14, ఏప్రిల్ 2012, శనివారం

కింటూరు లో ప్రకృతి అద్భుతము


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

;














మహాభారత కాలము నాటి చెట్టు అది
ఈ"పారిజాత తరువు" కుంతీ మాత చితాభస్మమునుండి ఉద్భవించినదని జన విశ్వాసము.
అనేక కథలు, లెజెండ్సు (legends) ప్రచారంలో ఉన్నవి. 
ఒక కథ ప్రకారం:-
పారిజాత పాదపమును అర్జునుడు, 
స్వర్గసీమనుండి తీసుకువచ్చాడు. ఆ చెట్టు కు పూచిన పూలతో- 
కుంతీ దేవి ప్రతి రోజూ పరమేశ లింగమును అలంకరించి, అర్చనలు చేసినది.
ఇంకొక కథ:- మన అందరికి తెలిసినదే!
ముక్కు తిమ్మనార్యుని రచన "పారిజాతాపహణము".
ముద్దుల భార్య సత్యభామ కోసమని, సురేంద్రునితో  పోట్లాడి,పోరాడి ధరణికి తెచ్చి, 
ఆ పారిజాతం చెట్టును, సత్యభామ ఉంటూన్న భవంతి ఆవరణలో నాటించాడు 
లీలావినోది, వేణుగానలోలుడు శ్రీక్రిష్ణమూర్తి. 
ఐతే ఈ రెండు కథలలో నేపథ్యమును అందరూ గమనించగలరు.
అది ఏమిటంటే- భారతదేశములో- 
విదేశాల నుండి తరు సంపద, జంతువులు మున్నగు వాటిని కూడా తీసుకు వచ్చేవారు.
అలనాడు మణులు, రత్నాలు, వస్త్రాలు,సుగంధ ద్రవ్యాలు ఇత్యాది సామగ్రి- 
ఎగుమతులకు మన దేశం పెట్టినది పేరు.
అదే రీతిలో అరబ్బీ గుర్రాలు, ఖర్జూరములు వగైరా 
సరంజామాలను, వస్తువులను, దిగుమతి చేసుకునే వారు.
ప్రాచీన శతాబ్దాలనుండీ భారీ ఎత్తున 
వాణిజ్య, ఆదాన ప్రదానాలు నిరాటంకముగా హిందూ దేశములో జరిగినవి.    
(ఈ అంశము చాలా విస్తృత పరిధి కలిగినది)
పర సీమలలోని మొక్కలనూ, చెట్లనూ, జంతువులనూ పాలకులు, ప్రజలు- 
విపణివీధులలో క్రయ విక్రయాలు చేసే వారు- అనే చారిత్రక విశేషమును-
కవులు విస్మరించినారు, ఈ దృక్పథాన్ని వీడుటచేత- చరిత్రలో ఇట్టి అంశాలు చోటూ చేసుకోలేదు.
ఐనప్పటికీ- సత్యభామా విజయము- వంటి నాటికలు, రచనలు, కావ్యాలూ 
కొంత మేలును కూరుస్తూ, ఊరటనిచ్చినవి- అని వక్కాణించవచ్చును.



అఖ్తర్ హుస్సేన్ (NDUAT, Akhtar Hussain Khan)మున్నగువారు 
ఈ పురాతన వృక్ష పరిరక్షణకై కృషి చేస్తూన్నారు.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...