కనుక్కున్నారన్న మాట  ; 
పరమేశునికీ, ఘౌతమ బుద్ధుని అవతారమునకు – ఈ నామాంతరము కలిగెను.
జింకల కేంద్రంగా విలసిల్లుతూన్న ఆ చోటుకు - సారంగము – పద మూలముగా: 
“సారంగ నాధ్” అని ఆ పట్టణానికి పేరొచ్చింది. 
అలాగే - "సారనాధ్"- “సారంగనాధ్” అను మాట నుండి వచ్చినదే. 
*************************;

"Lord of Deer" సారంగ పాణి,ఆ స్వామి కొలువైన ప్రదేశమే "సారనాధ్".  
అందున్న స్థూపము - "సారనాధ్ స్థూపము". 
ఆ స్థూపము మీదనున్న "ధర్మ చక్రము"ను నీతికీ ధర్మ ప్రవర్తనకూ ప్రతీకగా స్వీకరించి,
పింగళి వెంకయ్య- మువ్వన్నె పతాకము మధ్య ఉంచి, సకల జనామోదముగా రూ పొందించాడు.       

*************************; 

4, ఆగస్టు 2013, ఆదివారం

మంకు తిమ్మన కగ్గ- కన్నడ "వేమన" పద్యాలు


తెలుగు భాషలో “మంకు పట్టు” అనే ఒక పదం ఉన్నది. గత దశాబ్దము కిందటి వరకూ ఈ మాట పెద్దల నాలుకల మీద బాగానే ఆడుతూండేది. “అలాగ మంకు పట్టు పట్టకు. పెంకె తనం పనికి రాదు”అంటూ పిల్లలకు బుద్ధి సుద్ధులను గరిపేవాళ్ళు. "పెంకె ఘటం వీడమ్మా!" అంటూ ఆ రోజులలో విసుక్కోవడమూ కద్దు.
అలా “పెంకి పెళ్ళాం” అనే సినిమా కూడా వచ్చింది. 
రాజసులోచన హీరోయిన్, ఎన్. టి. రామారావు హీరో. 
షేక్ స్పియర్ డ్రామా “The Taming of the shrew” అనే కథాంశముతో భారతీయతతో రంగరించి చేసిన తెలుగు సినిమా అది. 
సరే! ఇంతకీ ప్రస్తుతం “మంకు” అనే ఈ పద మీమాంస ఎందుకు వచ్చింది?

*******************

ఆట వెలది అనగానే మనకు ఠకాల్న జ్ఞాపకం వచ్చే కవి “మహా కవి వేమన”.  “విశ్వదాభిరామ వినుర వేమ” అనే మకుటంతో ఛందో బద్ధ శతక పద్యాలలో మకుటాయమానమై ప్రభలీనుతూన్నది కదా. మన తెలుగు కవి వేమన్న- తన పద్యాలలోని పోలికలు నిత్య జన జీవితాల నుంచి గైకొన్నాడు. అలవోకగా అనేక భావలను శ్రోతలకు చిటికెలో బోధ పడేటట్లుగా రాసిన ఆటవెలదులు. అతి సామాన్యమైన పోలికలతో అనంత భావాలను “కొండలను చూపిన అద్దము” వోలె ఉన్నట్టి ఆ చిట్టి పద్దెములు ప్రజల చేత “ఔరా!” అనిపిస్తూ ముక్కుల మీద వేళ్ళు వేసుకునేట్లు చేసినవీ అంటే ఏ మాత్రమూ అతిశయోక్తి కాదు.
"మందగొడి తిమ్మ "/ మందగొండి తిమ్మని తిక్క వాగుడు; పిచ్చి కూతలు/ "Dull Thimma's Rigmarole"; అనే భావార్ధాన్ని కలిగిన కన్నడ మాట మంకు.
సరే! కొన్ని మెరుపు శకలాలు వీక్షిద్దాము.

మధ్య యుగాలనాడు "సర్వజ్ఞ" అనే కవి పద్యాలను పోలినవి ఈ చిట్టి పద్దెములు.
*******************

మన పొరుగు రాష్ట్రమైన కర్ణాట రాష్ట్రములోని “మంకు తిమ్మ” రచనలు కూడా 
వేమన సూక్తులను బోలినవి. 

డాక్టర్ దేవనహల్లి వెంకటరమణయ్య గుండప్ప/ DVG :-

“మంకు తిమ్మ కగ్గ”గా (ಮಂಕು ತಿಮ್ಮನ ಕಗ್ಗ) పిలువబడే పద్యాల గుచ్చాన్ని అల్ల్లినది ప్రముఖ కన్నడ కవి డాక్టర్ దేవనహల్లి వెంకటరమణయ్య గుండప్ప. వీరు డి.వి.జి. (DVG) అన్న హ్రస్వ నామముతో సుప్రసిద్ధులు. కర్ణాటక సీమలో బహుళ వ్యాప్తిలో ఉన్నవి. సమత్వ భావనను జగతికి చాటిన వాక్కులు, కగ్గ పద్దెములు. సంఘములోని మూఢనమ్మకాలను, దౌష్ట్యాన్నీ ఎత్తిచూపుతూ కేవలము పండితులనే కాక పామరులను సైతం ఆకట్టుకున్నవి.

కవి పరిచయము

కృష్ణమూర్తి నాడిగ గారు- బురదలో కూరుకుని మరుగున పడిన సహస్ర దళ నళినములను లోకానికి కరతలామలకం గావించారు. 
తీరా బైటికి తీసాక అవి మామూలు పువ్వులు కావు, అపరంజి పద్మములు- అని తెలుసుకుని, యావత్తు కన్నడ సారస్వత సీమ అచ్చెరువుతో ఆనందంలో ఓలలాడింది. 
అంతటి అద్భుత అమూల్య ముక్తక కౌస్తుభములను కావ్య ప్రపంచమునకు అందించగలిగిన భాగ్యశాలి D.V.G. కి “డాక్టరేట్”ను 1975 లో Karnataka state Government ఇచ్చింది.

అంతేనా! ఆయన అనేక గౌరవ పురస్కారములను అందుకున్నారు.

1974 లో "పద్మభూషణ్ అవార్డు"ను కర్ణాటక ప్రభుత్వం 1974 లో ఇచ్చి, గౌరవించింది. 1970 లో 90 వేల రూపాయల పారితోషికమును రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చి, సన్మానం చేసింది. ఈ మాన్యతా సభ బెంగుళూరులోని "రవీంద్ర కళాక్షేత్ర" లో వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్ర పాటిల్ చేతుల మీదుగా D.V.G. అందుకున్నారు. ఆ నాటి సభాసదులు మరొక మంచి సంఘటనా సరోరుహమును తమ మానససరోరములలో నిలుపుకోగలిగారు.

అదేమిటంటే- D.V. గుండప్ప- తాను పొందిన 90,000/- నూ అప్పటికప్పుడే బెంగుళూరులోని "గోఖలే ఇన్ స్టిట్యూట్" కు విరాళముగా ఇచ్చారు. ("Gokhale Institute of Public Affairs (GIPA) located in Bull Temple Road, Basavanagudi.

1988 లో భారతీయ పోస్టల్ సర్వీసు వారు "stamp of Dr. Gundappa" ను రూపొందించి ఆ మహనీయునికి నివాళులు అర్పించింది. డి.వి.జి.- గా విఖ్యాతి గాంచిన “డాక్టర్ దేవనహల్లి వెంకటరమణయ్య గుండప్ప” మంకు తిమ్మ కగ్గ ప్రోక్త కబ్బములను వెలుగు లోకి తెచ్చి, ప్రాచీన, అర్వాచీన కర్ణాటక సాహిత్య నందన వనములో కొత్త పూల మొక్కలను విరగబూసిన ఘనతను దక్కించుకున్నారు.

****************


మచ్చుకు కొన్ని 'తిమ్మ' నుడువులు చూద్దాము:-


జన్మస్థలి నుండి కడలి వేపు సాగుతూన్న నది- సాంతం :
ధరణిలోని సారములను సంగ్రహిస్తు సాగును:
వసుధకు తన విలువలు కొన్నిటి నిచ్చును: మార్పు పరస్పరం:
మనుజ సంతానపు గుణ విశేషమ్ము లీలాగుననే జరుగును:
పరిణామము పరిధి చాల విస్తృతము తెలియగా!- మంకు తిమ్మ
(412 ముక్తకము)
 *******************

నర నారీ మోహమ్ములు సృష్టించును
కుటుంబమును, వంశమ్మును:
కుటుంబమ్ము కొరకై- గృహము:
తదుపరి ఇరుగు పొరుగు:
ఆ వెనుకనె గ్రామమ్ము-
అటు పిమ్మట దేశములు, సమాఖ్యలున్ను!
(There is only one POD):-
మడుగు కేవలమ్మొక్కటే!
కేంద్రము నుండి ఒక చిరు కదలిక మాత్రమ్మే –
వందలాది అలల వ్యాప్తి అన్ని దిశల కలిగించెను:
ఈ ప్రపంచ / సంసార బిందు రీతి ఇదియే మంకు తిమ్మ!
[406 ]

*******************

జనక తనయ దర్శనమున చపలు డాయె రావణుడు:
కనక మృగ (బంగారు జింక= మాయ లేడి) దర్శనమున జానకియు చపల యాయె!
 జన వాదన తెలిసినదే! నిందింతురు దశకంఠుని, 
కనికరము సీత పైన! మనసు (యోచనల) స్పందన లెటులౌనో 
దుస్సాధ్యము అరయంగా! మంకు తిమ్మ! [383]

*******************

మంకు తిమ్మ కగ్గ పద్యాలలోని మౌలిక లక్షణములు :-

1) అన్నీ 4 లైన్లు/ (చౌపది రచనలు)

2) ఆది ప్రాస- నాలుగు వాక్యాల్లోనూ ఉంటుంది:

తెలుగు ఛందో పద్యములలో మోస్తరుగానే మంకు తిమ్మ పద్య వాక్యాలు నాల్గింటిలోనూ 
ప్రతి రెండవ పదము నాల్గింటిలోనే అదే ఉంటుంది.

3) వీనినే – ముక్తకములు (“ముక్తకగళు”) అంటారు.

4) అంకిత నామము అన్నిటికీ ఒకటే అది- “మంకు తిమ్మ”.
[“విశ్వదాభిరామ వినుర వేమ” – అనే మకుట వాక్యము వేమన పద్యాలలోని నాలుగవ వాక్యము,
 దీనిని పోలినదే – “మంకు తిమ్మ”]

5) 943 ముక్తకగళు:

ఈ అంకెను గమనిస్తారా?!:-

9-4-5=0: 9+4+5=18=1+8=9 :

6) 945 ముక్తకములలో మానవత్వము, మానవ స్వభావాదుల గురించి మంకు తిమ్మ అనేక ప్రశ్నలను లేవనెత్తాడు. వానిలో 595 సూటి ప్రశ్నలున్నవి.

*******************

 ఈ పేరులో ముచ్చటగా మూడు పదములు కలవు.

1) మంకు = మందకొడిగా:

2) తిమ్మ= పల్లెటూరి బైతు- అనే మాట,

ఆధునిక కాలంలో “ఎర్ర బస్సు ఎక్కి వచ్చాడు” అనే వాడుక విసృతంగా వ్యాప్తిలో ఉంది. ఆట్టే లోకజ్ఞానం లేని అమాయకుడు- అని అనవచ్చును (“country Bumpkin”). 
భగవాన్ శ్రీ విష్ణుమూర్తి అనే అర్ధం కూడా ఉంది.

3) కగ్గ = అయోమయం: కాస్త తిక్క ఉన్నవాడు; అలాగే – “వేదాంతి” అనే అర్ధం సైతం ఉన్నది.

ప్రాచీన కన్నడ భాషా పదవల్లరులతో (హళేగన్నడ) గుబాళించిన పూ రేకుల అల్లికలు 
ఈతని "మంకు తిమ్మ కగ్గ" పద్యములు.

#మంకు తిమ్మ కగ్గ- కన్నడ "వేమన" పద్యాలు 
User Rating:  / 2 
Newaawakaaya (web magazine)
Member Categories  - తెలుసా!
Written by kadambari piduri
Wednesday, 03 July 2013 07:50
Hits: 173

30, జులై 2013, మంగళవారం

మెకాలీయులు అంటే ? (లార్డ్ మెకాలే అభిలాష)

మెకాలే విద్యా విధానముబ్రిటీష్ పాలిత ఇండియాలో ప్రవేశ పెట్టబడింది.
ఆంగ్లేయుల పాలనా అవసరాలకు అనుగుణంగా రూపొందించిన లార్డ్ మెకాలే పేరు మీదుగానే ఇది ప్రాచుర్యానికి వచ్చింది. 
మెకాలీయులు: అనే పదం- బ్రహ్మ సమాజము – ఆవిర్భావము తర్వాత వచ్చింది. 

హిందూ మతమును అవహేళన చేస్తూ, పాశ్చాత్య భాషను, ఆంగ్లేయుల సంస్కృతినీ పొగడే వాళ్ళు “మెకాలీయులు” అనే కొత్త తెగ కింద జమ కట్టబడేవారు. ఇంగ్లీషును మాత్రమే కాక ఆ లిటరేచర్ ని మన తూర్పు దేశాల సారస్వత సంపద ఎందుకూ కొరగాదు, ఇది కేవలము నిస్సారము – అనే భావనను ప్రచారం చేస్తూ, భుజాల మీదికి ఎక్కించుకునే వాళ్ళను- అంటే స్వజాతిని ద్వేషిస్తూ, వెస్తెర్న్ కల్చర్ ను త్రికర్మణా ఆరాధిస్తూండే వర్గీయులకు -మెకాలీయులు అనే పద నిర్వచనము ఏర్పడింది.
*******,

వాస్తవానికి  Lord Meculyని - నీతి నిజాయితీలు పరిఢవిల్లుతూన్న - మన భారతీయసమాజము ఎంతో ఆకర్షించింది.లార్డ్ మెకాలే  హిందూ సంస్కృతినీ, విద్యా విధానములనూ ప్రశంసించాడు.
వెస్టర్న్ దేశాలలో- ప్రవేశ పెట్టడము అభిలషణీయ విధానముగా పేర్కొన్నాడు.
మెకాలే Eduction System వలన కొన్ని లొసుగులు ఏర్పడినవి. 

ఐనప్పటికీ కొన్ని ఉపయోగాలు కూడా కలిగినవి.
*************************************;

అప్పటికి మన దేశములో అనేక మూఢాచారములు వ్రేళ్ళూనుకున్నవి. 
మూఢ విశ్వాసాలు లేనట్లైతే మన హిందూ సమాజము 
అత్యున్నత శిఖర స్థాయిలో ఉంటుందని- మేధావులు గ్రహించారు.
ఫలితంగా రాజా రామ మోహన రాయ్, ఈశ్వర చంద్ర విద్యా సాగర్ మున్నగు వారు, 

దక్షిణాదిన కందుకూరి వీరేశలింగం, సుబ్రహ్మణ్య భారతి మున్నగు వారు 
సమాజ వ్యక్తుల దుష్ట భావాలకు ఎదురీత ఈదుతూ సంఘములో మార్పులు తేవడానికి శ్రమించారు.
వివేకానందుడు, దయానంద సరస్వతి, శ్రీరామక్రిష్ణపరమహంస వంటి వారు 

ఔత్తరాహ సీమలలో ప్రజలలో పరివర్తన తీసుకురావడానికై అహరహమూ పరితపించినారు.

*************************************;

మెకాలే విద్యా విధానమునే మనము ఈ నాడు అనుసరిస్తున్నాము. 
ఇందులోని లోపాలను సరిచేసుకుంటూ, ముందుకు సాగడమే మన కర్తవ్యం.
ఇప్పటి విద్యావిధానము సారస్వత జననికి ఇస్తూన్న చెమ్కీదండల వంటిది.

మరింత మెరుగులు పరుచుకొని, పరిమళభరిత విరి మాలికలుగా మార్చుకోవడము, ఏమంత కష్టమైన పద్ధతి కాదు. తరుణోపాయాలను అందిపుచ్చుకొని, సంఘములో ఎల్లరు సుఖపడే రీతిగా, కుల మతాలకు అతీతంగా- సమతా రాజ్య నిర్మాణమునకు సోపాన పంక్తులుగా విద్యావిధానాన్ని మేల్తరమ్ముగా తీర్చిదిద్దుకో వలసిన బాధ్యత పౌరులకు ఉన్నది.
*************************************;

లార్డ్ మెకాలే అభిలాష :- (Link)

21, జులై 2013, ఆదివారం

చేవ్రాళ్ళు, వేలిముద్రలు - ఇవే లేకపోతే?

పత్రాల పైన, ధన సంబంధ కార్యాలు, పెళ్ళిళ్ళూ, పబ్బాలూ, వీలునామాలు; 
అంతెందుకు, ఓటు హక్కు వినియోగము చేసుకోవాలన్నా కూడా ఏది అవసరమౌతుంది? 
ప్రోనోటు వ్యవహారాదులకూ, గుర్తింపు & రేషన్ కార్డుల పైనా ఉంచాల్సినది ఏమిటి? 
ఉలిక్కిపడకుండా చెప్పేయగలరు కదా!  

జవాబు: "చేవ్రాలు". అదేనండీ. సంతకము! 
దీనికి జతగా తటాలున మనకు స్ఫురించేది "వ్రేలి ముద్రలు". 
*******************************,
;
;
ఫింగర్ ప్రింట్స్ ఎవరికైనా అసలే లేకపోతే?
ఆ స్థితిని "అడర్మటోగ్లైఫియా" అని శాస్త్రజ్ఞులు ఓ నిర్వచనాన్ని అనుగ్రహించేసారు. 
(Adermatoglyphia = no finger prints due to a genetic defect. అడర్మటోగ్లైఫియా Link)

2007 లో ఇమ్మిగ్రేషన్ అనుమతి జారీ చేసేటప్పుడు, అమెరికా వీసా అధికారులకు ఒక చిత్రమైన పరిస్థితి ఎదురైనది. చూడచక్కనైన ఒక స్విస్ వనితకు యు.ఎస్. లోనికి పర్మిషన్ ఇవ్వాలా? వద్దా? అని వారు కిందుమీదైనారు. ఎందుకంటే, ఆ స్విట్జర్లాండ్  స్త్రీ చేతి వేళ్ళకు అసలు "వ్రేలి ముద్రలు" లేనే లేవు. 
ఈ సంగతి- సైన్సు ప్రపంచము దృష్టిని అటు మళ్ళించింది. 
(స్విట్జర్లాండ్ లేడీ వీసా పర్మిటు ఇవ్వడానికి, పుట్టుమచ్చలు వగైరా 
ఇతర అంశాలను పరిగణనలోకి  తీసుకొనవలసి వచ్చినది.)

ప్రపంచంలో ఈలాగున ఫింగర్ ప్రింట్సు లేని కుటుంబాలు నాలుగు మాత్రమే ఉన్నాయి. 
అదీ వింత!
*******************************,

సరే! వేళ్ళతోనూ, చేతులతోనూ సంభాషించే సిస్టమ్ లు కూడా డెవలప్ ఐనవి. 
పది హాండ్ జెస్టర్సు  పేర్లు ప్రస్తుతము చెప్పుకుందాము.

TOP 10 Most Irritating Hand Gestures  (చేతి సందేశాలు): 
1) Inverted commas 
2) Talk to the HAND 
3) None of your business
4) Blah! Blah! Blah!
5) Pistol
6) Hand punching
7) I am watching you!
8) Call me
9) Fake Yawn
10) kut trot

పది రకాల చేతి సందేశాలు:

1) Using your fingers to make "Air Quotes".
2) Talk to the Hand.
3) Tapping the side of your nose to say "none of your business." (This might be a British thing.)
4) Blah Blah Blah. That's when you open and close your hand like a mouth.
5) Finger Guns.
6) Hand Punch: You hit your palm like you're getting ready to fight.
7) Pointing to your eyes and then another person to say "I'm watching you."
8) Call Me: Making your hand into a fake phone.
9) Fake Yawn.
10) Throat Slash.

ఈ కర, అంగుళీ కౌశల ముద్రలు ఐఫోన్ ఆప్, గూగుల్ లలో కూడా లభిస్తూన్నవి.  

సాంప్రదాయక నృత్యాలలోనూ, యోగముద్రలలోనూ హస్త, అంగుళీ విన్యాసాల  సంఖ్య అపరిమితమే!  

యోగముద్రలు

గణేశ: కుబేర: గరుడ: లింగ: కాళేశ్వర్: అంజలి: బుద్ధి: జ్ఞాన: ధర్మ చక్ర: హాకిని: అపన: లింగ: ముకుళ: ఇత్యాదులు ఉన్నవి. 

నాట్యముద్రలు

నర్తనములలోని కర, నేత్ర అభినయ ప్రాధాన్యతలు సాంప్రదాయ కళాభిరుచి, పరిచయాలు కలిగిన వాళ్ళకు తెలిసి ఉంటా యి. పతాక ముద్ర: త్రి పతాక: అర్ధ పతాక: చంద్ర: మయూర; ఉత్పల: త్రిశూల ముద్రాదుల వంటి అనేక రకములు ప్రేక్షక మనోరంజకములై ఉన్నాయి.
;
లింక్ ఫర్ essay: web magazain

చేవ్రాళ్ళు, వేలిముద్రలు - ఇవే లేకపోతే?   Member Categories - తెలుసా!Written by kusumaFriday, 08 March 2013 04:34Hits: 203

23, మే 2013, గురువారం

మంచు మనిషి "యతి"



ఆకాశమంత ఎత్తు ఉన్న మంచు మనిషి పేరు "యతి".  
మరైతే ఈ హిమ మనుష్యుని దేశ కాల చరిత్రలు ఏమిటి?

ఈ మంచు మానిసి మన భారతదేశానికి ఉత్తర దిక్కున కిరీటంలాగా ఉన్న హిమాలయ సంచారి. 
"యతి" అంటే హిమాద్రి శిఖరములలో తారట్లాడుతూ ఉండే ఆదిమ వానరము.
ఇది మనిషికి పూర్వము ఉన్న గొరిల్లా. యతి అప్పుడప్పుడూ హిమాలయాలలో నడిచి వెళ్ళే వారికి కనపడుతూండేది. భారీ ఆకారము, అతి పెద్ద కాలిముద్రలు సాక్ష్యాలుగా చెబుతారు. ఇట్టే కనిపించి చిటికలో మాయమయ్యే "YETI" అనేక ఊహాగానాలను ప్రోది చేసింది. 
తద్వారా అనేక ఫిక్షన్ నవలలు, సైన్సు కథలూ, రచనలూ, ఫిల్మ్లూ వచ్చాయి.

ఈ హిమ మానవుడు హీరోగానూ, విలన్ గానూ సాహిత్యములో వెలిసాడు. కథతో సినిమాలను కూడా తీసారు. 
1957 లలో విడుదల ఐన The Abominable Snowman / The Abominable Snowman of the Himalayas) అనే మూవీ వానిలో ఒకటి. బ్రిటీష్ హారర్ సినిమా ఇది. 
"ది అబోనిమల్ స్నో మాన్" ("The Abominable Snowman") అనే చలనచిత్రం 1957 లలో వచ్చింది.

**************

బాల జగత్తుకు సరి కొత్త ప్రపంచాన్ని అందించిన మేధావి వాల్ట్ డిస్నీ. ఆతని డిస్నీ లాండ్ లోకవిఖ్యాతమైనది. వాల్ట్ డిస్నీ దృష్టిని ఆకర్షించింది కైలాస పర్వతమైన హిమాలయ పర్వతములు. వాల్ట్ డిస్నీ అద్భుత సృజనాత్మక దృశ్యాలలో "హిమాలయ శిఖరము" ఒకటి. ప్రపంచములో ఎత్తైన పర్వత శిఖరములు హిమాలయాలు. దీని నిర్మాణ దక్షత అతనికే చెల్లింది.

"హిమాలయ ఎక్స్ పెడిషన్"; ది టెంపుల్ డు పెరిల్ - రోలర్ కోస్టర్ లను తయారీలో అనేకమంది టెక్నీషియన్ లూ, శిల్పకళాకారులూ, డిస్నీ ప్రత్యేక శ్రద్ధ మూలస్తంభాలు. ఆసియా విభాగంలో “హిమాద్రి ని సృజించాడు. దీని నిర్మాణానికై కోట్ల డాలర్లను వెచ్చించేందుకు వెనుకాడ లేదు. 2006 లో నెలకొల్పిన ఈ Mount Everest; మౌంట్ ఎవరెస్ట్ లో అదనపు అట్రాక్షన్ “యతి”.


డిస్నీలాండ్ లోని ఆసియా విభాగములో హిమాలయాలు, యతి ముఖమైనవి. ప్రధానమైనది. వాల్ట్ డిస్నీ ఈ హిమ సంచార వానర జీవి స్వరూప, స్వభావాలను జిజ్ఞాసతో స్టడీ చేసాడు. ఆయనను యతి ఎంతగా ఆకట్టుకున్నదంటే – అదే పేరుతో "యతి మ్యూజియం" ను పెట్టాడు. 
“Yeti Museum" లో యతి ని గురించిన ఆసక్తికరమైన విశేషాలను, యతి అడుగుజాడలు, పాదము యొక్క మౌల్డ్ మూసను పెట్టారు. భారీ యతి బొమ్మ – నిజంగానే అక్కడకు గొప్ప గొరిల్లా జంతువు వచ్చినట్లు అనిపిస్తుంది. 
"హిమాలయ ఎక్స్ పెడిషన్"; ది  టెంపుల్ డు పెరిల్ - రోలర్ కోస్టర్ (The Temple du Péril) గిన్నీస్ రికార్డులకు చేరింది.

హిమాలయ పర్వతాలను కాపలా కాస్తుంది "బృహదాకార మంచు మనిషి. 
అతనే "యతి" ("Yeti"). ఇది కాకలు తీరిన ఇంజనీర్లు 6 సంవత్సరములు చేసిన నిరంతర కృషి ఫలితము.  డిస్నీ జంతు ప్రపంచము (Disney Animal Kingdom) ప్రపంచంలోని ఆబాలగోపాలానికీ ప్రధాన ఆకర్షణ.

*********************;
మంచు మనిషి "యతి"   (1)
మంచు మనిషి "యతి"  (2)  

Member Categories - తెలుసా!
Written by kadambari piduri
24 April 2013  
Add new comment
Hits: 168 

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...