7, మే 2009, గురువారం

పలుకుల తాయిలాలు


పలుకుల తాయిలాలు ;





మామిడీ చిగురుల
కొమ్మల పయిన
కోకిల వాలినది!
(ప్రశ్న) ;;;;;
"ఏమే కోకిల !
కిల కిలల పిల్లలకు 
ఏమి తెస్తివి?"

2)"జామ తోటలనుండి
ఉల్లాసముగా వచ్చే 
పంచవన్నెల చిలకా!
మా కేరింతల పాపలకు 
ఏమి తెస్తివి?"

(జవాబు) ;;;;;
కిల కిలల పాపలకు 
కేరింతల పిల్లలకు 
కమ కమ్మని గానములను,
తియ తీయని పలుకుల
తాయిలమ్ములను మేము
పదిలముగా తెచ్చాము
గైకొనండి,ప్రేమతో!
ఇవిగో! ఇవిగివిగో!
"కుహు కుహూ!
కిల కిలా!.......... 

4, మే 2009, సోమవారం

కాంచన గుహలో శ్రీ కురు మూర్తి స్వామి వారు


'''''






కాంచన గుహలో శ్రీ కురు మూర్తి స్వామి వారు 
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;  
1)అమ్మ పురము గ్రామము
(మహబూబ్ నగర్ జిల్లా,చిన్న చింత కుంట మండలం)లో
"కురుమతి"గా ప్రసిద్ధి గాంచిన గుహ, 
చాలా చల్లని ఆహ్లాద కరమైన వాతావరణము 
నెలకొని ఉన్నట్టి ప్రదేశము "కాంచన గుహ". 

2)కుబేరునికి అప్పును తీర్చే ప్రయత్నముతో,
శ్రీ వేంకటేశ్వర స్వామి వారు,పద్మావతీ దేవితో బయలు దేరారు.
మార్గ మధ్యములో (ఆత్మకూరు పట్టణానికి దగ్గరలో ఉన్న)
కృష్ణా నదిలో స్నానము చేయ saaగారు. 

3)లోక జననీ జనకుల పాదాలు కందకుండా ఉండుటకై 
క్రిష్ణమ్మ ఉద్దాలు కానుకగా ఇచ్చినది. 

[ఉద్దాలు= పాద రక్షలు ]

4)అమ్మవారితో అయ్యవారు ఆ గుహలో కొలువైన 
శుభముహూర్తమున ప్రతి సంవత్సరము వేడుకలు జరుగుతాయి.
అనగా,"కార్తీక శుక్ల పంచమి రోజున అలంకార ఉత్సవము, 
అలాగే సప్తమి రోజున "ఉద్దాల ఉత్సవము" జరుగుతాయి. .

5)ఇరువది రోజులు నేత్ర పర్వముగా
" శ్రీ స్వామి వారి ఉత్సవములు" జరుగుతూ ఉన్నాయి. 

6)శ్రీ తిరుమల బుక్క పట్టణం బుచ్చి వేంకటాచార్యులు రచించిన గ్రంధము
"వేంకటాచల మహాత్మ్యము". 

"అమ్మపురము కురుమూర్తి స్వామి గాధల" విపులీకరణలు 
"ఉత్తర వేంకటాచల మహాత్మ్యము "లో కలవు.

7)శ్వేతాద్రి,ఏకాద్రి,దుర్గాద్రి,ఘనాద్రి,భల్లూకాద్రి,పతగాద్రి,దేవలూద్రి"
అనే ఏడు కొండల పైన శ్రీ కురు మూర్తి స్వామి వారు శ్రీ లక్ష్మీ దేవితో కొలువై ఉన్నారు.

8)కురుమూర్తి రైల్వే స్టాషను నుండి"అమ్మా పూరు" గ్రామము 7 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. కొత్త కోట నుండిదుప్పల్లి మీదుగా 20 కిలో మీటరుల లోపే (బస్సు రూటు)అమ్మా పురము ఉన్నది. 9)కురుమూర్తి రైల్వే స్టేషను 
(A)కర్నూలుకు వెళ్ళే రూటులో,
మహబూబు నగర్ కు 50 కిలో మీటర్లు దూరములో ఉన్నది.
(B) దేవర కద్ర,కాకుంట్ల మీదుగా కురుమూర్త్ ని చేర వవచ్చును. 
(C)కొత్త పల్లి &వ నెంబరు మైన్ రోడ్డుపై ఉంది.
తిరుపతిలో వలెనే "శ్రీ కురు మూర్తి స్వామి వారు" 
సప్త గిరీ మధ్యమునందు కొలువు తీరి ఉన్నారు.
''''''''

కుశీ లవులు





Telusaa!

కుశీ లవులు ;;;

శ్రీ మద్రామాయణములో మహర్షి వాల్మీకి
 శ్రీ సీతా రాముల తనయులను "కుశీ లవులు" అనియే వ్యవహరించెను.

"తస్య చింతయమానస్య ,
మహర్షే ర్భావితాత్మనః :::
అగృహ్ణీ తాంతతః 
పాదౌ ముని వేషౌ కుశీ లవౌ"


వాల్మీకి మునీంద్రుని దృష్టిలో, 
రఘువంశ తిలకులైన ఈ కవల పిల్లలలో "కుశుడు" మొదటి వాడు
 కావున కుశుడే 'అన్నయ్య '
 అలాగే చిన్నవాడు లవుడు తమ్ముడు ఔతాడన్న మాట !!!


'''''''

షెరిడన్ ఫార్ములా ;(రావి వెంకటాచలం )






షెరిడన్ ఫార్ములా ;;;;;

 kadambari piduri

రావి వెంకటాచలం "77 ఏళ్ళ నాటకానుభవం " అనీ ,
తన జీవిత కథను రచించారు.

నాటక రంగంలో అనేక మణిపూసల వంటి నటులతో 
ఆయన చేసిన కృషి ఈ పుస్తకంలో ఆద్యంతమూ ఆకట్టుకుంటుంది.

స్వాతంత్ర్య సమరం జరుగుతూన్న రోజులలో 
మన నాటక రంగములోని అనేక అంశాలను
పాఠకులు తెలుసుకుని ఆశ్చర్య చకితులౌతారు.

ఇటీవల విశాఖ పట్టణములో ఓ నాటక దర్శకుడు
 "బుడ్డి చూపిస్తే గానీ రిహార్సల్సు కూడ పడవు చెలం గారూ!" అన్నాడు. 
త్రాగుడు దుర్వ్యసనం, రావి చలం ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. 
ఆయన మద్య పానాన్ని ఖండించారు.

 దానికి ఆ విశాఖ వాసీయ డైరెక్టరు డైరెక్టుగా ఇలా అన్నారు
"త్రాగుడు ఎలాంటి వ్యసనమో నాటకం కూడా అటువంటి వ్యసనమే! 
అంతకన్నా ఘాటైన వ్యసనమే!మీరన్నట్లుగా మానుకోవడం ఎలా?"

ఈ సఘటనను తెల్పుతూ 
చెలం అలనాటి ఫార్ములా 
నాటక సమాజాలలో వాడుకలో ఉన్న విషయాన్ని
 సందర్భానుసారంగా విపులీకరించారు.

"ఔత్సాహిక నాటక రంగాన్ని
మద్యపాన దుర్వ్యసనం ఎలా ఆవహించిందో అర్ధం కాదు. 
పరిషన్మహా సభలలో చూస్తూ ఉంటాను. 
నాటకానంతరం 'మందు సీసాలతో' విందు చేసుకుని ఆనందిస్తూంటారు.
నాటకారంభంలో హుషారు కోసం కొందరు, 
నాటకానంతరం జల్సా కోసం కొందరు ఇలా ...."షెరిడన్ ఫార్ములా"ని ఆచరణలో పెడతారు.

షెరిడన్ ఐడియా తట్టకుంటే మందుగా ఒక పెగ్గుnu, 
తట్టితే ప్రజు(prize)గా ఒక పెగ్గు వేసుకొనే వాడట! మరి తాగని దెప్పుడు?

220 పేజీల ఈ పుస్తకం, 
వివిధ రంగాలలోని నిష్ణాతులైన మహనీయుల ఆత్మ కథా రచనలకు కరదీపిక. 

నాటకరంగంలో సురభి కళా కారులు మున్నగు వారిని ప్రోత్సహించి,
తమ తమ జీవిత కథలను రాయించవలసిన అవసరము ఉన్నది. 
ఇంకా ఆలస్యం చేస్తే ఆయా కళాకారుల అమూల్య అనుభవాలు వెలుగులోకి రాvu.

2, మే 2009, శనివారం

ఉంటే ఎందుకు కాదంటానూ!

Pramukhula Haasyam

ఉంటే ఎందుకు కాదంటానూ!


పిల్లల అల్లరి మిక్కుటంగా ఉండటంతో భరించలేక
 వేదుల వారు ఉత్తరీయాన్ని విదిలించి నిలబడ్డారు.
రామాయణాది గ్రంధాలను సర్ది పట్టుకుని గబగబా మేడ మీదకు వెళుతున్నారు.


"వేదులా! పైకి వెళ్ళొద్దు!" అన్నారు విశ్వనాధ సత్యనారాయణ.
 అసలే చికాకుతో ఉన్న వేదుల మరింత చిరాకు పడుతూ,
 రుసరుసలాడుతూ అన్నారు 
"ఏం ! పైన పిచ్చాసుపత్రి గానీ ఉన్నదా?"


"ఉంటే మిమ్మల్నెందుకు కాదంటానూ!" అని తాపీగా అన్నారు విశ్వనాధ.

Views (98)

గులాబీ మహారాణి

Baala

గులాబీ మహారాణి ;

By kadambari piduri, Jan 23 2009 7:05PM
గులాబీ! గులాబీ ! 
పూలలోన " రా రాణి"! //

1)వన్నె ,చిన్నెలను చిమ్మి
" రాణువ" కెక్కెను ,తాను! 
పువు - రేకు లందు 'విడిది' చేసి 
సొగసులన్ని "రాణించెను" //


2)ఇంతితవి ఆ గులాబి దళాలు 
ఇంతింతని వర్ణనలు చాలవు 
మన - గులాబి రాణి అంలులన్ని!
వెన్నెల ఇందే "బస" చేసినదండీ! //


3)వాన చినుకుల పిల్లల్లారా!
ఇంద్ర ధనుసుల బాలల్లారా!
త్వరగా రండి!
రేకు, రేకున 
రేకులలోన,
రేకుల వెనుక
అందందున దాగి ,
ఆడండీ! ఆడండీ!
"దో బూచీ!""దో బూచీ!"
Views (45)

నటనల లీలలు

నటనల లీలలు   ;

పద గతి ఇది-స్వర లయ మది
ముదమతి గొని,
వరమీయమనీ
నీ చరణ శృతి చప్పుడు విని
గప్ చుప్ గా దాగేనని ఎటనో అని 
"మా మురిపాల 
బాల కన్నయ్యదే కదకఈ ఉనికి"అనీ

సవ్వడి తరి 'ఇవ్విరి వని'
విచ్చేసిన అగణితమౌ
వనితలదీ బహు సందడి
దడబిడగా గడ బిడ ఇది!

లే జవ్వని మువ్వల జడి-గువ్వల సడి
చిలకల,శుక 'కిళి కిళి'-
చివురుల ఒడి కిల కిల మని 
మరి మరి మరి ఒలికిన తఱి 
నిన్నటి దాకా -మౌనాంకిత బృందా వని!
నే్డేమో నిలువెల్లా సౌదామిని
ఇలాగిలాగీలాగున గిలిగింతలు ఈ ఇలకు!
అహహాహాహా! ఆహాహాహా ! 


అది కని,కని చకితంబై-యామినిలో 
యమునా నది తరగలపై
'వెన్నెల చలి కిరణమ్ముల కలముల'తో
వ్రాసెనులే నీలి నింగి
నవ్య లాస్య విలాస లాస
హావ భావ నాట్య చలన నర్తన లయ
ఝళం ఝళన ఘటిత ఘటన నట వేదము!
శ్రీ బాల కృష్ణ!నీ క్రీడా సంరంభము
మాకందిన పారిజాత మకరందము
ఇల, భక్త కోటి కొసగినట్టి 
సాహితీ కల్ప తరుల సౌరభములు! 


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

(చేతన -సెప్టెంబరు 2007 ప్రచురణ)
Views (61) |  ;

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...