29, మార్చి 2014, శనివారం

బ్లాంక్ చెక్ - వంద రూపాయలు

సమాజములోని అన్ని వర్గాలవారితో శరత్ చంద్ర చటోపాధ్యాయ్ స్నేహంగా మెలిగాడు. దేశబంధు చిత్తరంజన్ దాసు శరత్ బాబు సన్నిహితులలో ఒకరు. ఆయన పాలిటిక్సు పరంగా ప్రఖ్యాతి గాంచాడు.అయితే స్నేహ హస్తమును చాచిన సందర్భాలు ఇక్కడ- అనగా శరత్ చంద్ర జీవితగాథలో మనకు అగుపిస్తాడు. 
'శరత్ చంద్ర చటోపాధ్యాయ్ నాస్తికుడు' అనే జనాభిప్రాయము విస్తృతముగా ఉంది.

ఒకసారి దేశబంధు చిత్తరంజన్ దాసు శరత్ బాబుకు రాధాకృష్ణుల ప్రతిమను బహూకరించాడు. ఆ విగ్రహాన్ని శరత్ చంద్రుడు బహు భద్రంగా అట్టిపెట్టుకున్నాడు. అంతే కాదు! ఆ రాధాక్రిష్ణ విగ్రహమునకూ నిత్యమూ అర్చనలు చేసేవాడు. దేశబంధు చిత్తరంజన్ దాసు స్వాతంత్ర్య సమర కాలమున సర్వ విదితుడు. ఆయన భోగి, త్యాగి, యోగి కూడా! కొద్దిమంది మాత్రమే ఆతనిని కథకుడు, రచయితగా గుర్తెరిగి ఉన్నారు. "సాగర సంగీత్" (Sagar sangeeth) అనేగ్రంథాన్ని దేశబంధు చిత్తరంజన్ దాసు రచించారు. ఆయన ఒక పత్రికను నెలకొల్పారు కూడా. "నారాయణ" అనే ఆ పత్రిక అధిపతిగా దేశబంధు చిత్తరంజన్ దాసు అనేక బాధ్యతలను నిర్విరామముగా నిర్వర్తించేవారు.

"మా పత్రికకు ఒక కథను పంపించండి" అంటూ శరత్ చంద్ర చటోపాధ్యాయ్ ను కోరారు. దేశబంధు చిత్తరంజన్ దాసు కోరికపై శరత్ చంద్ర రాసి పంపించిన కథ పేరు "స్వామి"("swami"). 
ఆ కథను చదివిన చిత్తరంజన్ దాసు అమందానందకందళిత హృదయుడే ఐనాడు. 
ఆయన శరత్ చంద్ర చటోపాధ్యాయ్ కి ఒక "బ్లాంక్ చెక్" ను పంపించాడు. చెక్కుతో పాటు ఒక ఉత్తరమును రాసి పంపించాడు - "మహోన్నతమైన ఒక రచయిత నుండి ఒక గొప్ప కథను నేనీనాడు సంపాదించాను. 
చిత్తరంజన్ దాస్దాని విలువ కట్టే సాహసమును చేయలేను. అందుచేత ఈ ఖాళీ చెక్కును మీకు పంపిస్తున్నాను. మీ రచనకు మీ ఇష్టం వచ్చినంత మొత్తమును వేసుకుని మార్చుకొనవచ్చును."

శరత్ బాబు తనకు తోచినంత ధనాన్ని, ఎంత డబ్బునైనా- చెక్కులో రాసి, తీసుకోగల అద్భుత అవకాశం అది. ఎందుకంటే చిత్తరంజన్ దాసు పత్రికాధిపతి మాత్రమే కాదు, ఆ దేశబంధు- రెండు చేతులా ఇబ్బడిముబ్బడిగా ఆర్జిస్తూన్న వకీలు కూడా! ప్రఖ్యాతి గాంచిన లాయరు అతడు. కానీ శరత్ చంద్ర చటోపాధ్యాయ్ కేవలము నూరు రూపాయలకు మాత్రమే చిత్తరంజన్ దాసు ఇచ్చిన చెక్కుతో మార్చుకున్నాడు.

అటు దేశబంధు చిత్తరంజన్ దాసు, ఇటు శరత్ చంద్ర ఛటోపాధ్యాయల సంస్కార, అనుబంధాలకు ఎత్తి పట్టిన మణి దర్పణము ఈ సంఘటన.

@@@@@

(Sarat chandra Chatopadhyaya (15 sept 1876 - 16 Jan 1938) 

బ్లాంక్ చెక్ - వంద రూపాయలు  
(Link- new awa, web Magazine)
User Rating:  / 2 
Member Categories  - తెలుసా!
Written by kadambari piduri
Saturday, 15 March 2014 16:33
Hits: 206
{55342- }

11, మార్చి 2014, మంగళవారం

విశ్వనాథుని "త్రిలింగాలు"!

“త్రిలింగ విద్యా పీఠము” విజయవాడలో సాహిత్యకార్యక్రమాలను నిర్వహించే సంస్థ. 
ఆ సంస్థ ప్రోగ్రాములకై ఆర్ధిక సహకారమును అందించే వదాన్యులు చుండూరు వెంకట రెడ్డిగారు. అలాగే పాలనాది నిర్వహణలను ఎప్పటికప్పుడు పరిశీలించే కార్యదర్శి – కాంచనపల్లి కనకాంబ గారు. దండు సుబ్బావధానిగారు విద్యా బోధన చేసే ప్రధాన ఆచార్యులు. అక్కడ విద్యా విషయిక అంశాల ప్రధానాచార్య ఉపాధ్యాయులు. కార్యక్రమాలకు, పాల్గొన వలసిన వారికి, అతిధులకు త్రిలింగ సమాజ సభ్యులు ఇన్విటేషన్సును పంపించే వారు. ఒకసారి- త్రిలింగ విద్యా పీఠము సంస్థ తరఫున కవిసమ్మేళనమునకు దండు సుబ్బావధానిగారు కూడా ఆహ్వాన పత్రికలను పోస్టు చేసారు. ఐతే చిన్న పొరపాటు, ఎక్కడో ఏదో పొరపాటు వలన జరిగింది. అదేమిటంటే – ఒక ఉద్ధండ పండితునికి అసలు లేఖ వేయడమే మరిచారు ఆయనే కవి సామ్రాట్ బిరుదాంకితులు జగమెరిగిన పుంభావసరస్వతి శ్రీ విశ్వనాధ సత్యనారాయణ.

ఐనా సరే! సాహిత్య మమకారముతోటి పిలువని పేరంటానికి వెళ్ళారు విశ్వనాధ సత్యనారాయణ. అక్కడికి వచ్చిన విశ్వనాధ సత్యనారాయణగారిని చూసి, స్వాగతం పలికారు త్రిలింగ విద్యా పీఠము సభ్యులు.అసలే ముక్కు మీద కోపం విశ్వనాధ వారికి. సభ్యులకు ఇప్పటికీ జరిగిన పొరపాటును గురించిన గమనిక కలగలేదు. 
అందరూ ముందస్తుగా “శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారూ! మీరు ప్రసంగించండి.” అంటూ అడిగారు.

కనీసం సభా కార్యక్రమాలలో ఐనా తన నామాక్షరములు కలికానికైనా కనిపించ లేదు కదా! అవమానము వలన విశ్వనాధ ఆగ్రహంతో ఉక్కిరిబిక్కిరి ఔతూన్నారు. కవిసామ్రాట్ లేచి నిలబడ్డారు. మైకు దగ్గర నిలబడ్డారు, అటూ ఇటూ చూసారు. అంత రౌద్రంలోనూ పాండితీ ప్రకర్ష బాణసంచాలా రవ్వలను విరజిమ్మింది. 
“ఇది త్రిలింగ విద్యా పీఠం….”అన్నారు. ఆనక తారాజువ్వల్లా రెండే వాక్యాలను తన వాక్కులలో వేసారు ముక్తసరిగా. ఈ చుండూరు వెంకట రెడ్డి పుంలింగం, కాంచనపల్లి కనకాంబ స్త్రీ లింగం, దండు సుబ్బావధాని నపుంసక లింగం.”అని క్లుప్తంగా అనేసి గబ గబా వెళ్ళి రుసరుసలతో వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు.

శ్రోతలు అవాక్కయ్యారు. కొన్ని సెకండ్లు సభలో నిర్ఘాంత పడిన ప్రేక్షకుల మౌనంతో వాతావరణం కొన్ని లిప్తలసేపు నిండిపోయింది. ఆ తర్వాత సభాసదులందరికీ కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ వాక్కుల శ్లేషలోని హాస్యం సుబోధకం ఐంది. 
"అసలేమి జరిగిందో!" – అనుకుంటూ ఆహూతులు యావన్మంది నవ్వులతో పరిసరములు ప్రతిధ్వనించినవి. తర్వాత వాకబు చేసుకుని జరిగిన మిస్టేకుకు నాలిక కరుచుకున్నారు నిర్వాహక వర్గం వారు.

ఈ పట్టున కవి సామ్రాట్ వారి కోపాన్ని పూర్తిగా సమర్ధించలేము. 
ఎందుకంటే వ్యక్తిత్వములో అంతర్లీనంగా ఉండవలసిన అంశము ధృతి, ఆత్మ సంయమనం, ఆత్మ నిగ్రహము. శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు ఆర్ష ధర్మాన్ని అమితంగా ఆరాధించిన మహా మనీషి. ప్రాచీన సంస్కృతిని చాటే భావజాలము ఆయన రచనలకు పునాదులుగా నిలిచిన దోహదములు. మరి చిన్న విషయాలకు ఆగ్రహముతో ప్రతిబింబించే ప్రవర్తన ఏమంత సంభావ్యం కాదు. ఆ సభను ఏర్పాటు చేయడానికి నిర్వాహకులు ఎంత కష్టపడి ఉంటారు?- అనే కోణంలో ఆలోచించవలసిన వ్యక్తి ఆయన.

ఏదెలాగున్నా అనన్య ప్రజ్ఞా ధురీణులు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ. పాండితీ ప్రకర్షకు మారుపేరు ఆయన. ప్రతి సందర్భములోనూ కవి సామ్రాట్ ఈ రీతిగా రియాక్టు అవడము వలన - సాహితీ బృందావనాన అగణిత చమత్కార పారిజాతాలు విరబూసినవి.
కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ; (సెప్టెంబర్ 10, 1895- 18 అక్టోబర్ 1976)

@@@@@


1
విశ్వనాథుని "త్రిలింగాలు"!  (Link for Essay- web mag- NewAwa)
User Rating:  / 3 
Member Categories - ప్రముఖుల హాస్యం
Written by kadambari piduri
Thursday, 20 February 2014 04:43
Hits: 197

*********@@@@@*************,

55155 wieus; కోణమానిని; 
Another Essay, in my Blog "Konamanini 2009 April" (Link) 

నందమూరు (ఉంగుటూరు) ;శోభనాద్రి;విశ్వనాథ సత్యనారాయణ 

24 ఎప్రిల్ 2009 శుక్రవారం

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...